పాఠకుల సాహిత్యాభిమానం ఎక్కువ కావడం వల్లనో, సంగీతాభిమానం తక్కువ కావడం వల్లనో తెలియదు కాని, త్యాగరాజు సృష్టించిన అద్వితీయమైన సంగీతం గురించి మటుకు ఒక్క కామెంటు కూడా కనబడటం లేదు! వీణ తీగల గురించిన చర్చ కూడా అటువంటిదే.
కథ వాస్తవానికి చాలా దగ్గరగా వుంది. నిజానికి పిల్లల పెంపకము లో ప్రతి క్షణము యుద్ధమే. మంచి, చెడు ఏదో వారికి తెలియజేస్తె వారే నిర్ణయించుకుంటారు ఎమిచేయాలో.
06-01-2009 నాటి శేషు గారి లేఖ పైన డా. తాతిరాజు వేణుగోపాల్ అభిప్రాయం :
ఏ భాషకా భాషే గొప్పది. భావం ఒక్కటే అయినా ఒక్కో భాషలో ఒక్కో అందం కనబడుతుంది. ‘తమిళ వాసన’ అనే వెటకారం, ప్చ్ ! ఇంకా ఈ రోజుల్లో కూడానా? అమాయకుడు భారతి ‘సుందర తెనుంగ్’ అని అంటే, మనమేఁవో ఇలా. అర్ధమవుతున్న కొద్దీ అన్ని భాషల్లో అమృతం దొరుకుతుంది. ఇప్పుడు త్యాగయ్యలో తమిళం, రేపు రామదాసులో ఉర్దూ, ఎల్లుండి అన్నమయ్యలో కన్నడం- ఇలా వెతుక్కునే కన్నా ఈ మహానుభావుల కృషికి అబ్బురపడుతూ వారు వేసిన ‘చక్కని రాజమార్గములు’ యేవో తెలుసుకొనీ నడుచుకుందాం.
వచనానికీ కవనానికీ మధ్య భేదం లేదనిపించేట్లు రాయగల వాళ్ళు చలం, కృష్ణశాస్త్రి, రావి శాస్త్రి అని. సరిగ్గా ఆకోవలో రచనలు చేసిన వాడు స్మైల్ అని.
చాలా బాగా చెప్పారు.
చలం వచనం ఎందుకు అంత బాగా నచ్చుతాదో ఇన్నాళ్ళకు అర్ధం అయ్యింది నాకు.
నిన్ననే వల్లంపాటి వారు రాసిన “విమర్శా శిల్పం” కొన్నాను. చాలా బావుందనుకున్నాను పేజీలు తిరగెయ్యగానే. జీవితం, సాహిత్యం & సాహితీ విమర్శ మొదట్లో సమబాహు త్రిభుజం అనీ, తరవాత కాదనీ మొదటి పేజీ లోనే ఆయన రాయడం (మొదట రాసిన వ్యాసానికీ, ఈ పుస్తకానికీ “ఇంప్రూవ్ మెంట్”) ముచ్చటేసింది. ఈయనెక్కడ దొరుకుతారో, కలిసి బోల్డన్ని అడగాలనుకున్నాను. “యాదృచ్చికంగా” ఈ వ్యాసం చూసేను. అయ్యో రాతా అనిపించింది.
భూషణ్ గారికి – రుబాయీలకు అన్ని అనువాదాలను ఎక్కడ సంపాదించారండీ బాబూ? చలం పుస్తకం ఆరునెలలుగా వెతుకుతూంటే నిన్న దొరికింది. అద్భుతమైన వ్యాసం. సోదాహరణంగా వివరించటం వలన వ్యాసానికి గొప్ప సాధికారికత వచ్చింది. మీ రెన్నుకున్న పద్యం మీ వివరణలకు కరక్టుగా సరిపోయింది. 🙂
పెంపకం
గురించి gorusu jagadeeshwar reddy అభిప్రాయం:
01/07/2009
12:54 am
నిడదవోలు మాలతి కథ ‘పెంపకం’ చదివేను. విషయ ప్రాధాన్యమైన కథ ఇది. పార్వతి కేరెక్టర్ బాగుంది. ‘ఎప్పటికప్పుడు ఆ క్షణానికి తోచినట్టు వ్యూహ రచన చేసుకుంటానంతే. గెలుపూ, ఓటమీ రెంటికీ సిద్ధమే నేను’ అని పార్వతి చివర్లో చెప్పే మాటలు కథకు మరింత బలం ఇచ్చాయి. ఒక సాయంత్ర విశాఖబీచ్‌లో జరిగిన చిన్న సంఘటనతో కథను చెబుతూ అంతర్లీనంగా బతుకు సూత్రం చెప్పినట్టు అన్పించింది.
మాలతిగార్కి ధన్యవాదాలు.
– గొరుసు జగదీశ్వరరెడ్డి
థాంక్సండీ, ఇక్కడే వింటాను. డౌన్ లోడ్ చేయను. కాపీరైట్ల గురించి చాలా సార్లు మీ బోటి విజ్ఞుల అభిప్రాయాలను చదివాను. వీలైనంత వరకు, గౌరవించే ప్రయత్నమే చేస్తాను.
– శ్రీనివాస్
తరగని దూరం గురించి రానారె అభిప్రాయం:
01/07/2009 2:46 pm
ఆహా! నిజమే!! భలే చిత్రమైన సంగతి. దేశాల మధ్య దూరాలను మాపే ఈ సాధనాలే మనిషికీ మనిషికీ మధ్య దూరాన్నెక్కువ చేస్తున్నాయ్!!!
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Rohiniprasad అభిప్రాయం:
01/07/2009 2:45 pm
పాఠకుల సాహిత్యాభిమానం ఎక్కువ కావడం వల్లనో, సంగీతాభిమానం తక్కువ కావడం వల్లనో తెలియదు కాని, త్యాగరాజు సృష్టించిన అద్వితీయమైన సంగీతం గురించి మటుకు ఒక్క కామెంటు కూడా కనబడటం లేదు! వీణ తీగల గురించిన చర్చ కూడా అటువంటిదే.
పెంపకం గురించి Krishna అభిప్రాయం:
01/07/2009 2:31 pm
కథ వాస్తవానికి చాలా దగ్గరగా వుంది. నిజానికి పిల్లల పెంపకము లో ప్రతి క్షణము యుద్ధమే. మంచి, చెడు ఏదో వారికి తెలియజేస్తె వారే నిర్ణయించుకుంటారు ఎమిచేయాలో.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal అభిప్రాయం:
01/07/2009 11:28 am
06-01-2009 నాటి శేషు గారి లేఖ పైన డా. తాతిరాజు వేణుగోపాల్ అభిప్రాయం :
ఏ భాషకా భాషే గొప్పది. భావం ఒక్కటే అయినా ఒక్కో భాషలో ఒక్కో అందం కనబడుతుంది. ‘తమిళ వాసన’ అనే వెటకారం, ప్చ్ ! ఇంకా ఈ రోజుల్లో కూడానా? అమాయకుడు భారతి ‘సుందర తెనుంగ్’ అని అంటే, మనమేఁవో ఇలా. అర్ధమవుతున్న కొద్దీ అన్ని భాషల్లో అమృతం దొరుకుతుంది. ఇప్పుడు త్యాగయ్యలో తమిళం, రేపు రామదాసులో ఉర్దూ, ఎల్లుండి అన్నమయ్యలో కన్నడం- ఇలా వెతుక్కునే కన్నా ఈ మహానుభావుల కృషికి అబ్బురపడుతూ వారు వేసిన ‘చక్కని రాజమార్గములు’ యేవో తెలుసుకొనీ నడుచుకుందాం.
కవి స్మైల్ గురించి మరొక్కసారి… గురించి bollojubaba అభిప్రాయం:
01/07/2009 10:10 am
వచనానికీ కవనానికీ మధ్య భేదం లేదనిపించేట్లు రాయగల వాళ్ళు చలం, కృష్ణశాస్త్రి, రావి శాస్త్రి అని. సరిగ్గా ఆకోవలో రచనలు చేసిన వాడు స్మైల్ అని.
చాలా బాగా చెప్పారు.
చలం వచనం ఎందుకు అంత బాగా నచ్చుతాదో ఇన్నాళ్ళకు అర్ధం అయ్యింది నాకు.
ఖాళీ సీసాలు గురించి bollojubaba అభిప్రాయం:
01/07/2009 9:59 am
చానాళ్ల క్రితం చదివానీ కధని. ఈ కధలోని కొన్ని టాబూ ఇమేజెస్ ఇప్పటికీ హాంటింగ్ మెమరీస్ గానే ఫ్రెష్ గా ఉన్నాయి. మరలా చదివించారు థాంక్స్.
స్నేహితుడు, విమర్శకుడూ గురించి baabjeelu అభిప్రాయం:
01/07/2009 9:45 am
నిన్ననే వల్లంపాటి వారు రాసిన “విమర్శా శిల్పం” కొన్నాను. చాలా బావుందనుకున్నాను పేజీలు తిరగెయ్యగానే. జీవితం, సాహిత్యం & సాహితీ విమర్శ మొదట్లో సమబాహు త్రిభుజం అనీ, తరవాత కాదనీ మొదటి పేజీ లోనే ఆయన రాయడం (మొదట రాసిన వ్యాసానికీ, ఈ పుస్తకానికీ “ఇంప్రూవ్ మెంట్”) ముచ్చటేసింది. ఈయనెక్కడ దొరుకుతారో, కలిసి బోల్డన్ని అడగాలనుకున్నాను. “యాదృచ్చికంగా” ఈ వ్యాసం చూసేను. అయ్యో రాతా అనిపించింది.
అనువాదంలో మెలకువలు గురించి bollojubaba అభిప్రాయం:
01/07/2009 9:31 am
భూషణ్ గారికి – రుబాయీలకు అన్ని అనువాదాలను ఎక్కడ సంపాదించారండీ బాబూ? చలం పుస్తకం ఆరునెలలుగా వెతుకుతూంటే నిన్న దొరికింది. అద్భుతమైన వ్యాసం. సోదాహరణంగా వివరించటం వలన వ్యాసానికి గొప్ప సాధికారికత వచ్చింది. మీ రెన్నుకున్న పద్యం మీ వివరణలకు కరక్టుగా సరిపోయింది. 🙂
పెంపకం గురించి gorusu jagadeeshwar reddy అభిప్రాయం:
01/07/2009 12:54 am
నిడదవోలు మాలతి కథ ‘పెంపకం’ చదివేను. విషయ ప్రాధాన్యమైన కథ ఇది. పార్వతి కేరెక్టర్ బాగుంది. ‘ఎప్పటికప్పుడు ఆ క్షణానికి తోచినట్టు వ్యూహ రచన చేసుకుంటానంతే. గెలుపూ, ఓటమీ రెంటికీ సిద్ధమే నేను’ అని పార్వతి చివర్లో చెప్పే మాటలు కథకు మరింత బలం ఇచ్చాయి. ఒక సాయంత్ర విశాఖబీచ్‌లో జరిగిన చిన్న సంఘటనతో కథను చెబుతూ అంతర్లీనంగా బతుకు సూత్రం చెప్పినట్టు అన్పించింది.
మాలతిగార్కి ధన్యవాదాలు.
– గొరుసు జగదీశ్వరరెడ్డి
కొండ నుంచి కడలి దాకా గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
01/06/2009 7:15 pm