పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/08/2010 1:28 am

    సంపాదకులకి!! “ఈమాట” పాఠకులకి గానూ ఆసక్తి ఉంటుందంటే గనక పాత పుస్తకాలు ఇవాళ్టికీ కూడా “వావిళ్ళ” వారి ప్రచురణల్లో దొరుకుతాయి. ఆముక్తమాల్యద టీకా సహితంగా xerox ప్రతిని సంపాదించుకోవచ్చును. అలాగే మనుచరిత్రని కాళహస్తీశ్వర శతకాన్నీ.. ఇంక ఇతర ప్రబంధాలకోసం వెతికే వాళ్ళకి కూడా అటు వావిళ్ళ వారి దగ్గర కొన్ని ఇటు ఎమస్కో వారివద్ద కొన్ని ఇప్పటికీ దొరుకుతాయి గనక పాత సాహిత్యాన్ని చదవాలని అనుకునే వారూ తెలుగున వచ్చిన ముఖ్యమైన పాత గ్రంధాలని సేకరించుకోవాలని అనుకునేవారూ వీళ్ళవద్ద వాకబు చేయవచ్చును. ఇంక శతకాల వంటివి మామూలుగానూ అలాగే గుజిలీ ప్రతులలోనూ కూడా దొరుకుతాయి. గనక పాత తెలుగు సాహిత్యాన్ని సేకరించుకోవడం గనక ముందు [వీలైనన్ని పుస్తకాలని] చేస్తే…. క్రమంగా వాటిని చదవడమ్ చేయవచ్చు.

    కొత్తతరం వారికి ఈ సమాచారమ్ బహుశా పనికి వస్తుందనే ఉద్దేశ్యంతో చెబుతున్నాను.

    రమ.

  2. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/08/2010 1:13 am

    పరుచూరి శ్రీనివాస్ గారూ!! ఆ పుస్తకాలు ఎక్కడ దొరకగలవో.. వాటి ప్రచురణ కర్తలు ఎవరో మరి కాస్త వివరంగా తెలియజేయగలరు. అవి కొనడానికి అందుబాటులో ఉంటే గనక కొనుక్కుంటాను. అడ్రస్సులు చెప్పండి [తెలుగువి].

    రాయవాచకం ప్రధానంగా మనం ఇళ్ళలో పాతతరం వాళ్ళు కబుర్లు చెప్పుకొంటూంటే విని తిరిగీ మన కల్పనలలోంచి మరికొన్ని కబుర్లని కూర్చి మరీ కధలుగా చెప్తామే అలాంటి రచన. gossip లాంటిది. ఆ స్థానాపతికి రాయలని గురించిన ఒక fascination ఉందనిమాత్రం మనకి తెలుస్తుంది. పాత తరం వాళ్ళు చెప్పిన కబుర్లని తిరిగీ చెప్పుకోడంలో ఒక సరదా ఉంటుంది మనకి. అలాగే అందులో ఎక్కువ fiction కూడా ఉంటుంది. అదలా ఉంచినా రాయవాచకంలో ఆ స్థానాపతి వివరించిన పురుషోత్తమ గజపతి చేసిన భోజనం వర్ణన మాత్రం బాగుంటుంది. అలాగే ఆయన వచనం కూడా బహుశా బాగుండి ఉండచ్చును. ఆ కాలంలో వచనం ఇవాళ్టి మన వాడుక భాషకి మరీ దూరంగా ఏమీ ఉండకపోవడమ్ కూడా ముచ్చట కల్గించే విషయమే!! ఆ తెలుగుని చదవడం మనకి ఉపయోగంగానూ ఉంటుంది. ఇకపోతే… history and fiction
    ల గురించి వెల్చేరు నారాయణరావు గారు రాసిన విషయం నాకు తెలుసును గనక మీరు మళ్ళీ దాన్ని కోట్ చేసే పని పెట్టుకోనక్కరలేకుండా ముందే చెప్పేస్తున్నాను.;)

    నేను ఈ మధ్య మన దేశీయ విద్వత్తుమీద ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాను.పాత తరం పండితులు రాసినవాటిమీద. ఇంగ్లీషులోవచ్చే ఒకలాంటి stereotype research పుస్తకాల మీద నాలో ఆసక్తి చాలావరకూ తగ్గిపోయింది. గనక నేను సంజయ్ సుభ్రమణ్యం రాసిన పుస్తకాన్ని ఎంతపాటి చదవగలనో చెప్పలేను. వాటిని నేను “కొని” చదివేటంత ఆసక్తి కూడా ప్రస్తుతం నాలో లేదు.అవి చదవనందుకు గానూ నేనేదో miss అయిపోతున్నానని కూడా అనుకోను. చదవాల్సినవి ఇంకా బోలెడున్నాయి.
    ధన్యవాదాలు.
    రమ.

  3. అంధకారం గురించి జి ఎన్ అభిప్రాయం:

    04/07/2010 11:04 pm

    సత్యనారాయణ గారు,

    మీ అబిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ క్రింది విషయాలు గమనించండి.

    1. నేను ఈ కవితను ఎంత మాత్రం మీరు చెప్పిన సున్నితమైన సమస్యను, దానికి సంబంధించిన ఎవరినీ ఉద్దేశ్యించి వ్రాయలేదు. అలా అనిపించి ఉంటే అది యాద్రుచ్చికము తప్ప ఇతరత్రా కాదు.

    అంత విస్త్రుతమైన విషయాల పట్ల నిజంగానే నేను ఏదైనా వ్రాయలనుకుంటె అది ఆంధ్ర భూమి, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ లాంటి ఎక్కువమంది చదివే పత్రికలకు పంపుతాను.

    ఈ మాట లాంటి పత్రికలు కేవలం నెటిజన్లకు మాత్రమే అందు బాటులో ఉంటాయి.

    2. నా స్వానుభవంలోని విషయాల పట్ల స్పందించి మాత్రమే వ్రాసాను.

    3. ఈ కవితను ప్రచరణకు తీసుకున్నప్పుడే ప్రశంసా పుర్వకముగా ఆ విషయాన్ని తెలియజేసారు. అందువలన ఇందులో కవితా విలువలు ఉన్నాయనే నేనూ నమ్ముతున్నాను.

    మీరు చెప్పిన సున్నితమైన విషయాలను ఈ కవిత రూపములో ప్రస్తావించే ఉద్దేశ్యం నాకు ఎంత మాత్రము లేదు. మరొక్కసారి చదివితే మీకే తెలుస్తుందని నమ్ముతున్నాను.

  4. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/07/2010 3:51 pm

    రమ గారు: మీ ప్రశ్నలకు చాలా వివరంగా జవాబివ్వాలని వుంది కానీ, సమయాభావం వల్ల ఇలా క్లుప్తంగా …

    రాయవాచకము తేలికగానే దొరుకుతుంది (సి. వి. రామచంద్రరావు, ఆ.ప్ర. సా. అకాడమీ). రాయవాచకపు రాతప్రతులని గురించి కూడా మనకు సమాచారం దొరుకుతుంది. అలాగే కృష్ణరాయవిజయం, రామరాజీయం, నేలటూరి పుస్తకాలు, మల్లంపల్లి రెడ్డిరాజుల చరిత్ర (ఈ మధ్యనే పునర్ముద్రితం!) కూడా నాకు తేలిగ్గానే దొరికాయి (నేను జర్మనీలో వుంటాను. అయినా కూడా ..). ఒకటి రెండేళ్ళుగానయితే Digital Library of India వారి పుణ్యమా అని పై పుస్తకాలలో కొన్ని ఇప్పుడు netలో లభ్యం.

    కేవలం ఆ పుస్తకాలను చదివి చరిత్ర రచన చేసేయవచ్చునని నేననలేదు. మంచి చరిత్రకారులెవరైనా “Hard” (e.g. inscriptions) and “Soft” (e.g literary) materials అన్నింటినీ కలిపి చూస్తారు. ఉదాహరణకు మీరు Cynthia Talbot కాకతీయులపైన రాసిన పుస్తకం చూడగరలరు.

    శిలా/తామ్రశాసనాలపైనున్న సమాచారానికి ఎక్కువ గుర్తింపు, మిగిలిన వాటిపైన కొండొకచో చిన్నచూపుపైన చాలా విస్తృతమైన చర్చే జరిగింది/జరుగుతుంది. మీకిలాంటి విషయాల్లో ఆసక్తి వుంటే: Sanjay Subrahmanyam, Whispers and shouts: Some recent writings on medieval south India; IESHR, Vol38, N4, 2001 చూడగలరు.

    — శ్రీనివాస్

  5. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/07/2010 2:19 pm

    పరుచూరి శ్రీనివాస్ గారూ!!

    తెలుగులో దొరకని “రాయవాచక”పు ప్రతిని ఎలా చదవాలో మీరేమన్నా చెప్పగలరూ?? ఏ మిత్రుడో వదిలివెళ్ళిన దాని ఆంగ్లానువాదాన్ని నేను చదవబట్టి గానీ..లేకుంటే అసలు అందులో ఏముందో తెలుసుకోగల వీలు బహుశా లేకపోయేది సుమా!

    “రాయవాచకం” ఇవాళ దొరకదు. ఇంగ్లీషు అనువాదం బట్టి చూసినా అందులో ఉన్న విషయాల ద్వారా కుతూహలమూ అనేకానేక సందేహాలూ చరిత్రకి సంబంధించి కలుగుతాయి. దాన్నటుంచి అసలు రాయవాచకాన్ని సంపాదించి పునర్ముద్రించే వాళ్ళున్నారా?? విశ్వనాధ నాయకుడి కొలువులోని ఒకానొక “స్థానాపతి” రాయల కాలాన్ని గురించి తళ్లికోట యుధ్ధానంతరం తాను అక్కడా ఇక్కడా విన్న అనేకానేక విషయాలని కలగాపులగంగా కబుర్లుగా చెప్పేసేడు. దానిలోంచి మనం రాయలకి సంబధించిన వాస్తవాలని తెలుసుకోలేమని ఆనాటి విజయనగరపు చరిత్రని రాసిన ఆధునిక కాలం నాటి తెలుగు చరిత్రకారులంతా అభిప్రాయపడ్డారు. చాలా విషయాలు అందులోవి సాహిత్యంతోనీ ..శాసనాలతొనీ తైపారు వేసి చూస్తే ఏమీ సరిపడేలా లేవని అన్నారు వాళ్ళు.. దాన్నలా ఉంచినా అసలా “రాయవాచకాన్ని” కంటచూసిన వాళ్ళు ఎవరూ లేరాయె!!

    ధూర్జటి గారి మనవడు కూడా కృష్ణరాయలని గురించి ఒక పుస్తకం రాసేడు. “కృష్ణరాయవిజయం” అని ఆ పుస్తకం పేరు. అదీ చదవాలంటే దొరకదు. చదవడానికి దొరికే వీలుంటే కదా ముందసలు అందులోని విషయాలని గురించి, విజయనగరపు చరిత్రని గురించి వాళ్ళు రాసిన విషయాలని గురించి ఒక “పరిశోధన” సాగించడానికి. ఆరవీటి వంశం వారి గురించి “రామరాజీయం” అనే పేర అందుగుల వెంకయ్య కవి రాసేడు. దీనికే “నరపతి విజయం” అనే ఇంకో పేరు కూడా ఉంది. ఇబ్బంది ఏమంటే ఇదికూడా చదవడానికి దొరకదు. వీటిలోని విషయాలు చరిత్రకి సంబంధించి ఎంత ఉపయోగపడతాయీ అన్న విషయాన్ని అటుంచినా ముందసలు ఈ పుస్తకాలు చదవడానికి దొరకాలి కదా? వీటిలో ఆనాటి చరిత్రకన్నా ఆనాటి సమాజానికి సంబంధించిన సంగతులు కొన్ని పనికొస్తాయి అని అన్నారు సాహిత్యం ఆధారంగా “సాంఘిక చరిత్ర” రాసిన సురవరం ప్రతాపరెడ్డి గారు.

    కనీసం నేలటూరి వేంకట రమణయ్య గారు విజయనగర చరిత్రకి సంబంధించి రాసిన పుస్తకాలు గానీ.. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రాసిన రెడ్డిరాజుల చరిత్ర గానీ ఏనాడూ మళ్ళీ అచ్చయిన పాపాన పోలేదే? ఎలా వాటిని చదవడం? వేటిని వేటితో పోల్చి “పరిశోధన”ని ఇవాళ్టికాలం వాళ్ళు చేయాలీ?? సాహిత్యం అందుబాటులోలేదు. మొత్తంగా!! చరిత్రకి సంబంధించిన ఎటువంటి ఆధారాలు తెలుసుకుందికి వీలుగా సులువుగా దొరకవు. వేటిని వేటితో పోల్చి సరిచూసి విషయాల్ని గ్రహించాలీ??

    కనీసమ్ రాబర్ట్ స్వూవెల్ పుస్తకం “the forgotten empire” అన్నది చదవాలంటే కనీసం ఎక్కడైనా సంపాదించొచ్చు.అది అనేక ప్రచురణలని పొందిన పుస్తకమ్ గనక. విజయ నగర చరిత్రని తిరిగి రాయాలీ అంటే కనీసం సరిగ్గా అర్ధం చేసుకోవాలీ అంటే ఒక్క తెలుగు పుస్తకాలే కాదు కన్నడ పుస్తకాలు కూడా ఆనాటి కాలానికి చెందినవి చూడవలసి ఉంటుంది. కోదండరామయ్య గారు కృష్ణదేవరాయల కుటుంబం గురించి ఎంతో పరిశోధన చేసి పుస్తకం రాసేరు. అందులోని విషయాలు ఎన్నో కృష్ణదేవరాయని గురించి మనకి తెలిసిన వాటికన్నా భిన్నంగా ఉంటాయి. ఆయనకి కన్నడం కూడా వచ్చు గనక కన్నడ శాసనాలు సైతమ్ పరిశీలించి విషయాలని పేర్కొన్నారు. అయితే ఎంతమందికి ఆయన పేరైనా తెలుసు?? మనకి ఇంగ్లీషులో వచ్చిన పుస్తకాలని గురించీ వారు చేసిన “పరిశోధనలని” గురించి తెలిసినంత బాగా మనవాళ్ళు రాసిన పుస్తకాల గురించి తెలియదు. గట్టిగా 500 ఏళ్ళ కిందటి విజయనగర సామ్రాజ్యాన్ని గురించిన సంగతులే మనకి అంతంత మాత్రమ్గా తెలుస్తున్నాయి. ఇహ కాకతీయుల కాలం నాటి సాహిత్యం చరిత్ర రెంటినీ సరిపోల్చి చూడడానికి ఒక్క క్రీడాభిరామం, ప్రతాపరుద్రీయం మాత్రమే చాలవు. వాటిలోని విషయాలు శాసనాలలోని విషయాలతో విభేదించకుండా ఉంటే అప్పుడు. ఇవన్నీ వడపోత బట్టి పనిచేయాలీ అంటే ఆ చేసేవాళ్ళకి ఉన్న సదుపాయాలూ వనరులూ ఎలంటివో కూడా ఆలోచించాలి కదా మనం “వగచే”ముందు.

    నాకు వింతగా అన్పిస్తుంది ఏమంటే… మనం పనిగట్టుకుని కొన్ని విషయాల్ని చచ్చేదాకా మౌనం వహించి చూస్తాం!! మళ్ళీ అవన్నీ చచ్చిపోయేయంటూ చొచ్చొచ్చొ అంటాం!! “తెలుగుతనమ్” అంటేనే ఇదీ!! తెలుగులోని పరిశోధన తీరూ ఇదే మరి!! డబ్బులున్నవాళ్ళే ఏమన్నా చేయాలి. డబ్బులు ఇవ్వని రంగాలు ఏం ముందుకు సాగుతాయీ??

    రమ.

  6. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి సౌమ్య అభిప్రాయం:

    04/07/2010 7:01 am

    ఈ మధ్య సీపీబ్రౌన్ అకాడెమీ వారు ఇదే పని చేస్తున్నారు. ‘ఆముక్తమాల్యద’ గురించిన వారి పరిచయ గ్రంథం చదివాకే, నేను నా పరిధుల్లో శతకాల్తో మొదలుపెట్టా పద్య భాష చదవడం…

  7. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Lakshmi Nageswar Dasari అభిప్రాయం:

    04/07/2010 6:14 am

    చాలా బాగుంది.

  8. ప్రేమ కవితలు గురించి Ram sai ganesh అభిప్రాయం:

    04/07/2010 2:52 am

    చాల చక్కగా ఉంది మీ కవిత

  9. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి bhaarati అభిప్రాయం:

    04/06/2010 6:08 pm

    కథ చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చింది. సిగరెట్ల పై డాలీ కొచ్చిన ఫీలింగ్స్‌ చక్కగా చెప్పారు.
    చెప్పేపద్ధతిలో ” కృతకం, కృత్రిమం, వికృతం ” ఏమీ స్ఫురించ లేదే!
    “యాంత్రికంగా ” లేనే లేదు.
    ఈ రచయిత అంటే ఈ పై విమర్శకుడికి ఏమంత ఇష్టం లేనట్టు కనిపిస్తోంది; కానీ, రచనపై లేని అభాండాలు రుద్దడం ఏమంత నాగరీకం కాదేమో!

    యస్‌. భారతి

  10. అంధకారం గురించి తిరునగరి సత్యనారాయణ అభిప్రాయం:

    04/06/2010 12:21 pm

    రెండు ప్రశ్నలు:

    1. ఇది కవిత్వమా? ఇందులో కవిత్వం అని చెప్పుకోదగ్గదేమైనా ఉన్నదా? మంచి కాదు కదా కనీస సాహిత్య స్థాయి కానీ కవిత్వ స్థాయి కానీ లేని దీన్ని (ఏమనాలో తెలియడం లేదు) ప్రచురించి ఈ మాట తన స్థాయి మరచి పోయిందా? ఏ సాహిత్య ప్రమాణాలు దీనికి వర్తిస్తాయో, ఎట్లా ఇది కవిత్వమవుతుందో ఎవరైనా విడమర్చితే సంతోషిస్తాను.

    2. ఇది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు వ్యతిరేకంగా రాసినట్టుంది. కవిత బలహీనత వల్ల అది తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఇంత చవకబారు కవిత్వంతో అవమాన పర్చడం సమంజసమా? ఈ మాట సంపాదక వర్గానికి అభిప్రాయాలెట్లున్నా, తెలంగాణ ఆకాంక్ష ప్రజలది అనీనూ, ఏదో స్వార్థ రాజకీయ నాయకులది కాదనీ చాలా స్పష్టంగా తెలుసనే అనుకుంటున్నాను. స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఎన్ని సార్లు మోసపోయినా తెలంగాణ ప్రజలు తమ ప్రజాస్వామిక ఆకాంక్షను పదే పదే వ్యక్తం చేస్త్తూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. అట్లాంటప్పుడు ఇది ప్రచురించడం ఆ ఆకాంక్షను అవమానపర్చడం కాదా?