Comment navigation


15815

« 1 ... 1523 1524 1525 1526 1527 ... 1582 »

  1. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి ప్రద్యుమ్న గారి అభిప్రాయం:

    03/05/2007 11:36 am

    ఈమాటలో అప్పట్లో చాలా కామెంట్లు ” ఈ కథ బాగుందనో, ఈ కథ బాగోలేదనో వచ్చేవి. మన సంపాదకులు గారే ఇలాంటివి బదులు, బాగుంటే ఎందుకు బాగుందో, బాగోలేకపోతే ఎందుకు బాగోలేదో సవివరంగా సెలవిస్తే మిగిలిన వారికి బాగుంటుందని సెలవిచ్చారు.

    ఈ వ్యాసంలో మాత్రం సంపాదకులు అలాంటి తప్పేచేసినట్టు నాకు అనిపించింది. ముఖ్యంగా రెండు విషయాల్లో.

    1.ఇస్మాయిల్ గారే ఈ సంకలనం అచ్చువేసుకొనివుంటే, దీనిలో చాలా భాగం అచ్చయేది కాదు, అని నా దృఢ నమ్మకం. (ఏ కవితలు/హైకూలు ఇస్మాయిల్ గారి తరహాలో లేవో, వ్యాసకర్త పై అభిప్రాయాన్ని corroborate చేయడమో, కొంతచర్చ చేయడమో చేస్తే బాగుండేది.)

    2. ఇస్మాయిల్ గారి భక్తులు నామీద విరుచుక పడ్డా, ఈ సంకలనం గురించి నేను చెప్ప దలచుకున్నది (చర్వితచర్వణం అని ఆరోపించినా సరే!) చెప్పి తీరాలి. ఇస్మాయిల్ గారే బ్రతికి ఉంటే ఈ సంకలనం ఇంతకన్నా ఎక్కువశ్రద్ధతో చదువరికి సులువుగా ఉండేట్టు ప్రచురించి ఉండేవారనుకుంటాను! (ఇదీ అంతే. చదువరికి పుస్తకంలో ఏం సులువుగా లేదో నాకైతే అర్థం కాలేదు. సరైన చర్చ లేకపోవడం వల్ల “ఇస్మాయిల్ గారి భక్తుల్ని” ఏదో ఒకటి అనడం కోసం రాసినట్టనిపించింది. అలాగే తెలుగులో ఎవరైనా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తేనో, ఎవర్నో ఒకరిని మెచ్చుకుంటేనో, వాళ్ళందరిని ఒకగాటన కట్టి ఒక లేబిల్ అంటించే దురాచారం రొచ్చులో సంపాదకులు పడడం ఆశ్చర్యంగా ఉంది. అన్ని తెలుగు సంప్రదాయాలతో బాటు దీనినీ తు.చ. తప్పకుండా పాటించినట్టున్నారు. ఇస్మాయిల్ గారే ఈ లేబిల్స్ అంటించే సంప్రాదాయాన్ని తీవ్రంగా గర్హించినట్టు గుర్తు.

    ఇక వ్యాసకర్తతో నేనీకభవించిన ఒక సూచన తెలుగులో వచ్చిన చాలా అనువాదపుస్తకాలకు వర్తిస్తుంది. అనువాద కవితతో బాటు, original write name, poem name ఆంగ్లంలో రాస్తే చాలా మందికి original చదివే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంటర్నెట రోజుల్లో. ఉదా: జోర్గె లూయిస బోర్గెస కవితలు అని రాస్తే ఆయనెవరో కనుక్కోవడానికి మరో పరిశోధన మొదలెట్టాలి.

    పుస్తకం చదివిన తరువాత నాకు తోచిన మరో విషయం. ఒక పుస్తకం మరణాంతరం ప్రచురించేటప్పుడు, ప్రచురణ కర్తలు, ఆ కవితల్ని ఎలా సేకరించిందీ? (రచయిత ఎవరికైనా ప్రచురించమని ఇచ్చారా? లేక డైరీలో, చిత్తు కాగితాలో వెతికి సంపాదకులే ప్రచురించారా? ఇక ఈ సంపాదకవర్గం ఎవరు? ఈ ప్రక్రియలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇలాంటివి ముందుమాటలో రాస్తే బాగుండేది.

    ప్రద్యుమ్న
    (ఆచార్యుల, పీఠాధిపతుల, రకరకాల రసాల -భక్తుల -బాధితుడు).

  2. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    03/05/2007 9:13 am

    వివిధ సంగీతకారులని పరిచయం చేసేందుకు ఈ వ్యాసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే వారి బొమ్మలను కూడా చూపడం మంచి ఆలోచన.

    ఎటొచ్చీ ఈ సంగీతకారుల మధ్య పోలికలనూ, సామ్యాలనూ వెతకడం అనవసరమేమో అనిపిస్తుంది. వివిధ దేశాల్లో, రకరకాల పరిస్థితుల్లో, వేరువేరు ప్రేరణలకు లోనై జీవించిన ఈ ప్రతిభావంతులు తమ ప్రాంతాల సంగీతానికి ప్రభావితులయిన మాట నిజమే కాని ఈ రెండు విభిన్న సంప్రదాయాల మధ్య పోలికలేవైనా ఉంటే గింటే అవి యాదృచ్ఛికమే.

    ఒక చారిత్రక నేపథ్యంలో, ఒక ఆర్థిక, సామాజిక పునాది రూపొందిన తరుణంలో ఒక్కొక్క సంస్కృతి విలసిల్లుతుందనేది తెలిసినదే. రాజులూ, నవాబుల ప్రాపకం ఉన్న రోజుల్లో కొన్ని రకాల లలితకళలూ, సాహిత్యమూ వర్ధిల్లుతాయి.

    ఆసక్తికరమైన సంగతేమిటంటే పదిహేడో శతాబ్దం అంతం నుంచి పంతొమ్మిదో శతాబ్దం మొదలైన నాటి దాకా కర్ణాటక, పాశ్చాత్య సంగీతంలోనే కాక హిందూస్తానీ పద్ధతిలో కూడా విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి. (సమకాలీన సంఘటనలుగా వీటిని ప్రస్తావించవచ్చు గాని సామ్యాలను వెతకడం వ్యర్థ ప్రయత్నమని నా అభిప్రాయం)

    1719-1748 మధ్య కాలంలో రాజ్యం చేసిన మహమ్మద షా రంగీలే అనే ముగల్ చక్రవర్తి ఆస్థానంలో నియామత్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ అనే ఇద్దరు ప్రసిద్ధ సంగీతకారులు (వీణ, గాత్రం) సదారంగ్, అదారంగ్ అనే కలం పేర్లతో కొత్త ఒరవడి సృష్టించారు. అప్పటిదాకా జనాదరణ పొందిన ద్రుపద్ శైలికి భిన్నంగా వీరు ఖయాల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈనాటికీ అదే కొనసాగుతోంది.

    మొత్తం మీద ప్రపంచంలోని మూడు సుదూర ప్రాంతాల్లో ఒకే యుగంలో మూడు ముఖ్య శాస్త్రీయ పద్ధతుల్లో కొత్త పోకడలు మొదలవడం, ప్రఖ్యాత సంగీత రచయితలు ఆవిర్భవించడం ఆసక్తికరమైన విషయం.

    తక్కిన సాంస్కృతిక అంశాల్లాగే కళల చరిత్రలో కొన్నిటిని విస్మరించడం జరుగుతుంది. టర్కీ, మధ్యధరా ప్రాంతాలూ, చైనావంటి తూర్పు దేశాలూ అన్ని చోట్లా సంగీతం ఉంటూనే ఉంది. ప్రతిచోటా గొప్ప సంగీతకారులు ఉండే ఉంటారు. అయితే వారి గురించి చెప్పుకోవడం తక్కువగా జరుగుతుంది. ఇదొకరకమైన కల్చరల్ ఇంపీరియలిజం అనిపిస్తుంది. దీన్ని గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసి వ్యాసాలు రాయవచ్చు.

    ఈ మధ్య నేను గ్రీక్ సంగీతంలో సరిగ్గా కర్ణాటక సంగీతాన్ని పోలిన రాగాలున్నాయని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోవడం జరిగింది. వాటిని గురించి మరికాస్త తెలుసుకుని ఒక చిన్న వ్యాసం రాసే ఆలోచన కూడా ఉంది. నిజమైన పోలికలంటే ఇటువంటివే.

  3. ఇద్దరు దుర్మార్గులు గురించి PhaNi DokkA గారి అభిప్రాయం:

    03/05/2007 8:41 am

    కిశోరు గారూ,
    నమస్కారం. కథపై మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. మీ ప్రశ్నకు సమాధానం ఇదిగో:
    దుర్మార్గులు = చెడు మార్గమును పట్టినవారు.
    సమాజం దృష్టిలో మోహను, గోపిక అటువంటివారే కదా. అందుకనే ఆ పేరు పెట్టాను.
    వ్యక్తిగత బలహీనతలున్నా, చెడు మార్గంలో ప్రయాణిస్తున్నా, నా దృష్టిలో వారు చెడ్డవారు మాత్రం కారు. వారిద్దరి మనసు మంచిది. ఈ కథలో అది చెబుదామనే ప్రయత్నించాను.

    ధన్యవాదాలతో,
    మీ ఫణి డొక్కా.

  4. ఓ.పీ.నయ్యర్‌ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    03/05/2007 8:23 am

    సీబీరావుగారు చెప్పిన జాయియే పాటలాగే మేరేసనమ్ లో పుకార్ తా చలా హూ మై (రఫీ) మొదలైన మంచి పాటలెన్నో ఉదహరించదగ్గవే. “గ్రంథ విస్తరణ భీతి” ఎలాగూ ఉంటుంది కనక కొన్ని సినిమాల పేర్లూ, తక్కినవాటికి లింకులూ ఇచ్చి ఊరుకోవలసివచ్చింది. సమగ్రత కోసమని నయ్యర్ జీవిత విశేషాలన్నిటినీ మాత్రం రాయక తప్పలేదు.

    తక్కిన వ్యాసరచయితలు కూడా భారతివంటి పాత పత్రికల పద్ధతిలో కాకుండా అవసరమైన చోట బొమ్మలనూ, ఆడియో లింకులనూ జతపరిస్తే వెబ్ పత్రిక సదుపాయాలను ఉపయోగించుకున్నవారవుతారు.

  5. ది బీచ్ గురించి Aruna గారి అభిప్రాయం:

    03/05/2007 8:07 am

    చాలా బాగుంది. కధలో తన భార్యని ఒప్పించే తీరు మీద ఇంకొంచము దృష్టి పెడితే ఇంకా బాగుండేది.

  6. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Narayanaswamy గారి అభిప్రాయం:

    03/05/2007 7:04 am

    సమీక్ష బాగుంది. ఇస్మాయిల్ గారి ఈ సంకలనం లోని కొన్ని పారడాక్సెస్ ని బాగా పట్టుకున్నారు. అయితే ఒక చిన్న సమాచారం – జీవ(బ)నానంద దాస్ మీద కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఒక పుస్తకం తెచ్చారు. భారతీయ సాహిత్యకారులు అన్న సిరీస్ లో అనుకుంటా! దాన్ని కుందుర్తి గారు రాసారు. అందులో జీవనానందదాస్ కవితలని చాలా అనువాదం చేసారాయన. వాటిల్లో “వనలతా సేన్” ఉంది. చాలా సాఫీగా , అచ్చతెలుగు పదాలతో అద్భుతంగా సాగుతుందా అనువాదం.

  7. వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    03/05/2007 5:43 am

    సుధాకర్ బాబు గారికి, ఇంకెందరో వికీకారులకు,

    ఈమాటలో రచనల కాపీరైట్ హక్కులు ఈమాట పత్రికవి, రచయితవీను. లాభాపేక్షలేని వికీపీడియాలో ఈమాట రచనలలోని సమాచారాన్ని వాడుకోవడానికి పత్రికా పరంగా ఈమాటకు అభ్యంతరాలేమి లేవు. అయితే, మీరు ఏదైనా సమాచారాన్ని సంగ్రహించే ముందు ఆయా వ్యాస రచయితలను కూడా సంప్రదించి వారి అనుమతిని కూడా పొందడం అవసరం. అందరికీ ఉపయోగపడే వికీపీడియా వంటి బృహత్ప్రాజెక్టులకు తమ రచనలను వాడుకోనే విషయంలో చాలామంది ఈమాట రచయితలు సంతోషంగా ఒప్పుకుంటారనే నా అభిప్రాయం. రచయితల కాంటాక్ట్ వివరాలు మీకు తెలియకపోతే మాకు రాయండి. వారి అనుమతిని సంపాదించడంలో మీకు వీలైనంతగా సహాయం చెయ్యడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం!

    సంపాదక వర్గం తరఫున,
    సురేశ్ కొలిచాల.

  8. సీతా-రామా గురించి Kishore గారి అభిప్రాయం:

    03/05/2007 3:15 am

    సీతా రామా లో కామా(,)లెక్కువయ్యాయి. ఒక్కో వాక్యాన్ని అంత పెద్దదిగా వ్రాస్తే భావం పట్టు కోల్పోయినట్లుంది..

  9. ఇద్దరు దుర్మార్గులు గురించి Kishore గారి అభిప్రాయం:

    03/05/2007 1:15 am

    భాగుంది. ఇంతకీ ఈ కథకి “ఇద్దరు దుర్మార్గులు” అనే పేరు ఎందుకు పెట్టారు?

  10. ఓ.పీ.నయ్యర్‌ గురించి cbrao గారి అభిప్రాయం:

    03/04/2007 10:35 pm

    ‘జాయియే ఆప్ కహా జాయేంగే, యె నజర్ లౌట్ కె ఫిర్ ఆయేగీ ‘ – ఈ పాట కూడా మీరు ఉదహరించిన పాటలకు కలుపుకో తగ్గది. ఆలోచించిన కొద్దీ ఎన్నో మధుర గీతాలు మదిలో ప్రత్యక్షమవుతాయి. ఏక్‌ ముసాఫిర్‌ ఏక్‌ హసీనా చిత్రంలోని ‘ఆప్‌ యూఁహీ అగర్’ పాట పాడితే నిజంగానే మనకు నచ్చిన అమ్మాయి మనకు దగ్గరయ్యేంత మంత్రం ఉందా పాటలో. నయ్యర్ గురించి మీరు రాసినవి తెలిసినవే అయినా వ్యాసాన్ని ఎక బిగిని చదివించే శైలి ఆకట్టుకుంది. ఎక్కువమందికి తెలియని పలు విషయాలు చెప్పారు. తెలుగు వికి లో ఉంచటానికి కావలసిన అర్హతలున్న వ్యాసం ఇది. నయ్యర్ గురించి రాసి ఆప్ జీత్ లియా హమారా దిల్.

« 1 ... 1523 1524 1525 1526 1527 ... 1582 »