భవభూతిగారికి నా వ్యాసం నచ్చినందుకు సంతోషం. కానీ అందులో శంకర్ జైకిషన్ మంచి సంగీత దర్శకులు కాదని అనలేదు. రాజ్ కపూర్ సినిమాలు కాకపోయినా పూనమ్, కఠ్ పుత్లీ, రాజ్ హఠ్ మొదలైన పాత సినిమాల్లో వారి పాటలు అద్భుతంగా ఉన్నాయి. ప్రజాదరణ పొందడానికి ప్రతిసారీ ఎక్కువ శ్రమపడనవసరం లేదని నిరూపించినది మాత్రం వారే. నౌషాద్ మాట కొస్తే అతని పాటలన్నీ హెవీగా ఉన్నాయనే అభిప్రాయం కలగడానికి కారణం క్లాసికల్ పాటలు ఎక్కువగా వినబడడమే కారణం కావచ్చు. దులారీ, దాస్తాన్ మొదలైన సినిమా పాటల్లో ఈ లక్షణాలు తక్కువే. ఏమైనప్పటికీ నౌషాద్ అందరికన్నా పాప్యులర్ సంగీత దర్శకుడని అనలేం. “నువ్వొక్కడంటేనే మాకు భయం” అని శంకర్ ఒక సందర్భంలో తనతో అన్నాడని నయ్యర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
సాధికారంగా వ్రాసిన రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం చాలా చాలా బాగుంది. నౌషాద్ గురించి వినని వాళ్ళకి ఒక గొప్ప పరిచయవ్యాసం. సంగీతం అంతగా తెలియని జనాన్నికూడా ఆ సాగరంలో ఓలలాడించడంలో ఆయన సిద్ధహస్తులని నిరూపించారు.
శంకర్_జైకిషన్ గురించి రో.ప్ర. గారి అభిప్రాయం మాత్రం నాకు కొద్దిగా బాధ కల్గించింది (శ_జై లు చవకబారు పాటలు చేసారన్న ధ్వని).
హృదయాల్ని ఊపే సంగీతానికి కావలసినది నిర్మాణక్లిష్టత, పాండితికాదు గదా!
సంగీతం రాని వాళ్ళకి నౌషాద్ సంగీతంలో వైవిధ్యత లేదనిపించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది నేను 1960 నుంచీ గమనించిన సాంఖ్యక సత్యం.
ఆడ పిల్లల తండ్రులను ఒక విలన్ గానో లేక ఒక జోకర్ గానో చిత్రీకరించే ఈ రోజుల్లో నాన్న హృదయాన్ని అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు అభినందనీయులు. బహుమతికి ఖఛ్ఛితంగా అర్హులు.
“అనుక్షణికం”ని సజీవ నవలగా ఏ రీతిలోనూ సమర్థించే సామర్ధ్యత నాకు లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు వేగుంట మోహన్ ప్రసాద్ 2004 లో రాసిన “”అనుక్షణికం-భాష, భాషణ” వ్యాసాన్ని “వెన్నెల నీడలు” సంపుటిలో చదవచ్చు.
అయినా, మనిషికి కావాల్సిన జ్ఞానమంతా తాజాగా దినపత్రికలలో సులభంగా దొరుకుతుంటే, “అనుక్షణికం” ఏం ఖర్మ, దాదాపు ప్రపంచ సాహిత్యమంతా బూజుపట్టిన పాత చింతకాయపచ్చడి కాదూ?
చర్చలో ఇప్పటికే పరిమితిని దాటి పాల్గొన్నాను; “ఈమాట” మరో “రచ్చబండ” కావాలనే కోరిక నాకే కోశానా లేదు. సెలవ్.
ఇప్పుడు నేనేదో రాయటం, మళ్ళీ మీర్రాయటం – వీటన్నిటికీ రచ్చబండ ఉంది. కనుక ప్రస్తుత వ్యాసానికే పరిమతవటం సర్వత్రా శ్రేయస్కరం అనుకుంటాను.
అయినా నేను వత్తులు దీర్ఘాల గురించి రాసింది మీ వ్యాసం గురించి కాదు. మారుతున్న విలువల గురించి ఎక్కువగా, కాస్త కొద్దిలో చదువుకోని వారు, చదువుకున్న వారికి ఉన్న తేడా గురించి. మారుతున్న చదువుకున్న వారి భాష గురించి మొత్తంగా.
ఆ రూజ్వెల్ట్ కొటేషను ఇప్పటికే పాతచింతకాయ వాసనొస్తోందని చదివిన ప్రతిసారీ అనుకోవటం మామూలైంది. భవభూతి, వ్యాసుడు, కాళిదాసు లాంటి వాళ్ళు కాక తెలుగు వాళ్ళే కావాలంటే మీకు నచ్చిన తుమ్మపూడి పెద్దలు ఎవరో రాసిన కొటేషను దొరికితే వదలండి, ఇట్లాంటి స్మరించే వ్యాసాల చివర. ఆ చివర కొటేషను లేకపోయినా పెద్ద నష్టం కనిపించలేదు నాకు.
అన్నట్టు, ఈ నవల ఇప్పుడు రాయవలసొస్తే ఆ మనిషి ఈ వాక్యాలు రాసేవాడు కాదు.:
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. – ”
అందుకే ఈ నవల జీవన కాలం ముగిసిందేమో అనిపిస్తోందిప్పుడు :).
I hope your next article will be about ‘why అనుక్షణికం is a living text’ & the challenge is to tell us without quoting a single line from that text 🙂 or from Teddy Roosevelt, for that matter..
నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను. ఆభాషలో ఒత్తులు, దీర్ఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం – అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో – నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ, అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.
ఆ నియమాలు అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండవని నాకు తెలుసు. ఆ తేడాలని గౌరవించేపాటి సంస్కారం ఉంది. “మెజారిటీ” సంగతేమోగాని, మన ఆధునిక సాహిత్యంలో వేరు వేరు ప్రాంతాల రచయితలు వారి వారి భాషలో రాశారు; వాటిని ఇతర ప్రాంతాల ప్రజలు గూడా బాగానే ఆదరించారు. ఒకే రచనలో అనేక పాత్రలతో ఆయా ప్రాంతాల, వర్గాల భాషలో సంభాషణలు నడిపించిన నవలొకటి గత శతాబ్దానికే తలమానికంగా నిలిచింది:
“Overwhelmed by sorrow – అంటే యేమిటి?” అని అడిగింది గంగి, పుస్తకంలో వొక పేజీలో గుర్తుపెట్టుకున్న చోట తీసి చూస్తూ.
“సారో అంటే తెలుసుగా విచారం, దుఃఖం. వోవర్ వ్వెల్మింగ్ అంటే – ” అని రెప్పలు మూతపడని కళ్ళతో, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – గంగి” అన్నాడు అనాలోచితంగా.
పగలబడి నవ్వింది, గంగి.
రవి అలాగే చూస్తున్నాడు.
నవ్వు ఆపుకుని, “యాడున్నవ్ సారూ? పాఠం చెప్తున్నవా, కార్కాన్ల వున్నవా?” అంది.
…
తేరుకుని, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – యేదైనా వొక భావంగానీ అనుభూతిగానీ ఫీలింగ్ గానీ – సంతోషమో విచారమో అసూయో ద్వేషమో ప్రేమో యివి యేవీ కాని మరేదో అనిర్వచనీయ భావమో – అట్లాంటిది యేదో వుక్కిరిబిక్కిరిగా పుక్కిలింతలుగా నిర్వీర్యంకాని అశక్తతగా చేసినట్లుగా – ” అని ఆ తరవాత యేం చెప్పాలో రాక ఆగిపోయాడు.
“నువ్వు చెప్పేది అర్థంకాకపోయినా నువు చెప్తుంటే వింటం బావుంటుంది” అంది.
రవి ఫక్కున నవ్వాడు.
“దేన్కి?” అంది కోపంగా.
“నీ మాటకి. నీ అనుకరణకి నవ్వొచ్చింది” అన్నాడు.
“నీలాగా మాట్లాడదాఁవని.” అంది.
నవ్వు ఆపుకుంటూ “దేనికి?” అన్నాడు.
“మా మాట బగ్గడ్ గుంటదిలే! మీ ఆంద్రోళ్ళు మంచిగ మాట్లాడతరు” అంది.
“నేను ఆంధ్రావాణ్ని కాదు. తెలంగాణావాణ్నే” అన్నాడు.
“యేదొకటి. నీ మాట అట్లానే వుంటది. నాకు మంచిగ అనిపిస్తది – ఆతీరు మాట్లాడేది. నా మాట మంచిగుండదులే” అంది.
“బావుంటం అనేది మాటలోకంటే, ఆ మాట్లాడే మనసులో మనిషిలో భావంలో వుంటుంది! పుట్టిపెరిగిన ప్రాంతపు వాతావరణాన్ని బట్టి మాట తీరు వుంటుంది. వొక్కొక ప్రాంతంలో వొక్కొక రకంగా మాట్లాడతారు. మనసులు మంచివైతే ఆ మాట్లాడే తేడాలు అంత ముఖ్యంకాదు.” అన్నాడు.
“కాని నా కెందుకో అట్ల మాట్లాడితె మంచిగా అనపిస్తుంది. అటు ఆంధ్రుల అట్లనె మాట్లాడతరు గద?” అంది.

— “అనుక్షణికం,” పేజీలు 267-268.
నౌషాద్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/16/2006 6:04 pm

నౌషాద్ గురించి BhavabhUti K గారి అభిప్రాయం:
07/16/2006 3:06 pm
సాధికారంగా వ్రాసిన రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం చాలా చాలా బాగుంది. నౌషాద్ గురించి వినని వాళ్ళకి ఒక గొప్ప పరిచయవ్యాసం. సంగీతం అంతగా తెలియని జనాన్నికూడా ఆ సాగరంలో ఓలలాడించడంలో ఆయన సిద్ధహస్తులని నిరూపించారు.
శంకర్_జైకిషన్ గురించి రో.ప్ర. గారి అభిప్రాయం మాత్రం నాకు కొద్దిగా బాధ కల్గించింది (శ_జై లు చవకబారు పాటలు చేసారన్న ధ్వని).
హృదయాల్ని ఊపే సంగీతానికి కావలసినది నిర్మాణక్లిష్టత, పాండితికాదు గదా!
సంగీతం రాని వాళ్ళకి నౌషాద్ సంగీతంలో వైవిధ్యత లేదనిపించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది నేను 1960 నుంచీ గమనించిన సాంఖ్యక సత్యం.
ఇంత మంచి వ్యాసమిచ్చినందుకు బహుధా కృతఙ్ఞతలు.
సందుక గురించి Iswari Murthy గారి అభిప్రాయం:
07/14/2006 9:18 pm
సందూక చాలా బాగుంది
గుందె అరలో బూజు పట్టిన పాత గ్నాపకాల వసంతాలూ చిగురించి కోయిల గీతాలు పాడాయి.
Thank you.
పిచ్చి నాన్న గురించి Raghuram గారి అభిప్రాయం:
07/10/2006 10:21 pm
ఆడ పిల్లల తండ్రులను ఒక విలన్ గానో లేక ఒక జోకర్ గానో చిత్రీకరించే ఈ రోజుల్లో నాన్న హృదయాన్ని అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు అభినందనీయులు. బహుమతికి ఖఛ్ఛితంగా అర్హులు.
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/09/2006 5:52 pm
“అనుక్షణికం”ని సజీవ నవలగా ఏ రీతిలోనూ సమర్థించే సామర్ధ్యత నాకు లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు వేగుంట మోహన్ ప్రసాద్ 2004 లో రాసిన “”అనుక్షణికం-భాష, భాషణ” వ్యాసాన్ని “వెన్నెల నీడలు” సంపుటిలో చదవచ్చు.
అయినా, మనిషికి కావాల్సిన జ్ఞానమంతా తాజాగా దినపత్రికలలో సులభంగా దొరుకుతుంటే, “అనుక్షణికం” ఏం ఖర్మ, దాదాపు ప్రపంచ సాహిత్యమంతా బూజుపట్టిన పాత చింతకాయపచ్చడి కాదూ?
చర్చలో ఇప్పటికే పరిమితిని దాటి పాల్గొన్నాను; “ఈమాట” మరో “రచ్చబండ” కావాలనే కోరిక నాకే కోశానా లేదు. సెలవ్.
కొడవళ్ళ హనుమంతరావు
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
07/09/2006 2:02 pm
ఇప్పుడు నేనేదో రాయటం, మళ్ళీ మీర్రాయటం – వీటన్నిటికీ రచ్చబండ ఉంది. కనుక ప్రస్తుత వ్యాసానికే పరిమతవటం సర్వత్రా శ్రేయస్కరం అనుకుంటాను.
అయినా నేను వత్తులు దీర్ఘాల గురించి రాసింది మీ వ్యాసం గురించి కాదు. మారుతున్న విలువల గురించి ఎక్కువగా, కాస్త కొద్దిలో చదువుకోని వారు, చదువుకున్న వారికి ఉన్న తేడా గురించి. మారుతున్న చదువుకున్న వారి భాష గురించి మొత్తంగా.
ఆ రూజ్వెల్ట్ కొటేషను ఇప్పటికే పాతచింతకాయ వాసనొస్తోందని చదివిన ప్రతిసారీ అనుకోవటం మామూలైంది. భవభూతి, వ్యాసుడు, కాళిదాసు లాంటి వాళ్ళు కాక తెలుగు వాళ్ళే కావాలంటే మీకు నచ్చిన తుమ్మపూడి పెద్దలు ఎవరో రాసిన కొటేషను దొరికితే వదలండి, ఇట్లాంటి స్మరించే వ్యాసాల చివర. ఆ చివర కొటేషను లేకపోయినా పెద్ద నష్టం కనిపించలేదు నాకు.
అన్నట్టు, ఈ నవల ఇప్పుడు రాయవలసొస్తే ఆ మనిషి ఈ వాక్యాలు రాసేవాడు కాదు.:
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. – ”
అందుకే ఈ నవల జీవన కాలం ముగిసిందేమో అనిపిస్తోందిప్పుడు :).
I hope your next article will be about ‘why అనుక్షణికం is a living text’ & the challenge is to tell us without quoting a single line from that text 🙂 or from Teddy Roosevelt, for that matter..
I think I will step out now.
విప్లవ్
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/09/2006 10:27 am
నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను. ఆభాషలో ఒత్తులు, దీర్ఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం – అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో – నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ, అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.
ఆ నియమాలు అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండవని నాకు తెలుసు. ఆ తేడాలని గౌరవించేపాటి సంస్కారం ఉంది. “మెజారిటీ” సంగతేమోగాని, మన ఆధునిక సాహిత్యంలో వేరు వేరు ప్రాంతాల రచయితలు వారి వారి భాషలో రాశారు; వాటిని ఇతర ప్రాంతాల ప్రజలు గూడా బాగానే ఆదరించారు. ఒకే రచనలో అనేక పాత్రలతో ఆయా ప్రాంతాల, వర్గాల భాషలో సంభాషణలు నడిపించిన నవలొకటి గత శతాబ్దానికే తలమానికంగా నిలిచింది:
“Overwhelmed by sorrow – అంటే యేమిటి?” అని అడిగింది గంగి, పుస్తకంలో వొక పేజీలో గుర్తుపెట్టుకున్న చోట తీసి చూస్తూ.
“సారో అంటే తెలుసుగా విచారం, దుఃఖం. వోవర్ వ్వెల్మింగ్ అంటే – ” అని రెప్పలు మూతపడని కళ్ళతో, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – గంగి” అన్నాడు అనాలోచితంగా.
పగలబడి నవ్వింది, గంగి.
రవి అలాగే చూస్తున్నాడు.
నవ్వు ఆపుకుని, “యాడున్నవ్ సారూ? పాఠం చెప్తున్నవా, కార్కాన్ల వున్నవా?” అంది.
…
తేరుకుని, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – యేదైనా వొక భావంగానీ అనుభూతిగానీ ఫీలింగ్ గానీ – సంతోషమో విచారమో అసూయో ద్వేషమో ప్రేమో యివి యేవీ కాని మరేదో అనిర్వచనీయ భావమో – అట్లాంటిది యేదో వుక్కిరిబిక్కిరిగా పుక్కిలింతలుగా నిర్వీర్యంకాని అశక్తతగా చేసినట్లుగా – ” అని ఆ తరవాత యేం చెప్పాలో రాక ఆగిపోయాడు.
“నువ్వు చెప్పేది అర్థంకాకపోయినా నువు చెప్తుంటే వింటం బావుంటుంది” అంది.
రవి ఫక్కున నవ్వాడు.
“దేన్కి?” అంది కోపంగా.
“నీ మాటకి. నీ అనుకరణకి నవ్వొచ్చింది” అన్నాడు.
“నీలాగా మాట్లాడదాఁవని.” అంది.
నవ్వు ఆపుకుంటూ “దేనికి?” అన్నాడు.
“మా మాట బగ్గడ్ గుంటదిలే! మీ ఆంద్రోళ్ళు మంచిగ మాట్లాడతరు” అంది.
“నేను ఆంధ్రావాణ్ని కాదు. తెలంగాణావాణ్నే” అన్నాడు.
“యేదొకటి. నీ మాట అట్లానే వుంటది. నాకు మంచిగ అనిపిస్తది – ఆతీరు మాట్లాడేది. నా మాట మంచిగుండదులే” అంది.
“బావుంటం అనేది మాటలోకంటే, ఆ మాట్లాడే మనసులో మనిషిలో భావంలో వుంటుంది! పుట్టిపెరిగిన ప్రాంతపు వాతావరణాన్ని బట్టి మాట తీరు వుంటుంది. వొక్కొక ప్రాంతంలో వొక్కొక రకంగా మాట్లాడతారు. మనసులు మంచివైతే ఆ మాట్లాడే తేడాలు అంత ముఖ్యంకాదు.” అన్నాడు.
“కాని నా కెందుకో అట్ల మాట్లాడితె మంచిగా అనపిస్తుంది. అటు ఆంధ్రుల అట్లనె మాట్లాడతరు గద?” అంది.
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. – ”
…
— “అనుక్షణికం,” పేజీలు 267-268.
కొడవళ్ళ హనుమంతరావు
రాచపుండు గురించి krao గారి అభిప్రాయం:
07/09/2006 7:02 am
చాలా బాగుంది. కధ అంతా చదవడానికి హాయిగా వుంది. కాని రెండవ పేరాకి మిగతా కధకి ఎమీ సంభందం లేదు.
సందుక గురించి Geeta.K గారి అభిప్రాయం:
07/09/2006 6:44 am
నారాయణ స్వామి గారూ,
మీ కవితలు సందూక, అర్ర మరిచిపోయిన బాల్యాన్ని, యౌవనాన్ని గుర్తుకు తెస్తాయి ఎవరికేనా. గడిచిన చూరు కింద రాలిపడిన సమయాల వాన చుక్కల జాడలు. రియల్లీ చాలా మంచి కవితలు. కీపిటప్.
…కె.గీత
పిచ్చి నాన్న గురించి siva kumar గారి అభిప్రాయం:
07/09/2006 12:01 am
బాగా వుంది. ఇలాంటివి ఇంకా రాసి పిల్లల దృష్టికి తీసుకు వెళ్ళాలి.