Comment navigation


15549

« 1 ... 160 161 162 163 164 ... 1555 »

  1. ఊహల ఊట 9 గురించి Palagiri Viswaprasad గారి అభిప్రాయం:

    02/28/2022 8:49 am

    ఊహల ఊట ఊరుతూనే వుంది. ఎందులో పడి ఎందులో నుండి ఎందులోకొస్తోందో తెలియకుండానే ప్రవాహంలా సాగుతోంది. ఊత పదాలతో పాఠాలు చెప్పే అయ్యవార్లకు పేర్లు పెట్టని పిల్లలుండరు. ఇందులో ఆ చిన్నప్పటి ఆ జ్ఞాపకాలను తట్టి లేపారు.

  2. రెండు అక్షరసామ్య యతులు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    02/27/2022 3:02 pm

    ఈ వ్యాసంలోని అతి చిన్న ప్రపోజల్ గాని, ఇతర పెద్ద వ్యాకరణాలు రాసిన వారి సూత్రాలు గాని చూస్తే, అవన్నీ కవి చక్కని కవిత్వాన్ని చెప్పాలన్న కోరికతోనే అనిపిస్తున్నది. “కవ్యనుమతమున” -భాషలో మార్పులు జరుగుతాయి. సూత్రాలు బిగుతు చేసినా, సడలించినా గాని కవి కోసమే. అతడి పదకోశాగారం, మ్యూజికాలిటీ పెంచటానికే. మీకు నచ్చిన సూత్రాలు ఉంచుకోండి, నచ్చకపోతే తీసెయ్యండి, అని మధ్య మధ్య, వీరందరూ చెపుతున్నారు.
    ఇన్ని వీలుసాలులు చెపుతున్నప్పుడు, నాకు పద్యం రాయాలనే అనిపించింది. ఈ రచయితవే, ఈ పత్రిక లోని -శత కంద సౌరభము, కంద పద్య గాథ వ్యాసాల్లో, అక్కడే మరొకసారి రూల్స్ చదువుకుని వచ్చి రాస్తున్నాను. Isn’t that convenient!

    స్థితిమంతురాలికి, స్వర
    శ్రుతి శ్రావ్యత సొరగు షోకు శ్రితశార్వరికిన్
    అతిలాలస యగు సుదతికి
    యతితో పొసగదుగ కృష్ణ మోహన రాయా!

    చిలకల గుంపులు వచ్చి, బాల్కనీ పక్కనే ఉన్న చెట్టుమీద వాలినప్పుడు, పిట్టలు మాయమై, చెట్టు అకస్మాత్తుగా ఎర్రని బెర్రీలు కాసిన సుందర దృశ్యం నేను చూసినందున, చిలకల కేరులు విన్నందున ఆ పద్యం.

    Don’t miss those bird sounds in the poem. -Lyla

  3. విశాఖ గురించి భాస్కర్ కె గారి అభిప్రాయం:

    02/25/2022 9:06 pm

    అవును, శ్రీనివాస్ గారు కొన్ని అర్థం చేసుకోవడంలో ఆలస్యమవుతుంది. వెయిట్ చేస్తాను, ప్రయత్నిస్తాను అర్థం చేసుకోవడానికి. ధన్యవాదాలు సర్

    రామయ్య గారు, సుధగారు ధన్యవాదాలు.

    భూమి పొరలపైన పొరలు కప్పుకుంటూ వచ్చినట్లు, చరిత్ర ఎప్పుడూ వర్తమానంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. బహుశా నేను దాన్ని సరిగా ప్రజెంట్ చేయలేదేమో. థాంక్యూ రాఘవ.

    అవును సనత్ గారు, అయ్యి ఉండచ్చు. నేనూ విన్నాను. ధన్యవాదాలు.

    ధన్యవాదాలు రాజా గారు.

  4. తెలుగు కవిత్వంలో దళితవాదం గురించి ఇండ్ల ఉపేందర్ గారి అభిప్రాయం:

    02/25/2022 7:27 pm

    ధన్యవాదాలు అద్భుతం

  5. ఆమె ఇల్లు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    02/25/2022 9:31 am

    కె.కె. రామయ్య on February 15, 2022:
    “యీ ముగింపు… … నమ్ముతున్నాను.”

    You must be kidding. ముగింపు మారిస్తే, ఈ కథ అంత నచ్చకపోతే, మరో కథ ఐనా చదివే హోప్ ఉండేది. ఐనా, “ఆమె ఇల్లు” ముగింపు మారే పరిస్థితి అసలెలాగూ లేదు కదా. అది అనువాదపు కథ. ఇతరుల కథలు అనువదించుకునేవాడు స్వతంత్రుడు కాడు. అతడు ‘అసలు రచయిత’కు విధేయుడు. మూలరచయిత ఏం రాస్తే, అనువాదకుడు అదే రాయాలి.

    కథ తను రాసిందైతే, – కాంటెంపరరీ, ప్రొగ్రెసివ్ రైటర్ – ఛ! ఇలా రాసానేంటి, ఇంత వెనకబడిన ముగింపు, ఇది ఒక misogynistic కథ లాగా సౌండ్ అవుతూంది, పొరపాటు, మార్చేస్తున్నా, అని మార్చేసుకునేవాడు. కాని, అనువాదకుడు గదా, అందువల్ల మొదలూ, మధ్యా, ముగింపూ -ఏదీ మార్చలేడు.

    అనువాద కథల్లో -అనువాదకుడి కున్న “బాధకాల్లో” ఇది ఒకటై ఉండాలి. అంత సాధకం చేసి, ఈ బాధకం తెచ్చుకోటమెందుకు!

    -Lyla

  6. ఊహల ఊట 9 గురించి చాగంటి తులసి గారి అభిప్రాయం:

    02/25/2022 7:08 am

    పిబ్రవరి మాసపు ఊహల ఊటను నచ్చిన, మెచ్చిన ముకుంద రామారావు గారికి, కొ o కే పూడి అనూరాధ గారికి, మల్లాప్రగడ రామారావు గారికి, స్వాతి గారికి,ఝాన్సీ గారికి ధన్యవాదాలతో – చాగంటి తులసి

  7. విశాఖ గురించి జి కె యస్ రాజా గారి అభిప్రాయం:

    02/23/2022 10:41 pm

    వ్యాసం, కథ కలగలిపిన చారిత్రక కథనం. చాలా ఆసక్తికరంగా బావుంది. ‘వైద్యమే భయంకరమైన జబ్బు’ … చాలా ఆలోచించవలసిన, చర్చ జరగవలసిన అంశం. మతమూ, రాజకీయాల విష పరిష్వంగమే నేటి దయనీయ స్థితి. ఆత్మధైర్యాన్ని, గుంపుల జీవిత క్రమబధ్ధీకరణకూ ఊతమివ్వాల్సిన మతం, విశ్వాసం ఈరోజు మొత్తం సమాజానికీ వదిలించుకోలేని గుదిబండ అయి కూర్చుంది.

  8. ఉత్తర మొరాకో శోధనలు 3 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    02/23/2022 8:53 pm

    రామానాయుడుగారు, రాజాగారు, తులసిగారు… సంతోషం, ధన్యవాదాలు.
    అనువాదం మాత్రమే నాది. అనుభవాలు, మూల అక్షరాలు నిమ్మగడ్డ శేషగిరిగారివి.

  9. ఊహల ఊట 9 గురించి ఝాన్సీ గారి అభిప్రాయం:

    02/20/2022 11:38 am

    హబ్బా! మళ్ళీ మమ్మల్ని అందమైన బాల్యం లోకి తీసుకుపోయారు తులసిగారూ!

  10. వెతలే వెతుకులాట గురించి బుచికి గారి అభిప్రాయం:

    02/19/2022 2:49 pm

    ఇలాంటి రచనల వల్ల ఏమి ఉపయోగం? కవితల పేరుతో ఈమాటలో వస్తున్న రచనలు కొన్ని పేలవంగా మరికొన్ని అర్థరహితంగా ఉంటున్నాయి. సంపాదకులు ఎలా ప్రచురిస్తున్నారు. సంపాదకుల అభిరుచి పైనే సందేహం వస్తుంది. కొన్నిసార్లు పేరున్న రచయితలు వ్రాసినవి కూడా ఏమంత బాగాలేవు.

    పై రచనలో ఉన్న వాక్యాలకు సంబంధం ఏమి ఉందో రచయిత లేదా సంపాదకులు వివరించగలరు.

« 1 ... 160 161 162 163 164 ... 1555 »