కామేశ్వరరావుగారూ, బాగుందండీ మీ బ్లాగు.. సాహిత్యంలో మీ
ఆసక్తికి ఇది ఒక నిదర్శనమే.
1) చంపకమాలలో పాదం మధ్యలో మూడు విధాలుగా
ఒక గతిని కల్పించవచ్చును. మొదటిది స-స-స
విరియై, సిరియై, ఝరియై లాటిది ఇది.
ప్రగడ రాణ్ణరసా విరసా తుసా బుసా ఇట్టిదే.
రెందవది మూడు జ-గణాలతో, అభంగ మృదంగ తరంగ లాటిది.
మూడవది మనం మామూలుగా వాడేది భ-భ-ర.
ఇక్కడ అల్లసానివారు మూడు జ-గణాలను వాడినా అది
నా ఉద్దేశంలో యాదృచ్ఛికమే. అన్ని పాదాలలో అలా వాడితేనే
ఒక కొత్త గతి వస్తుంది అని నా నమ్మకం.
2) నాకు ఎన్నో సంవత్సరాలుగా ఈ సందేహం. అసలు
ప్రవరాఖ్యుడు నిజంగా హిమాలయాలకు వెళ్లాడా అనేదే ఇది.
ఎందుకంటే మంచుమలలలో కరేణువులు ఎక్కడుంటాయి?
కలాపి జాలాలు ఎక్కడుంటాయి? పాపం వాటికి చలి వేయదా?
జలపాతాలు కూడా అరుదే.
బహుశా అతడు ఇప్పటి నేపాళ లేక ఉత్తరప్రదేశ, లేక
హిమాచలప్రదేశపు లోయలకు వెళ్లి ఉండవచ్చు. అక్కడి
అడవులలో ఏనుగులు, నెమళ్లు, వానాకాలపు ఉరుములు,
మెరుపులు, మృదంగపు మ్రోతలా జలపాతాలు ఉండి
ఉంటాయి. పర్వతాలలో చాలా చల్లగా ఉన్నా ఈ లోయలలో
ఎండ ఒక్కొక్కప్పుడు ఎక్కువే. అందువల్ల అతని పాదలేపం
కూడా కరిగిపోవడానికి అవకాసశం ఉంది. దూరంనుండి
హిమవత్పర్వతాలను చూసి ఉంటాడు. సియాటుల్ నగరంనుండి
మవుంట్ రెనియెర్ను చూచినట్లు. ఇట్టి సందేహం
కాళిదాసు మేఘదూతం విషయంలో కూడ ఉంది.
త్యాగరాజ స్వామి కీర్తనలకు కూడా ఈ బెడద తప్పలేదు!
నేనొక పుస్తకాన్ని వ్రాస్తూ ఒక పెద్దాయనవద్దకు వెళ్ళగా ఆయన ఈ క్రింది విషయాలను చెప్పి, దిగ్భ్రాంతపరచాడు – ఏతావాతా తేలినదేమిటంటే క్రింది కృతులు త్యాగరాజకృతులు కావు!
1) వెడలెను కోడండపాణి (తోడి)
2) నీదు చరణములే (సింహేంద్రమధ్యమం)
3) పరాంగ్ముఖ .. (సురటి)
4) వినతాసుతవాహనుడై (హరికాంభోజి)
చాలా సంతోషం. మరోమాట: మీరిచ్చిన లింకు లోకి వెళ్ళి “మనుచరిత్ర” లోని “అటజనికాంచె” పద్యం మీద వ్యాఖ్యానం కూడా ఇప్పుడే చూసాను. మీకు మనుచరిత్రలో “సహసానఖంపచ …” పద్యం నచ్చలేదా? దాన్ని అందంగా వ్యాఖ్యానించవచ్చునే? బహుశా కావాలనే మీరంతా ఆ పద్యాల జోలికి పోవడం లేదు కాబోలు (సంశయించి), ఔనా? కానీ నేనేమనుకుంటానంటే ఇంతమంది సాహితీ ప్రియులుండి మంచి పద్యాన్ని మళ్ళీ మరోసారి పాఠకులకు పరిచయం చేయకపోతే ఎట్లా అని. సరసులైన పాఠకులున్నారు; చాలా సంయమనంతో మాట్లాడగలిగిన వాళ్ళు వున్నారు; స్వారస్యం తెలుసుకుని రసాస్వాదన చేయగలరు వాళ్ళు. చూడండి. పెద్దన గారి గాంధర్వం అంతా ఆ పద్యంలో వుంది.
ఏమండీ, బాబ్జీలు గారు మీరేమంటారు? ఎంతసేపూ “అటజనికాంచె” గురించేనా? కాస్తా ముందుకి వెళ్ళండి మనుచరిత్రలో. పోనీ “చలిగాలి బొండుమల్లెల పరాగము వైచి నిబిడంబు చేసే వెన్నెల రసంబు” దాకానైనా. నాకు తెలిసి చాలామంది మీ చర్చలు ఆనందిస్తారని. ముఖ్యంగా పెద్దన గారి కవిత్వాన్ని మరింత ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. శృంగారాన్ని మాట్లాడటం లో మీ విశ్లేషణలు వెనకపడితే, పాపం, ఆ పద్యాలని రాసిన పెద్దన గారేమనుకోవాలి? ఈ తెలుగు వాళ్ళకి సరసత లేదన్నీనూ, విజయనగర కాలం దగ్గరే శృంగారం కూడా ఆగిపోయిందనీన్నూ అనుకోడా? ఈ తరం వాళ్ళకి పాత (I mean, “భూస్వామ్య వాద”) తెలుగు కవిత్వంలోని మధురిమలని సైతం కాస్త రుచి చూపించండి. నేను చెప్పేదాన్నే గానీ, నేను పీక లోతు దాకా అన్నమయ్య శృంగార సంకీర్తనల వ్యాఖ్యానంలో కూరుకుపోయి వున్నానిప్పుడు, గనుక దారి మళ్ళలేను.
జయప్రభగారు,
చాలా మంచి సూచన చేసారండీ. తప్పకుండా వీలుచూసుకొని, నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. నాచన సోమన సీసాలగురించే ఓ వ్యాసం రాయవచ్చు!
పద్య శిల్పం
గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/18/2008
1:32 pm
జయప్రభ గారిలాగే నేనూ బాబ్జీలు గార్ని ” కాస్త చేయి చేసుకోండి ” అని అభ్యర్థిస్తే ఆయన నాపై మాటలు విసిరారు. వాక్యం బాగుందంటే నన్నూ నా మాటనీ బంగాళాఖాతంలో విసిరి పారేసారు. బాబ్జీల గారి మాటే ‘కత్తి’. ఇలా అదృశ్య యుద్ధం ఎన్నాళ్ళు చెస్తారో చూద్దాం?
నాచన సోమనాథుని మీద (“ఒకడు నాచన సోమన” – విశ్వనాథ ది మాత్రమే సరిపోదు) చక్కని విశ్లేషణ ఇంకా రావాలసి వుంది. పద్యాలలో ఛందస్సు వాడకం, కవుల వుద్దేశ్యం చదివే పద్ధతిలో వుండవలసిన తీరులని గురించిన మీ వ్యాసం చదివాక, మీరు నాచన సోమనాథుని మీద, అతడి పద్య శిల్ప వైశిష్ట్యాన్ని వివరిస్తూ రాయగలరని — రాస్తే బాగుంటుందని — అనిపించి, ఈ సూచన (పోనీ కోరిక) ఈమాట ద్వారా అడుగుతున్నాను.
విశ్వనాథ “నిశి నిశి ఎల్లనింద్రునకు నీల సరోరుహ లోచన …” పద్యాన్ని నా స్నేహితుడు మరో తరహా విరుపు తో చదివేవాడు. దాన్ని నేను చేసే ఈ స్లో టైప్ లోంచి చెప్పలేను గానీ, మీ వ్యాసం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకున్నాను. మంచి వ్యాసం రాసేరు. అభినందనలు.
note: అయ్యా బాబ్జీలు గారు, మీ అసలు పేరిదేనా? “అసలు పేరు తోనే రాయాలా?” అని మీరు ఎదురు ప్రశ్న వేస్తే “ఏమీ అవసరం లేదు” అన్న జవాబు నాది. అయినా గానీ అసలు పేరు తెలుసుకోవాలన్న కుతూహలం పాఠకులకి (పోనీ, నాలాంటి పాఠకురాలికి) వుండటం సహజం కనుక, వూరికే అడుగుతున్నాను. చెప్పేయండి తమరి ప్రవర. మీరు అన్నీ అభిప్రాయాలేనా? విసుర్లని బాబ్జీలు అన్న కుర్రాడి పేరుతోనే చెల్లుబాటు చేసేస్తానంటే పాఠకలోకం ఎందుకు ఒప్పుకోవాలిట? కవ్వింపులు మీకేనా? మీ అభిప్రాయాలని చదివేవాళ్ళకి కూడా వుండొచ్చుకదా? దాన్ని మీరు ఒప్పేసుకుని మీ పేరు చెప్పండి ముందు ;).
మరో విషయం: మీ అభిప్రాయాల ద్వారా మీకు సాహిత్య పరిజ్ఞానం, స్వంత ఆలోచనలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టంగానే తెలుస్తోంది. మరి మీరు మీ ఇష్టాలని వివరంగా వ్యాసాల ద్వారా చెప్పొచ్చుగా? రాయండి! బాగా రాయగలవారని అడుగుతున్నాను. ఆపై తమరి దయ, పాఠకుల ప్రాప్తం. ఊరికే అభిప్రాయాల తోనే సరిపుచ్చేయవొద్దని నా విన్నపం.
నాకు కూడా ఈ పద్యమంటే చాల యిష్టం. నేను రాసిన
చంపకోత్పలమాలల కథలో (సెప్టెంబర్ 2007) దీనిని ఉదహరించాను.
దీనిని నేను ఇలా చదువుతాను –
అట చని కాంచె భూమిసురుడు
అంబర…కలాపిజాలమున్
కటక…సాలము
శీతశైలమున్
అంబర నుండి జాలమున్ వరకు ఒకే సమాసము,
గుక్క తిప్పుకోడానికి వీలు లేదు. ఒకే మారు చదవాలి!
ఇట్టి సమాసాలలో పదాలను డాష్ (-) గుర్తుతో విరుచుట వాడుక.
విధేయుడు – మోహన
మీ వ్యాసం చదివేను. అందులో “విశ్వనాథ” వారి అభిప్రాయంకూడా తెలిపేరు. శబ్దం గురించి మిగిలినవాటి గురించీ ఆయన చక్కగా చెప్పేరు. మీరు కూడా ఛందస్సు కవికి ఒరగబెడుతున్న దానికీ, కవి ఛందస్సుని సందర్భానికి తగినట్టు వాడుకోడానికీ తేడా బాగా రాసేరు.
అయితే “అంబర చుంబి శిరస్సురజ్ఝరీ పటల” “ముహుర్ముహుర్లుఠ” విడగొట్టాలా, కూడదా? “దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటల” తోటే “నటనానుకూల” చదవాలా” అక్కర్లేదా? తెలీక అడుగుతున్నవివి. తెలిసిన వాళ్ళు మీరు చెప్పాలి మరింత దయతో.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి mOhana అభిప్రాయం:
08/19/2008 5:32 am

గ్రంథచౌర్యం గురించి … గురించి satya rama prasad kalluri అభిప్రాయం:
08/19/2008 4:06 am
త్యాగరాజ స్వామి కీర్తనలకు కూడా ఈ బెడద తప్పలేదు!
నేనొక పుస్తకాన్ని వ్రాస్తూ ఒక పెద్దాయనవద్దకు వెళ్ళగా ఆయన ఈ క్రింది విషయాలను చెప్పి, దిగ్భ్రాంతపరచాడు – ఏతావాతా తేలినదేమిటంటే క్రింది కృతులు త్యాగరాజకృతులు కావు!
1) వెడలెను కోడండపాణి (తోడి)
2) నీదు చరణములే (సింహేంద్రమధ్యమం)
3) పరాంగ్ముఖ .. (సురటి)
4) వినతాసుతవాహనుడై (హరికాంభోజి)
కల్లూరి సత్యరామ ప్రసాదు
kalluriprasaad@hotmail.com
పద్య శిల్పం గురించి jayaprabha అభిప్రాయం:
08/19/2008 1:59 am
కామేశ్వర రావు గారు,
చాలా సంతోషం. మరోమాట: మీరిచ్చిన లింకు లోకి వెళ్ళి “మనుచరిత్ర” లోని “అటజనికాంచె” పద్యం మీద వ్యాఖ్యానం కూడా ఇప్పుడే చూసాను. మీకు మనుచరిత్రలో “సహసానఖంపచ …” పద్యం నచ్చలేదా? దాన్ని అందంగా వ్యాఖ్యానించవచ్చునే? బహుశా కావాలనే మీరంతా ఆ పద్యాల జోలికి పోవడం లేదు కాబోలు (సంశయించి), ఔనా? కానీ నేనేమనుకుంటానంటే ఇంతమంది సాహితీ ప్రియులుండి మంచి పద్యాన్ని మళ్ళీ మరోసారి పాఠకులకు పరిచయం చేయకపోతే ఎట్లా అని. సరసులైన పాఠకులున్నారు; చాలా సంయమనంతో మాట్లాడగలిగిన వాళ్ళు వున్నారు; స్వారస్యం తెలుసుకుని రసాస్వాదన చేయగలరు వాళ్ళు. చూడండి. పెద్దన గారి గాంధర్వం అంతా ఆ పద్యంలో వుంది.
ఏమండీ, బాబ్జీలు గారు మీరేమంటారు? ఎంతసేపూ “అటజనికాంచె” గురించేనా? కాస్తా ముందుకి వెళ్ళండి మనుచరిత్రలో. పోనీ “చలిగాలి బొండుమల్లెల పరాగము వైచి నిబిడంబు చేసే వెన్నెల రసంబు” దాకానైనా. నాకు తెలిసి చాలామంది మీ చర్చలు ఆనందిస్తారని. ముఖ్యంగా పెద్దన గారి కవిత్వాన్ని మరింత ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. శృంగారాన్ని మాట్లాడటం లో మీ విశ్లేషణలు వెనకపడితే, పాపం, ఆ పద్యాలని రాసిన పెద్దన గారేమనుకోవాలి? ఈ తెలుగు వాళ్ళకి సరసత లేదన్నీనూ, విజయనగర కాలం దగ్గరే శృంగారం కూడా ఆగిపోయిందనీన్నూ అనుకోడా? ఈ తరం వాళ్ళకి పాత (I mean, “భూస్వామ్య వాద”) తెలుగు కవిత్వంలోని మధురిమలని సైతం కాస్త రుచి చూపించండి. నేను చెప్పేదాన్నే గానీ, నేను పీక లోతు దాకా అన్నమయ్య శృంగార సంకీర్తనల వ్యాఖ్యానంలో కూరుకుపోయి వున్నానిప్పుడు, గనుక దారి మళ్ళలేను.
జయప్రభ
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Kameswara Rao అభిప్రాయం:
08/18/2008 8:03 pm
“అటజని గాంచె” పద్యం గురించి నా వివరణ ఇక్కడ రాసాను:
అటజని కాంచె…
అదేమైనా ఉపయోగ్యమైనదే అనుకుంటే , దాని బట్టి మీకు తోచినట్టు చదువుకోండి!
(నా, యీ సొంత ప్రోపగాండాని ఈమాట సంపాదకులు క్షమిస్తారని ఆశిస్తున్నాను 🙂
పద్య శిల్పం గురించి Kameswara Rao అభిప్రాయం:
08/18/2008 7:56 pm
జయప్రభగారు,
చాలా మంచి సూచన చేసారండీ. తప్పకుండా వీలుచూసుకొని, నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. నాచన సోమన సీసాలగురించే ఓ వ్యాసం రాయవచ్చు!
పద్య శిల్పం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/18/2008 1:32 pm
జయప్రభ గారిలాగే నేనూ బాబ్జీలు గార్ని ” కాస్త చేయి చేసుకోండి ” అని అభ్యర్థిస్తే ఆయన నాపై మాటలు విసిరారు. వాక్యం బాగుందంటే నన్నూ నా మాటనీ బంగాళాఖాతంలో విసిరి పారేసారు. బాబ్జీల గారి మాటే ‘కత్తి’. ఇలా అదృశ్య యుద్ధం ఎన్నాళ్ళు చెస్తారో చూద్దాం?
పద్య శిల్పం గురించి jayaprabha అభిప్రాయం:
08/17/2008 11:23 pm
కామేశ్వర రావు గారు,
నాచన సోమనాథుని మీద (“ఒకడు నాచన సోమన” – విశ్వనాథ ది మాత్రమే సరిపోదు) చక్కని విశ్లేషణ ఇంకా రావాలసి వుంది. పద్యాలలో ఛందస్సు వాడకం, కవుల వుద్దేశ్యం చదివే పద్ధతిలో వుండవలసిన తీరులని గురించిన మీ వ్యాసం చదివాక, మీరు నాచన సోమనాథుని మీద, అతడి పద్య శిల్ప వైశిష్ట్యాన్ని వివరిస్తూ రాయగలరని — రాస్తే బాగుంటుందని — అనిపించి, ఈ సూచన (పోనీ కోరిక) ఈమాట ద్వారా అడుగుతున్నాను.
విశ్వనాథ “నిశి నిశి ఎల్లనింద్రునకు నీల సరోరుహ లోచన …” పద్యాన్ని నా స్నేహితుడు మరో తరహా విరుపు తో చదివేవాడు. దాన్ని నేను చేసే ఈ స్లో టైప్ లోంచి చెప్పలేను గానీ, మీ వ్యాసం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకున్నాను. మంచి వ్యాసం రాసేరు. అభినందనలు.
note: అయ్యా బాబ్జీలు గారు, మీ అసలు పేరిదేనా? “అసలు పేరు తోనే రాయాలా?” అని మీరు ఎదురు ప్రశ్న వేస్తే “ఏమీ అవసరం లేదు” అన్న జవాబు నాది. అయినా గానీ అసలు పేరు తెలుసుకోవాలన్న కుతూహలం పాఠకులకి (పోనీ, నాలాంటి పాఠకురాలికి) వుండటం సహజం కనుక, వూరికే అడుగుతున్నాను. చెప్పేయండి తమరి ప్రవర. మీరు అన్నీ అభిప్రాయాలేనా? విసుర్లని బాబ్జీలు అన్న కుర్రాడి పేరుతోనే చెల్లుబాటు చేసేస్తానంటే పాఠకలోకం ఎందుకు ఒప్పుకోవాలిట? కవ్వింపులు మీకేనా? మీ అభిప్రాయాలని చదివేవాళ్ళకి కూడా వుండొచ్చుకదా? దాన్ని మీరు ఒప్పేసుకుని మీ పేరు చెప్పండి ముందు ;).
మరో విషయం: మీ అభిప్రాయాల ద్వారా మీకు సాహిత్య పరిజ్ఞానం, స్వంత ఆలోచనలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టంగానే తెలుస్తోంది. మరి మీరు మీ ఇష్టాలని వివరంగా వ్యాసాల ద్వారా చెప్పొచ్చుగా? రాయండి! బాగా రాయగలవారని అడుగుతున్నాను. ఆపై తమరి దయ, పాఠకుల ప్రాప్తం. ఊరికే అభిప్రాయాల తోనే సరిపుచ్చేయవొద్దని నా విన్నపం.
జయప్రభ
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి mOhana అభిప్రాయం:
08/17/2008 1:12 pm
నాకు కూడా ఈ పద్యమంటే చాల యిష్టం. నేను రాసిన
చంపకోత్పలమాలల కథలో (సెప్టెంబర్ 2007) దీనిని ఉదహరించాను.
దీనిని నేను ఇలా చదువుతాను –
అట చని కాంచె భూమిసురుడు
అంబర…కలాపిజాలమున్
కటక…సాలము
శీతశైలమున్
అంబర నుండి జాలమున్ వరకు ఒకే సమాసము,
గుక్క తిప్పుకోడానికి వీలు లేదు. ఒకే మారు చదవాలి!
ఇట్టి సమాసాలలో పదాలను డాష్ (-) గుర్తుతో విరుచుట వాడుక.
విధేయుడు – మోహన
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి aswanikumar అభిప్రాయం:
08/17/2008 10:00 am
very good
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:
08/17/2008 8:16 am
తమ దయకి క్రుతజ్నతలు.