Comment navigation


15811

« 1 ... 33 34 35 36 37 ... 1582 »

  1. మన తరం – మహాకవి గురించి chinaveerabhadrudu vadrevu గారి అభిప్రాయం:

    11/02/2024 2:41 am

    ధన్యవాదాలు వాసూ! ఒక కవికి అతడి జీవితకాలంలో ఇటువంటి సమీక్ష ఒకటి చాలు!

  2. నవంబర్ 2024 గురించి పవన్ సంతోష్ గారి అభిప్రాయం:

    11/02/2024 2:32 am

    ఎక్కడో జరిగిన చర్చకు ప్రతిస్పందనగా రాసిన రాతలా ఉందిది. మీరు దేన్నైనా ఉద్దేశించి చెప్తున్నట్టైతే వాటి లింకులు ఇవ్వండి. లేదంటే ఇంకాస్త స్పష్టంగా రాయండి.

  3. నన్ను గురించి కథ వ్రాయవూ? – నాకు అర్థమయినట్లుగా… గురించి అమరేంద్ర దాసరి గారి అభిప్రాయం:

    11/02/2024 2:01 am

    ఇది ప్రేమకథా కాదా? అన్న విషయం మీద నెల క్రితం ‘సాహితీవేదిక,ఢిల్లీ’లో తీవ్రమైన చర్చ జరిగింది. కథలో కథకుడు చేసే వర్ణనలు, చెప్పే వివరాలూ, కథ చివరిలోని కుముదం వ్యాఖ్యా (‘నువ్వెందుకు పెళ్ళి చేసుకోలేదో నాకు తెలుసు – నా కోసం) ఇది ప్రేమకథే అని నిర్ధారించబోయినా చివర్లో ఫ్రాయిడ్ చొరబడి కథకునితో ‘…నాలోని వాంఛ బయటపడింది. అది కుముదం గ్రహించి చేతిని వెనక్కి లాక్కుని నా నోరు నొక్కింది’ అనిపించేసరికి కథ పట్టాలు తప్పింది. నేను ఇదేదో తెలుసుకుందామని మరికాస్త శోధించినపుడు ఓ వ్యాసంలో ఈ కథ గురించి బుచ్చిబాబు చేసిన వివరణ/వ్యాఖ్య కనిపించి విషయాన్ని మరింత జటిలపరచింది – కనీసం నా వరకు.

  4. అంతిమ లతాంతము గురించి Chandrasekhar Cheerla గారి అభిప్రాయం:

    11/02/2024 12:43 am

    అలౌకికము!

  5. లోకాలోకం గురించి Chandrasekhar Cheerla గారి అభిప్రాయం:

    11/02/2024 12:35 am

    Only first and last two strnzas would have made even a greater poem.

  6. మన తరం – మహాకవి గురించి Chandrasekhar Cheerla గారి అభిప్రాయం:

    11/02/2024 12:31 am

    అనుభూతిపరమైన ప్రాకృతిక కవనానికి ఉత్కృష్టమైన వ్యాఖ్య.

  7. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి sarma గారి అభిప్రాయం:

    11/02/2024 12:25 am

    లీలాశుకుని గూర్చి పూర్తిగా తెలియడు. చోరాష్టకమే అసలు తెలియడు. లీలా శుకుడు(బిల్వమంగళుడు) విలక్షణ కవి. అనుభవ సారం చెప్పినవాడు.

    చాలాకాలం తరవాత మీనుంచి చాలామంచి టపా.

    ఈమాటవారు ఇటువంటివి కూడా ప్రచురిస్తూ ఉంటారా? అప్పుడపుడు.

    [మంచి సాహిత్యం అనుకుంటే ఏదైనా ప్రచురిస్తాం. సాహిత్యంపై మాకు ఏ నిర్వచనాలు నిబంధనలు లేవని ఇంకెన్ని వేలసార్లు చెపుతూ ఉండాలో! – సం.]

  8. కాలుష్యాష్టకం గురించి sarma గారి అభిప్రాయం:

    11/02/2024 12:21 am

    కాలుష్యం,కల్తీ నిత్యం.తల్లిపాలు కూడా కల్తి.కాలం కాదు సార్! కాలానికేం అంటదు.

  9. పెద్దన్నయ్య, ప్రపంచం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/01/2024 3:01 pm

    పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ కాదు అన్నారు. పొరపాటు. ఆయన ప్రవర్తన స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ ఐన వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో అలాగే ఉంది అక్షరాలా.

    రమేష్ గారు అద్భుతమైన కథ అన్నారు కాని నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అద్భుతమైన నవలకు స్కెచ్. శర్క గారికి తీరికా ఓపికా ఉంటే పెద్దన్నయ్య అనో కర్మయోగి అనో పేరు పెట్టి ఈకథనానికి నవలారూపం ఇవ్వవచ్చును.

    శర్మగారు దీనిని నవలారూపంలో వెలువరించితే చదువరులకు చాలామందికి భుజాలు తడుముకోవలసిన సంగతులు అనేకం తప్పక కనిపిస్తాయి.

    ఇలా ఒక స్కెచ్ రూపంలోనే ఆలోచనలను రేకెత్తించే దీనికి నవలారూపం మరెంతగా ఆలోచనీయం అవుతుందో వేరే చెప్పనవసరం లేదు.

    శర్మ గారికి అభినందనలు.

  10. ఎవరెస్ట్ బేస్ కాంప్ – 1 గురించి Hanu గారి అభిప్రాయం:

    11/01/2024 2:25 pm

    మీ అనుభవాన్ని చాలా బాగా వివరించారు. తర్వాత భాగాలకోసం ఎదురుచూస్తు ఉంటాము.

« 1 ... 33 34 35 36 37 ... 1582 »