పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. జవాబు ఫలితం గురించి pantula Jogarao అభిప్రాయం:

    10/06/2009 10:25 am

    మీ రచన శ్రీ శ్రీ గారి “నిప్పులు చిమ్ముకు౦టూ” గేయ౦ లాగా చిన్నదయినా చాలా గొప్పగా ఉ౦ద౦డీ. ధన్యవాదాలు. నాది పార్వతీపురమ౦డీ.

  2. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    10/05/2009 7:06 pm

    రవి కిరణ్ గారి సుదీర్ఘ వ్యాసానికి, వేమూరి వారిది చక్కని వంగ్యమైన జవాబు అని రమ గారు చెపితే అర్థమయ్యింది. అంతవరకూ రమణి గారి లాగే నేను బాధపడ్డాను.

    ప్రశ్న లేవనెత్తినందుకు రమణి గారికి ధన్యవాదాలు.

    గరికపాటి పవన్ కుమార్

  3. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj అభిప్రాయం:

    10/05/2009 1:32 am

    రమణి గారూ! వేమూరి వారిది వెక్కిరింత. మీడియాలోని తెలుగుకి ఆయన ఒక బొమ్మ గీసి చూపించారు. ఆయనకి కల్గిన కోపం అటువంటి సంకరవాక్యాల మీద ఎంత గాఢమైనదో అందరికీ తెలిసేలా రాసారు వ్యంగ్యాన్ని. దాన్ని
    చదువుకున్న వారు “అమ్మో! ఇలా ఉంటుందన్నమాట!” తెలుగులో ఎక్కువ ఇంగ్లీషు వాడితే! అని అనుకోవాలన్నదే ఆయన అభిప్రాయంఅ గనక ఆయన అనుకున్నది నెరవేరినట్టే !

    లైలా గారి అభిప్రాయం మీద మీ అభిప్రాయం బాగుంది.

    రమ.

  4. తెలుగు నిఘంటువు గురించి… గురించి అనిలు అభిప్రాయం:

    10/04/2009 10:41 pm

    తెలుగుఁ వారికిఁ జాలినంత తెలుఁగుబాస కలదు; వారు పరభాషా దాస్యమునకుఁ జేతులొగ్గవలసినది లేదు” అంటు, “అచ్చతెలుగు కోశము” (రెండు సంపుటాలు) ని 1979 లో పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి (శ్రీ శ్రీనివాస భవనశ్రీ – నెం 22-7-7, మోటుపల్లి వారి వీధి, కొత్తపేట, తెనాలి-522 201, గుంటూరు జిల్లా, ఆం. ప్రదేశ్ ) గారు వెలువరించారు. ఆవుల సాంబశివరావు గారు కృతికర్త. ధర (50+50) వంద రూపాయలు.
    మనకి నిఘంటువులు లేకపోలేదు. కాని వాటిని పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.

  5. ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి సర్పవరపు రమణి అభిప్రాయం:

    10/04/2009 9:17 am

    (లైలా గారి) అభిప్రాయం ఆంగ్లంలో కొటేషన్లు తెలుగులో ఏమి బేహద్బీ !!
    రచయిత్రి తమ అభిప్రాయాలను తెలుగులో రాస్తే సొమ్మేం పోయింది??
    English online magazine చదివి తెలుగులో అభిప్రాయాలు
    రాస్తే ఇతరులు (తెలుగు రానివారు) ఆనందించగలరా ?? సంపాదక వర్యులు ఆంగ్లంలో అభిప్రాయాలు రాసేవారిని కొంచెం పట్టించుకొండి.

    సర్పవరం రమణి.

  6. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి సర్పవరపు రమణి అభిప్రాయం:

    10/04/2009 9:00 am

    పంతుళ్లు కూడా తెలుగులో రాయలేక చతికిలపడిపోతే ?? పైగా యాంకర్ల యాసలో కొంకర్లు పోయిన తెలుగు(?)లో అభిప్రాయాలు రాస్తే ఎవ్వరిననుకొని ఏమి లాభం ??ఏటికి ఎదురీదగల సాహసే ఏమైనా సాధించగలడు. “ఫ్లోని అప్పోజ్ చేస్తూ స్విం చెయ్యటానికి ట్రై చెయ్యటా”నికి పెద్ద గట్స్ అవసరం లేదు.

    సర్పవరపు రమణి.

  7. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి సర్పవరపు రమణి అభిప్రాయం:

    10/04/2009 8:47 am

    విరామ చిహ్నాలు తెలియకుండా మహాకవులు గావచ్చు.
    అసలేమీ చదవకుండా ఆధునిక కవిత్వాలు అప్రయత్నంగా
    అర్థమవాలనుకునే అసాధరణ పాఠకులు కావచ్చు.ఘనంగా
    సినిమా పాటలు రాసుకుంటూ జ్ఞానపీఠం బడయవచ్చు.
    ఇవన్నీ ,మన ఒక్క తెలుగులోనే సాధ్యం సుమా !!

    సర్పవరపు రమణి.

  8. జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Nagaraj అభిప్రాయం:

    10/03/2009 5:04 am

    Kudos to the author for presenting such a marvelous piece before the readers.

    Best Regards,
    Nagaraj

  9. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri అభిప్రాయం:

    10/01/2009 9:40 am

    యూనివర్సు షేపు ఎలా ఉందో తెలుగులో ఎక్స్‌ప్లైన్ చేసి చెప్పటం డిఫికల్ట్ అని ముందుగానే ఒప్పేసుకున్నాను. తెలుగులో ఎటెంప్టు చేసి చూద్దామనే సరదాతో చేసిన ఎక్స్పరిమెంటు ఇది. ఈ వర్కు ఈజీ అయితే నేను ఎటెంప్టు చేసి ఉండేవాడినేకాదు. ప్రతీ ఎక్స్పరిమెంటూ సక్సెస్ అవాలని రూలు లేదు కదా. వేలూరి గారు రివైజ్ చెయ్యమని రిక్వెస్టు చేస్తూ నా చేత అరడజను బుక్స్ చదివించేరు. స్పిరిట్ లూజవకుండా ఆయన హెల్పుతో అలా రెపేర్లు చేస్తూనే వచ్చాను. కనుక ఈ కాంటెక్స్టులో ఆయన ఫాల్టు లేదు. అండర్‌స్టేండింగుకి ఎక్కడ డిఫికల్టీ వస్తుందోనని చాల మాటలకి పక్కనే ఇంగ్లీషు ఈక్వివలెంట్లని ఇచ్చేను. ఇంగ్లీషు వర్డ్స్‌ని వాడుతూ మరోసారి ట్రై చేసి చూస్తాను.

    వరంగల్ హొటేల్ రూంలో కూర్చుని ఈ రిప్లై రాస్తూన్న సమయంలో ఒక సైడ్ నుండి టివి లో తెలుగు నూస్ వింటున్నాను. ఆ బ్రాడ్‌కేస్ట్‌లో ఒక్క టెక్నికల్ వొకేబ్యులరీయే కాకుండా, ఎవ్విరిడే యూస్ లో ఉన్న తెలుగూ వర్డ్స్ కి బదులు ఇంగ్లీషు వర్డ్సే యూస్ చేస్తున్నారు. ఫ్లోని అప్పోజ్ చేస్తూ స్విం చెయ్యటానికి ట్రై చెయ్యటం తప్పేనేమో అనే ఐడియా ఇప్పుడు నా మైండ్‌లో ఎమర్జ్ అవుతోంది.

    లార్జి హేడ్రాన్ కొల్లైడర్ మీద మరొక పీస్ రాయటానికి ఎటెంప్టు చేస్తున్నాను. అదయినా మోడ్రన్ తెలుగు స్టయిల్లో వస్తుందనే ఆశతో – విధేయుడు, వేమూరి.

  10. తెలుగు నిఘంటువు గురించి… గురించి Kameswara Rao అభిప్రాయం:

    10/01/2009 8:52 am

    ఇంత చర్చా అయ్యాక ఇప్పుడు నేనడిగేది చొప్పదంటు ప్రశ్నలా ఉంటుందేమో కాని, అడక్కుండా ఉండలేకున్నాను. ఇక్కడ చర్చిస్తున్న ఈ నిఘంటువులు అసలు ఎవరికోసం?
    బడిలో పిల్లలకోసమా? వాళ్ళకి తెలుగు నిఘంటువు చూసే అవసరమూ తీరికా రెండూ లేవు.
    తెలుగు చెప్పే పంతుళ్ళకీ, తెలుగు సాహిత్యాభిమానులకీనా? వీళ్ళకైతే ప్రాచీన కావ్యాలని అర్థం చేసుకోడానికి తప్పిస్తే వేరే ఏమైనా అవసరం ఉంటుందా? దానికి ఇప్పటికే ఉన్న శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు సరిపోతాయి కదా? (పరుచూరిగారు చెప్పినట్టు, సూ.ని. అచ్చులోనే ఉంది నాలుగేళ్ళ కిందటివరకూ)
    పోనీ తెలుగు టీవీ, పేపర్ల జర్నలిస్టులకా? హహహ 🙂
    ఇక మిగిలింది తెలుగురాని వాళ్ళు తెలుగు నేర్చుకోడానికి. సాధారణమైన తెలుగు పదాలకి అర్థాలు కావాలంటే బ్రౌణ్యం 90% వరకూ సరిపోతుందనే అనుకుంటాను. బ్రిటిషు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, తెలుగులో సృష్టించబడ్డ కొత్తపదాలన్నీ ఇంచుమించుగా ఇంగ్లీషునుంచి వచ్చినవే కాబట్టి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాదు. మరీ సంస్కృత పదాలైతే సూ.ని సరిపోతుంది. మాండలిక పదాలైతే ఆయా పదకోశాలు తిరగెయ్యాలి.
    ఇంకా కొత్త నిఘంటువులు ఎవరికోసం చెప్పండి?
    అంచేత నా ఉద్దేశంలో కొత్త నిఘంటువు కోసం ఆలోచించే కన్నా, ఉన్నవాటిని డిజిటైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం అత్యుత్తమమైంది. దీనికి నేను సైతం ఏమైనా చెయ్యడానికి సిద్ధం.