పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి susila అభిప్రాయం:

    08/19/2009 8:51 am

    బ్రహ్మానందం గారూ,

    అద్భుతమైన వ్యాసం…
    మీ కృషి అభినందనీయం…
    మీకు అనేకానేక ధన్యవాదాలు…
    1) ఈ వ్యాసాలన్నీ ప్రింటవుట్‌ తీసుకొని, చదువుకోడానికి వీలుగా, మీదగ్గర PDF లాంటిది ఏదైనా ఉంటే దయచేసి ఇవ్వరూ..?
    2) “కన కన రుచిరా…” అనే కీర్తనకి తెలుగులో సాహిత్యం ఇవ్వండి ప్లీజ్‌…
    ధన్యవాదాలతో
    సుశీల

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి Sai Brahmanandam అభిప్రాయం:

    08/19/2009 1:27 am

    రమ గారూ, మీరు చెప్పింది నిజం. రచయితలకి నిజాయితీ కొరవడుతోంది.

    ఈ మధ్యనే ఒక అనువాద కథ మీద ఒక ప్రముఖ రచయిత కాపీ కొట్టాడంటూ సాక్షాలతో సహా చూపించారు. సదరు రచయిత గారూ అదేం పెద్ద తప్పుకానట్టుగా వ్యవహరించి, దర్జాగా అదే పత్రికలో విరివిగా కధలూ, కాకరకాయలూ రాసేస్తున్నారు.
    తెలుగు సాహిత్యం వరకూ ‘కాపీయే రైటు” అన్నది అక్షర సత్యం.
    విషయం కాపీ కొట్టడం ఒక రకం అయితే, యధాతధంగా వాక్యాలనీ కాపీ కొట్టడం మరో రకం. మీరన్నట్లు నిలదీసే వాళ్ళు లేనప్పుడు ఇలాంటివి తప్పవేమో?

    ఈనాడు చెన్నై వారికి ఫోన్ చేసి విషయం చెబితే వారికి అది రాసిన వ్యక్తి పేరు తెలీదని బుకాయించారు. కావాలంటే హైద్రాబాదు ఆఫీసుకి ఫిర్యాదు రాయమని ఓ ఉచిత సలహా పారేసారు. ఇదీ ప్రస్తుత జర్నలిజం తాలూకు విశ్వరూపం.
    పేరూ వూరూ లేని రాతల్ని వేసుకునే పత్రికలు చెప్పే వార్తల్ని ఎవరు విశ్వసించాలి?

    నాకు ఫోన్ కాల్ దండగ తప్ప ఏమీ మిగల్లేదు.
    రోహిణీ ప్రసాదు గారు చెప్పినట్లు “Imitation is the best form of flattery! ” అని సంబరపడాలంతే!

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి rama bharadwaj అభిప్రాయం:

    08/15/2009 11:10 am

    తెలుగులో నిస్సమ్కోచంగా నిస్సిగ్గుగా అభిప్రాయాల్ని..పేరు చెప్పకుండా copy కొట్టడం ఎన్నిసార్లో కన్పిస్తుంది. పేర్లు చెప్తే దు:ఖపడతారని ఊరుకోవాలి గానీ..ఇటువంటి పనులు చేసిన వాళ్ళలో మ హా మ హులెందరో!!

    కష్టపడి చదివి..విషయ సేకరణ చేసి..ఒక పుస్తకం రాసేమనుకోండి..దానిలోని ఆలోచనలకీ..ప్రతిపాదనలకీ ఆదరణ వచ్చిందనుకోండి..ఆ తర్వాత మాట్లాడే వాళ్ళంతా ఆ ఆలోచనలూ..ఆ ప్రతిపాదనలూ..వాళ్ళ సొంత అభిప్రాయాల్లా అసలు కృషి చేసిన వారి పేరుని వీలైనంత దాచి పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ..నిర్భయంగా ఇతరుల మాటల్ని తమవిగా చెలామణీ చేసుకుంటారు. తెలుగుసాహిత్యసమాజం వీళ్ళ విషయంలో ఏనాడూ..ఖచ్చితంగా వ్యవహరించక పోబట్టీ ఇటువంటి వారి చర్యలు బేఫిఖరుగా కొనసాగుతున్నాయి. mediocrity ప్రధాన కారణం..నిజాయితీ లోపించడం అంతకన్నా ముఖ్యమైన కారణం. గమ్మత్తేమంటే..డబ్బూ..అవకాశాలూ..వచ్చేవి వీరికే!! ఇదేమిటని..ఇలా ఎందుకని ఎవరూ అనక పోవడం..అనుకోకపోవడం తెలుగు వాళ్ళ నైజం గనక వీటిని గురించిన చర్చ నిజంగా ఏనాడూ జరగలేదు. “మనకెందుకులెస్తూ” అన్న ఒక అతి జాగ్రత్త మనస్తత్వం దీనికి కారణం.

    పాపం ఆ “ఈనాడు రిపోర్టర్ ” దొరికాడు. దొరకని దొంగలు” పెద్ద మనుషులుగా చెలామణీలో ఉన్నారు బ్రహ్మానందం గారూ!!

    రమ.

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/14/2009 10:26 am

    సమాచార వితరణ అనేది మంచిపనే కనక దీన్నంత సీరియస్‌గా తీసుకోనక్కర్లేదేమో. తక్కిన ఇంటర్నెట్ సమాచారంలాగే మనవాళ్ళు ‘విదేశీ’ సైట్లనుంచి ఇటువంటివి స్వీకరిస్తున్నారని సరిపెట్టుకోవచ్చు.
    మన దేశంలోని జర్నలిస్టులకు జీతాలూ తగినంతగా ఇవ్వరు. ఒత్తిడికూడా ఎక్కువే. వారిలో కొందరిని చూసిన తరవాత ఎవరికైనా సానుభూతి కలుగుతుంది. సెర్చ్‌చేసి కొత్త విషయాలను తెలుసుకుని రాసి పంపేంత వ్యవధీ, వనరులూ, సౌకర్యాలూ లేని పరిస్థితిలో ఇలాంటి షార్ట్‌కట్లు తప్పవేమో.
    http://www.dictionary.com వంటిది ఉపయోగించి, జర్నలిజంలో తగిలే పదాల ఉచ్చారణ తెలుసుకోవడం కష్టమేమీ కాకపోయినా మన పెద్ద దినపత్రికల్లో కూడా భయంకరమైన తప్పులు కనిపిస్తూ ఉంటాయి. జర్నలిజంలో ఉత్తమ సంస్కారం అలవడటానికి ఇంకా సమయం పడుతుంది.

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి వినీల్ అభిప్రాయం:

    08/14/2009 5:06 am

    ఈమాటలో వివిధ ఫీచర్లతో బాటు “హాల్ అఫ్ షేం” ఫీచర్ ఒకటి పెట్టి ఇలాంటివి లిస్ట్ చేస్తే సరి. కేవలం సంపాదకులు, రచయితలే కాక బోల్డు మంది నవ్వుకోవచ్చు. మరోసారి ఎవరైనా ఇలా కాపీ చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/13/2009 9:27 pm

    Imitation is the best form of flattery! ప్రొఫెషనల్ తెలుగు జర్నలిస్టులందరూ వెబ్ పత్రికలనూ, ముఖ్యంగా ఈమాటనూ శ్రద్ధగా చదువుతారు. సమాచారం పనికొచ్చేదైతే తీసేసుకుంటారు. Acknowledge చెయ్యరు. చందమామ గురించీ, రజనిగారి గురించీ నేను రాసినవి వాళ్ళకి inspirationగానో, ఇతర పద్ధతుల్లోనో పనికొచ్చాయి. ఏదైనా అంతే. నవ్వుకుని ఊరుకోవడం తప్ప మనం చెయ్యగలిగినదేమీ లేదు. We are their unpaid stringers!

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి Sai Brahmanandam అభిప్రాయం:

    08/13/2009 12:44 pm

    ఈ మధ్య చెన్నై ఈనాడు వెర్షన్ లో త్యాగరాజు పై వ్యాసాలు వస్తున్నాయి. అందులోనూ కొన్ని కల్పితాలతో వున్నాయి.
    ఈ వ్యాసంలో కొన్ని వాక్యాలు యధాతధంగా నేను రాసిన త్యాగరాజు వ్యాసం నుండి రాసారు. ఇంటర్నెట్ సౌకర్యాలలో ఇదొకటి. గూగిలిస్తే కొండంత సమాచారం కాలు కదపకుండా చక్కగా దొరుకుతుంది.

  8. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/12/2009 8:44 am

    రాజేశ్వరరావుగారి రికార్డింగ్ 1979లో జరిగింది. కన్యకాపరమేశ్వరి మహత్యం అనే సినిమాలో దేవులపల్లివారి రచన వీణా నా వీణా అనే పాటకు సుబ్రహ్మణ్యంరాజుగారు వీణనూ, నేను సితారునూ వినిపించాం. (‘ఎం.ఎస్‌.రాజు’గా సంగీత దర్శకత్వం కూడా వహించిన ఈ సీనియర్ కళాకారుడు సా విరహే తవదీనా మొదలైన పాతపాటల్లో హవాయియన్ గిటార్‌ కూడా వాయించాడని తరవాత తెలిసింది) పేరుకు వీణ అయినా సినిమాల్లో తరుచుగా రెండు రమారమి ఒకేలాంటి వాద్యాలను కలిపి ఉపయోగిస్తారు. పుష్పవిలాపం గురించి త్వరలో రాస్తాను.

  9. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి sOmAvathi అభిప్రాయం:

    08/11/2009 6:02 am

    1/ అద్భుతమైన వ్యాసం…వీలైతే పుష్పవిలాపం మీద కూడా ఒకటి రాయండీ?
    2/ సాలూరి వారి సంగీతంలో మీరు సితారు వాయించిన పాట ఏ సినిమా లోది?

  10. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి Ravi అభిప్రాయం:

    08/11/2009 5:19 am

    @Mahesh్ garu
    Great article. Now I should revisit these movies. Thanks for the inspiration. More later

    @Rajendra kumar

    The issues with the ‘glorified’ Mafia existed from ages with several directors, name it Sameul fuller , Martin scorsese , Brian DePalma or QT. Whether people appove or not there was and always will be an innate charisma , fascination surrounding ‘Gangsters’ and ‘violence’. There is nothing glorification in it , rather a representation of mixture of realities and fantasies.

    I am not sure of what you are hinting about ‘women’ in RGV’s films but I didn’t see any misogynistic tendencies in his films may be a bit bordering on masculinity. There is always, this male gaze in his movies.