http://nagarajur.blogspot.com/2009/10/blog-post_9159.html#comment-form
సవాయీ గంధర్వ సంగీతోత్సవం గురించిన ఈ సైట్ కిరానా సంప్రదాయ గాయకుడి స్మృత్యర్థం ప్రతి ఏటా జరుగుతుందని తెలియజేస్తుంది.
మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు.
కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు.
1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.
అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య్ల భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటంలేదో>>
ఎక్కువగా అంటే! వేలూరిగారు పైన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ముఖ్యంగా ఇరవయ్యవ శతాబ్దపు కవిత్వాన్ని చాలామంది అనువాదం చేశారు. ఉదా: S.S. Prabhakararao, Post-independence Telugu poetry, Writers workshop, Calcutta, 1993. అలాగే B.V.L.N. రావు గారు అరవయిల్లో కొన్ని క్షేత్రయ్య పదాలు, కొన్ని వేమన పద్యాలు చేయడం జరిగింది. ఈమధ్య కాలంలో శిష్ట్లా శ్రీనివాస్ గారు కొంత pre-19th century (సుమతి, పెద్దన, రాయలు) సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. ఏమయినా అధికభాగం ఆంగ్లంలోకి మాత్రమే అనువదించబడుతున్నాయి. కొన్ని స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ లలోకి కూడా (వీటిలో కొన్ని శ్రీశ్రీ కవితలున్నాయి.) వెళ్ళాయి. వాటిపైన ఆ దేశాల్లో స్పందనెలా వుదో మరి? అలాగే అనువాదం ఎంత *బాగా* వుంది అనేది మరో ప్రశ్న.
ప్రతిదీ కాకపోయినా కవితలు బానే అనువదించబడుతున్నాయి. (శ్రీశ్రీగారే స్వయంగా తన మహాప్రస్థానంలో కవితలన్నీ అనువాదం చేసుకున్నారు.) తెలుగునుండి కూడా. కొందరి (వారసుల)తో కాపీరైట్ల సమస్యలున్నాయి.
ప్రస్తుత వ్యాసం శ్రీశ్రీ వేరే భాషలనుండి చేసిన అనువాదాలపైన కాబట్టి, తెలుగునుండి యితర భారతీయేతర భాషల్లోకి జరిగిన అనువాదాల గురిచి మరోసారెక్కడైనా రాయ ప్రయత్నిస్తాను.
శ్రీనివాస్ గారూ!! పాతకాలంలో ఎక్కువగా భారతీయ భాషల్లోకి ప్రపంచ భాషలనించి కవిత్వం ఇంకా నాటకాలూ అనువాదం జరిగిన మాట నిజమే. మన భారతీయ భాషలనించి పరాయి దేశస్థులు సంస్కృత నాటకాలని తొలిగా అనువాదాలు చేసుకున్నారు. అయితే ఇటీవలకాలంలో వారు మన సమకాలీన సాహిత్యంవేపు కూడా దృష్టి సారిస్తున్నారు. భారతీయ కవుల కవిత్వాలని ఇంగ్లీషు నించి వారివారి భాషల్లోకి అనువాదం చేసుకుంటున్నారు. అందులో ఒక్కోసారి పూర్తిగా వారి దేశం వారే ఉండగా ఒక్కోసారి ఆయా దేశాల భాషలు వచ్చిన భారతీయులే ఇందుకు ముందుకువస్తున్న దాఖలాలూ కన్పిస్తున్నాయి. అనువాదాలు జరగాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. అది స్వాగతించవలసిన విషయమే!!
వేలూరి వారుబహుశా తెలియక చేర్చినట్టులేదు. పీ.వీ.నరసింహారావు గారు జయప్రభగారి ప్రేమ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. penguin india వారు ఆ పుస్తకాన్ని ద్విభాషా సంకలనంగా “unforeseen affection and other poems” అనే పేర 2005 లోనే ప్రచురించారు.
Wonderful compilation of expressions .. Keep up the good work .. I continue to have good impression of your sizzling work and contribution to the telugu literature .. Produce a beauty from your dormant pen ..
కామేశ్వరరావు గారు – మీ పరిశోధనలో చాలా మంచి సోర్సు సంపాదించారు. ఎట్టకేలకు శ్రీశ్రీ ఉపయోగించిన ఆంగ్లానువాదం చూడటం చాలా ఆనందం కలిగించింది. ఊహించినట్టుగానే అనేక భేదాలు ఆంగ్లానువాదంలోనే ఉన్నాయి. శ్రీశ్రీ అనువాదం ఆంగ్లానువాదాన్ని అనుసరించే ఉంది గదా . ఒక్క “లవంగాలు తమ పసరిక చేతులతో పోగుచేసేటప్పుడు” అన్నచోట మాత్రం cloverను cloveగా పొరపడ్డారేమో అనిపిస్తుంది. ఈ ఆంగ్లానువాదాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు.
శ్రీనివాస్ గారు కామేశ్వర రావుగారిని అడిగినా, చొరవచేసుకొని నాకు తెలిసిన వివరాలు చెప్పుతాను. ఇదివరలో తెలుగు కవిత్వం నుంచి ఇంగ్లీషులోకి వచ్చిన అనువాదాలు ఏమీ లేవనే చెప్పాలి.
గత పాతిక సంవత్సరాలుగా, వెల్చేరు నారాయణ రావు తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేస్తున్నారు. ఆయన స్వయంగాను, డేవిడ్ షూల్ మన్, హాన్క్ హైఫెట్జ్ తోను కలిసి చేసిన కొన్ని అనువాదాలు మనవి చేస్తాను.
1. For the Lord of the Animals – Poems from the Telugu, The Kaalahastiswara Satakamu, by Dhurjati ( University of California Press, 1987), with Hank Heifetz.
2. Twentieth Century Telugu Poetry , An Anthology ( Oxford University Press, 2002) .
3. Hibiscus on the Lake, Twentieth Century Telug Poetry from India
( University of Wisconsin, 2002)
4. Classical Telugu Poetry, An Anthology ( Oxford University Press, 2002), with David Shulman.
5. A Lover’s Guide to Warangal, The Kridabhiramamu by Vinikonda vallabharaaya ( Permanent Black, Distributed by Orient Longman Ltd., 2002) with David Shulman.
6. The Sound of the Kiss, Pingali Surana’s Kalapurnodayam (Columbia University Press, 2002) with David Shulman.
7. The Demon’s Daughter, Pingali Surana’s Prabhaavati Pradyumnamu (State University of New York Press, 2006) with David Shulman.
8. When God is a Customer, Telugu Courtesan Songs by Kshetrayya and Others ( University of California Press, 1994) with A. K. Ramanujan and David Shulman.
9. God on the Hill, Temple Poems from Tirupati, Annamayya (Oxford University Press, 2005) with David Shulman.
10. A Poem at the Right Moment, remembered verses from premodern South India ( University of California Press, 1998) with David Shulman.
I have very reliable information from one of the translators that the Manucaritra by Allasani Peddana is ready for publication.
I haven’t mentioned Narayana Rao’s other translations ( from Telugu prose works and Sanskrit poetic works).
ఎప్పటిలాగానే కామేశ్వరరావుగారు, మంచి ఆసక్తికరమైన వ్యాసాన్ని, అనువాదంలోని ఎన్నో విషయాలను ఓపికతో ఎత్తి చూపించి విశ్లేషించినందుకు చాలా కృతజ్ఞతలు.
వీలైతే, మరొక్క అంశంపై మీ ఆలోచనలు తెలియజేయ మనవి. మనం శ్రీశ్రీ కవితలు, ఇంగ్లీషు,ఇతర భాషలనుంచి శ్రీశ్రీ అనవాదాలు చదువుతున్నాం కదా ప్రధానంగా (ఈ సంచికలో కూడా). అట్లే, శ్రీశ్రీ కవితలను భారతేతర భాషలు (English, French etc) లోకి అనువాదాలు చేసారా, చేస్తే ఎట్లున్నాయి, చేయకపోతే దానికి కారణాలు_ ఇట్లా ఏమైనా దానిగురించి చెప్ప మనవి.
మోహనగారు మహాప్రస్థానం కన్నడ అనువాదం తెలిపారు. రవీంద్రుని కవితలు, తిరుక్కురళ్ వంటివి కొన్ని తప్ప, భారతీయ భాషల్లోని కవితలేవీ కూడా పెద్దగా పాశ్చాత్య భాషల్లోకి అనువదింపబడలేదేమో అని అనుమానం. మన కవులు ఫలానా కవిత ఏ English, French నుంచో బాగుందనిఎన్నుకొని, సొంతానికి అనువాదాలు చేసారో, అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటం లేదో తెలియదు. అవి సార్వజనీనం కావు అని అనుకోవాలో కూడా తెలియదు.
======
విధేయుడు
_Srinivas
హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
01/06/2010 10:44 am

సామాన్యుని స్వగతం: పాఠం చెప్పటం! గురించి lakshmi simhadri అభిప్రాయం:
01/06/2010 8:12 am
Very nice, your essays reminds me of my wonderful childhood days.
శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
01/06/2010 5:45 am
అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య్ల భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటంలేదో>>
ఎక్కువగా అంటే! వేలూరిగారు పైన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ముఖ్యంగా ఇరవయ్యవ శతాబ్దపు కవిత్వాన్ని చాలామంది అనువాదం చేశారు. ఉదా: S.S. Prabhakararao, Post-independence Telugu poetry, Writers workshop, Calcutta, 1993. అలాగే B.V.L.N. రావు గారు అరవయిల్లో కొన్ని క్షేత్రయ్య పదాలు, కొన్ని వేమన పద్యాలు చేయడం జరిగింది. ఈమధ్య కాలంలో శిష్ట్లా శ్రీనివాస్ గారు కొంత pre-19th century (సుమతి, పెద్దన, రాయలు) సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. ఏమయినా అధికభాగం ఆంగ్లంలోకి మాత్రమే అనువదించబడుతున్నాయి. కొన్ని స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ లలోకి కూడా (వీటిలో కొన్ని శ్రీశ్రీ కవితలున్నాయి.) వెళ్ళాయి. వాటిపైన ఆ దేశాల్లో స్పందనెలా వుదో మరి? అలాగే అనువాదం ఎంత *బాగా* వుంది అనేది మరో ప్రశ్న.
ప్రతిదీ కాకపోయినా కవితలు బానే అనువదించబడుతున్నాయి. (శ్రీశ్రీగారే స్వయంగా తన మహాప్రస్థానంలో కవితలన్నీ అనువాదం చేసుకున్నారు.) తెలుగునుండి కూడా. కొందరి (వారసుల)తో కాపీరైట్ల సమస్యలున్నాయి.
ప్రస్తుత వ్యాసం శ్రీశ్రీ వేరే భాషలనుండి చేసిన అనువాదాలపైన కాబట్టి, తెలుగునుండి యితర భారతీయేతర భాషల్లోకి జరిగిన అనువాదాల గురిచి మరోసారెక్కడైనా రాయ ప్రయత్నిస్తాను.
— శ్రీనివాస్
శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి rama bharadwaj అభిప్రాయం:
01/06/2010 2:50 am
శ్రీనివాస్ గారూ!! పాతకాలంలో ఎక్కువగా భారతీయ భాషల్లోకి ప్రపంచ భాషలనించి కవిత్వం ఇంకా నాటకాలూ అనువాదం జరిగిన మాట నిజమే. మన భారతీయ భాషలనించి పరాయి దేశస్థులు సంస్కృత నాటకాలని తొలిగా అనువాదాలు చేసుకున్నారు. అయితే ఇటీవలకాలంలో వారు మన సమకాలీన సాహిత్యంవేపు కూడా దృష్టి సారిస్తున్నారు. భారతీయ కవుల కవిత్వాలని ఇంగ్లీషు నించి వారివారి భాషల్లోకి అనువాదం చేసుకుంటున్నారు. అందులో ఒక్కోసారి పూర్తిగా వారి దేశం వారే ఉండగా ఒక్కోసారి ఆయా దేశాల భాషలు వచ్చిన భారతీయులే ఇందుకు ముందుకువస్తున్న దాఖలాలూ కన్పిస్తున్నాయి. అనువాదాలు జరగాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. అది స్వాగతించవలసిన విషయమే!!
వేలూరి వారుబహుశా తెలియక చేర్చినట్టులేదు. పీ.వీ.నరసింహారావు గారు జయప్రభగారి ప్రేమ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. penguin india వారు ఆ పుస్తకాన్ని ద్విభాషా సంకలనంగా “unforeseen affection and other poems” అనే పేర 2005 లోనే ప్రచురించారు.
రమ.
నిశ్శబ్దం లో నీ నవ్వులు గురించి Lakshmi Ranga raju Onkaram అభిప్రాయం:
01/06/2010 2:49 am
Wonderful compilation of expressions .. Keep up the good work .. I continue to have good impression of your sizzling work and contribution to the telugu literature .. Produce a beauty from your dormant pen ..
శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి రవిశంకర్ అభిప్రాయం:
01/05/2010 11:07 pm
కామేశ్వరరావు గారు – మీ పరిశోధనలో చాలా మంచి సోర్సు సంపాదించారు. ఎట్టకేలకు శ్రీశ్రీ ఉపయోగించిన ఆంగ్లానువాదం చూడటం చాలా ఆనందం కలిగించింది. ఊహించినట్టుగానే అనేక భేదాలు ఆంగ్లానువాదంలోనే ఉన్నాయి. శ్రీశ్రీ అనువాదం ఆంగ్లానువాదాన్ని అనుసరించే ఉంది గదా . ఒక్క “లవంగాలు తమ పసరిక చేతులతో పోగుచేసేటప్పుడు” అన్నచోట మాత్రం cloverను cloveగా పొరపడ్డారేమో అనిపిస్తుంది. ఈ ఆంగ్లానువాదాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు.
శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి V R Veluri అభిప్రాయం:
01/05/2010 10:32 pm
శ్రీనివాస్ గారు కామేశ్వర రావుగారిని అడిగినా, చొరవచేసుకొని నాకు తెలిసిన వివరాలు చెప్పుతాను. ఇదివరలో తెలుగు కవిత్వం నుంచి ఇంగ్లీషులోకి వచ్చిన అనువాదాలు ఏమీ లేవనే చెప్పాలి.
గత పాతిక సంవత్సరాలుగా, వెల్చేరు నారాయణ రావు తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేస్తున్నారు. ఆయన స్వయంగాను, డేవిడ్ షూల్ మన్, హాన్క్ హైఫెట్జ్ తోను కలిసి చేసిన కొన్ని అనువాదాలు మనవి చేస్తాను.
1. For the Lord of the Animals – Poems from the Telugu, The Kaalahastiswara Satakamu, by Dhurjati ( University of California Press, 1987), with Hank Heifetz.
2. Twentieth Century Telugu Poetry , An Anthology ( Oxford University Press, 2002) .
3. Hibiscus on the Lake, Twentieth Century Telug Poetry from India
( University of Wisconsin, 2002)
4. Classical Telugu Poetry, An Anthology ( Oxford University Press, 2002), with David Shulman.
5. A Lover’s Guide to Warangal, The Kridabhiramamu by Vinikonda vallabharaaya ( Permanent Black, Distributed by Orient Longman Ltd., 2002) with David Shulman.
6. The Sound of the Kiss, Pingali Surana’s Kalapurnodayam (Columbia University Press, 2002) with David Shulman.
7. The Demon’s Daughter, Pingali Surana’s Prabhaavati Pradyumnamu (State University of New York Press, 2006) with David Shulman.
8. When God is a Customer, Telugu Courtesan Songs by Kshetrayya and Others ( University of California Press, 1994) with A. K. Ramanujan and David Shulman.
9. God on the Hill, Temple Poems from Tirupati, Annamayya (Oxford University Press, 2005) with David Shulman.
10. A Poem at the Right Moment, remembered verses from premodern South India ( University of California Press, 1998) with David Shulman.
I have very reliable information from one of the translators that the Manucaritra by Allasani Peddana is ready for publication.
I haven’t mentioned Narayana Rao’s other translations ( from Telugu prose works and Sanskrit poetic works).
Most of these books are available at Amazon.com
Regards,
Veluri Venkateswara Rao
శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
01/05/2010 2:45 pm
ఎప్పటిలాగానే కామేశ్వరరావుగారు, మంచి ఆసక్తికరమైన వ్యాసాన్ని, అనువాదంలోని ఎన్నో విషయాలను ఓపికతో ఎత్తి చూపించి విశ్లేషించినందుకు చాలా కృతజ్ఞతలు.
వీలైతే, మరొక్క అంశంపై మీ ఆలోచనలు తెలియజేయ మనవి. మనం శ్రీశ్రీ కవితలు, ఇంగ్లీషు,ఇతర భాషలనుంచి శ్రీశ్రీ అనవాదాలు చదువుతున్నాం కదా ప్రధానంగా (ఈ సంచికలో కూడా). అట్లే, శ్రీశ్రీ కవితలను భారతేతర భాషలు (English, French etc) లోకి అనువాదాలు చేసారా, చేస్తే ఎట్లున్నాయి, చేయకపోతే దానికి కారణాలు_ ఇట్లా ఏమైనా దానిగురించి చెప్ప మనవి.
మోహనగారు మహాప్రస్థానం కన్నడ అనువాదం తెలిపారు. రవీంద్రుని కవితలు, తిరుక్కురళ్ వంటివి కొన్ని తప్ప, భారతీయ భాషల్లోని కవితలేవీ కూడా పెద్దగా పాశ్చాత్య భాషల్లోకి అనువదింపబడలేదేమో అని అనుమానం. మన కవులు ఫలానా కవిత ఏ English, French నుంచో బాగుందనిఎన్నుకొని, సొంతానికి అనువాదాలు చేసారో, అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటం లేదో తెలియదు. అవి సార్వజనీనం కావు అని అనుకోవాలో కూడా తెలియదు.
======
విధేయుడు
_Srinivas
కలైన గోర్వెచ్చని పాట గురించి sailajamithra అభిప్రాయం:
01/05/2010 10:08 am
Really realistic poem. I appreciate this.. good john keep it up.
గాలిపటం గురించి Vamshi అభిప్రాయం:
01/05/2010 4:08 am
మీ కవితలో చాలా లోతైన భావం ఉన్నది….