పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. అ, న్యాయం గురించి b.ajayprasad అభిప్రాయం:

    07/02/2010 12:27 am

    ఈ కథ బాగుంది.

  2. కృష్ణదేవరాయలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/01/2010 1:13 pm

    ఈ “కృష్ణ దేవరాయలు” పుస్తకం తెరుచుకోబడుటలేదు చదువుటకు. కారణమేమో??

    రమ.

    [తప్పు సరిచేశాము. ఇప్పుడు ప్రయత్నించండి. తెలిపినందుకు కృతజ్ఞతలు – సం.]

  3. రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/01/2010 11:05 am

    నోట్ : ఇది మాధవ్ స్వంత వ్యాసం కాక పోయినా ఫిలిప్ వాగనర్ దే అయినా పైన నేను చెప్పిన విషయాలలో ఏమన్నా మార్చుకుని నా అభిప్రాయంలోని ఏ ఒక్క వాక్యాన్నీ తిరిగి రాయవలసిన పని ఉన్నట్టు నాకు అన్పించలేదు. ఆనాటి దేశీయ సాహిత్యాన్నీ ఇతర ఆకరాలనీ పరిశీలించకుండా కేవలం విదేశీయ చరిత్రకారుల..యాత్రీకుల రాతలనించే ఈ “ఇండాలజిస్ట్ లు” అభిప్రాయాలని ప్రకటించడం విడ్డూరం! మాధవ్ అనువాదం కూడా నీరసంగా ఉంది.
    దీనిని నేను ఇందాకా చెప్పిన నా పై అభిప్రాయానికి కింద జత పరచ గలరు.
    రమ.

  4. రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/01/2010 10:56 am

    ఈ వ్యాసంలో అనవసర పదాడంబరం అతిగా ఉండి వ్యాసం చదువుతున్నప్పుడు మాటిమాటికీ ఆలోచనకి ఆటకంగా అన్పించింది. మాధవ్ ఎక్కడా ఎందుకో మరి దేశీయ శాసనాలనించి గానీ.. నేలటూరి వెంకట రమణయ్య గారిలాంటి విజయనగర సామ్రాజ్యంపై చెప్పుకోతగ్గ పరిశీలన చేసిన వారి నించి గానీ ఏ సమాచారాన్నీ స్వీకరించనేలేదే?! అలాగే .. ఎప్పుడైనా గానీ సాహిత్యం తన కాలానికి చెందిన అలంకార వస్తు వస్త్ర వర్ణనలని వివరించడంలో చాలా ముఖ్యమైనది. మాధవ్ వ్యాసం ఆ నాటి సాహిత్యంలోంచి వివరాలని ఏమంతగా పొందుపరచలేకపోవడం వలనా.. విజయనగర కాలం నాటి వివరాలకోసం కేవలం విదేశీ రాతలనే నమ్ముకున్నట్టూ సాగడం వలనా .. ” రాతి నించి నార తీసిన” చందంగా తన ఊహల్ని అల్లుకుపోయినట్టూ అన్పించిందే గానీ ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని అంత బలంగా ప్రతిపాదించి స్థాపించలేకపోయింది. వ్యాసం చదవడం పూర్తి చేసిన తర్వాత ..వ్యాసకర్తకి “కొత్తగా” ఏదైనా చెప్పాలన్న తపన ఉన్నట్టు గా మాత్రం అర్ధమైంది.

    రమ.

  5. నువ్వు గురించి ప్రదీప్ అభిప్రాయం:

    07/01/2010 8:03 am

    కవిత చాలా బాగా రాసారండి 🙂 నాకు చాలా నచ్చేసింది. Super అంతే.

  6. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి bhanu అభిప్రాయం:

    07/01/2010 7:17 am

    very nice story.Depicts the understanding of the child.

  7. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి bhanu అభిప్రాయం:

    07/01/2010 7:01 am

    చాలా బావుంది వ్యాసము.

  8. ఈమాట మే 2010 వసంత ఋతు సంచికకు స్వాగతం గురించి Lakshmi Prasad Geddapu అభిప్రాయం:

    07/01/2010 5:23 am

    వెబ్ పుటల్లో లంకెల శీర్షికల రంగు లేతగా ఉంది. కొంచెం ముదురు రంగులో ఉండేటట్లు మార్చితే బాగుంటుదేమో!

    గురు జన విధేయుడు,
    లక్ష్మీ ప్రసాద్ గెడ్డాపు

  9. కవితావిర్భావం గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    06/30/2010 2:47 pm

    “కవితావిర్భావం ” పై తమ అభిప్రాయం తెలిపిన సాహితీ మిత్రులందరికీ
    కృతజ్ఞతలు.

  10. ప్రేమ కవితలు గురించి Giri అభిప్రాయం:

    06/30/2010 7:02 am

    చాల బాగున్నది