ఏ నిఘంటువులో “సోమము” అన్నదానికి అర్ధం “అమృతము” అని ఉందో కాంతి కిరణము అని ఉందో మరి మోహన గారు చెబితే బాగుండేది. నాకు అలాంటి అర్ధం ఏదీ నిఘంటువుల్లో కనిపించలేదే?? సోమము అంటే “ఉదకము” అని “తరవాణి” అని అర్ధాలున్నాయి. [ నీటికి సంబంధించిన అర్ధాల్లో]…అందుకే అన్నాను సోముడు వేరు సోమము వేరు అని.
సోమ అనే పదాన్ని సామాన్యంగా సోమరసము అనే భావంలో ఉపయోగిస్తారు. సోమ అంటే అమృతము అని కూడా అర్థము ఉంది. సోమము అంటే కాంతి కిరణము అని కూడా అర్థము ఉంది. విధేయుడు – మోహన
సత్యనారాయణగారు, శ్రీనివాసుగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఉత్తరాలు నా పద్యాలలోనే ఉన్నవి. నేను సిసలైన తెలంగానావాడినే ఐనా ముమ్మాటికి త్రికరణశుద్ధిగా సమైక్యవాదినే కాని వేర్పాటు ప్రతిపాదకుని కాను. వారి భావాలతో ఏకీభవించవలసిన అవసరం నాకు లేదు. వారి కెంత వాక్స్వాతంత్ర్య మున్నదో నా అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు,ఇట్టి వ్యక్తీకరణద్వారా వీలైన కొందరి మనసులు వేర్పాటు ధోరణినుండి మళ్లించుటకు నాకు అధికారము, పైపెచ్చు బాధ్యతా ఉన్నాయని నా అభిప్రాయము.
“ముఖబింబమే ఒలికే సోమమై”…అంటే?? చంద్రుడు సోముడు. సరే! కానీ ఈ ఒలికే సోమము అంటే ఏమిటీ?? వెన్నెలా?? అలాంటి అర్ధం ఉందా?? లేక నీరా?? నీరు ఒలుకుతున్న పోలికేంటో? “సోముడు” వేరు “సోమము” వేరు. ఈ పదాన్ని పాటగా రూపొందిస్తున్నానని కూడా పద అనువాదంలో తన భావాన్ని లైలా చెబుతున్నారు కదా? అందువలన ముందుగానే ఈ సందేహం!! సంస్క్రుతంలో భావానికి తెలుగు పోలిక వాక్యాలలో అమిరినట్టులేదు.
చాలా బాగున్నదండీ ఈ ఆర్టికల్ . తెలుగు అనువాదాలు వ్యాసంలోనివి, వ్యాసం అనుబంధం లోనివి అన్నీ చదివాను. పాటలు ఎన్నోసార్లు విని ఆనందించాను.
అందుమూలంగా, నాకు ఈ జయదేవుని “సా విరహే..” భానుమతి పాడిన శైలిలో, ఈ క్రింది విధంగా తెలుగులో నా మెదడులో వినిపిస్తున్నది. మీకిష్టమైతే ‘ఈ మాట’ పాఠకులను ఈ నా సాహిత్య/సంగీత అనుసరణను చదవనిచ్చి, పత్రికకు గాయకులు కూడా ఉన్నట్లైతే పాడించి వినిపించండి. ఒకవేళ ఈ పాటను నేనే ముందు రికార్డ్ చేయించగలిగితే, ఈ మాటలో తప్పక వినిపిస్తాను. ధన్యవాదాలు.
నా మాటలతో కన్నా వ్యాసకర్తలు అన్నట్లుగా “సా విరహే తవ దీనా లోని ఆమె (సా) ఎవరో కాదు, మనమే. జీవనది పరమాత్మ దయాసాగరం చేరడానికి తహతహలాడుతూ అనుభవించే బాధ, తపన, వియోగమే ఈ అష్టపదిలోని ఇతివృత్తము”
ఎరుక మరిచి ఈ వ్యాసం ఆద్యంతం ఒక దివ్యమైన అనుభూతిలో మునిగి చదివి, అత్యంత మధురమైన ఈ గీతాల్ని వింటూ ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. చాలా ధ్యన్యవాదాలు.
సా విరహే తవ దీనా గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
04/20/2010 1:33 pm
సోమము: “సోమ” రూపాంతరము; పరాక్రమము, జలము, కర్పూరము. మరికొన్ని అర్థాలు, వివరాలు శబ్దరత్నాకరములో (బి సీతారామాచార్యులు) చూడవచ్చు.
కారాశం
రాగలహరి: హిందోళం గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
04/20/2010 1:29 pm
ఈమాట సంపాదకులకి,
ఈ వ్యాసంలో – “8వ మేళకర్త అయిన హనుమత్తోడి జన్యరాగం హిందోళం. ” అని రాసింది సరిదిద్దాలి. హిందోళ రాగం 20వ మేళకర్త నటభైరవి రాగ జన్యం. హనుమత్తోడి జన్యం కాదుకాక కాదు. అనుమానముంటే గూగిలించవచ్చు.
మీకోసం కొన్ని లింకులు:
http://www.ecse.rpi.edu/Homepages/shivkuma/personal/music/samajavaragamana.htm
http://www.karnatik.com/ragash.shtml#hindOLam
సా విరహే తవ దీనా గురించి rama bharadwaj అభిప్రాయం:
04/20/2010 1:25 pm
ఏ నిఘంటువులో “సోమము” అన్నదానికి అర్ధం “అమృతము” అని ఉందో కాంతి కిరణము అని ఉందో మరి మోహన గారు చెబితే బాగుండేది. నాకు అలాంటి అర్ధం ఏదీ నిఘంటువుల్లో కనిపించలేదే?? సోమము అంటే “ఉదకము” అని “తరవాణి” అని అర్ధాలున్నాయి. [ నీటికి సంబంధించిన అర్ధాల్లో]…అందుకే అన్నాను సోముడు వేరు సోమము వేరు అని.
లైలా వాక్యాలని అలాంటి అర్ధాల్లో అన్వయించలేము కద?
రమ.
సా విరహే తవ దీనా గురించి mOhana అభిప్రాయం:
04/20/2010 10:41 am
సోమ అనే పదాన్ని సామాన్యంగా సోమరసము అనే భావంలో ఉపయోగిస్తారు. సోమ అంటే అమృతము అని కూడా అర్థము ఉంది. సోమము అంటే కాంతి కిరణము అని కూడా అర్థము ఉంది. విధేయుడు – మోహన
తెలగాణెము గురించి ధేశికాచారి అభిప్రాయం:
04/19/2010 11:19 pm
సత్యనారాయణగారు, శ్రీనివాసుగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఉత్తరాలు నా పద్యాలలోనే ఉన్నవి. నేను సిసలైన తెలంగానావాడినే ఐనా ముమ్మాటికి త్రికరణశుద్ధిగా సమైక్యవాదినే కాని వేర్పాటు ప్రతిపాదకుని కాను. వారి భావాలతో ఏకీభవించవలసిన అవసరం నాకు లేదు. వారి కెంత వాక్స్వాతంత్ర్య మున్నదో నా అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు,ఇట్టి వ్యక్తీకరణద్వారా వీలైన కొందరి మనసులు వేర్పాటు ధోరణినుండి మళ్లించుటకు నాకు అధికారము, పైపెచ్చు బాధ్యతా ఉన్నాయని నా అభిప్రాయము.
సా విరహే తవ దీనా గురించి rama bharadwaj అభిప్రాయం:
04/19/2010 10:17 pm
“ముఖబింబమే ఒలికే సోమమై”…అంటే?? చంద్రుడు సోముడు. సరే! కానీ ఈ ఒలికే సోమము అంటే ఏమిటీ?? వెన్నెలా?? అలాంటి అర్ధం ఉందా?? లేక నీరా?? నీరు ఒలుకుతున్న పోలికేంటో? “సోముడు” వేరు “సోమము” వేరు. ఈ పదాన్ని పాటగా రూపొందిస్తున్నానని కూడా పద అనువాదంలో తన భావాన్ని లైలా చెబుతున్నారు కదా? అందువలన ముందుగానే ఈ సందేహం!! సంస్క్రుతంలో భావానికి తెలుగు పోలిక వాక్యాలలో అమిరినట్టులేదు.
రమ.
సా విరహే తవ దీనా గురించి lyla yerneni అభిప్రాయం:
04/19/2010 6:21 pm
సంపాదకులకు:
చాలా బాగున్నదండీ ఈ ఆర్టికల్ . తెలుగు అనువాదాలు వ్యాసంలోనివి, వ్యాసం అనుబంధం లోనివి అన్నీ చదివాను. పాటలు ఎన్నోసార్లు విని ఆనందించాను.
అందుమూలంగా, నాకు ఈ జయదేవుని “సా విరహే..” భానుమతి పాడిన శైలిలో, ఈ క్రింది విధంగా తెలుగులో నా మెదడులో వినిపిస్తున్నది. మీకిష్టమైతే ‘ఈ మాట’ పాఠకులను ఈ నా సాహిత్య/సంగీత అనుసరణను చదవనిచ్చి, పత్రికకు గాయకులు కూడా ఉన్నట్లైతే పాడించి వినిపించండి. ఒకవేళ ఈ పాటను నేనే ముందు రికార్డ్ చేయించగలిగితే, ఈ మాటలో తప్పక వినిపిస్తాను. ధన్యవాదాలు.
…
గంధము వేడిర, చంద్రుడు వేడిర
మలయ సమీరం మరిమరి వేడిర!
మన్మథ బాణం మాధవ! వాడిరా
భీతిలి నీ భావనలోనే దాగినదేమొర!
నీ విరహిణిరా! రాధ
నీ విరహిణిరా రాధా, కృష్ణా!
నీ విరహిణిరా…!
ప్రతియడుగున నీ నామమె జపమై
మాధవ! మాధవ! నాదమె తపమై
మనసున నీతో రతియే వ్రతమై
మదనుని వేటుకు మతి బాసినదై
నీ విరహిణిరా! రాధ..
మదకస్తూరిది, మామిడి చిగురిది,
మకరధ్వజమిది, నా వందనమిది
మన్మథుడా ఇక బాధించకుమని
ముఖబింబమే ఒలికే సోమమై
పూలపానుపున నీకై వేచెనా దీన!
నీ విరహిణిరా, రాధ..
కృష్ణా!…తవవిరహే ….దీనా..
lyla
సా విరహే తవ దీనా గురించి ఉష అభిప్రాయం:
04/18/2010 7:19 pm
నా మాటలతో కన్నా వ్యాసకర్తలు అన్నట్లుగా “సా విరహే తవ దీనా లోని ఆమె (సా) ఎవరో కాదు, మనమే. జీవనది పరమాత్మ దయాసాగరం చేరడానికి తహతహలాడుతూ అనుభవించే బాధ, తపన, వియోగమే ఈ అష్టపదిలోని ఇతివృత్తము”
ఎరుక మరిచి ఈ వ్యాసం ఆద్యంతం ఒక దివ్యమైన అనుభూతిలో మునిగి చదివి, అత్యంత మధురమైన ఈ గీతాల్ని వింటూ ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. చాలా ధ్యన్యవాదాలు.
రాగలహరి: హిందోళం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
04/17/2010 12:17 pm
ఎప్పుడో రాసిన వ్యాసాలు ఇప్పటికీ మేలు చేస్తున్నాయంటే ఆనందంగా ఉంది.. ఈ వ్యాసాలు రాసిన రోజుల్లో పాఠకుల స్పందన ఎక్కువగా ఉండేది కాదు.
ఇంకా ఏం రాయాలో ఎవరన్నా సూచిస్తే బాగుంటుంది.
విష్ణుభొట్ల లక్ష్మన్న
ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి ashwini అభిప్రాయం:
04/17/2010 7:49 am
Its very good story all want to learn from this ” smoking is injurious to others life also”