ఆదివారం ఆంధ్రజ్యోతిలో అదృష్ట రత్న జ్యోతి శీర్షికలో ప్రిడిక్షన్సు చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన verifiability/falsifiability కి సరిపోయే విధంగా ఈవారం (3/ఆగస్టు/2008) చాలా ఖచ్చితమైన ఫలితాలు చెప్పారు. ఆఖరికి జాతకుడు ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పేశారు. అయినాసరే మీరు జ్యోతిషం తప్పంటారా? పైగా ఇది కేవలం జాతకం చూసి చెప్పినది మాత్రమే. జ్యోతిష్కుడికి సమాచారం లీకయ్యే అవకాశం లేదు కదా.
ఆంధ్రజ్యోతిలో చెప్పిన ఫలితాలు –
1. 2006 అక్టోబర్ నుంచి 2008 మే మధ్య ఉద్యోగంలో మార్పు.
2. 2009 జూన్ 21 నుంచి ఏ క్షణంలోనైనా వివాహం. ఛేంజాఫ్ ప్లేస్. అయితే ప్రస్తుతం సంబంధం కుదిరినా కూడా 2009 జూన్ 21 వరకూ వివాహం చేసుకోకూడదు. ఒక ప్రాపర్టీ డిజ్పోజాఫ్ చెయ్యడం.
3. 2001 నవంబర్ 2 నుండి 2014 ఆగస్టు మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి. కానీ చిన్నపాటి అవమానం. ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. స్పెక్యులేషన్, షేర్స్ జోలికి వెళ్ళి నష్టపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే సంతానం గురించిన ఎంతో కొంత ఆందోళన.
4. 2014 ఆగస్టు నుండి 2017 ఫిబ్రవరి మధ్య మళ్ళీ చేంజాఫ్ జాబ్. ఎక్కువ తిరగాల్సి వస్తుంది. టూ మెనీ షార్ట్ జర్నీస్. పీరియడ్ లో అనే కాదు, ఆఅన్ జనరల్ ధరించాల్సిన రత్నాలు పచ్చ + వజ్రం. అదృష్ట దిక్కు ప్రత్యేకంగా ఇదీ అని ఏమీ లేదు.
5. 2017 ఫిబ్రవరి నుండి 2018 ఫిబ్రవరి మధ్య ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకోకుండా రాహు కేతువులకి గట్టి రెమెడీస్ పాటించాలి. అలాగే ఎటువంటి దూరప్రయాణం చేయకపోవడమే అసలైన రెమెడీ. అయితే ఇదే పీరియడ్ లో ఊహించని ప్రమోషన్ రావడం విశేషం.
6. 2018 ఫిబ్రవరి నుండి 2021 ఫిబ్రవరి మధ్య కెరీర్ లో ఉన్నత స్థితి వాహనయోగం. అన్నీ కలిసి రావడం. అంతా అదృష్టం.
7. 2023 జూలై 8 నుండీ 2024 జూలై మధ్య వారసత్వంగా వచ్చే ధనం. గృహయోగం. అయితే స్థిరాస్తులు వీలైనంతవరకు మీ పేరు మీద లేకుండా చూసుకుంటే మంచిది. నిలకడ కనిపించడం లేదు.
8. గురు దశ అంతా కూడా సబార్టినేషన్ ఉంటుంది. రిటైర్మెంట్ కనిపించడం లేదు. కావాలని పనిచేయడం కావచ్చు. కొందరికి పనే విశ్రాంతి.
9. 2011 నవంబర్ నుండి 2014 ఆగస్టు మధ్య చిన్నపాటి గండం రాకుండా రెమెడీస్ పాటించాలి. అయితే 2050 జూన్ 22 నుండి ఆగస్టు 7 మధ్య అంటే మీ 76 వ ఏట ఒక ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున పగటిపూట సంతానం సమక్షంలో మీ పరమపద ప్రాప్తి.
మీ పత్రిక బాగుంది. ఈమాట మనమాటగా ఆంధ్రులందరిదీ అనిపించేలా పత్రికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న సంపాదకవర్గానికి ఒక రచయితగా నా అభినందనలు.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు
పేరవరం-533235-తూ.గో.జిల్లా ఆంథ్ర ప్రదేశ్
నూలు చీర
గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/05/2008
11:55 am
బాబ్జీలు గారూ,
సరదాగా రాసింది “దిల్” మీదకి తీసుకున్నట్లున్నారు.
తప్పులు దొర్లితే చూపించడమూ, అచ్చయిన దాన్ని “ఇలా రాయాలి సుమా” అని చెప్పడమూ రెండూ ఒకటి కాదని నా అభిప్రాయం. రెంటికీ తేడా ఉంది.
మీ స్పందన కంటే,
“రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి.” అన్న సలహా బాగా నచ్చింది. ఇది నాకు మాత్రమేనా? లేక “చెయ్యి” చేసుకునే అందరికీనా?
మీకు పలవరింతలెలాగో, నాకు ఈ పేలాపన్లలాగ!
బతుకు మాట దేవుడెరుగు, “అబద్ధం నిజంలా మాట్లాడ్డం మాత్రం నాకు తెలీదు.”
నమ్మినా, నమ్మక పోయినా మీ వాక్యం మాత్రం నాకు నచ్చింది.
ఇహ ఈ చర్చకి దారీ, తెన్నూ లేనట్లు అనిపిస్తోంది.
నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయికి, తెలుగు “రెసిటేషన్” పోటీకి, మూడు పెద్దన గారి పద్యాలు, మనుచరిత్రము నుండి, వాళ్ళ తెలుగు “మేమ్” ఇచ్చేరు.
“మేమ్” గారూ శిష్యురాలూ కలిసి, మూడు పద్యాలూ వచన కవిత్వంలా రాసేరు.
వచనకవిత్వాన్ని ఛందస్సర్పపరిష్వంగంలోకి తీసుకెళ్ళాలి. పగవాడికి కూడా వద్దు ఈ బాధ.
“… ప్రాలేయ (కామా) రుణ్మండలీ..” అని రాసేరు “తెలుగుమేమ్ గారు”.(నా యూనీకోడ్ చేతకాని స్పెల్లింగ్ “రుణ్మండలీ”)
మూడవ తరగతి లో “అల వైకుంఠపురములో..” పద్యం, “సిరికింజెప్పడు..” పద్యం “రిసైట్” చేసి “ఫస్ట్ ప్రైజ్” “కొట్టేసిన” విద్యార్ధినిని, “నాలుగోక్లాసు మేమ్” “బాగా చెప్పి ప్రైజ్ రాకపోతే వుంది నీ పెళ్ళి” అని భయపెట్టి మరీ పంపించింది.
మనుచరిత్ర(ము, ప్రథమా విభక్తి????) ఇప్పుడెక్కడ దొరుకుతుందిరా “దేవుడా” (ప్రథమా విభక్తి కాదు) అని అనుకుంటూంటే, “ఈమాట” “గ్రంధాలయం” గుర్తొచ్చి బతుకుజీవుడా అనుకున్నాను.
“ఈ మాట” చలవ వల్ల పద్యాలు, పద్యాల్లా దొరికేయి. “ప్రైజ్” మాట దేవుడెరుగు, “ప్రైజ్” రాకపోతే “నాలుగోక్లాసు మేమ్ చేతిలో మా అమ్మాయి పెళ్ళి దేవుడెరుగు.”
“ఈ మాట” నామాం మరువాం, మరువాం.
చిన్న పిట్టకథ: కిందటేడాది నాకు “ఈ మాట” పరిచయం లేక, “సిరికిం..” పద్యం కోసం, తెలిసిన వాళ్ళిళ్ళకి తిరిగేను. ఓ ఇంట్లో, ఓ ఐటీ అమ్మాయి, ఏడాది కొడుక్కి అన్నం పెడుతూ “అంకుల్, అది శ్రీరామదాసు సినిమాలోది” అంది. ఆ పిల్ల తల్లితండ్రులు చాలా గర్వంగా చూసేరు నావేపు. “ధన్యోస్మి” అని మనసులో అనుకుని, “థేంక్సు సుజాతా” అని బయటకని, బయటపడ్డాను.
గణవిభజన చేసి “అల వైకుంఠపురములో…” “సెట్” చెయ్యగలిగేను. “సిరికింజెప్పడు..” మాత్రం “శ్రీరామదాసు సినిమా సిడిలో” బాలసుబ్రహ్మణ్యం పాడినదే దిక్కయిపోయింది.
[బాబ్జీలు గారు: అభిప్రాయాలు రాసే పెట్టె పైన ఉన్న “కీబోర్డు మ్యాపింగ్ చూపించండి” అన్న లింకు నొక్కితే మీకు R.T.S. (Rice Transliteration Standard) కీబోర్డు మ్యాపింగ్ ప్రత్యక్షమవుతుంది. ఋకారానికి “ru” బదులు “R” అని టైపు చెయ్యాలి. ఉదా: కృష్ణుడు (kRshNuDu), సంస్కృతం (samskRtam). వర్గాల వారీగా అనునాసికాలు: ఙ (~ma), ఞ్ (~na), ణ (Na), న (na), మ (ma). మరికొన్ని ఉదాహరణలు: జ్ఞానము (j~nAnamu), ప్రాలేయరుఙ్మండలీ (prAlEyaru~mmanDalI) ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. — పద్మ, ఈమాట సంపాదక వర్గం.]
సాయి గారూ,
అభిప్రాయాలు రాసేవాళ్ళు, కవి/రచయిత కి తెలియని విషయాలు చెప్పాలి, తప్పులు ఎత్తి చూపాలి, విపులంగా రాయాలి అని మీరు “నొక్కి వక్కాణించ” డానికి ఇదో ప్రయోగం.
“ఈ మాట” ని నేను “రవికిరణు” కవిత్వం తో మొదలెట్టేను. “నూలు చీర” ఎలా “మిస్ కొట్టీసేనో?” ఈ కవితకి అభిప్రాయం రాస్తూ, “రవికిరణు గారూ మీరు ఈ కవితని ఇలా రాయాలి. చిత్తగించండి.” అని రాస్తే “సృష్టికర్తలు” “సృజనాత్మక శక్తి” వుందని మేం నమ్ముతున్నవాళ్ళు వూరుకుంటారా?
(రవికిరణు గారూ, క్షమించాలి. దీనికి మీరు స్పందించకండి)
*************
{“నూలు చీర”
కొత్తలో
వెలుగు, జిలుగుల్ని ప్రదర్శించిందే,
పాముకుబుసం కాకపోయినా
పట్టు వస్త్రం కాకపోయినా
వాటి సావాసగత్తె.
మా అమ్మకి అమ్మేమో
అమ్మని చుట్టుకునుండేది, కనిపెట్టుకునుండేది.
అమ్మ కన్నీళ్ళకీ, వేణ్ణీళ్ళకీ, చన్నీళ్ళకీ
అమ్మ కష్టాలకీ, సుఖాలకీ,దుఃఖాలకీ
మమ్మల్ని మించిన తోడు.
కుంకుమ తప్ప పౌడరు వాసన మర్చిపోయిన అమ్మలా
తడి పిడిచి ఆరెయ్యడం తప్పఇస్త్రీ పెట్టె సావాసం అడగలా.
ఒక చెట్టులా, తాపసిలా
ప్రాపంచిక సౌందర్యం వదిలేసి
మా అమ్మ అనంత సౌందర్యంలో కలిసిపోయింది.
అమ్మకీ, చీరకీ తేడా తొలగిపోయింది.
ఆ ముతక నూలు చీర
మా మనసుల్లో రంగూ, రూపం లేని భావంలా
మా అమ్మలా మిగిలిపోయింది.}
{రవికిరణు గారూ, ఈ నూలు చీర అమ్మకి తలదిండుగా కూడా పనిచేసేది, ఇంటికి చుట్టాలొచ్చినపుడు. ఉన్న తలగడలు ముఖ్యవైనవాళ్ళకిచ్చీసి, మిగిలినవాళ్ళకి బొంతలూ, దుప్పట్లూ మడతపెట్టిచ్చేక, “అమ్మా నీకో” అన్నపుడు, “దా, పడుకో” అని పిలిచి అమ్మ తలకింద ఈ “నూలుచీరే” “ఆదిశేషుళ్ళా” నుమ్మలు చుట్టుకుని.}
సాయిగారూ,
బతుకు తెలిసిన మీలాటివాళ్ళు, అనుభవాన్నిభావంగా పట్టుకోగలిగిన మీలాటివాళ్ళు, భాష తెలిసిన మీలాటివాళ్ళు, “టుమ్రీ” గాళ్ళ “అజ్ఞానపు విజ్ఞానపు” అభిప్రాయాల్ని పట్టించుకోకుండా, రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి. అప్పుడే కదా “ఈ మాట” ఏడాదికే నాలుగేళ్ళెదిగినప్పటికీ ఎప్పటికి ముఫ్ఫైలోపే వుంటుంది. “భారతి” లా కాకుండా.
మీ పలవరింతల్లో ‘మన” అనే నిజమూ, తప్పటడుగులు వేసే పిల్లాణ్ణి పరిగెత్తించేలా చేసే నిజాయితీ కనిపించాయి. వీధి చివర కిరాణా కొట్టు వాడిలా “తూనిక రాళ్ళ” తో కొడుతున్నారని అనిపించలేదు. మీ అనుభవాల్లో కూసింత ‘అందమూ,’ పలవరింతల్లో పిసరంత “పేమా: కనిపించాయి. అందుకే రాసాను.
ఆ మధ్యనే ఓ సాహితీ సదస్సులో “చేయి” తిరిగిన ఓ పెద్ద రచయిత కనిపించారు. ఆయన రాసిన కథల ప్రస్తావన తెస్తూ, “చదివి, బాగుందని విమర్శించండి” అంటూ ఆయనకేం కావాలో నికార్సుగా సెలవిచ్చాడు. నేనేమీ అలా అడగ లేదు కదా? రత్తాలూ, రాంబాబుల “అడ్డబుర్ర” నడ్డం పెట్టుకొని పలవరించినా, “బాలకిష్టుడి” స్థాయిలో చెప్పినా, “బినాకా గీత మాలా” స్టైల్లో రేటింగ్ ఇస్తూ “అభీ ఆ రహే హై – ఆప్ కీ మన్ పసంద్ ” అని ఊరించినా, ఆ “చేతల్లో” నిజాయితీ కనిపించింది. అందుకే రాయమని అడిగాను. తెంపరి తనాలూ, కోతి చేష్టల్లా అనిపించలేదు. మీ వాక్యాలు “నిజ్జం” గా గిలిగింతలు పెడుతున్నాయి. పిచ్చితల్లి “గానాపసూనాంబ” మీదొట్టు. కావాలంటే రమణ గారబ్బాయి “బుడుగు” నడగండి. “సత్తెపమాణికం” గా చెబుతున్నాను. ఇంకోటి.
సంపాదకుల ఉజ్జోగం చూస్తే, ఊరు చివర మంగలి గుర్తుకొస్తాడు. కత్తెర వాళ్ళ ఆయుధం. వెంట్రుకలయినా పీగ్గలరు. అవసరమైతే మెడైనా తెగ్గోయగలరు. “యాబ్రాసి” మొహానిక్కూడా “మహేష్ బాబు” కటింగ్ ఇవ్వగలరు. కాబట్టి వారితో కాస్త “జాగర్త” గా ఉండాలని అప్పుడేప్పుడో ” టౌన్ హాల్లో గిరీశం” దంచుకుంటూడగా ఈ నాలుగు ముక్కలూ చెవిన పడ్డాయి. సరిగ్గా కత్తెరేయలేదని మాసిన తలని మోయలేం కదా? నెల తిరక్కుండా అక్కడికే పరిగెడతాం. అయినా “కత్తెర” ఎక్కడ లేదు చెప్పండి? జీవితమే ఓ పెద్ద కత్తెర. కావల్సినవి అతికించుకుంటాం, అక్కర్లేనివి ఆవతల విసిరి పారేస్తాం. కాదంటారా?
మీ “పలవరింత” అనుభవంలో తప్పటడుగులేదు.
-సాయి బ్రహ్మానందం
( కావాలనే “అప్పుతచ్చు” అని రాసినా, మీరన్నట్లు గిలిగింతల కొటేషన్లో ఇరికించడం మరిచాను. మే బి, నెక్స్ట్ టైం. )
సాయిగారూ,
మీ లాటి వారు ఇలాగ రాయకూడదు.
బహుశా నా తెంపరితనం తోనో, “జయప్రభ” గారు అభిప్రాయపడ్డట్టు “వికటకవి” కోతి చేష్టల వలనో నా అభిప్రాయాలు మితిమీరిపోయుంటాయి.
అభిప్రాయాలు, సామాన్యపాఠకుడి “విమర్శలు.”
అయితే,సామాన్య పాఠకుల “విమర్శలకి” తూనికరాళ్ళు వుండవు. “అనుభవించి పలవరించడం” తప్ప.
శ్రీశ్రీ “మహాప్రస్థానం” ముందుమాటలో “చలం” ఎంత చక్కగా రాసీసేడు.
దాని శీర్షిక కూడా “యోగ్యతా పత్రం”. అయితే “చలం” “యోగ్యతా పత్రం” ఇవ్వలేదు.
నచ్చప్పోతే “పాసిట్ ఆన్” అనీసేడు. తలకింద దిండులా పెట్టుకుని పడుకోవద్దన్నాడు.
ఇంకోటాలకించండి.
మణిరత్నం “గీతాంజలి” సినిమా చూసి, అప్పుడెప్పుడో, చాన్నాళ్ళ కిందట, “శ్రీకాకుళం” లో “బాలక్రిష్ణ వీర అభిమాని” “టైలర్ రాము” ఏవన్నాడు తెలుసా? “పొగెట్టీసేడండీ, సినిమా అంతా. అయితే మీలాటోళ్ళకి నచ్చొచ్చు. సినిమా ఆడ్డం కష్టం.” రాము చెప్పింది అతని అభిప్రాయం.
రామూ లాగే నేను కూడా నాకిష్టవయిన “ఈ మాట” శీర్షికలన్నిటికీ, నా అభిప్రాయాలు రాసీసేను. “అనుభవించి, పలవరించి, తూనిక రాళ్ళ తో కొలవకుండా.”
మృణాలిని గారి వుపన్యాసం గురించి నేను రాసిన అభిప్రాయం లో నేను అవాకులూ చవాకులూ రాసీసేను. “ఈ మాట” సంపాదకులు నా తోక కత్తిరించీసేరు. కత్తిరించడం వల్ల “మరియాదా” వచ్చింది. ఆ మర్యాదపూర్వకమైన అభిప్రాయాన్నే ప్రచురించేరు.
సామాన్య పాఠకుడు, మీలాటి వ్యాసకర్తల, కవుల రచనలు తప్పకుండా చదువుతాడు. చాలా నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అదే “మీ అభిప్రాయం తెలపండి” లో “అప్పుతచ్చు”లతో సహా “సబ్మిట్” చేసేస్తాడు.
మీరూ, మీరూ రాసిన వాటిల్లో తప్పులు మాలాటి పాఠకులకి తెలీవు. మాకు తెలిసిందల్లా “తొలాట కష్టం” అనో “వోరం ఆడ్డం కష్టం” అనో “అదురు బినాకా టాపు” అనో అనడం. అది నిజాయితీ తో కూడిన అభిప్రాయం. తప్పవచ్చు “రైటవొచ్చు.”
చివరాకర్లో సిన్నముక్క.
“ఫలించిన వృక్షానికే రాతి దెబ్బలు” కదా?
మీరూ, కొడవళ్ళవారూ, భైరవభట్లవారూ, వైదేహీ శశిధర్ గారూ, మూలా సుబ్రహ్మణ్యం గారూ, రవికిరణు గారూ, జెజ్జాల క్రిష్ణమోహనుగారూ, పప్పు నాగరాజు గారూ, భైరవభట్ల వారూ, ఇలపావులూరి వారబ్బాయీ, లక్ష్మన్నగారూ, ఇత్యాదులతో సంపాదకులు వేలూరివారూ & కో; మీ అందర్నీ మించిపోయి ఉదయకళ గారూ, మీరంతా ఫలించిన వృక్షాలు.
అందుకే మీ రచనల్లో నచ్చినవి ” జిత్ నా ఖాయా మీఠా థా” పధ్ధతిలోనూ, నచ్చనివి ” జో హాత్ న ఆయా ఖఠ్ఠా థా” పధ్ధతిలోనూ నా లాటి పాఠకులు అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తారు, విమర్శించం.
ప్రస్తుతం మీరు వ్యక్తీకరించిన అభిప్రాయంలో, అప్పుతచ్చు అని మీరు రాసేరు. కావాలనే మీరు రాసుంటారు. అలాటప్పుడు “అప్పుతచ్చు” అని “కొటేషన్స్‌లో” పెట్టుంటే “చమక్”మని కితకితలు పెట్టుండీవారు. నా సందేహం ఏవిటంటే రాయడంలో “మిస్టేక్ సే గల్తీహోగయా హోగా” నేమోనని.
సాయిగారూ, నేను “సప్తపది”కి రాసినది విమర్శా? అనుభవించి పలవరించడవా?
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Ravi అభిప్రాయం:
08/07/2008 5:54 am

మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Kameswara Rao అభిప్రాయం:
08/06/2008 3:32 am
పద్యాలని వాటి ఛందస్సు ప్రకారం “రిసైట్” చేస్తారా?!
రచయితలకు సూచనలు గురించి Dr.Jonnalagadda Markandeyulu అభిప్రాయం:
08/05/2008 11:33 pm
మీ పత్రిక బాగుంది. ఈమాట మనమాటగా ఆంధ్రులందరిదీ అనిపించేలా పత్రికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న సంపాదకవర్గానికి ఒక రచయితగా నా అభినందనలు.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు
పేరవరం-533235-తూ.గో.జిల్లా ఆంథ్ర ప్రదేశ్
నూలు చీర గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/05/2008 11:55 am
బాబ్జీలు గారూ,
సరదాగా రాసింది “దిల్” మీదకి తీసుకున్నట్లున్నారు.
తప్పులు దొర్లితే చూపించడమూ, అచ్చయిన దాన్ని “ఇలా రాయాలి సుమా” అని చెప్పడమూ రెండూ ఒకటి కాదని నా అభిప్రాయం. రెంటికీ తేడా ఉంది.
మీ స్పందన కంటే,
“రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి.” అన్న సలహా బాగా నచ్చింది. ఇది నాకు మాత్రమేనా? లేక “చెయ్యి” చేసుకునే అందరికీనా?
మీకు పలవరింతలెలాగో, నాకు ఈ పేలాపన్లలాగ!
బతుకు మాట దేవుడెరుగు, “అబద్ధం నిజంలా మాట్లాడ్డం మాత్రం నాకు తెలీదు.”
నమ్మినా, నమ్మక పోయినా మీ వాక్యం మాత్రం నాకు నచ్చింది.
ఇహ ఈ చర్చకి దారీ, తెన్నూ లేనట్లు అనిపిస్తోంది.
శలవ్,
సాయి బ్రహ్మానందం
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:
08/05/2008 7:45 am
నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయికి, తెలుగు “రెసిటేషన్” పోటీకి, మూడు పెద్దన గారి పద్యాలు, మనుచరిత్రము నుండి, వాళ్ళ తెలుగు “మేమ్” ఇచ్చేరు.
“మేమ్” గారూ శిష్యురాలూ కలిసి, మూడు పద్యాలూ వచన కవిత్వంలా రాసేరు.
వచనకవిత్వాన్ని ఛందస్సర్పపరిష్వంగంలోకి తీసుకెళ్ళాలి. పగవాడికి కూడా వద్దు ఈ బాధ.
“… ప్రాలేయ (కామా) రుణ్మండలీ..” అని రాసేరు “తెలుగుమేమ్ గారు”.(నా యూనీకోడ్ చేతకాని స్పెల్లింగ్ “రుణ్మండలీ”)
మూడవ తరగతి లో “అల వైకుంఠపురములో..” పద్యం, “సిరికింజెప్పడు..” పద్యం “రిసైట్” చేసి “ఫస్ట్ ప్రైజ్” “కొట్టేసిన” విద్యార్ధినిని, “నాలుగోక్లాసు మేమ్” “బాగా చెప్పి ప్రైజ్ రాకపోతే వుంది నీ పెళ్ళి” అని భయపెట్టి మరీ పంపించింది.
మనుచరిత్ర(ము, ప్రథమా విభక్తి????) ఇప్పుడెక్కడ దొరుకుతుందిరా “దేవుడా” (ప్రథమా విభక్తి కాదు) అని అనుకుంటూంటే, “ఈమాట” “గ్రంధాలయం” గుర్తొచ్చి బతుకుజీవుడా అనుకున్నాను.
“ఈ మాట” చలవ వల్ల పద్యాలు, పద్యాల్లా దొరికేయి. “ప్రైజ్” మాట దేవుడెరుగు, “ప్రైజ్” రాకపోతే “నాలుగోక్లాసు మేమ్ చేతిలో మా అమ్మాయి పెళ్ళి దేవుడెరుగు.”
“ఈ మాట” నామాం మరువాం, మరువాం.
చిన్న పిట్టకథ: కిందటేడాది నాకు “ఈ మాట” పరిచయం లేక, “సిరికిం..” పద్యం కోసం, తెలిసిన వాళ్ళిళ్ళకి తిరిగేను. ఓ ఇంట్లో, ఓ ఐటీ అమ్మాయి, ఏడాది కొడుక్కి అన్నం పెడుతూ “అంకుల్, అది శ్రీరామదాసు సినిమాలోది” అంది. ఆ పిల్ల తల్లితండ్రులు చాలా గర్వంగా చూసేరు నావేపు. “ధన్యోస్మి” అని మనసులో అనుకుని, “థేంక్సు సుజాతా” అని బయటకని, బయటపడ్డాను.
గణవిభజన చేసి “అల వైకుంఠపురములో…” “సెట్” చెయ్యగలిగేను. “సిరికింజెప్పడు..” మాత్రం “శ్రీరామదాసు సినిమా సిడిలో” బాలసుబ్రహ్మణ్యం పాడినదే దిక్కయిపోయింది.
[బాబ్జీలు గారు: అభిప్రాయాలు రాసే పెట్టె పైన ఉన్న “కీబోర్డు మ్యాపింగ్ చూపించండి” అన్న లింకు నొక్కితే మీకు R.T.S. (Rice Transliteration Standard) కీబోర్డు మ్యాపింగ్ ప్రత్యక్షమవుతుంది. ఋకారానికి “ru” బదులు “R” అని టైపు చెయ్యాలి. ఉదా: కృష్ణుడు (kRshNuDu), సంస్కృతం (samskRtam). వర్గాల వారీగా అనునాసికాలు: ఙ (~ma), ఞ్ (~na), ణ (Na), న (na), మ (ma). మరికొన్ని ఉదాహరణలు: జ్ఞానము (j~nAnamu), ప్రాలేయరుఙ్మండలీ (prAlEyaru~mmanDalI) ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. — పద్మ, ఈమాట సంపాదక వర్గం.]
ఈమాట కొత్త వేషం గురించి p n rao అభిప్రాయం:
08/05/2008 3:40 am
మొదటి సారి ఈరోజు “ఈమాట” చూడగాగానే చాలా సంతోషం వేసింది యిన్ని రోజులు ఈమాట చూడకుండా అజ్ఞానంలో వున్నానా అని బాధ కూడా కలిగింది.
అంతర్మథనం గురించి Srinivasa Rao అభిప్రాయం:
08/04/2008 12:19 pm
కథ బావుంది. ఇలాగే రాస్తూండండి
శ్రీనివాసరావు వి
నూలు చీర గురించి baabjeelu అభిప్రాయం:
08/04/2008 11:05 am
సాయి గారూ,
అభిప్రాయాలు రాసేవాళ్ళు, కవి/రచయిత కి తెలియని విషయాలు చెప్పాలి, తప్పులు ఎత్తి చూపాలి, విపులంగా రాయాలి అని మీరు “నొక్కి వక్కాణించ” డానికి ఇదో ప్రయోగం.
“ఈ మాట” ని నేను “రవికిరణు” కవిత్వం తో మొదలెట్టేను. “నూలు చీర” ఎలా “మిస్ కొట్టీసేనో?” ఈ కవితకి అభిప్రాయం రాస్తూ, “రవికిరణు గారూ మీరు ఈ కవితని ఇలా రాయాలి. చిత్తగించండి.” అని రాస్తే “సృష్టికర్తలు” “సృజనాత్మక శక్తి” వుందని మేం నమ్ముతున్నవాళ్ళు వూరుకుంటారా?
(రవికిరణు గారూ, క్షమించాలి. దీనికి మీరు స్పందించకండి)
*************
{“నూలు చీర”
కొత్తలో
వెలుగు, జిలుగుల్ని ప్రదర్శించిందే,
పాముకుబుసం కాకపోయినా
పట్టు వస్త్రం కాకపోయినా
వాటి సావాసగత్తె.
మా అమ్మకి అమ్మేమో
అమ్మని చుట్టుకునుండేది, కనిపెట్టుకునుండేది.
అమ్మ కన్నీళ్ళకీ, వేణ్ణీళ్ళకీ, చన్నీళ్ళకీ
అమ్మ కష్టాలకీ, సుఖాలకీ,దుఃఖాలకీ
మమ్మల్ని మించిన తోడు.
కుంకుమ తప్ప పౌడరు వాసన మర్చిపోయిన అమ్మలా
తడి పిడిచి ఆరెయ్యడం తప్పఇస్త్రీ పెట్టె సావాసం అడగలా.
ఒక చెట్టులా, తాపసిలా
ప్రాపంచిక సౌందర్యం వదిలేసి
మా అమ్మ అనంత సౌందర్యంలో కలిసిపోయింది.
అమ్మకీ, చీరకీ తేడా తొలగిపోయింది.
ఆ ముతక నూలు చీర
మా మనసుల్లో రంగూ, రూపం లేని భావంలా
మా అమ్మలా మిగిలిపోయింది.}
సాయి గారూ, మీరంతా “ఫలించిన వృక్షాలు.” “రాతి దెబ్బలకి” చలిస్తారేం?
{రవికిరణు గారూ, ఈ నూలు చీర అమ్మకి తలదిండుగా కూడా పనిచేసేది, ఇంటికి చుట్టాలొచ్చినపుడు. ఉన్న తలగడలు ముఖ్యవైనవాళ్ళకిచ్చీసి, మిగిలినవాళ్ళకి బొంతలూ, దుప్పట్లూ మడతపెట్టిచ్చేక, “అమ్మా నీకో” అన్నపుడు, “దా, పడుకో” అని పిలిచి అమ్మ తలకింద ఈ “నూలుచీరే” “ఆదిశేషుళ్ళా” నుమ్మలు చుట్టుకుని.}
సాయిగారూ,
బతుకు తెలిసిన మీలాటివాళ్ళు, అనుభవాన్నిభావంగా పట్టుకోగలిగిన మీలాటివాళ్ళు, భాష తెలిసిన మీలాటివాళ్ళు, “టుమ్రీ” గాళ్ళ “అజ్ఞానపు విజ్ఞానపు” అభిప్రాయాల్ని పట్టించుకోకుండా, రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి. అప్పుడే కదా “ఈ మాట” ఏడాదికే నాలుగేళ్ళెదిగినప్పటికీ ఎప్పటికి ముఫ్ఫైలోపే వుంటుంది. “భారతి” లా కాకుండా.
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/03/2008 6:30 am
బాబ్జీలు గారూ,
మీ పలవరింతల్లో ‘మన” అనే నిజమూ, తప్పటడుగులు వేసే పిల్లాణ్ణి పరిగెత్తించేలా చేసే నిజాయితీ కనిపించాయి. వీధి చివర కిరాణా కొట్టు వాడిలా “తూనిక రాళ్ళ” తో కొడుతున్నారని అనిపించలేదు. మీ అనుభవాల్లో కూసింత ‘అందమూ,’ పలవరింతల్లో పిసరంత “పేమా: కనిపించాయి. అందుకే రాసాను.
ఆ మధ్యనే ఓ సాహితీ సదస్సులో “చేయి” తిరిగిన ఓ పెద్ద రచయిత కనిపించారు. ఆయన రాసిన కథల ప్రస్తావన తెస్తూ, “చదివి, బాగుందని విమర్శించండి” అంటూ ఆయనకేం కావాలో నికార్సుగా సెలవిచ్చాడు. నేనేమీ అలా అడగ లేదు కదా? రత్తాలూ, రాంబాబుల “అడ్డబుర్ర” నడ్డం పెట్టుకొని పలవరించినా, “బాలకిష్టుడి” స్థాయిలో చెప్పినా, “బినాకా గీత మాలా” స్టైల్లో రేటింగ్ ఇస్తూ “అభీ ఆ రహే హై – ఆప్ కీ మన్ పసంద్ ” అని ఊరించినా, ఆ “చేతల్లో” నిజాయితీ కనిపించింది. అందుకే రాయమని అడిగాను. తెంపరి తనాలూ, కోతి చేష్టల్లా అనిపించలేదు. మీ వాక్యాలు “నిజ్జం” గా గిలిగింతలు పెడుతున్నాయి. పిచ్చితల్లి “గానాపసూనాంబ” మీదొట్టు. కావాలంటే రమణ గారబ్బాయి “బుడుగు” నడగండి. “సత్తెపమాణికం” గా చెబుతున్నాను. ఇంకోటి.
సంపాదకుల ఉజ్జోగం చూస్తే, ఊరు చివర మంగలి గుర్తుకొస్తాడు. కత్తెర వాళ్ళ ఆయుధం. వెంట్రుకలయినా పీగ్గలరు. అవసరమైతే మెడైనా తెగ్గోయగలరు. “యాబ్రాసి” మొహానిక్కూడా “మహేష్ బాబు” కటింగ్ ఇవ్వగలరు. కాబట్టి వారితో కాస్త “జాగర్త” గా ఉండాలని అప్పుడేప్పుడో ” టౌన్ హాల్లో గిరీశం” దంచుకుంటూడగా ఈ నాలుగు ముక్కలూ చెవిన పడ్డాయి. సరిగ్గా కత్తెరేయలేదని మాసిన తలని మోయలేం కదా? నెల తిరక్కుండా అక్కడికే పరిగెడతాం. అయినా “కత్తెర” ఎక్కడ లేదు చెప్పండి? జీవితమే ఓ పెద్ద కత్తెర. కావల్సినవి అతికించుకుంటాం, అక్కర్లేనివి ఆవతల విసిరి పారేస్తాం. కాదంటారా?
మీ “పలవరింత” అనుభవంలో తప్పటడుగులేదు.
-సాయి బ్రహ్మానందం
( కావాలనే “అప్పుతచ్చు” అని రాసినా, మీరన్నట్లు గిలిగింతల కొటేషన్లో ఇరికించడం మరిచాను. మే బి, నెక్స్ట్ టైం. )
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి baabjeelu అభిప్రాయం:
08/03/2008 12:52 am