పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి jayaprabha అభిప్రాయం:

    04/23/2010 3:11 pm

    ఏమండీ వేంకటేశ్వరరావుగారూ!! “కౌస్ కౌస్ ” అంటూ కవులని వెక్కిరించే మీరేనా కవిత్వం గురించి ఇంత శ్రధ్ధగా పఠనాశక్తితో ప్రతిపదార్ధ సహితంగా అవి అచ్చులో పునర్ముద్రణ జరగాలని ఆశిస్తున్నదీ!! మీరు ఇంతగా మారారా? మంచిమార్పే!! అయితే ఆ పుణ్యకాలం ఏదో గడిచిపోకుండా ఆ ప్రతిపదార్ధాలూ..వివరాలూ కవితా రహస్యాలూ చెప్పగలవారుండగానే మీ కోరికని కార్యరూపంలోకి అనువదించరాదో!! తెలుగులోని భావి కవితా ప్రియులు తరిస్తారు కదా మీ పేరు చెప్పుకుని.

    ఈ మద్య నా “క్షణ క్షణ ప్రయాణం” కవితా సంకలనంలోని కొన్ని పద్యాలలోని పదబంధాలు అర్ధం కావడం లేదంటూ ఓ ఆకాశరామన్న పాఠకుడు అందులో నేను ” అగ్రహారం “భాష రాసేనని ఓఘాటైన విమర్శ రాసేడు. ఆయన ఉద్దేశ్యం నాకైతే అర్ధమ్ కాలేదనుకోండి. అయితే నేను అతగాడు రాసిన ఆ విమర్శని చదివే వీలులేదని అనుకున్నట్టున్నాడు..దానిని ఒక ఫొటోకాపీ తీయించి మరీ [ పేరూ అడ్రస్సూ లేకుండానే సుమా!]] నాకోసం శ్రమపడి మరీ పోస్టులో పంపించాడు.ఐతే ఇప్పుడు మీమాటలు చదివాకా శ్రీశ్రీ మహాప్రస్థానం అర్ధం కావడం కస్టమ్ అనిమీరు అనుకుంటున్నట్టుగా నాకర్ధమ్ అయ్యింది. అయ్యా!! నా కవిత్వంలోని భాష కూడా
    అర్ధం చేసుకోవడానికి ఏమంత వీలుగా లేదట!! మరి మహాప్రస్థానం అర్ధంకాకపోతే గనక ఆశ్చర్యం ఏముందీ?? ఆమధ్య ఒకసారి కవి శివారెడ్డి నా ప్రేమకవిత్వాన్ని చదివి ఒక మాట నాతోనే స్వయంగా ఇలా అన్నాడు. ఆతనికి నా భావాలు చాలా బాగున్నాయి ట! ఐతే ఆయన అన్నదేమంటే.. జయప్రభా!! మీ కవిత్వంలోని భాష నాకే సరిగ్గా అర్ధం కావడం లేదు. మరి ఇవాళ్టి తరం వారికి అర్ధమ్ అవుతుందంటారా?? అని. దీన్ని బట్టి మీరే ఊహించుకోండి.. అర్ధంచేసుకోండి ఇవాళ్టి కవిత్వ పాఠకులు ఎవరో.. వారు చదువుతున్న కవిత్వాల [ రాస్తున్న కవిత్వాల స్థాయి కూడా] భాషా పరంగా ఏ దశలో ఉందో!! కవిత్వమ్ మీద అభిమానమే ఉంటే అటువంటి వారికి కవి ఊహా అర్ధం అవుతుంది.కవి భాషా అర్ధమ్ అవుతుంది.అందులోని ఆనందమూ అనుభవంలోకి తప్పక వస్తుంది.

    జయప్రభ.

  2. తెలగాణెము గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/23/2010 1:38 pm

    మొత్తానికి ఇవాళ ఆంధ్ర దేశాన్ని అతలాకుతలం చేస్తున్న “తెలంగాణం” వేర్పాటు.. సమైక్య నినాదాలు దేశికాచార్యుల వారి పద్యాల పుణ్యమా అని ఈమాటలోకి ప్రవేశించడం అనివార్యమైంది.

    ఆకలి, వెనుకబాటుదనం తెలంగాణంతో సమానంగానూ.. కొండొకచో తెలంగాణం కన్నా ఎక్కువగానూ ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాలలోనూ ఉన్నాయి. అందువలన ఈ సమస్యలు ఒక్క ప్రాంతానికే పరిమితమై లేవు. వలస కూలీల పరిస్థితి మరీ దయనీయంగా పరిణమిస్తోంది. ఉన్నచోట బతికే వీలు లేని స్థితి ఒకపక్క వారిని పరాయిసీమల పాలు చేస్తూంటే.. ఇలాంటి అస్థిమిత రాజకీయ పరిణామాలు వారిని మరింతగా ఆందోళనకి గురిచేస్తున్నాయి.

    గత శతాబ్దాలలో వలసలు విపరీతంగా జరిగాయి. ఏవి స్వస్థలాలో.. ఏవి వలస వచ్చిన ప్రాంతాలో ఆయా ప్రజలు వారి తరవాతి తరాలు దాదాపుగా మరిచిపోయి మనుగడ సాగిస్తూ.. జీవనపోరాటాలు సలుపుతూ బతుకులీడుస్తూన్న కోట్లాది ప్రజ గురించి ఈ ఉద్యమాలేవీ మాట్లాడవు. కేవలం డబ్బులున్న కొద్దిమందిని తమ లక్ష్యంగా చేసుకుని “పోరాటం” పేరుతో సమాజ జీవనాన్ని నిరంతరంగా కల్లోలం చేయడం ఇప్పుడు జరుగుతున్న అంశం!!

    గురజాడ అప్పారావు గారు తన “దేశభక్తి” గీతంలో పరమ నిర్మొహమాటంగా ఒక హెచ్చరిక చేశారు భావితరాల వారిని కూడా ఆయన ఉద్దేశించేరా?! అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాతప్రతిలో ఉన్న ఈ చరణాన్ని మరి ఏ కారణం వల్లనో అచ్చువేసేటప్పుడు తొలగించారు. ఆ చరణంలో ఆయన ఇలా అంటున్నారు. “ఇంగ్లీషు వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళేనని అంటున్నావు. ముసల్మానులు మొన్న వచ్చిన వాళ్ళని అంటున్నావు. కానీ నువ్వుకూడా అటుమొన్న వచ్చిన వాడివే సుమా! ఈ విషయాన్ని విస్మరించి మనుష్యులని వేరుచేసి చూడకు” అని ఆయన వ్యాఖ్యానించేరు. బయటి దేశాలనించి వచ్చిన వారి విషయంలోనే ఈ సమ్యమనాన్ని పాటించాలని బోధించిన గురజాడ.. సహదేశస్థులు, సహ జాతివారు, సహ భాషాబంధువులు ఈ వైషమ్యాలతో రగిలిపోవడాన్ని చూసి ఏమనుకుని ఉందురో!?
    రమ.

  3. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి medavaram kanthi mumar అభిప్రాయం:

    04/23/2010 6:54 am

    nice story. simple and easy understandable sentenses. but selected concept is very simple, eventhough, the texture is gentle.

  4. తెలగాణెము గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    04/23/2010 2:16 am

    పద్యాలు అన్నీ చక్కగా వినసొంపుగా ఉన్నాయి. అన్నిటినీ, ఆపైన అభిప్రాయాలనీ ప్రచురించిన ఈమాటకి ధన్యవాదాలు.

    దేశికాచార్యులు గారి పద్యాలు చదివితే తెలంగాణ నాయకులలో నీచమైన స్వార్ధ పరత్వమున్నదని తెలుస్తుంది కానీ తెలంగాణ వాదంలో ఆకలి గొడవ ఒకటున్నదని కానీ, గత నాలుగు నెలలుగా చెవులు దిబ్బళ్ళు పడేలా సమైక్యవాద హోరు వినిపించిన నాయకులను నడిపించినది కూడా నీచమైన స్వార్ధమేననీ అనుమానం ఎవరికీ కలుగదు. (బలంగా ఉంటుందని కాబోలు, సమైక్య వాద నాయకులందరూ తాము సమై’ఖ్య’ వాదులమని చెప్పుకుంటారు. తప్పుడు ప్రయోగం ఎక్కడున్నా దాని వెనకాల తప్పుడు చేతలు ఉంటాయని బాలగోపాల్ చాలా కాలం క్రితం చెప్పి ఉన్నాడు.)

    శ్రీనివాస్ గారి పద్యాలు చదివితే తెలంగాణ ఆకలి చావులున్నాయని తెలుస్తుంది కానీ, తెలంగాణలో ఎక్కడా కనిపించనంత ఆకలీ హింసా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో చాలా చోట్ల ఉన్నాయని ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

    యదుకుల భూషణ్ గారు చెప్పినది చూస్తే , రవి కాననిచో కవి గాంచునన్న మాట ఉత్తిదే నేమో ననిపిస్తుంది. నిఖార్సైన నిజా నిజాలు తెలుసుకోవడానికి గణాంకాలొక్కటేనా మార్గం ? కవి పూనుకుని ఏ ఒక్క రోజు కూలీ జీవిత కథనం వివరంగా అడిగి విన్నా ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించలేడా ?

    రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలలోనూ పేద ప్రజలను ఎవరిని కదిలించినా నీటి కోసం ఉద్యోగాల కోసం కటకట పడుతున్న చరిత్రలూ, పోలీసులూ అధికార యంత్రాంగమూ, వ్యాపారులూ , వైద్యులూ పెడుతున్న హింసలూ చెప్తారు. చాలా సందర్భాలలో హింసని అనుభవించడం మామూలు అయిపోయి, దాన్ని హింసగా గుర్తించే వివేకం కూడా కోల్పోయి ఉన్నారు. (లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరు జిల్లాలో అంత మంది స్త్రీల శరీరాల్లోనించి గర్భ సంచీలు తీసివేశారన్న వార్త బయట పడటానికే ఇన్నేళ్ళు పట్టడం ఎట్లా సాధ్యం ?)

    ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయి అని తెలంగాణలో చాలా మంది పేద ప్రజలు అనుకుంటున్నారు. (లక్షలాది మంది హాజరయ్యే ఉజ్జీవ సభలను చూస్తే – యేసు ప్రభువుని నమ్ముకుంటే తమ వెతలు తీరుతాయని ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది పేద వాళ్ళు అనుకుంటున్నారని పిస్తుంది కానీ అది వేరే విషయం). అదే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో మరి కొంత మంది పేద ప్రజలు ధనవంతులైన ఆంధ్ర ప్రాంతపు ప్రజలు తరలి పోతే ఈ మాత్రం కూడా జరుగుబాటు ఉండదేమో నని అనుకుంటున్నారు.

    రాష్ట్రం ఏర్పడితే తమకి దగ్గర్లో ఉండే నగరాలు అభివృద్ధి చెందుతాయి కదా అని ఆంధ్ర లోనూ సీమలోనూ కొంత మంది పేదలు అనుకుంటే, హైదరాబాదుకి దారులు మూసుకు పోతాయెమో, అదే జరిగితే ఈ పాటి అవకాశాలు కూడా పోతాయెమో నని అక్కడే మరి కొంత మంది పేదలు ఆందోళనతో గుండె పగిలి చస్తున్నారు.

    ప్రజాభిప్రాయం తమకి ఎట్లాగూ తెలిసే అవకాశం లేదనీ, అందుచేత తమ స్వంత అభిప్రాయాలకి కట్టుబడి ఉండి ధైర్యంగా వాటిని ప్రకటించ గలిగితే చాలు అని ఎవరైనా అనుకుంటే అది వారి శక్తికీ, అభిరుచికీ సంబంధించి విషయమే అవుతుంది కానీ దాన్ని మొత్తం గా కవిత్వానికే పరిమితి గా చెప్పుకోవలసిన అవసరం లేదేమో ? !!

  5. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి lyla yerneni అభిప్రాయం:

    04/23/2010 1:26 am

    ఈ వ్యాస రచయిత వేలూరి వేంకటేశ్వర రావేనా 🙂 చాలా బాగా రాశారండీ. వ్యాసం ఇంతకు ముందు చదవలేదని కాదు. మళ్ళీ చదివితే ఇదివరకటికన్నా ఇంకొంచెం బాగా అర్థమయ్యింది. మెచ్చుకోకుండా ఉండలేక రాస్తున్నాను.

    లైలా

  6. తెలగాణెము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/23/2010 12:49 am

    [This extends the thought, but goes beyond the poem and if shown must be due to extra-ordinary accommodation by E-maata friends on this burning issue. Want to say this when many well meaning heads and hearts are on this topic.]

    The harsh and hard feelings spewed among ones speaking same language and living in same country is sad. It is even sad we could not build effective institutions and evolve practices that work in timely fashion to remedy policy errors, resolve differences, address pain points, sympathize suffering, support problem-solving, without making any of that as a political issue. We ignore issues silently, but bemoan loudly when politicians exploit them. Even now more talk is about united or bifurcation and less about problem solving. (Central) Government often tries to solve all such problems, but strangely, such a govt in turn is the biggest problem of all! If only this was not real, it would make a good comedy.
    ==========
    Regards
    -Srinivas

  7. తెలగాణెము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/22/2010 10:54 am

    రమగారూ,
    కవుల పట్ల నా “భయం” గురించి మీకు ఎటువంటి భయం అవసరం లేదు. ఇదివరకు చెప్పినట్లే అది కూడా కవిసమయం లోనిదే. అభిప్రాయాన్ని అందించడమే కదా మనం చేసేదిక్కడ. అయినా తెలంగాణపట్ల అన్యాయాలను మన ప్రజాస్వామ్యంలోని అవ్యవస్థను ఎత్తిచూపడానికి ఎటువంటి వకాల్తా పుచ్చుకోవడం కాని, అసలక్కడ పుట్టడం సైతం అనవసరం, అప్రస్తుతం.
    ====
    విధేయుడు
    _Srinivas

  8. తెలగాణెము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/22/2010 10:38 am

    దేశికాచారిగారు
    నేను రాసిన భయం కూడా కవిసమయంలోనిదే. మంచి పద్యాలు చదువుతూ “ఈ మాట”లో ఎవరికైనా ఎప్పుడైనా ఎందుకైనా ఏం భయముంటుంది!

    వట్టి మభ్యపెట్టే ప్రసంగాలే ప్రస్తుత సమస్యకు కారణమైతే, వాటికి విరుగుడు మరో ప్రసంగాలతో పోయేది. కాని మీరన్న “పార్టీరథచోదకుల”స్వార్థం ముమ్మాటికీ సత్యం. ఎన్నికల ముందు అన్ని ప్రధాన పార్టీలకు గుర్తుకు
    రాని “సమైక్యం”, ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చి ఓట్లు పడ్డాకనే, మాట మార్చి బాట మార్చడం మన ప్రజాస్వామ్యంలో చూస్తున్నదే. “సమైక్యం” నినాదం చాటున దాగిన, దాచిన “పార్టీరథచోదకుల”స్వార్థం కూడా చూస్తున్న పర్వమే. సత్కవుల మాటలకన్నా మంచి (నాయకుల) చేతలే ఎక్కువగా ఊరటను ఇస్తాయేమో అనిపిస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానీకానికి.
    ========
    విధేయుడు
    -Srinivas

  9. తెలగాణెము గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/22/2010 10:28 am

    నాగులపల్లి శ్రీనివాస్ గారూ!! మీ అభిప్రాయాలని ఆసక్తిగా చదువుతాను నేను. సాధారణంగా సమతూకంగా రాసే మీరు ఈసారి మరి ఎందుకనీ అనవసరమైన ఆవేశాన్ని ప్రదర్శించారూ?? ఆశ్చర్యంగా అన్పించింది. భూషణ్ అన్నది నిజమే కదా? సాహితీరంగం ఎప్పుడూ తామనుకున్నది చెప్పగలిగే స్వతంత్రతని నిలబెట్టుకోవాలి. కృష్ణ దేశికాచార్యుల వారి అభిప్రాయాన్ని మీరు సమస్త తెలంగాణం తరుపునా వకాల్తా పుచ్చుకుని ఖండనమండనాలు చెయ్యనఖ్ఖరలేదేమో??

    రాజకీయనాయకులు చెప్పే మాటల్నే ఇతరులందరూ మాట్లాడాలని ఎవరూ ఆశించకూడదు. తెలగాణెము రానివ్వండి.. సమైక్యమే ఉండనివ్వండి. అది “కవుల” వలన వచ్చేదీ కాదు.. కవులు పద్యాలు రాసినంత మాత్రానికి ఆగేదీ కాదు.

    ఇకపోతే మీరు “కవులు” అని “భయపడినప్పుడు” అందర్నీ ఒకే గాట కట్టేసారే?? తెలుగువారి భావదారిద్ర్యం వలన మాత్రమే తెలుగులోని గొప్ప కవులెవ్వరూ ఇవాళ్టి దాకా ప్రపంచ ఖ్యాతిని పొందలేకపోయారు. తిక్కననీ.. అన్నమయ్యనీ వేమన్ననీ గురజాడనీ శ్రీశ్రీనీ కృష్ణశాస్త్రినీ కూడా మీ కోపంలో కరిగించేశారా?? అందరూ ఒకటే మాట్లాడాలని అనడం మావోయిస్టుల మార్గం! వారి మాటల్ని మాట్లాడని వాళ్ళంతా వాళ్ళకి “వర్గ శతృవులే” అయినట్టూ.

    మీరు కవులమీది అసహనాన్ని అక్షరంమీది అసహనాన్ని తెలంగాణా – ఆంధ్రాల మీది అసహనాల్ని కట్టకలిపేయకండి. దేశికాచార్యులవారి భావనలు బాగున్నాయని చెప్పడానికి మరీ ముఖ్యంగా ఇవాళ్టి వాతావరణంలో సూటిదనం కావాల్సిఉంది. నిర్భీకత కూడా కావాల్సి ఉంది.

    రమ.

  10. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి geyamala అభిప్రాయం:

    04/22/2010 5:19 am

    one of the greatest symbolist poets of this century, Gunturu Seshendra sarma discussed this issue in detail in his “kavisena manifesto”. How a poem is made important. A good poem communicates the emotional feelings to the reader even if he could not understand each word. Biragi also extensively used Sanskrit words in his poems. Even Marx and Mao also wrote poems but in classical meter. It is wrong to think that every thing should be understood.

    Seshendra says, ” can all people understand Einstein’s theory of relativity?” Writing for people and writing in their dialect are different issues. That was why many people could not accept, SRI SRI’s ” Ninnati jatkawala” as poetry, though one can understand the meaning of all the words used in that poem.