పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    10/30/2009 8:08 pm

    పరిభాష సంగతి ఎలా ఉన్నా ఈ మధ్య టీవీలో వస్తున్న తెలుగు సినిమాల్లోనూ, కొన్ని సీరియల్స్ లోనూ ‘నేను డిసైడయిపోయాను’ అనే ప్రయోగం తరుచుగా వినబడుతోంది. డిసైడ్ అనేది సకర్మక క్రియో, అకర్మక క్రియో తెలియని semi literate స్థితిలో మనవాళ్ళున్నారని తెలుస్తోంది.

  2. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj అభిప్రాయం:

    10/30/2009 1:58 pm

    హరీష్ గారూ!!

    తెలుగులో ఉన్న న్యాయపరమైన విషయాల్లోనూ..అలాగే రెవెన్యూ రికార్ద్స్ ల్లోనూ ఈనాటికీ ఎక్కువ వాడే శాస్త్రీయ పరిభాష మొఘలులకాలం నించీ అమలౌతూన్న పర్షియన్ భాషనించి గ్రహించినవే!! ఉదాహరణకి “తహసీల్దారు”
    “శిస్తు”..”జిల్లా””జమాబందీ”..”ఫిర్కా’..”తాలూకా” లాంటివి.
    న్యాయసంబంధమైనవి ఉదాహరణకి..”వకాలత్ నామా”..జామీను”..అమీనా”
    “జప్తు” “దావా” “అర్జీ”లాంటివీ.
    ఇంగ్లీషుకి సమానమైనవి జనవ్యవహారంలో ఉన్నవికూడా ఉన్నాయి.ఇంగ్లీషులో “కోల్ మైన్స్” కి పాటకజనం “బొగ్గుబావి” అని సునాయాసంగా తమదైన వాడకం చేసుకుంటారు.అందువల్ల లోపం భాషలో
    పదాలు లోపించడమూ కాదు. ఇంగ్లీషులో చెప్పటం ఒక్కటే వీటికి నిజమైన
    పరిష్కారమూ కాదు. పదాలు అనువైనవి తయారుచేసుకోవడం అన్నది ఆ
    భాషని సృజనాత్మకంగా ఎలా వాడగలం అన్నదానికి సంబంధించినది. కదా?

    hospital అన్న పదాన్ని నిత్యవ్యవహారంలో “ఆసుపత్రి” అని తెలుగు పదంగా
    మలుచుకుని వాడుకచేయడంలేదా? అలాచేస్తే జనానికి అర్ధం కావదంలేదా??
    ఆలోచించండి. మనం ఎలా అలవాటు చేసుకుంటే భాష అలా లొంగుతుంది.
    లోపం ఎప్పుడూ భాషలో ఉండదు. భాషని క్రియేటివ్ గా వాడటం మీద ఉంటుంది. భాష అంటే సాహిత్యం కాదని గమనించగలరు.సాహిత్యం భాషలో ఒక భాగం మాత్రమే!!
    ఇంకా అనేకమైన ఉదాహరణలు విషయాల్ని చక్కగా చెప్పడానికి వీలుగా తెలుగునించి కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇవి కొన్ని మాత్రమే!! అందువల్ల
    విషయాన్ని వివరించడానికి గానీ..శాస్త్రీయమైన అంశాలు తెలుగులో సుబోధకం చేస్తూ వ్యాసాలు రాయడానికి గానీ భాష నిజమైన సమస్య కాదు.

    రమ.

  3. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    10/30/2009 10:44 am

    మోహనరావుగారు సైన్సు వ్యాసాలను వెబ్ పత్రికలలో కాకుండా మామూలు తెలుగు పత్రికల్లో రాస్తే బావుంటుంది. అమెరికాలోనూ, ఇతర ఉన్నతవిద్యాసంస్థల్లోనూ జరిగే పరిశోధనల వివరాలు నేరుగా తెలుగు పాఠకులకు అర్థమయే పద్ధతిలో రాయడం చాలా అవసరం. ఈ కాలమ్‌లో సాగే పండితచర్నూసంగతి ఎలా ఉన్నా సైన్స్ వివరాలు సామాన్యులకు అందాలి.

  4. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి mOhana అభిప్రాయం:

    10/29/2009 7:16 pm

    నా రెండు ఎర్రని సెంటులు.
    (1) ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్‌ సాపేక్షవాద సిద్ధాంతాన్ని మొట్టమొదట ఆంగ్లములో తర్జుమా చేసింది సత్యేంద్రనాథ బోసు మరియు మేఘ్‌నాథ్ సాహా.
    (2) నేను 70 దశకంలో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో పని చేసేటప్పుడు మదరాసు విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ సిద్ధాంతవ్యాసాన్ని ఒకటి ఆంగ్ల ప్రతితో సహా తమిళ ప్రతిని కూడా నమోదు చేశారు. ఆ థీసిస్‌ను ఏనుగు పైన పెట్టి గిండీనుండి మెరీనావరకు ఊరేగింపు చేశారు.
    (3) శాస్త్ర వ్యాసాలు తెలుగులో రాసేటప్పుడు ఆంగ్ల పదాలు వాడడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. పాఠకులు అర్థం చేసికొంటారా లేదా అనేదే మన ప్రశ్న. దానికి తగిన రీతిగా తెలుగు పదాలతోబాటు ఆంగ్లములోని పదాలను కూడ ఇస్తే సందిగ్ధత తప్పుతుంది.
    (4) రోహిణీప్రసాద్‌గారు చెప్పినట్లు తెలుగులో పదకోశాలు ఉన్నాయి. వాటిని వాడవచ్చు.
    (5) నాకు కూడా తెలుగులో శాస్త్రీయ వ్యాసాలు రాయలని ఉంది. వీలైనప్పుడు రాస్తాను. ఇంతకు ముందు ఒకటి ఈమాటలో, ఒకటొ కౌముదిలో, ఒకటి తానాపత్రికలో ప్రచురించి ఉన్నాను.
    విధేయుడు – మోహన

  5. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/29/2009 3:29 pm

    I agree reading in Telugu writings of law or Science may appear strange or hard, but that can be changed with a little effort and getting used to.

    I have a confession. When I first ate pizza I thought even dogs in India may not eat it. And Western dance was crazy. And heard any devotional song, wondered why can’t they sing like Ghantasala. Until I’ve been to Washington DC thought “cherry blossom” is shoe polish. Because thats all I knew then. But now, I enjoy pizza and am sure dogs in India eat too.Can
    see any dance, not always enjoy! and hear any song for sometime:) Now I wonder how hard can it be to read any thing in Telugu, a language that I already know a little.

    My point is it is not who developed any field, but how we make it into our own that determines largely the ease of use and compatibility. Vemuri gaari article itself has many examples. His saying creatively ఉల్లిగుడ్డు, పూరీ పోలిక etc. talk more closely and directly to me than English equivalents. After all, language is all about talking closely and directly right?!
    ________
    Regards
    Srinivas

    PS: రాసింది నచ్చినందుకు రమ గారికి చాలా కృతజ్ఞతలు.

  6. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj అభిప్రాయం:

    10/29/2009 2:11 pm

    నాగులపల్లి శ్రీనివాస్ గారి ప్రతి అక్షరం తోనూ ఏకీభవిస్తున్నాను. తెలుగు దేశం లోని జిల్లా స్థాయి లోని ఒక ప్రైవేటు పాఠశాల లో చిన్నపిల్లలు స్కూల్లో తెలుగులో మాట్లాడితే అక్కడి టీచర్లు ఆ చిన్నపిల్లల మెళ్ళో క్రిమినల్స్ మెళ్ళో వేల్లాడదీసినట్టుగా ఒక పెద్ద అట్ట మీద తాటికాయంత అక్షరాలతో ఇంగ్లీషులో..” I NEVER SPEAK IN TELUGU ” అని రాసి తగిలించి అందరూ చూసేలా నిలబెట్టారు. ఆ పసిపిల్లల వయసు ఆరేడేళ్ళు. వాళ్ళకి వాళ్ళ తప్పేంటో కూడా తెలీని వయసు. అంత చిన్న వయసులో ఆ పిల్లల మనసులో మాతృభాష మీద చులకననీ..ఇంగ్లీషు మీద ఆలవికాని వ్యామోహాన్నీ..కల్గిస్తున్నారు వాళ్ళ టీచర్లూ ఆ పాఠశాల యాజమాన్యం. ఇందుకు ఆ పసివాళ్ళ తల్లితండ్రుల పూర్తి అంగీకారం ఉన్నట్టే తెలుస్తోంది.

    ఒక రెండు తరాలు నిర్లక్ష్యం చేస్తే ఆ భాష నశించిపోయే అవకాశం ఉంది. తిరిగి దాన్ని ఉద్ధరించడానికి తాతలు దిగివచ్చినా లాభం లేదు. వెయ్యేళ్ళ మన తెలుగు గురించి అందులోని అనేక రకాల పదజాలం గురించి తెలుసుకోకుండానే..అందులోంచి అధ్యయనం కష్టం అంటున్నారు. శాస్త్రీయ సంబంధమైన పారిభాషిక పదజాలాన్ని మనం సంస్కృతం నించి గ్రహించి వాటిని తెలుగులో చొప్పించాం..ఎలాగైతే ఇంగ్లీషు లాటిన్ నీ గ్రీకు నీ సైంటిఫిక్ పరిభాషగా గ్రహించిందో అలాగ!! అక్కడ ఇంగ్లీషులో ఉన్న అన్య భాషాపదాలు ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే వాళ్ళకి అదే తెలుగు వాక్యాల్లో ఉన్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా అన్పిస్తున్నాయి. పోనీ అని మిగతా భాషల వాళ్ళు చేసినట్టుగా చక్కని తెలుగు పదాలని తిరిగి వాడకం చేసే ప్రయత్నం చేసామా అంటే తెలుగుని ఉచ్చరించటం కూడా మరిచిపోతున్నారు. నిత్యవ్యవహారంలో ఉండే ఎన్నో మాటల్ని జారవిడిచేసాం!! వేలయేళ్ళ చరిత్రని కలిగి ఉండటం ఒక్కటే కాదు ఆ వెయ్యేళ్ళ కిందటి పద్యం చదివితే మనకి ఇంకా అర్ధమవుతూంది.అంటే తెలుగు ఇంకా సజీవంగా ఉందని అర్ధం. ఈ స్థితిని అనుభవంలో చూస్తూ కూడా తెలుగునించి పదసేకరణ చేసి వాటిని బోధనాభాషగా తిరిగి వాడుకోలేక ఇలా ఇంత మంది అదేదో అన్ని సమస్యలనీ పరిష్కరించేయగలిగినది అన్నట్టుగా అందరూ అతిగా ఇంగ్లీషు వేపు చూడటమూ..ఆ పదజాలం సహజమూ..తెలుగులో ఉన్న సంస్కృతం ఆసహజమూ..అన్నట్టుగా అనుకోవటమూ జరుగుతూంటే ఈ చర్చల్లో..మీ అభిప్రాయం చదివి ప్రాణం లేచొచ్చింది. అందుకు మీకు వందనాలు.
    రమ.

  7. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి hareesh అభిప్రాయం:

    10/29/2009 12:35 pm

    I appreciate the point made by Srinivas Nagulapalli. I made it very clear that I am an ardent fan of Telugu Literature and take pride for it. But, being a legal professional, I can at least vouch for my statement that Telugu language is not compatible for Law. India has borrowed the present form of of administration of justice from British and British in turn from Latin. The maxims and theories of law have been developed in English and Latin and as long as we follow this system of administration of justice, in my opinion,not only Telugu, but none of the any other languge is suitable therefor. In view thereof, I thought, Medicine, technology and other modern sciences having been developed by mainly western ocieties, Telugu is not suitable for those fields either. The other main reason for English’s compatibility is that English widely spoken and understood by large part of the world. Therefore, we should rather enjoy the richness of our Telugu literature and continue working for its further enrichment by encouraging people to bring out good works in Telugu, while accepting the fact the fact about English’s adaptability.

    This is purely my personal opinion and I may not be correct, open for correction.

    Regards,

    Hareesh

  8. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/29/2009 12:11 am

    I am afraid, neither can we say Telugu, or any language, is incompatible for Technical, Medical, Medical, Mathematics, Law, Science, nor can we argue English is always most compatible either. A language may just become as compatible as made out by the competency and ingenuity of its users.

    Merely 400+ years ago, English did not hold any special place in Sciences. We know major works of Newton including Principia were in Latin. And even century ago Einstein’s papers were first published in German. May be I am biased- one of my professors renowned for his work in parallel algorithms wrote his Ph.D thesis in Hebrew. For whatever reasons, many brilliant minds have been sharing their most creative thoughts largely in English for many, many years and therein, I believe, lies its strength and reason for “compatibility”. I do not know Chinese, but know there is lot of effort going on to make many/any scientific works in Chinese. No idea how compatible Chinese will be, say, 200 years from now, but with present massive effort it certainly appears to become only more, not less, compatible than ever before.

    My point is Telugu can be made compatible to the extent it is put to best use by best minds. It may not appear so now, but with unceasing and increasing effort it can only become more compatible. May be not in our lifetime. But it is guaranteed to remain incompatible and worse become even stagnant- without effort from our generation. And to that reason alone, I see a great purpose and even a greater cause to write such in Telugu. And no words of encouragement and support seem enough.

    Furthermore, asking who will read these and get benefit seems unhelpful. If Nannayya thought who would read his work in Telugu, when Sanskrit was so prevailing, popular and in esteem, we would not be having thousand-year legacy of his work and language today. Isn’t it?
    ————–
    Regards
    -Srinivas

  9. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    10/28/2009 4:12 pm

    సైన్సు రచనలు తెలుగులో చెయ్యటానికి రెండు స్పష్టమైన లక్ష్యాలుంటాయి. మొదటిది తెలుగు మాధ్యమంలో నేర్పడానికి పాఠ్యపుస్తకాల కోసం. ఇందులో ప్రామాణిక భాషనూ, పదాలనూ వాడవలసివస్తుంది. ఇందుకోసం అధికారిక భాషాసంఘాలూ, అవి తయారుచేసే నిఘంటువులూ పనికొస్తాయి. ఈ మధ్య బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు తదితరులు పదకోశాలు తయారుచేశారు. ఈ పదాలు ఎంతవరకూ పనికొస్తాయో విద్యాసంస్థల ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. విమర్శకులూ, భాషాపండితుల స్పందన కూడా తీసుకోవాలి.

    ఇక రెండోది పాప్యులర్ సైన్స్ రచనలు. ఇవి సామాన్యపాఠకులకూ, విద్యార్థులకూ పనికొస్తాయి. ఇంటర్నెట్ చదివేవారికన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగువారిలో వీటిని చదివేవారెక్కువ. ఇటువంటి ఆసక్తి ఉన్నవారందరికీ వివిధ సైన్సు విషయాలమీద దొరికే ఇంగ్లీషు పుస్తకాలనూ, పత్రికలనూ కొనే అవకాశాలుగాని, ఆర్థికవనరులుగాని ఉండకపోవచ్చు. అదీకాక మనకు అర్థమయే మామూలు భాషలో స్నేహపూర్వకంగా సులభశైలిలో వివరించే పని ఈ రచనలు చేస్తాయి. వీటిని చదివి ప్రభావితులయే విద్యార్థుల్లో కొందరైనా సైన్సుపట్ల ఆసక్తి పెంచుకుని మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

  10. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి harish అభిప్రాయం:

    10/28/2009 12:51 pm

    The article by Shri Vemuri is thought provoking and informative. However, the discussion as to writing of scientific subjects in Telugu is quite interesting. I am of the opinion that, Telugu language may not be compatible for Technical, Medical, Mathematics, Law, Science. My opinion may not be taken as contempt for Telugu language. I am also ardent fan of Telugu language. I take price in our rich Telugu literature, but, I feel rather uncomfortable while trying to attempt Technical and other scientific subjects in Telugu. Therefore, I fully agree with Mr.Ravikiran Timmireddy that no purpose would be served to trying to telugise everything in our over enthusiasm.

    Hareesh