పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చాటుపద్య రూపకం గురించి రాఘవ అభిప్రాయం:

    02/26/2009 2:51 am

    ఇలాంటివి వేరే రూపకాలు కూడా ఈమాటలో ప్రచురించారా? వీలుంటే ఈ రూపకానికి అనుబంధంగా ఆ లంకెలు కూడా ఇవ్వగలరు.

  2. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/25/2009 11:30 pm

    సంపాదకులకు,
    నాకు చిన్న కుతూహలం! ఇలా కలిగింది మరి! అది ఎటువలెననంగా!!

    కాళ్ళు ఫోటో తీసి పంఫడం ఏం గౌరవమండీ బాబూ! అంత భక్తి కలిగినప్పుడు స్వయంగా వెళ్ళి మొక్కాలి గానీ! మా తరంలో మేము అలా చేసేవాళ్ళం మరి! ఈ మధ్య ఆస్త్రేలియా లో రోడ్డు మీద నిలబడి “free hugs” కోసం ప్రచారం ఒకటి చూసేను. అన్నీ కొరతే అయిపోతున్న ట్టున్నాయి లోకంలో. మాట..స్పర్శ లాంటివి! ప్లాస్టక్ మయం..ఏం తెలుసుకోలేం! పొటోల్లో..కాళ్ళు మొక్కడం..కంప్యుటర్ లోంచి పూజలు చేసుకోవడం! అంతా మాయా ప్రపంచం మరి! భైరవభట్ల వారి కాళ్ళు …ఈసారి వ్యాసంతో పాటు గానే “జమిలి”గా పంపేస్తే సరి!

    రోహిణీ ప్రసాద్ గారూ! తెనుగు మగవారి మీద మీ వ్యాఖ్యతో నాకు పేచీ ఏం లేదు గానండీ..అన్ని సంప్రదాయాలూ అలా నిరంతరంగా ఆడాళ్ళ వల్లే వర్ధిల్లే భారం ఇంకా ఇంకా ఆశిస్తూ ఉంటే..అందుకు ఈ ఆడాళ్ళూ ఇవాళ అనేక విధుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు కదా. ఇంకో బరువు కూడానా?? అని విసుగ్గా అనుకుంటాం కదా! ఇప్పటిదాకా మోసిన సంప్రదాయాలు చాల్లేదా ఏమన్నానా? for a change, ఆ విధి ఏదో కనీసం ఇప్పటికైనా “తెనుగు మగ వారే” నెత్తికెత్తుకోవచ్చును కదా! ఇది తప్పకుండా కృష్ణా స్నానమే”! ఏ కొండుభొట్ల అనుజ్న అఖ్ఖర్లేదు. పుణ్యం పురుషార్ధమూను. so ఇటుపై శాస్త్రీయ సంగీతానికి కుటుంబంలోని మగవాళ్ళూ అంతే ఆసక్తి చూపించడం ఆశించ వచ్చునా??
    రమ.

  3. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి యుగంధర్ అభిప్రాయం:

    02/25/2009 5:15 pm

    గొర్తిగారిలా అన్నారు ..
    “తెలుగు నాటకం పేరున ఒక బ్లాగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. అందులో నాటక ప్రతులూ, వీడియోలూ అన్నీ ఉండేలా చేయాలన్న ఆలోచన ఉంది. అది రూపుదిద్దుకుంటే ఈ పుస్తకం అక్కడ పెడదాం. ”

    అయ్యా మీ ఉద్దేశం గనక జయప్రభగారు రాసిన నాలుగోగోడ పుస్తకం అయితే ఆవిణ్ణి సంప్రదించకుండా ఇలాంటి ప్రణాళికలు వెయ్యకండి. తన కాపీరైట్లని సంరక్షించుకోవడంలో ఆవిడకి చాలా పట్టింపు ఉంది.

  4. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/25/2009 2:44 pm

    ‘గంగా స్నానానికి కొండుభొట్ల ఆజ్ఞ’ అన్న పద్ధతిలో కాకుండా శాస్త్రీయసంగీతాన్ని ఇంటర్నెట్ ద్వారానూ, ఇతర సాధనాలతోనూ ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా విని ఆనందించవచ్చు. నేను చేసేదల్లా దానికి నేపథ్యాన్ని గురించిన సమాచారం కాస్త అందజేయడమే. దానివల్ల రమగారిలాగా ఎవరైనా సంతోషం పొందితే నా పని నెరవేరినట్టే.

    శాస్త్రీయసంగీతం బ్రహ్మపదార్థమేమీ కాదని నా ఉద్దేశం. (నీచోపమానం కాదనుకుంటే) సాఫ్ట్ డ్రింక్స్ మానేసి స్కాచ్ ఆస్వాదించడం మొదలుపెట్టినట్టు తేలిక పాటల్నించి కాస్త గ్రాడ్యుయేట్ కావడం సాధ్యమే.

    పెద్ద సంగీతజ్ఞులందరూ తమ తల్లులనుంచే సంగీతానికి ప్రేరణ పొందినట్టు చెపుతారు. ‘మగవెధవలు’ (అందునా తెలుగువారు) ఈ విషయంలో కాస్త వెనకపడ్డారేమో ఆలోచించాలి. కుటుంబాల్లో సంగీతం పెరగాలంటే మహిళలే నడుం కట్టాలనిపిస్తుంది.

  5. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/25/2009 9:34 am

    సంపాదకులకి,
    రోహిణీ ప్రసాద్ గారి లింకు ద్వారా ఫియాజ్..విలాయత్ గారల జుగల్ బందీ ఇంకా నాలో మోగుతోంది. నాలుగు మొయిళ్ళు అలా వాటి లోని మెరుపూ..ఉరుము లతో సఃహా ఆలింగనం చేసుకున్న ట్టు గా ఉంది. వాన..అంటే మామూలు వాన కాదు ..ఒకానొక సాంధ్యవేళ ..అటు చంద్రోదయమూ..ఇటు వెన్నెలా ఉన్నప్పుడే …హఠాత్తుగా అతి వేగంగా దూసుకొచ్చిన స్వర మేఘం .జలజలా రాగాన్ని “జ్యొత్స్నా పయఃపిండములు” గా కురిపించిన ట్టుంది. అందువల్లే కాబోలు.. వాళ్ళ గొంతుల్లో వెలుగు..మురజం లాగా మోగింది.

    thanks to rohini prasad,

    రమ.

  6. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి Ram అభిప్రాయం:

    02/25/2009 7:39 am

    మాస్టారు, మీ కాళ్ళు కాస్త ఫొటొ తీసి పంపుతారా!

  7. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి mOhana అభిప్రాయం:

    02/25/2009 6:30 am

    కర్ణాటక సంగీతములో 72 మేళకర్తలు ఉన్నాయి. వాటి సంఖ్యలను తెలిసికొనడానికి కటపయాది సూత్రం ఉపయోగపడుతుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య విలువను ఇస్తారు ఇందులో. ఆ విలువలు
    ఇలా ఉంటాయి –
    1 2 3 4 5 6 7 8 9 0
    క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ
    ట ఠ డ ఢ ణ త థ ద ధ న
    ప ఫ బ భ మ
    య ర ల వ శ ష స హ

    సంఖ్య విలువలు కుడి నుండి ఎడమకు (సామాన్యముగా మనము ఎడమనుండి కుడివైపుకు సంఖ్యలను రాస్తాము). కనకాంగి అంటే 1, రత్నాంగి అంటే రెండు, రామప్రియ అంటే 52, ఇలా.

    విధేయుడు – మోహన

  8. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి p.kusumakumari అభిప్రాయం:

    02/25/2009 2:36 am

    ఇంత మంచి విశేషాలను అందించిన కొ.రోహిణీ ప్రసాదు గారికి కృతజ్ఞతలు. సంగీత విశేషాలను ,లలిత కళల గురించీ అక్షర బద్ధం చేసి, పాఠకులకు “అఱటి పండు వలిచి ,అఱచేతిలో పెట్టిన” మీకృషి అద్భుతం!
    ఇదే రీతిగా “కటపయాది సూత్రము ” గురించి వివరిస్తారని ఆశిస్తున్నాను.

  9. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/24/2009 10:39 am

    నాగరాజు గారూ – అన్నమయ్య మీద జయప్రభ గారు రాసిన పదపరిచయం చదవలేదా ?? లేకపోతే చదవండి. ఆవిడ అన్నమయ్య మీద రెండో సంపుటం కూడా రాస్తునారని విన్నాను. అన్నమాచార్యుల వారి గురించి ఆసక్తి ఉన్నవాళ్ళకి ఆ పుస్తకాలు ఉపయోగపడొచ్చు. పోలిక సంగీతంలో కన్పించొచ్చు…గానీ..కర్ణాటక సంగీతానికీ..యూరోపియన్ సంగీతానికీ లంకె తక్కువ అనుకుంటాను. అయినా శ్రమ పడ్డారు. అందుకు అభినందనలు.

    అన్నమయ్య సంగీతానికి సంభంధించిన పరిశోధనలు ఏమీ జరిగినట్టు కన్పించదు. కానీ అన్నమయ్య మనవడు -అన్నమయ్య గారి సంకీర్తనా లక్షణానికి తెనుగు అనువాదం చేస్తూ- తన తాతగారి కాలం నాటి సంగీత శాస్త్ర గ్రంధాలని పేర్కొన్నాడు. విజయనగర కాలం నాటికి సంగీతం మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. గనక అన్నమయ్య పదాల లోని సంగీతం గురించి ఎవరైనా పరిశోధన చేయాలని నిజంగా అనుకుంటే అది అసాధ్యం కాకూడదు.
    రమ.

  10. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి రాఘవ అభిప్రాయం:

    02/24/2009 3:11 am

    నాకు కర్ణాటక సంప్రదాయ సంగీతంలో(తో) పరిచయం ఉన్నా పాశ్చాత్య సంగీతంగా పిలువబడుతున్న సంగీతంతో పరిచయం నిండు సున్నా. ఇప్పుడు వ్యాసకర్త పుణ్యమా అని కనీసం ఒక నలుగురి పేర్లు తెలిసాయి.

    ఇక ఇక్కడ ప్రతిపాదించిన కర్ణాటక సంప్రదాయంలో ప్రసిద్ధులైన నలుగురు వాగ్గేయకారుల వివరాలు చక్కటి ఆరంభాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు. శ్యామశాస్త్రిగారి గురించి చెప్తూ సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో సుబ్బరామదీక్షితర్ ఉదహరించిన శ్రీనాథుని పద్యాన్ని ఉటంకించడం సముచితం.