ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక సరుగుడు చెట్టు వుండేది. మంచి వర్షంతో పాటూ తగినంత సూర్యరశ్మి కూడా ఉండడంతో అది ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ వుండేది. దాని నీడలో పిల్లలు ఆనందంగా ఆడుతూ పాడుతూ వుండేవారు. దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న పక్షులు కిలకిలారావాలు ఆలపించేవి. కొమ్మ నుంచి కొమ్మకు దూకుతూ సరస సల్లాపాలాడే ఉడతల్ని చూస్తే, ఎవరికైనా ఉత్సాహం ఉరకలేస్తుండేది.
అమ్మని అమ్మాళ్
జీవిత విశేషాలు
అమ్మని అమ్మాళ్ గురించి ఏ విధమైన సమాచారమూ దొరకలేదు. తొలి తమిళ మహిళా కథకురాలని మాత్రం చెప్పవచ్చు. యిది తొలి తమిళ కథ అని కూడా దిలీప్ కుమార్, సుచిత్రా వంటి తమిళ రచయితలు కొందరు అంటున్నారు. ఈ కథ గురించి ప్రముఖ తమిళ-యింగ్లీషు అనువాదకురాలు శుభశ్రీ క్రిష్ణస్వామి యిలా అన్నారు. ‘It begins much like a parable, and I settled in for a comfortable read, a smile very much on display. But the intelligent and unexpected end shook me out of my complacency’.