ఇవన్నీ ఇంట్లో మరుగు దొడ్లు లేనివారికి, డబ్బులిచ్చి వెళ్ళలేని వారికే. ఇప్పుడు ధారావిలో ప్రభుత్వం వసూళ్ళ వేటకు, గుళ్ళకు ఏ మాత్రం తీసిపోని, రాజభవనం లాంటి డబ్బులు చెల్లించే మరుగు దొడ్లను తీసుకువచ్చింది. తెల్లారి నాలుగు గంటలకు తెరిచి, రాత్రి ఒంటి గంటకంతా మూసేస్తారు. తెరిచేటప్పుడు మనుష్యులు వచ్చి తెరవమని చెబుతారు. నాలుగు గంటల నుండి ఒక్కొక్కరిగా ఏడు, ఏడున్నరకల్లా గుమిగూడటం మొదలవుతుంది.
ఎస్. రాజేంద్రన్
జీవిత విశేషాలు
ఎస్. రాజేంద్రన్ తమిళ సంతతికి చెందిన ముంబయ్ వాసి. పనుల నిమిత్తం ముంబయ్‌కి వలస వచ్చిన తమిళుడు. తన పద్నాలుగేళ్ళ వయసులో పొట్టకూటికి వచ్చిన ఆయన ముంబయ్‌కి వచ్చి దాదాపు 40 ఏళ్ళ పైబడింది. ఇప్పటి వరకు రెండు పుస్తకాలు రచించారు. వలి సూళుమ్ పొళుదుగల్ అనే కథా సంకలనం, కన్నాడి అనే కవితా సంకలనం రచించారు. కథలు ధారావి జీవన విధానాలను ఆధారంగా చేసుకుని రాయబడినవి. ప్రింటింగ్ శాఖలో పనిచేస్తున్నారు.