Comment navigation


15815

« 1 ... 49 50 51 52 53 ... 1582 »

  1. మధుమేహం – రక్తపోటు 2 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    08/10/2024 12:53 am

    శ్రీ విన్నకోట నరసింహారావు గారికి

    “పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్” చెయ్యడానికి వీలవుతుంది. సాధారణంగా ఉన్న పాంక్రియాస్‌ని ఉన్న చోటే ఉంచి, మరొక మంచి పాంక్రియాస్‌ని చిన్న ప్రేగులకి తగిలిస్తారు. ఈ ఆపరేషన్ చేయించుకున్నవారిలో 95% మొదటి ఏడాది బ్రతికే ఉంటారు. మూడు సంవత్సరాలు బ్రతికినవారు 92.5% ఉంటారు. Organ rejection occurs in about 1% of the patients. వైద్యులని సంప్రదిస్తే ఎక్కడ ఈ రకం ఆపరేషన్లు ఎక్కువ విజయవంతం అవుతాయో చెబుతారు. నాకు తెలిసినంతవరకు పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యడానికి వీలవుతుంది. ఉన్న పాంక్రియాస్‌ని ఉన్న చోటే ఉండనిచ్చి కొత్త పాంక్రియాస్‌ని చిన్న ప్రేగులకి తగిలిస్తారు. గూగుల్ చేసి వెతకండి. ఏయే ఆసుపత్రులలో ఇది ఎక్కువగా చేస్తున్నారో, గణాంకాలు తెలుసుకోవచ్చు.

  2. మధుమేహం – రక్తపోటు 1 గురించి రవిచంద్ర గారి అభిప్రాయం:

    08/09/2024 12:37 pm

    ఆరోగ్య స్పృహ ఉన్న అందరూ చదవాల్సిన వ్యాసం ఇది. కేవలం వైద్య విద్యార్థులకు మాత్రమే పరిమితమైన లావైన వైద్య పుస్తకాలలో, నోరు తిరగని పదాలతో ఉన్న ఇంతటి లోతైన పరిజ్ఞానాన్ని ఇలా సామాన్యులకు సైతం సోదాహరణంగా అర్థమయ్యేలా రాయడం శ్రీ రావు గారికే సాధ్యం.

  3. Janaki’s Zen గురించి శామల గారి అభిప్రాయం:

    08/09/2024 6:06 am

    శ్యామల రావు గారూ,

    కృతజ్ఞతలు. మీ విమర్శల పుణ్యమా అని ఈ “zen” చదివాను. చదివితీరవలసిన రచన. ఈమాత్రం స్థాయిగలిగిన రచనలు ఈరోజుల్లో ప్రచురింపబడుతున్నాయని తెలిసి సంతోషించాను. గర్వపడ్డాను.

    రచనలో కొన్ని పదాలు ముచ్చటగా పడ్డాయి. కొన్ని దారి తప్పాయి. కొన్ని సహజాలు, కొన్ని కాపీలు. కొన్నిట్లో సంగీతం వినిపించింది, కొన్నిట్లో అపశృతి, తాళహీనం.

    కొన్ని పంక్తులలో అతికించిన పదాలున్నాయి. ఎన్నో పంక్తులు ‘ ఆహా ‘ అనిపించించాయి. మనలో మన మాట, మీకూ అనిపించాయి కదూ? ఏకాగ్రతతో పట్టిన కలం. మీకు కనిపిస్తోంది కదా.
    ఎంత పటిమ దాగుందీ verse లో! సాంప్రదాయిక ఛందస్సులో రాశానని ఈ రచయిత/త్రి ఘోషించలేదే! రచనలో అహంకారం ఉంది సరే. బహుభాగం అందంకూడా ఉందికదా. అది ఆస్వాదించాల్సిన, ఉన్నదని ఒప్పుకోవలసిన, నైతికత మనలో ఉండాలి కదా!

    రాముడు, సీత, రావణుడు, వారి వ్యక్తిత్వాలు ఎవరి కాపీరైటూ కావు. వారిని కొన్ని సహస్రాబ్దాలుగా ఎందరెందరో విభిన్న రూపాల్లో చిత్రీకరిస్తూనే ఉన్నారు. హృద్యంగా ఉన్న చిత్రణలన్నీ ప్రజలు హర్షించారు. రామకథ నిరంతరంగా పటిష్టమవుతూనే ఉంది. ముదావహం.

    ఇన్ని వేల పరస్పర విభిన్న రామాయణాలని సృష్టించగలిగిన మన సంస్కృతిని చూసి మనం గర్వపడాలి.

    పదిహేను వందల క్రిందట రాయబడిన మా మత గ్రంధంలో ఒక్క పొల్లు చెదిరించారో కబడ్దార్ అనే సంస్కృతి కాదు మనది.

  4. ఆగస్ట్ 2024 గురించి శామల గారి అభిప్రాయం:

    08/09/2024 4:58 am

    నా మట్టుకూ నాకు ఓ మంచి సంపాదకీయం చాల రోజుల తర్వాత చదివాననే అభిప్రాయం కలిగింది.

    విమర్శలూ సహేతుకంగానే ఉన్నాయి.

    ఈ మీటింగులకి ” సాహిత్య/సాహితీ సమావేశం” వంటి భారీభర్కం పేర్లు పెట్టకుండా ఉంటే ఉభయకుశలం. కావస్తే ” wannabe writers’ informal meet” అనండి. ఏ గొడవా ఉండదు‌‌.

    తెలుగులో ” రాద్దామని ఉంది” అని అనండి. దర్జా తగ్గింది. ఇదేం పామరపేరు? ఇది అసంస్కృతం అనుకుంటే,

    “ఔత్సాహిక రచయితా సమావేశం” సరిపోతుంది.

    పదుగురి గుండెలు కదిలించేది రచన. నలుగురిని ఆలోచింపచేసేది రచన. ఒక్కరినైనా సరే, రాసేవానికంటే ఎక్కువ దూరం చూడగలిగేట్టు ప్రోత్సహించే దుర్భిణి రచన.

    అటువంటి రచనలు ఎంతోకొంత చేయనేర్చిన అనుభవజ్ఞులు అదే దారిని ఆకాంక్షిస్తున్న కొత్తవారితో ముఖాముఖీ అవటం సమాజానికి ఆవశ్యకం.

  5. ఆగస్ట్ 2024 గురించి అనిల్ Atluri గారి అభిప్రాయం:

    08/08/2024 8:18 am

    ఇంతకీ ఈ సంపాదకీయం అమెరికా సంయుక్త రాష్త్రాలలోని సాహిత్య సభల గురించా లేక ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న తెలుగు సభల గురించా? ఇక్కడున్న రెండు వ్యాఖ్యలలో కనీసం ఒకటి అమెరికా సంయుక్త రాష్ట్రాల నివాసి గారిదనుకుంటాను.

  6. నడిరేయి గురించి Balaguravaiah Kasula గారి అభిప్రాయం:

    08/07/2024 6:51 pm

    ఆలోచనలు అలలలా నడిచాయి…అద్భుతం 💕👌🏻

  7. నలభై గురించి A N Ratnakar Rao గారి అభిప్రాయం:

    08/07/2024 3:23 pm

    నాకైతే మీ వాటిల్లో కొన్ని ( వాస్తవానికి…కొన్ని కాదు!) చదువుతుంటే చిన్నప్పటి “డబల్ యాక్షన్” సినిమల్లా అనిపిస్తుంటై. same ఆలోచనలు. same అనుభూతులు… “ఇంచ్”తేడా లేకుండా ఒక హీరో మీరు… 😀😘😍

  8. బ్రెడ్‌ ప్యాకెట్‌ గురించి A N Ratnakar Rao గారి అభిప్రాయం:

    08/07/2024 2:59 pm

    దేవుడి గొంతు.!!!

  9. ఆగస్ట్ 2024 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    08/06/2024 8:28 pm

    ఈమాట సంపాదకీయంలో ప్రస్తావించినంత ఘోరంగా సాహితీ సభల వలన ప్రయోజనం లేకుండా పోలేదు. కొన్ని సభలు సంపాదకీయంలో చెప్పినట్లుగా ఉండచ్చు గాక.

    పరిచయాలూ, స్నేహాలూ పక్కన బెడితే కొంతమందితో సంభాషించడం వలన కొత్త విషయాలూ, పరిశీలనలూ తెలిసే అవకాశాలు వున్నాయి. మైకాసురులూ, సోడాలు (సొంతడబ్బాలు) కొట్టుకునే రచయితలూ అన్ని చోట్లా వున్నారు. ప్రతీ సభలోనూ తారసపడతారు. వారి స్వీయ రచనలు కాకుండా వేరే వారి రచనల గురించి మాట్లాడిన వారు కూడా చాలా మందే వున్నారు. నేను మా కాలిఫోర్నియాలో ప్రతీ ఏటా 2011 వరకూ సాహితీ సభలు జరిపాను. వారికిచ్చిన సమయం అయిపోగానే రచయితలుగా వారి స్థాయి ఎంత పెద్దదైనా వేదిక మీద దింపేసిన సందర్భాలు కూడా వున్నాయి.

    కొంతమంది మహానుభావులుంటారు, వారికిచ్చిన సమయానికి ముందే ఆపేసే వారు. పూర్వ రచయిత బోయ జంగయ్యగారితో చిన్న అనుభవం. ఆయన మా సభలో మాట్లాడే వారి లిస్టులో లేరు. నేను పది నిమిషాలు అని చెప్పి మాట్లాడ్డానికి వేదిక ఇచ్చాము. చాలా అద్భుతంగా మాట్లాడారు, ఆయన ఎవరెవరి కథలు చదివాక కథలెలా రాయడం నేర్చుకున్నారో చెప్పుకొచ్చారు. తన కథల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కరక్టుగా పది నిమిషాలు కాగానే ఆపేసారు. అటు ప్రేక్షకులూ, ఇటు నేనూ ఎంత బ్రతిమాలినా మాట్లడ లేదు. “వేరొకరి సమయం తినేసేటంతటి రాక్షస ఆకలి నాకు లేదు…సభ అయిపోయాకా మాట్లాడుకుందాం,” అని దిగిపోయారు.

    ఒకసారి గొల్లపూడి మారుతీరావు గార్నీ, వారికిచ్చిన సమయం అయిపోయిందని సిగ్నల్ ఇవ్వగానే ఆపేసారు. “నా ఏభయ్యేళ్ళ సాహితీ చరిత్రలో నాకిచ్చిన టైమ్ అయిపోయింది, ఇక చాలన్న మొట్టమొదటి వ్యక్తి నువ్వేనయ్యా. ఈ క్రమశిక్షణ మా తెలుగునాట చాలా అవసరం,” అన్నారు. సభా నిర్వాహకుల బట్టే సాహితీ సభలూ నడుస్తాయి.

    గత రెండు అమెరికా రచయితల సమావేశాల్లో జరిగిన ఒక మంచి ప్రయోజనం చెప్పగలను. ముఖాముఖీ పరిచయాలు పెరగడం వలన రచయితలు వారు రాసిన కథలూ, వ్యాసాలూ వేరే వారికి పంపి సవరించుకునే గ్రూపులు ఏర్పడ్డాయి. రచయితల మధ్య–ఒక డైలాగ్–ఏర్పడింది. ఇంటర్నెట్‌లో కత్తులు దువ్వుకున్న వారి మధ్య సాహితీ సయోధ్య ఏర్పడిన సంఘటనలు కూడా తెలుసు. ఇవన్నీ కొంతవరకూ మంచి పరిణామమే కదా?

    సాహిత్యమూ, చిత్రలేఖనం వంటి కళలు స్వయంకృషి తోనే మొదలయ్యి, సామూహిక కళగా రూపాంతరం చెంది, వేరే రచయితల/కళాకారుల పనితనం, వాటిలో మెలుకువలూ తెలుసుకునేందుకు దోహద పడతాయి. ఇతరుల నుండి ప్రేరణే వాటికి బలం. అవే కొత్త కళాకారుల్ని తయారు చేస్తాయి. వేరే కళాకారుల అనుభవాలూ, ఆయా కళల్లో మెలుకువలూ తెలుసుకోడానికి ఈ సమావేశాలు కొంతైనా ఉపయోగపడతాయి.

  10. మధుమేహం – రక్తపోటు 2 గురించి విన్నకోట నరసింహారావు గారి అభిప్రాయం:

    08/06/2024 4:21 pm

    డయాబిటీస్‌ని నిర్మూలించడానికై పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యడానికి వీలవుతుందాండి? రచయితగారు గానీ, చదువరులలో ఉన్న డాక్టర్లు ఎవరయినా గానీ నా సందేహనివృత్తి చేస్తే ధన్యుడిని.

« 1 ... 49 50 51 52 53 ... 1582 »