పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ముగ్గురు ముసలమ్మలు గురించి lyla yerneni అభిప్రాయం:

    11/12/2009 6:19 pm

    కథ చదివాను. ‘ఈ మాట’ లోని కామెంట్లు చదివాను.
    ఈ కథలో ముగ్గురు ముసలమ్మలతో పాటు, డాక్టరు సునీత కూడా ఒక పాత్రే.
    అరుణా పాణిని – ఈ పై కథను రాసిన రచయిత్రి.
    కథలో పాత్రలన్నీ ఈ రచయిత్రి కల్పితాలే. అన్ని పాత్రల మాటలూ రచయిత్రి రాసినవే.
    మరి,
    ఈ రచయిత్రి డాక్టరు ఐ ఉన్నందున, కథలో ఉన్న డాక్టరు సునీత మాటలు మాత్రం, రచయిత్రి అభిప్రాయాలుగా పాఠకులు తీర్మానించవచ్చునా?
    ఈ కథ ఒక డాక్టరు కాకుండా ఇంకెవరో రాస్తేనో, లేకుంటే 🙂 ఏదో మారు పేరుతో రాస్తేనో, అప్పుడు డాక్టరు సునీత అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు అవుతాయి? పాఠకులు వాటిని ఎవరికి ఆపాదిస్తారు?

    లైలా

  2. పెట్టె బయట గురించి Prassannam Divakarla అభిప్రాయం:

    11/11/2009 5:37 pm

    పొడుపు కధలతొ కథ చాలా బాగ రాసారు. Nice Concepts in the story, Good Job !!

  3. చెట్టు నా ఆదర్శం గురించి raveender అభిప్రాయం:

    11/11/2009 10:00 am

    తరుచాపము వీడిపోయి గురిమరచిన బాణంలా తిరుగాడును పిట్ట.
    –చాలా గొప్ప వాక్యాలు.

  4. ముగ్గురు ముసలమ్మలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/11/2009 7:44 am

    “చావుతో సరియైన సౌఖ్యంబులో తగిలి”..అంటాడు అన్నమయ్య అలాగే…కేన్సర్ తో బాధ పడి పోతున్న దశలో కూడా అంతే చిరునవ్వుతో అంతే శాంతంతో..శ్రీ రమణ మహర్షి ” బాధ లేదా స్వామీ” అని భక్తులు అడిగినప్పుడు ” బాధ శరీరానికి గానీ తనకి కాదు” అని తను తన శరీరం కాదని జవాబు చెప్తారు. వాళ్ళు జ్నానులు.

    “అనాయాస మరణం వినా దైన్యేన జీవనమ్ ” అని ఈ దేశపు ఆర్యోక్తి!! అయితే ఇది ఒక ఆదర్శమే గానీ ఇందుకు ప్రాణులు అన్నిసార్లూ అనేక కారణాల వల్ల చాలరు.ఎన్నో కోరికల్లాగే ఈ కోరికా అందరికీ తీరేది కాదు.అందు వల్ల మృత్యువుని గురించి బయటివాళ్ళు చెప్పడం, మంచి చావు ఇలా ఉంతుంది అని చావుని నిర్వచించటం హాస్యాస్పదమే కాదు..అన్యాయమ్ కూడా!ఇది ఒక తరహా వివక్ష. ageism అంటారు.

    ageism అన్నదాన్ని racism అంత తీవ్రంగానూ చూడాల్సిందే!! చావు ఉంటుంది. అంతే గానీ అది “హుందా” అయిన చావా?? దిక్కుమాలిన చావా?/ అన్ని ఇన్నిరకాలుండవు. kinship వల్ల ఇలాంటి బాధలూ..ఇలాంటి భావనలూ.. మనుష్యులకుంటాయేమో గానీ సృష్టి లోని ఏ ఇతర ప్రాణులకీ ఉండవు.

    అది స్వచ్చంద మరణమైతే తప్ప ఈ పధ్ధతి లో చావాలని ఎవరైనా అనుకుంటే తప్ప..మృత్యువు ఏ రూపంలో వచ్చి పలకరిస్తుందో తెలిసిన వాళ్ళు లేరు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో దరిచేరేదీ డాక్టర్ లతో సహా చెప్పగలిగినవాళ్ళు లేరు.ఏవో కొన్ని వేదాంతాలు ఆ క్షణానికి వల్లించుకోవడం తప్పితే అందులో ఏ సత్యమూ గోచరించదు.

    చావుని వీలైనంత దూరం పెట్టడం ఆధునిక వైద్యం వల్ల ఎంతో కొంత మనిషికి సాద్యమైంది గనక గానీ… అదే అడవిలో ఎలుగు, ఆకాశంలో ఎగిరే పక్షి ,ఎలా చావుని స్వీకరిస్తున్నాయో చూసిందెవరూ?? చావు అన్నది ఎవరికైనా ఒకటే కదా!!

    ఈ కధ వల్ల “మరణాన్ని” చూడటంలో డాక్టర్ లలో కూడా అసహనాలుంటాయని తెలుస్తోంది.. కానీ వృత్తి ధర్మంగా చావుని “హుందా” చావు గానూ.. నానా చావు గానూ..వర్గీ కరించడం ఒక డాక్టర్ పాత్ర అలా భావించడం మాత్రం ఆశ్చర్యమే! విషాదమే!! రవికిరణ్ గొంతులో కోపం ఉందేమో గానీ ఆయన మాటల్లో మాత్రం నిజం కన్పిస్తోంది. ధర్మాగ్రహం అది! సదుపాయాలు ఉన్నాయి కదా అని అనవసరంగా బతుకుని పొడిగించుకోకండీ..చక్కగా మా తాతయ్య లాగా అలవోకగా అందరికీ ఆదర్శంగా “శివశివా!!” అనుకుంటూ చప్పున చావండీ !!అని దాక్టర్ సునీత ఇస్తున్న సందేశం ఈ కధలో సుస్పస్టం!! అరుణాపాణిని గారి ఈ సందేశం ఎంతమందికి ఒప్పుదలగా ఉంటుందో మరి??

    రమ.

  5. సామాన్యుని స్వగతం: మా అమ్మ – నడిచే బడి గురించి Sita అభిప్రాయం:

    11/11/2009 7:06 am

    Heart touching story… Hat’s off…

  6. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి బొల్లోజుబాబా అభిప్రాయం:

    11/11/2009 1:42 am

    అంతే అంతే
    మనం ఏం చూడాలనుకుంటామో అవే కనపడతాయి. సాహిత్యంలోనైనా, జీవితంలోనైనా!
    కధ నాకు నచ్చింది. కవిత్వం నిండిన కధలు చదివి చాన్నాళ్లయింది.
    బొల్లోజు బాబా

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి kusuma kumari అభిప్రాయం:

    11/09/2009 3:35 am

    సాయి బ్రహ్మానందం గారికి!
    త్యాగ రాజ కృతులను గురించి ఎన్నెన్నో నూతన విశేషాలను పాఠకులకు చెప్పారు.
    కర్ణాటక సంగీత పరిజ్ఞానము మా వంటి సామాన్యులకు కూడా అందించ గల సరళ శైలిలో ఇచ్చిన మీ వ్యాసము మీ అమోఘ కృషికి నిలువుటద్దము.
    కృతజ్ఞతలు.

  8. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి సర్పవరపు రమణి అభిప్రాయం:

    11/08/2009 2:46 pm

    ఇది కథా? నాకేమాత్రం బ్రహ్మానందం కలుగలేదు ఈ కథ చదివి. అలవాటైన ఇంగ్లీష్ పదాలకు వంకర తెలుగు స్పెల్లింగులు నరకయాతన – బేగ్‌(bag), బేండెయిడు(bandaid), మేప్‌(map), లౌంజ్‌(lounge), ఈస్(is), స్పానిష్, స్పేనిష్ (spanish),టేక్సీ,టాక్సీ కేబ్ ,కేబ్ (taxi,cab)!! బాగ్,మ్యాప్ లేదా మాప్ అంటే సరిపోదా;

    taxiకి, spanish కి రెండు స్పెల్లింగులు! సంపాదకులు గమనించ ప్రార్థన.

    [గమనించి సరిదిద్దాము – సం.]

  9. ముగ్గురు ముసలమ్మలు గురించి బొల్లోజుబాబా అభిప్రాయం:

    11/07/2009 2:57 pm

    కథనం బాగుంది. కధలోని నేపథ్యం మన తెలుగునాడు కాదు కనుక అన్వయం కొంచెం కష్టంగానే ఉంది.
    రవికిరణ్ గారి వాఖ్య కొంచెం పంజెంట్ గాఉంది. కానీ ఒక పరిశీలన ప్రతిఒక్కరూ తనచావు ప్రశాంతంగా శివశివా అనుకొంటూ పోవాలని కోరుకొనేవారే. ఆఖరుకు మంచంపట్టిన వారుకూడా.
    కానీ వాస్తవానికి మరణ శయ్యపై ఉన్నవాని ఆలోచన అలా ఉంటుందా? మరికొంత కాలం బతకాలన్న ఆశ ఉండటం సార్వజనీనమేమో.

    అలాగని చావును ఈ కథలో మూడో ముసలమ్మ ఎదుర్కొన్నట్టుగా వీరోచితంగా ఎదుర్కోవటం అనేది చాలా డ్రమాటిక్ గా అనిపిస్తోంది. ఇక్కడ అప్రస్తుతమైనా ఎప్పుడో చదివిన చిన్న కవిత

    చిన్నప్పుడు తడబడుతూ రోడ్డు దాటుతున్న
    ముసలివానిని చూసి దేముడా నాకు అట్లాంటి దుస్తితి
    రాకుండానే తీసుకుపో అని కోరుకొన్నాను.

    ఇప్పుడు అంత ముసలివాడినయ్యాక మరలా దేముడిని ప్రార్ధిస్తున్నాను
    దేముడా నన్ను ఇప్పుడే తీసుకెళ్లకు ఈ రోడ్డు దాటనీ”

    కవి పేరు గుర్తుకులేదు వాక్యాలు కూడా అవే కాకపోవచ్చు.

    ప్రతిఒక్కరూ ప్రశాంతంగా శివ శివా అని వెళిపోవాలి అన్న కోరికమీద నిర్మించిన కథ ఇది. దీనిలోని పాత్రలూ, సంఘటనలూ, సంభాషణలూ ఆ సెంట్రల్ డోగ్మా ను అనుసరించి పేర్చుకొంటూ పోయినవే అని నాకనిపిస్తూంది. అంతకు మించి మరోలా ఉండటం వీలుకాదేమో!

    బొల్లోజు బాబా

  10. నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని మధుకేళి వర్ణన గురించి Veerabhadram అభిప్రాయం:

    11/07/2009 12:53 pm

    పొదలి, గాత, నా, వీధి మినహయిస్తే ఈ పద్యములొ ఇంకా తెలుగు పదాలు ఉన్నాయా?