పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. పాట ఒకటి… గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:

    08/09/2017 11:16 am

    చాలా రోజుల తరువాత మీ నుండి ఓ కవిత చదివాను. ఎప్పటిలానే ఎంత బావుందో. మీ అక్షరాలు తీసుకెళ్ళే మరో లోకం నాకు భలే నచ్చుతుంది.

  2. మా ఇంటికి దారి గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:

    08/09/2017 7:14 am

    మీ ఇంటి దారి తెలుసుకుని ఇంటిలొకి ప్రవేశించిన తరువాత బయటకు రావడం తెలియడం లేదు

  3. పాట ఒకటి… గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:

    08/09/2017 7:02 am

    మొదలూ చివరా కాని రెండు మూడు పదాల పరదా చాటు నుండి దొరికీ దొరక్కుండా దాగుడు మూతలాడుతూగుర్తుకొస్తున్న ఆ పాట ఒకటి ఏమిటొ వినాలని ఉంది.

  4. గోళం గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:

    08/09/2017 6:34 am

    తిరుగుతూపరిగెడుతూ, పరిగెడుతూ తిరుగుతూ, పరిశ్రమే శ్రమే మేమే మే..

  5. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి Ramamohan Perubotla అభిప్రాయం:

    08/09/2017 12:15 am

    ముందుగా శ్రీ రమణ గారికి కృతజ్నతలు.

    ఈమాట సంపాదవర్గానికి చిరు విన్నపం: మీరు మళ్లీ ఇల్లాలి ముచ్చట్లు ప్రచురిస్తే ఈ తరం వారు సర్వదా ఋణపడి వుంటారు.

    మరో సారి కృతజ్నలతో,
    రామమోహన్

  6. పాట ఒకటి… గురించి ns murty అభిప్రాయం:

    08/08/2017 10:52 am

    నిషిగారూ,
    జ్ఞాపకాల పొరల్లోంచి అప్పుడప్పుడు దారితప్పి మనసులో చొరబడే చిన్ననాటి పాట లీలగా వినిపించడం అందరికీ అనుభవమే. చాలా బాగుంది. అభినందనలు.

  7. నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం గురించి వి.ఎస్.ఎన్.ప్రసాద్ అభిప్రాయం:

    08/06/2017 3:50 am

    ధన్యవాదాలు.

  8. వలయం గురించి Madhu Chittarvu అభిప్రాయం:

    08/05/2017 9:54 pm

    థాంక్స్ శశికళ గారూ !

  9. చేరాతో ముఖాముఖి గురించి సౌమ్య అభిప్రాయం:

    08/05/2017 12:31 pm

    “‘తెలుగు వాక్యం’ ఇంగ్లిష్ చేసారు. త్వరలో రాబోతోంది.”
    – సతీష్ గారు, వచ్చిందా?

    ఇంటర్వ్యూ బాగుందండి. కొన్ని ప్రశ్నలు, కొన్నింటికి చేరా సమాధానాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చేరా సమాధానాల్లో నాకు నచ్చిన రెండు.

    ఆరోజుల్లో అమెరికా లో ఉంటూ ఇండియాలో జరిగేది ఎలా ఫాలో అయేవారని అడిగితే ఆయనిచ్చిన సమాధానం, మాతృభాష ప్రచారానికి భాషాశాస్త్రం ఏం చేయగలదన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం.

  10. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/04/2017 11:52 am

    ఆంధ్రజ్యోతి వారపత్రిక స్వర్ణయుగం కి సంబందించిన పెద్దలు నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లతో సన్నిహితంగా పనిచేసిన అనుభవంతో యీ అద్భుతమైన వ్యాసాన్ని రాసిన శ్రీరమణ గారికి కృతజ్నతలు.

    యీ శీర్షికన మరిన్ని అమూల్యమైన వ్యాసాలు ఇవ్వవలసినదిగా శ్రీరమణ గారికి విన్నతి.