నా. ముత్తుకుమార్
జీవిత విశేషాలు
నాగరాజన్ ముత్తుకుమార్ (1975 – 2016) భారతీయ కవి, గేయ రచయిత & రచయిత. ప్రధానంగా తమిళ భాషా చిత్రాలకు పాటలు రాశారు. స్వరకర్తలు యువన్ శంకర్ రాజా & జివి ప్రకాష్ కుమార్‌లతో తరచుగా కలిసి పనిచేసినందుకు ప్రసిద్ది చెందారు. తమిళంలో ఉత్తమ గీత రచయితగా అత్యధిక ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. తంగా మీన్కల్ (2013), శైవం (2014) సినిమాలకు ఉత్తమ గీత రచయితగా రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు & నాలుగు దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు.