పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. కలవరపెడుతుంది మనస్సును గురించి siva rama prasad అభిప్రాయం:

    02/24/2010 2:51 pm

    గర్భస్త శిశువు ఏడవటం. ప్రయోగం నచ్చ లేదు.నిర్జన ….. జనావాసాల contradictory. ఆకులు మెత్తగ రాలడం? భాషాడంబరం తప్ప భావాడంబరం లేదు.నెర + మోవి=నెమ్మోవి.నెమ్మోవికి అలము కొవడం ఏంటో.

  2. కలైన గోర్వెచ్చని పాట గురించి siva rama prasad అభిప్రాయం:

    02/24/2010 2:37 pm

    బాగున్నది మీ కవిత. దాలి అంటె? నిఘంటువు వెదికితే పాలు మరిగించడానికి పిడకల ప్రోవు అని ఉంది. బాప్ప అంటె అత్త కద. మా కళింగాంధ్రలొ అత్త. నిజమే, నులక మంచాలు పట్టె మంచాలు మరచి పొయాము. ప్లై ఉడ్ మంచాల షోకు వచ్హినది. ఆ అల్లిక ఎంత (artistic) కళాత్మకంగ ఉండేది diamond shape తొ రెండేసి వరసలతొ చిత్రం గీసినట్టుగా. పోయిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు.

  3. శ్రీశ్రీ ఉపన్యాసం గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/23/2010 12:49 am

    ముందు రవ్వంత మొహమాటంగా మొదలెట్టి పక్క సీట్లో సినారె ఉన్నందు వల్ల కాబోలు..యూనివర్సిటీలలోని పిహెచ్ .డి లని గురించి కూడా ప్రస్తావించి….తెలుగు ఉపన్యాసకుడిలాగా మాట్లాడటమ్ మొదలుపెట్టిన ఆ మహాప్రస్థాన కారుడి నెమ్మదితనం ముందు కొంచెం అసహజంగా అన్పించింది..కానీ మెల్లగా ఆయన కవిత్వం వేపు మళ్ళాకా మాత్రం ఆయన తన ముద్రని అక్కడి శ్రోతల మనసులమీద వేసాడు. “ప్రతిజ్ఙ” కవితని చదివి ముగించాకా అక్కడి వాళ్ళు కొట్టిన చప్పట్లు తరవాత ఆయన ముఖంలోని చిన్నపిల్లవాడి ముఖంలోని ఆ అమాయకపు నవ్వుని గమనించగలిగితే [కవిగా ఆయన ఎంత తేటగా ఉన్నాడో ఆ వయసున కూడా] అన్న సంతోషం కలుగుతుంది.

    ఆయన చదివిన మహాభారతంలోని పద్యాలన్నీ బాగా ప్రసిధ్ధికెక్కిన పద్యాలే!! కానీ వాటిని ఆయన ధాటీగా అనర్గళంగా చదవడం ఆయన పద్యాలని ధారతో గుర్తుపెట్టుకోవడం ఆయన మీద ఉన్న చందస్సు ప్రభావం ..పద్యం మీద ఆయనకున్న పట్టుని కూడా చెపుతోంది.

    మొత్తానికి శ్రీశ్రీ నించి క్లుప్తంగా ఆయనపైని కవిత్వ ప్రభావాలనీ..తెలుగు కవిత్వాన్ని ఆయన అంతే క్లుప్తంగా అక్కడి శ్రోతలకి చెప్పడాన్నీ ఈవీడియో ప్రదర్శించింది.ఆయన “దహ్యప్రభావానల …సలిపిరి దీర్ఘ వాసర నిశల్ ” అన్న మహాభారత పద్యం చదువుతూంటే మాత్రం ..”కన్యాశుల్కం”లో “అట్టె అట్టె దహ్య ప్రభవానలము అంటే అర్ధమేమిటిరా?” అని కరటకశాస్త్రులు వెంకటేశాన్ని అడిగినప్పుడు గిరీశం కల్పించుకుని “ఇప్పటి మటుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు….అంటూ వెంకటేశాన్ని కరటక శాస్త్రినించి తప్పించడానికి పడ్డ తమాషా గుర్తొంచింది.

    శ్రీశ్రీ పక్కన కూచున్న నారాయణరెడ్డి అలా కుర్చీలో కదులుతూ ఉండటం మాటిమాటికీ కళ్లజోడుని తుడుచుకుంటూండటం..జుట్టుని సవరించుకోవడమ్ లాంటి అసహజ కదలికలు చూపుకి చికాగ్గా ఉన్నా శ్రీశ్రీని క్లోజ్ అప్ షాట్ లోకి పెట్టాకా ఆ బెడద వదిలి మిగతా శ్రీశ్రీ మాటల్ని స్థిమితంగా ఆస్వాదించడానికి వీలయ్యింది.

    మద్దిపాటి కృష్ణారావు, ఇంకా వడ్లమూడి బాబులకి సంతోషాన్ని తెలియజేస్తూ..
    రమ.

  4. శ్రీశ్రీ ఉపన్యాసం గురించి IVNS Raju అభిప్రాయం:

    02/20/2010 8:48 am

    It is a rarest footage on the great poet Sri Sri. Many thanks for bringing this out. I wonder if Sri Sri would have been a champion of Sanathana Dharma how he would have excelled in doning that role!! With the unfolding of the spiritual energy hidden in the people of this world, in this information era, we certainly miss Sri Sri. Rendu Sirulanu daachukunna vaadu. Oka siri tana Kavanam and marokasiri noothanatwaanni maanavatvaanni vedake manasu. Idi chaaladu Sri Sri ni Aadhunika Aadhyaatmika Jeevi ani cheppadaaniki.

    Dhoorjati loni power of confession
    Potana loni bhakti paaravasyam
    Telugu biddalaku andacheyaali
    Anduku maroka Sri Sri kaavali.
    Aa Sri Sri Aadhyatmika Kavi
    Adhivaastavikatanunchi Aadhyatmikam vaipu adugulesina Sri Sri kaavali

    Namassulato
    __
    IVNS Raju

  5. పాఠకులకు సూచనలు గురించి BATHINI THIMMAGURUDU అభిప్రాయం:

    02/20/2010 1:18 am

    గౌరవనీయులైన సంపాదకునికి నా నమస్కారాలు.

    అయ్యా!
    మీ వెబ్ సైట్ చాలా బాగుంది. మీరు తెలుగుజాతి గౌరవాన్ని , ప్రతిష్టని పెంచుతున్నాను .దానికి నేను ఆనంద పడిపోతున్నాను . మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

    ధన్యవాదములు

    ఇట్లు
    సాహిత్య అభిమాని,
    బత్తిని తిమ్మగురుడు,
    ఇడుపులపాయ,
    ఎపి ట్రిపుల్ ఐటి,
    కడప జిల్లా,
    ఆంధ్రప్రదేశ్,
    భారతదేశం (ఇండియా).

  6. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి rajendra kumar devarapalli అభిప్రాయం:

    02/19/2010 3:35 pm

    కొన్నాళ్ళ క్రితం యస్పీ బాలసుబ్రమణ్యం గారు ‘చల్లగాలిలోయమునా తటిపై శ్యామసుందరుని మురళి’ అంటూ పాడి ఎవరికో అర్ధం చెప్తున్నారు.చెప్పొద్దూ ఆయన పాట విన్నాక అహోరాత్రులు కష్టపడి రాజేశ్వరరావు గారి స్వంతగొంతులో ఆపాట విన్నదాకా స్వాంతన కలగలేదు నాకు.తెలుగుచలనచిత్ర సంగీతరంగంలోని మొదటి అయిదుస్థానాల్లో రాజేశ్వరరావుగారు ఒకరు,

  7. నౌషాద్‌ గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/10/2010 7:45 pm

    నౌషాద్‌తో సహా అనేకమంది ప్రసిద్ధులను ఖననం చేసిన ప్రదేశాలకు ముప్పు ఎదురయిందని ఈ వార్తనుబట్టి తెలుస్తోంది.

  8. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/10/2010 1:05 am

    లోకో భిన్నరుచిహి అన్నది ఆర్యోక్తి. మీకు ఆ పాట మీద అంత గాఢమైన భావనలున్నాయి మరి. అందువల్ల మీకు అలా అర్ధమైనట్టుంది. మీ ప్రశ్నలకి జవాబులు శ్రీశ్రీ చెప్పాలి. ఏం చేస్తాం మీకా అవకాశం మరి లేదు. మీకు అర్ధమైన పధ్ధతిలో ఆ పాట నాకు అర్ధం కాలేదు.
    రమ.

  9. రచయితలకు సూచనలు గురించి M.V.S.Prasad & Saroja అభిప్రాయం:

    02/09/2010 11:03 pm

    ఈ మాట అద్భుతం! ఇన్నాళ్ళూ మాకు తెలియక పోవడం మా దురద్దృష్టం. మీ కృషి ఎంతైనా అభినందనీయం.- సరోజాప్రసాదు

  10. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    02/08/2010 11:53 pm

    రమ గారూ, కల్పన అన్నది ఒకటి కాదు, చాలా వుంటాయి.

    నా చిన్నప్పుడు మా తాత వీపు తొక్కుతూ నేను చెప్పిన నలభై రోజుల ధారా వాహిక కూడా కల్పనే. అది నాకూ, మా తాతకీ తప్ప మరెవరికీ ఆసక్తికరంగా వుండదు. సోదమ్మలూ, సోమిదేవమ్మలూ చెప్పేవి కూడా కల్పనలే. అభూత కల్పనలూ వుంటాయి, కవిత్వాలూ వుంటాయి, దెయ్యం కథలూ, బూతు కథలూ కూడా కల్పనలే. ఆఫీసునించి లేటుగా రావటానికి భర్తలు చెప్పే కారణాల్లోనూ, నెలవారీ ఖర్చుల్లోంచి పొదుపు చేసే భార్యలూ, పీకలదాకా నష్టాల్లో కూరుకు పోయినా షేరు మార్కెట్లో నిలదొక్కుకోవటానికి సీయీవోలు చార్టర్డ్ అక్కౌంటెంట్లూ పడే తంటాలూ కల్పన మీద ఆధార పడేవే.

    సమస్య అదికాదు. సినిమాల్లో నేపథ్య గానాలున్నట్టుగా నిజ జీవితంలో ఎక్కడా మనము పాటలు పాడుకోక పోయినా, సినిమా అన్న కళామాధ్యమంలో నేపథ్య గానానికి వుండే విలువని మనమందరమూ గుర్తిస్తాము. ఇక్కడ విషయం పాటా సినిమా నమ్మదగ్గవిగా వున్నాయా లేదా అన్నది కాదు.

    సూక్ష్మంగా చెప్పాలంటే, తెలుగు వీర లేవరా అన్న పాట శ్రీ శ్రీ రాసిన పాటల్లో అంత గొప్పదేమీ కాదు అన్నది నా వ్యాఖ్య. ఆమాటకొస్తే ఇదే సినిమాలో పాటలు రాసిన ఆరుద్ర, కొసరాజులు కూడా ఇందులో పాటల కన్నా చాలా చక్కటి సినిమా పాటలు రాసిన సందర్భాలు చాలానే వున్నాయి అన్న విషయం మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వ్యాఖ్య వ్రాసినప్పుడు దానిని ఒక విమర్శగానో వివరించవలసిన అభిప్రాయంగానో అనుకోకపోవటం నా పొరపాటే.

    కొంచెం వివరంగా చెప్పాలంటే , కథ మరొక దగ్గర మొదలు పెట్టక తప్పదు. అల్లూరి సీతారామరాజు సినిమాకీ, అందులో జాతీయ అవార్డు వచ్చిన ఈ పాటకి మనం విస్మరించరాని చారిత్రక భౌగోళిక నేపథ్యం వుంది. సినిమా విడుదల అయినది 1974 లో. విశాలాంధ్ర అవతరించి గట్టిగా ఇరవయి సంవత్సరాలు కూడా కాకుండానే, అప్పటికి అయిదు సంవత్సరాలుగా తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో మూల మూలలా భాషా సంస్కృతులలో భేదాల పేరు మీదనే చెలరేగిన తీవ్రమైన అశాంతి (జై తెలంగాణ, జై ఆంధ్రా వుద్యమాలు) ఇంకా సద్దుమణగలేదు. పోలీసు కాల్పుల్లో నాలుగు వందల మంది చని పోయి వుంటారని అంచనా. వేలాది మంది విద్యార్థుల చదువులు, జీవికల మీద ఆశలూ కోల్పోయారు.

    అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితమే, మైదాన ప్రాంతపు ప్రజలు మన్య ప్రాంతాలలో గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నారని , దాన్ని అరికట్టక పోతే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వచ్చే ప్రమాదం వుందనీ భావించి రాష్ట్రపతి ద్వారా గిరిజనుల భూములను మైదాన ప్రాంతపు ప్రజల నించి రక్షించటానికి వన్ ఆఫ్ సెవెంటీ (1970 సంవత్సరంలో వచ్చిన మొదటి ఆదేశాలు కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ అన్న మాట) ఇప్పించవలసి వచ్చింది. (ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెలుగు వాడు అన్న శబ్దాలు వినపడుతుంటే క్షమించండి.. మాట వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు. అవే మన్య ప్రాంత భూములని, అదే వన్ ఆఫ్ సెవెంటీ ఆదేశాలకి వ్యతిరేకంగా గత పది సంవత్సరాలలో మైనింగ్ లీజులకింద, సినిమా నిర్మాతలకి స్టూడియోలూ గట్రా నిర్మించుకోవడానికి లీజులకిందా ఇస్తూ పోతున్నారనీ చాలా కేసులు హై కోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ పడి వున్నాయి).

    సినిమా రిలీజయిన నాటికి, దేశ భద్రతకి అంతర్గతంగా విచ్ఛిన్నకర శక్తులవల్లనూ, బాహ్య శక్తుల కుట్ర వల్లనూ ప్రమాదం పొంచి వుందని చెప్పి, శ్రీమతి ఇందిరా గాంధీ నెమ్మది నెమ్మదిగా అధికారాన్ని అంతటినీ తన చేతిలో కేంద్రీకృతం చేసుకుంటూ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లోనే రాష్ట్రపతి పాలన విధించవలసిన అగత్యం వుందని అప్పటికే చేసి చూపించింది.

    ఇటువంటి కల్లోల పరిస్థితిలో, అనేకానేక చారిత్రక భౌగోళిక కారణాల వలన తునా తునకలయిన ప్రజల ఐక్యత నేపథ్యంలో, అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలయింది. అటువంటి సందర్భంలో మన్య ప్రాంతంలో మైదాన ప్రాంత ప్రజల వీరోచిత సేవని నిరూపించటంలోనో, నిజ జీవితంలో సాధ్యం కానీ ఐక్యతని సినిమా ద్వారా చూపించటంలోనో నిర్మాతకి ఏదో తక్షణ స్వార్ధం వున్నదని అంత క్రూడ్ గా చెప్పుకోవలసిన పని లేదు కానీ, ఆ నేపథ్యంలో ఈ సినిమా ఏం సాధించింది? ఎందుకు అంత గుర్తింపు పొందింది, ఈ సినిమాని ఏ ప్రజలు ఎందుకు ఆదరించారు? అందులో శ్రీ శ్రీ పాట పాత్ర ఏమిటి అన్న ప్రశ్నలు వేసుకోవటం అవసరం. ఆ ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఈ రోజు నెలకొన్న పరిస్థితులేమిటి అన్న గ్రహింపు కూడా వుండడం అవసరం.

    ఇంతకు ముందు నేను సూచన ప్రాయంగా చెప్పిన నేపథ్యం అంతా శ్రీ శ్రీ కి బాగానే తెలుసును. అటువంటి పరిస్థితులలో తెలుగు వీరత్వాన్ని, శూరత్వాన్ని, బాహ్య శత్రువుని తరిమి తరిమి కొట్టమని ఉద్బోధిస్తకీ భాష పాట రాయాలంటే శబ్దాడంబరం ద్వారా, భాష పేరిటా, సంస్కృతి పేరిటా, జాతి పేరిటా , మగతనం పేరిటా క్షణికావేశం సృష్టించడం తప్ప వేరే మార్గం లేదు. శ్రీ శ్రీ ని అందుకు మనం తప్పు పట్టనవసరం లేదు కానీ, పాటకు లేని గొప్పదనాన్ని ఆపాదించనవసరం కూడా లేదు.