అప్పుడా గంతలే నా జీవితం
నా బరువులే నాటి మనుగడ
నా జీనే అప్పటి నా స్వర్గం
ఝాటీ దెబ్బే నా నరకం
రౌతే నా భగవంతుడు
చిక్కంపోతే భోజనం;
పని చిక్కితే ఉపవాసం
గంతలుపోతే వీక్షణం;
విశ్రాంతికే అప్పుడు కాటకం
నుంచుంటే ఒక శోష,
పడుకుంటేనొక మైకం
అలా ఆ సాహిత్య సాగరాన్ని
లంఘించడమసాధ్యం!
అందుకేనోయ్! మళ్ళీ ఇప్పుడు
మూర్ఖత్వాన్ని మట్టుబెట్టి
మరోసారి పద్య వస్తువు
కళ్ళెం లేని గుఱ్ఱం!
స్వేచ్ఛాప్రాణీ,
స్వైరవిహారీ,
పంచకళ్యాణి.
అయ్యా బాబ్జీలు గారు
మీరు ప్రతిభావంతులనీ, పండితులనీ, విటులనీ [:-) as in English wit; యిటువంటి తర్జుమాలతో వచ్చిన గొడవే ఇది. వెధవది మనం చెప్పొచ్చేదొకటి, ఇతరులకి అర్థమయ్యేది యింకోటీను. పోనీ విట్టులందామా అంటే అది యింకా ఘోరం కదండీ! మొత్తానికి నేను చెప్పొచ్చేది మీకు అర్థమయ్యింది కదా, అదే చాలు] అందరూ ఒప్పుకున్నారు కదా! మరి గజేంద్రుడి మొర ఆలకించని విష్ణు మూర్తిలా ఎన్నాళ్ళు వుంటారు చెప్పండి?
మొద్దబ్బాయి గారూ,
అసలు పేరు చెప్పకపోవడానికీ, అసలు ఇంటి పేరు వేరే వాళ్ళు మార్చేయడానికీ తేడా తెలుసుకోకుండా, మోకాలికీ, బోడిగుండుకీ ముడి పెట్టి, సార్థకనామ ధేయులనిపించుకున్నారు.
ఒక మనిషి తన అభిప్రాయంలో రాసిందే ముఖ్యం. ఆ మనిషి ప్రవర సెకండరీ. శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు అని మీరంటే, అది మీ అభిప్రాయం అవుతుంది. ఎవరి వ్యంగ్యాలు వారికుంటాయి.
ఈమాట వారు వ్యక్తిగత వ్యంగ్యాలకి చోటు ఇవ్వం అంటూనే, ఇలాంటీ వ్యక్తిగత వ్యంగ్యాలని అనుమతించడం భావ్యంగా లేదు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. “నీ పేరు చెప్పూ, నీ పేరు చెప్పూ, అప్పుడే నువ్వన్న విషయాలు పట్టించుకుంటాము” అని అనడం భావ్యం కాదు. ఒకవేళ అలాగే వుండాలీ అని అనుకుంటే, ఈమాట వారు ఆ రూలే పెట్టాలి.
నా అబిప్రాయంలో విషయానికే ప్రాధాన్యత ఇచ్చాను. వ్యాసకర్తని ఒక్క మాట అనలేదు.
అభిప్రాయాలతో ఎవరూ మారరు సాహిత్యానికి సంబంధించిన వరకూ. కానీ అలాంటి అభిప్రాయాలు వుంటాయి అని తెలియడం కోసమే ఈ అభిప్రాయ వేదిక. ఆ పైన సెన్సార్ చెయ్యడానికి పెద్దలున్నారు.
పేరు చెప్పకపోవడం వల్లనే, నా అభిప్రాయానికి విలువ లేదని మీరంటే, అలాగే కానియ్యండి.
పాఠకుడు
ఛందోధర్మము
గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
“అలాగే బాల సుబ్రహ్మణ్యం గారి ఇంటి పేరు మార్చేసి నట్టు పేరు పెడితే, ఆయనకి మాత్రం ఒళ్ళు మండదూ? ” అంటూ చక్కగా సెలవిచ్చారు.
నాకయితే భలే నచ్చింది.
అసలు పేరే ప్రపంచానికి చెప్పడానికి వెనకాడే వాళ్ళు ఇలా అడగొచ్చా?
“బాబీ, చంటీ, బుజ్జీ, నానీ, పండూ” లాంటి ముద్దుపేర్లతో ముద్దుముద్దుగా విమర్శించే వాళ్ళంటే ఎవరికిష్టం ఉండదూ?
( మీరే నాకు ఆదర్శం. నేనూ నా పేరు మొద్దబ్బాయి గా మార్చేసుకున్నా, చూసారా? )
అయ్యా బాబ్జీలు గారూ! మీరెవరండీ బాబు!!
మాకేసి ముత్తేలమ్మని మధురవాణిని నాకు చెప్తున్నారు. vaaLLu maa APPAle kaaraa?”chatri baabu” ikaTaalu meevannee!!
కృష్ణ దేశికాచారి గారి వ్యాసం మీద మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. చాన్నాళ్ళకి మంచి సరదా కలిగింది నాలో. కానీ మీతో పోటీపడి respond కాగల సత్తువ నాకు లేదు గనుక విరమించుకుంటున్నాను. కవులకి కవిత్వంతో పాటు వుండవలసిన మిగితా నేర్పుల తాలూకు లిస్టు ఇంకా నాకు నవ్వుతెప్పిస్తూనే వుంది.
ముత్తాలమ్మో, మధురవాణో, ఎవరైతేనేం గానీ, వున్నవిషయమే అన్నది కదా? సారం అన్నది అనిర్వచనీయం సామీ. వుప్పు ఎక్కువో, తక్కువో తిని చెప్పాల్సిందే, విని కాదు!
మీ “ఇజీనగరంలో” లేదా “ఇస్సపట్నంలో” మరోపాలి బొంకులదిబ్బ కాడినించి అయ్యకోనేరు దాటి వెతకండి. పైడి తల్లి, నూకాలమ్మ వరం ఇస్తే సారం మీకు తెలుస్తుంది. అనిర్వవచనీయం గనక చర్చతో పనిలేదు. ఎవరెవరి రూప సారాల సంతోషాలు వారివే.
anyway, చాలా enjoy చేస్తున్నాను మీ అభిప్రాయాలని. “ఒగ్గీకండి. రాస్తూండండి. బెగి తొంగోవాలి. శానా పొద్దోయింది”
అయ్యా బాబ్జీలుగారు కవిత్వం, సాహిత్యం గురించి కాదు కాని, నాకు తెలిసిన విషయంలో మాత్రం మీరు పొరబడ్డారేమో అని భయం!
పిల్లల “హోం వర్క్” (సొంతంగా) చేయడం సులువంటే ఒప్పుకోవచ్చేమో కాని, “చేయించడం సులువు” అంటే నిజమేనా అనిపిస్తుంది. చేయించడానికి కనీసం పిల్లలను ఒక్కచోట కూచోబెట్టాలి. కాళ్ళు కట్టేసినా, పిల్లకాయల మనసులను కట్టేయడం, కాదు ఆకట్టుకోవడం, ఒక చాలెంజ్. ఇంతా అయింతర్వాత మన ధిమాక్ లోకెక్కింది వాళ్ళ ధిమాక్ లోకి ఎక్కించడాన్ని ఏమన్నా అనొచ్చు కాని సులువు అని మాత్రం అనగలమా అని డౌటు. ఈ తిప్పలంతా చూసే గురువుగారిని “గురు బ్రహ్మ” అనికూడా అనేసారేమో అని అనుమానం కూడా. దీనికంటే ఒకచోట కూర్చోని, అక్షరాల ఒక కావ్యమో, విమర్శో, గేయమో, వచనమో, కథనో, నవలనో, లేకపోతే ఇప్పటి దాక పుట్టని ఒక అపూర్వ సాహితీప్రక్రియనో ఈ తిప్పలగురించే వ్రాసేయడం సులువేమో అని కూడా చెడ్డ అనుమానం. కాదంటారా?!
“నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే.
జయప్రభగారూ,
మీరు చెప్పింది కాళోజీకి, ఈనాటి వాళ్ళకీ వర్తిస్తుందేమో కానీ, మొదట్లో కవిత్వాన్ని పద్యానికి దూరంగా నడిపించిన అతిరథ మహారథులకి ( గురజాడ, శ్రీశ్రీ, నారాయణబాబు, తిలక్, ఆరుద్ర) వర్తించదనుకుంటాను. (మిగతావాళ్ళు మహారథులు కారని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి పద్యం రాయడం వచ్చో రాదో నాకు తెలీదు!)
ఈ వ్యాసం పేరు ఏమీ బాగోలేదు. పైపెచ్చు చాలా అభ్యంతరకరంగా వుంది. ఒకరి ఇంటి పేరునీ, ఇంకొకరి అసలు పేరునీ కలిపేసి, ఒక మనిషి పేరు అని అర్థం వచ్చేలా పేరు పెట్టి, ఆ అసలు ఇద్దరు వ్యక్తుల గురించీ రాయడం ఏమీ బాగోలేదు. ఏ కారణం చేత గానీ, నా ఇంటి పేరు మార్చేస్తే నాకు ఒళ్ళు మండదూ? అలాగే బాల సుబ్రహ్మణ్యం గారి ఇంటి పేరు మార్చేసి నట్టు పేరు పెడితే, ఆయనకి మాత్రం ఒళ్ళు మండదూ? “ఘంటసాల, బాల సుబ్రహ్మణ్యం” అని కామాతో వుంటే, సరిగా వుండేది. ఇలా కామా లేకుండా పేరు పెట్టడం ఆ ఇద్దరు గాయకుల్నీ అవమానం చెయ్యడమే.
వ్యాసంలో వాళ్ళ మీద ఎంత గౌరవం చూపిస్తే ఏమిటీ, పేరులో ఆ గౌరవం లేక పోయాక?
మిగిలిన వారి సంగతి ఏమో గానీ, ఇలా చెయ్యడం ఘంటసాల అభిమాని అయిన నాకు చాలా అభ్యంతరకరంగా వుంది.
ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:
08/20/2008 1:08 pm
పద్యవస్తువును నేను.
నేనొకప్పుడు కళ్ళెంలేని గుఱ్ఱం
స్వేచ్ఛాప్రాణీ, స్వైరవిహారీ, పంచకళ్యాణి
నా చూపే నా పరిధి, నా దారే నా వీధి
తిన్నదే భోజనం,
విన్నదే సంగీతం,
చూసిందే ఇంద్రజాలం,
చేసిందే చమత్కారం.
నాకు గతంలో కళ్ళెం తొడిగారు
డెక్కలకి లాడాలు కొట్టారు
కళ్ళకి గంతలు కట్టారు
మూతికేమో చిక్కం వేసారు
వీపుకి జీను తగిలించారు
మెడకి గంటలు కట్టారు
తమ పిచ్చన గమ్యాలు వివరించారు!
నా బాధ్యతలను ఘోషించారు!
రౌతులెందరో వీపెక్కారు
కర్మకొద్దీ బరుఘోలు మోయించారు
లేకపోతే బళ్ళు లాగించారు
ఉరుకులు పరుగులు వేయించారు
కాదంటే కొరడా ఝుళిపించారు
అప్పుడా గంతలే నా జీవితం
నా బరువులే నాటి మనుగడ
నా జీనే అప్పటి నా స్వర్గం
ఝాటీ దెబ్బే నా నరకం
రౌతే నా భగవంతుడు
చిక్కంపోతే భోజనం;
పని చిక్కితే ఉపవాసం
గంతలుపోతే వీక్షణం;
విశ్రాంతికే అప్పుడు కాటకం
నుంచుంటే ఒక శోష,
పడుకుంటేనొక మైకం
అలా ఆ సాహిత్య సాగరాన్ని
లంఘించడమసాధ్యం!
అందుకేనోయ్! మళ్ళీ ఇప్పుడు
మూర్ఖత్వాన్ని మట్టుబెట్టి
మరోసారి పద్య వస్తువు
కళ్ళెం లేని గుఱ్ఱం!
స్వేచ్ఛాప్రాణీ,
స్వైరవిహారీ,
పంచకళ్యాణి.
అయ్యా బాబ్జీలు గారు
మీరు ప్రతిభావంతులనీ, పండితులనీ, విటులనీ [:-) as in English wit; యిటువంటి తర్జుమాలతో వచ్చిన గొడవే ఇది. వెధవది మనం చెప్పొచ్చేదొకటి, ఇతరులకి అర్థమయ్యేది యింకోటీను. పోనీ విట్టులందామా అంటే అది యింకా ఘోరం కదండీ! మొత్తానికి నేను చెప్పొచ్చేది మీకు అర్థమయ్యింది కదా, అదే చాలు] అందరూ ఒప్పుకున్నారు కదా! మరి గజేంద్రుడి మొర ఆలకించని విష్ణు మూర్తిలా ఎన్నాళ్ళు వుంటారు చెప్పండి?
నమస్కారములతో
పామర్తి సత్యనారాయణ వ్రాలు
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి పాఠకుడు అభిప్రాయం:
08/20/2008 12:24 pm
మొద్దబ్బాయి గారూ,
అసలు పేరు చెప్పకపోవడానికీ, అసలు ఇంటి పేరు వేరే వాళ్ళు మార్చేయడానికీ తేడా తెలుసుకోకుండా, మోకాలికీ, బోడిగుండుకీ ముడి పెట్టి, సార్థకనామ ధేయులనిపించుకున్నారు.
ఒక మనిషి తన అభిప్రాయంలో రాసిందే ముఖ్యం. ఆ మనిషి ప్రవర సెకండరీ. శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు అని మీరంటే, అది మీ అభిప్రాయం అవుతుంది. ఎవరి వ్యంగ్యాలు వారికుంటాయి.
ఈమాట వారు వ్యక్తిగత వ్యంగ్యాలకి చోటు ఇవ్వం అంటూనే, ఇలాంటీ వ్యక్తిగత వ్యంగ్యాలని అనుమతించడం భావ్యంగా లేదు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. “నీ పేరు చెప్పూ, నీ పేరు చెప్పూ, అప్పుడే నువ్వన్న విషయాలు పట్టించుకుంటాము” అని అనడం భావ్యం కాదు. ఒకవేళ అలాగే వుండాలీ అని అనుకుంటే, ఈమాట వారు ఆ రూలే పెట్టాలి.
నా అబిప్రాయంలో విషయానికే ప్రాధాన్యత ఇచ్చాను. వ్యాసకర్తని ఒక్క మాట అనలేదు.
అభిప్రాయాలతో ఎవరూ మారరు సాహిత్యానికి సంబంధించిన వరకూ. కానీ అలాంటి అభిప్రాయాలు వుంటాయి అని తెలియడం కోసమే ఈ అభిప్రాయ వేదిక. ఆ పైన సెన్సార్ చెయ్యడానికి పెద్దలున్నారు.
పేరు చెప్పకపోవడం వల్లనే, నా అభిప్రాయానికి విలువ లేదని మీరంటే, అలాగే కానియ్యండి.
పాఠకుడు
ఛందోధర్మము గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
08/20/2008 10:22 am
కుక్కపిల్ల, అగ్గిపెట్టి, సబ్బు బిళ్ళ, గుర్రం, గాడిద కావేవీ కవితకనర్హం. ఎటొచ్చీ రాసేవాళ్ళకున్న అర్హత తోనే పేచీ.
రాజాశంకర్ కాశీనాథుని
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి మొద్దబ్బాయి అభిప్రాయం:
08/20/2008 10:13 am
పాఠకుడు గారూ,
“అలాగే బాల సుబ్రహ్మణ్యం గారి ఇంటి పేరు మార్చేసి నట్టు పేరు పెడితే, ఆయనకి మాత్రం ఒళ్ళు మండదూ? ” అంటూ చక్కగా సెలవిచ్చారు.
నాకయితే భలే నచ్చింది.
అసలు పేరే ప్రపంచానికి చెప్పడానికి వెనకాడే వాళ్ళు ఇలా అడగొచ్చా?
“బాబీ, చంటీ, బుజ్జీ, నానీ, పండూ” లాంటి ముద్దుపేర్లతో ముద్దుముద్దుగా విమర్శించే వాళ్ళంటే ఎవరికిష్టం ఉండదూ?
( మీరే నాకు ఆదర్శం. నేనూ నా పేరు మొద్దబ్బాయి గా మార్చేసుకున్నా, చూసారా? )
పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి jayaprabha అభిప్రాయం:
08/20/2008 10:07 am
అయ్యా బాబ్జీలు గారూ! మీరెవరండీ బాబు!!
మాకేసి ముత్తేలమ్మని మధురవాణిని నాకు చెప్తున్నారు. vaaLLu maa APPAle kaaraa?”chatri baabu” ikaTaalu meevannee!!
కృష్ణ దేశికాచారి గారి వ్యాసం మీద మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. చాన్నాళ్ళకి మంచి సరదా కలిగింది నాలో. కానీ మీతో పోటీపడి respond కాగల సత్తువ నాకు లేదు గనుక విరమించుకుంటున్నాను. కవులకి కవిత్వంతో పాటు వుండవలసిన మిగితా నేర్పుల తాలూకు లిస్టు ఇంకా నాకు నవ్వుతెప్పిస్తూనే వుంది.
ముత్తాలమ్మో, మధురవాణో, ఎవరైతేనేం గానీ, వున్నవిషయమే అన్నది కదా? సారం అన్నది అనిర్వచనీయం సామీ. వుప్పు ఎక్కువో, తక్కువో తిని చెప్పాల్సిందే, విని కాదు!
మీ “ఇజీనగరంలో” లేదా “ఇస్సపట్నంలో” మరోపాలి బొంకులదిబ్బ కాడినించి అయ్యకోనేరు దాటి వెతకండి. పైడి తల్లి, నూకాలమ్మ వరం ఇస్తే సారం మీకు తెలుస్తుంది. అనిర్వవచనీయం గనక చర్చతో పనిలేదు. ఎవరెవరి రూప సారాల సంతోషాలు వారివే.
anyway, చాలా enjoy చేస్తున్నాను మీ అభిప్రాయాలని. “ఒగ్గీకండి. రాస్తూండండి. బెగి తొంగోవాలి. శానా పొద్దోయింది”
సెలవ్..
జయప్రభ.
a_jayaprabha@yahoo.co.in
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/20/2008 10:05 am
అయ్యా బాబ్జీలుగారు కవిత్వం, సాహిత్యం గురించి కాదు కాని, నాకు తెలిసిన విషయంలో మాత్రం మీరు పొరబడ్డారేమో అని భయం!
పిల్లల “హోం వర్క్” (సొంతంగా) చేయడం సులువంటే ఒప్పుకోవచ్చేమో కాని, “చేయించడం సులువు” అంటే నిజమేనా అనిపిస్తుంది. చేయించడానికి కనీసం పిల్లలను ఒక్కచోట కూచోబెట్టాలి. కాళ్ళు కట్టేసినా, పిల్లకాయల మనసులను కట్టేయడం, కాదు ఆకట్టుకోవడం, ఒక చాలెంజ్. ఇంతా అయింతర్వాత మన ధిమాక్ లోకెక్కింది వాళ్ళ ధిమాక్ లోకి ఎక్కించడాన్ని ఏమన్నా అనొచ్చు కాని సులువు అని మాత్రం అనగలమా అని డౌటు. ఈ తిప్పలంతా చూసే గురువుగారిని “గురు బ్రహ్మ” అనికూడా అనేసారేమో అని అనుమానం కూడా. దీనికంటే ఒకచోట కూర్చోని, అక్షరాల ఒక కావ్యమో, విమర్శో, గేయమో, వచనమో, కథనో, నవలనో, లేకపోతే ఇప్పటి దాక పుట్టని ఒక అపూర్వ సాహితీప్రక్రియనో ఈ తిప్పలగురించే వ్రాసేయడం సులువేమో అని కూడా చెడ్డ అనుమానం. కాదంటారా?!
విధేయుడు
-Srinivas
పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి Kameswara Rao అభిప్రాయం:
08/20/2008 9:46 am
జయప్రభగారూ,
మీరు చెప్పింది కాళోజీకి, ఈనాటి వాళ్ళకీ వర్తిస్తుందేమో కానీ, మొదట్లో కవిత్వాన్ని పద్యానికి దూరంగా నడిపించిన అతిరథ మహారథులకి ( గురజాడ, శ్రీశ్రీ, నారాయణబాబు, తిలక్, ఆరుద్ర) వర్తించదనుకుంటాను. (మిగతావాళ్ళు మహారథులు కారని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి పద్యం రాయడం వచ్చో రాదో నాకు తెలీదు!)
ఛందోధర్మము గురించి baabjeelu అభిప్రాయం:
08/20/2008 9:27 am
పావలా పట్కా, పాతికరూపాయిల జట్కా.
పట్కా ఛందస్సు, సంధులూ, సమాసాలూ వగైరాలు.
జట్కా కవిత్వం.
మరి గుర్రం?
అసలయిన దానినెలా వొగ్గెస్తావండీ.
“కవితా వస్తువు”.
పద్య కవిత్వవయినా, పొలై పొలై / మిల్లు ఖద్దరు కవిత్వ వయినా “ఇత్యాని పద్య/కవిత లక్షణాని” (పైటలు/చున్నీలు తగలెట్టండి అనే కవిత్వవయినా)
పద్యం అంటే సుముఖత ఎందుకు? గురించి baabjeelu అభిప్రాయం:
08/20/2008 9:16 am
మా ముత్తేలు తెగ్గొట్టీసినట్టు, తెగ్గొట్టీసేరు జయప్రభగారూ.
(ముత్తేలంటే చదువూ సంధ్యా లేని మధురవాణని తెలుసున్న వాళ్ళు చెప్పేరు)
సారం వుంటే “ఆళ్ళిద్దరూ” పొద్దుగూకులూ నిలబడరా? నిలబడతారు.
సారం ఏదన్న ప్రశ్నకే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి పాఠకుడు అభిప్రాయం:
08/20/2008 7:28 am