Comment navigation


15815

« 1 ... 1522 1523 1524 1525 1526 ... 1582 »

  1. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/06/2007 9:13 am

    చక్కని వ్యాసం! సంగీతాన్ని ఆనందించటం తప్ప విశ్లేషించటం తెలియని వారిని,సంగీతం పై అపారమైన అభిమానమే తప్ప అధికారం,విజ్ఞానం లేని వారిని కూడా ఆసక్తి కరంగా చదివించిన వ్యాసం. ప్రాక్పశ్చిమ సంప్రదాయాలలోని దిగ్గజాల జీవిత విశేషాలను,విభిన్న సంగీత రీతుల లోని కొన్ని విశేషాలను వివరించిన తీరు బావుంది.ఆకట్టు కునే శైలి వచనంలో దాగిన కవిత్వంలా ఉంది.

  2. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    03/06/2007 7:43 am

    నాకు ఎందుకో ఇండో-యూరోపియను భాషలు ఎలాగో, అలాగే ఈ సంగీతము కూడా అయి ఉండవచ్చు అనిపిస్తుంది.

    చావా గారు: అన్ని విషయాలను ఇండో-యూరోపియన్ అద్దం లోంచి చూస్తే ఎలాగండీ? 🙂 ఇండో-యూరోపియన్ భాషల మధ్య జన్మ సంబంధం నిరూపించే భాషాశాస్త్ర ఆధారాలు కోకొల్లలు. గత అయిదారు వందల ఏండ్లలోనే బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య కర్ణాటక సంగీత సంప్రదాయాలకు, సుమారు అయిదు వేల యేండ్ల కింద విడిపోయిన ఇండో-యూరోపియన్ భాషలకు లంకె లేదు. ఈ వ్యాసంలో సంగీత సంప్రదాయాల మధ్య సారూప్యం ఎత్తిచూపడానికి ప్రయత్నించిన నాగరాజు గారు సైతం ఆ పోలికలకు కారణం మానవుని ఆలోచనల్లో నిగూఢమైన ఏకత్వమనే వాదించాడే గాని వాటి మధ్య ఏ రకమైన జన్మ సంబంధం అంటగట్టలేదు. ఏవో కొన్ని యాదృచ్ఛిక సారూప్యాలను (chance similarities) ఆధారం చేసుకొని తయారు చేసిన సజాతిత్వ సిద్ధాంతాలు శాస్త్ర విమర్శకు నిలవలేవని మీకు తెలుసు కదా?

    రిగార్డులతో,
    సురేశ్.

  3. అంతరం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 7:38 am

    కథ చాలా బాగా వుంది. తను మాత్రమే బాగా చేయగలమనుకొనే వారి బలహీనతను, ఎదురింటావిడ భర్తను పొగిడే భార్యల సోదిని బాగా చెప్పారు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. సీతా-రామా గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 7:12 am

    అద్భుతంగా వుంది. రామ, సీత పేర్లు కొద్దిగా కన్ఫ్యూజన్ కలిగించినా చదువుతున్న కొద్దీ వారి అంతరంగాల్లో లీనమయిపోయాను.
    డబ్బే జీవితమనుకొనే జీవాలు కొన్నైనా ఈ కథ చదివి బఇష్యత్తు వూహించుకోగలిగితే బాగుండును.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. ది బీచ్ గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    03/06/2007 6:13 am

    కథ చాలా బాగుంది. నీళ్ళలో మునిగినప్పుడు తన అంతరంగాన్ని మరింత విశదపరిచి వుంటే బాగుండేదేమొ!
    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. ఇద్దరు దుర్మార్గులు గురించి ప్రసాదం గారి అభిప్రాయం:

    03/05/2007 9:42 pm

    చాల మంచి కథ, బాగా రాసారు. అభినందనలు

  7. నామాట గురించి chavakiran గారి అభిప్రాయం:

    03/05/2007 9:26 pm

    Generic comment.

    It is time to install some more word press plug in’s to eemaata. isn’t it?

    particularly plugins like Ajax comments and etc…

  8. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి chavakiran గారి అభిప్రాయం:

    03/05/2007 9:22 pm

    ఈ రెండు విభిన్న సంప్రదాయాల మధ్య పోలికలేవైనా ఉంటే గింటే అవి యాదృచ్ఛికమే.

    నాకు ఎందుకో ఇండో-యూరోపియను భాషలు ఎలాగో, అలాగే ఈ సంగీతము కూడా అయి ఉండవచ్చు అనిపిస్తుంది. కానీ బొత్తిగా సంగీత జ్ఞానము లేని వాడిని అంతకంటె ఏమీ చెప్పలేని వాడిని.

  9. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    03/05/2007 5:32 pm

    వ్యాసము బాగుంది. బాఖ్ కాలములో పియానో లేదనుకొంటాను. అప్పుడు హార్ప్సికార్డ్ ఉండేది. క్రింద ముత్తుస్వామి దీక్షితులపై కొన్ని వివరాలు. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలో ఆరితేరినవారు. వారి తండ్రి రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. వీరు హంసధ్వని రాగమును కనుగొన్నారు. ముత్తుస్వామి గాత్ర సంగీతమును మాత్రమే గాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడునప్పుడు వీణను కూడ వాయించెడివారు. వీణతో కలిపి పాడుచుండుటచే వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో వాడెడివారు. చివర మధ్యమకాలము సామాన్యముగా కీర్తనలలో నుండును. వీరు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపినారు. కావున వీరికి హిందూస్తానీ సంగీతముతో బాగుగా పరిచయము. హిందూస్తానీ రాగములను తన కీర్తనలలో వాడియున్నారు (జంఝూటి, జయజయవంతి, యమన్, సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు). వీరు వీరి తండ్రిగారితో మదరాసు సమీపమున నున్న మణలిలో కొన్ని సంవత్సరములు ఉన్నారు. మణలికి నాయకుడు వేంకటకృష్ణ ముదలియార్. వీరు దుబాసి, సెయింట్ జార్జ్ కోటలో పని చేసెడివారు. అప్పుడప్పుడు ముత్తుస్వామిని, వారి తమ్ముడైన బాలాస్వామిని కోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్ మేళమును వినేవారు. సి మేజర్‌కు సరిపోయే

    శంకరాభరణములో నోటు(ట్టు) స్వరములను వ్రాసినారు. సుమారు నలభైకు పైన సంస్కృతములో వ్రాసినారు. నేడు కూడ ఇట్టి నోటుస్వరాలు కచేరీల చివరలో తుకడలుగా పాడుతారు. ఇంగ్లాండ్ రాష్ట్రగీతమైన గాడ్ సేవ్ ది కింగ్ మెట్టులో సంస్కృతములో వ్రాసినారు! వీరి తమ్ముడు బాలాస్వామి ఒక ఆంగ్లేయునిచేత ఫిడేల్ నేర్చుకొన్నారు. వారి తండ్రిగారి సలహా ననుసరించి ముత్తుస్వామి కచేరీలలో వయలిన్ వాయించేవారు. ఇదే కర్ణాటక సంగీతములో మొట్టమొదట వయలిన్‌ను పక్కవాద్యముగా ఉపయోగించుట. అంతకు ముందు వీణను ఉపయోగించేవారు. మూడు సంగీత సంప్రదాయాలను అవగాహన చేసికొని అందులో ఘనతను సాధించారు దీక్షితులవారు.

    వీరి సంస్కృత కృతులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, యతి, గోపుచ్ఛయతి, బీజాక్షరములు, ముద్రాలంకరము (రాగము పేరు పాటలో వచ్చుట), ఇత్యాదులు ఎక్కువ. వీరికి భక్తి మాత్రమే కాదు, విభక్తి అంటే కూడ ఇష్టమే. వీరి విభక్తి పాటలు ఒక ప్రత్యేకత. ఒక్కొక్క పాటను ఒక విభక్తిలో వ్రాయుట ఇందులోని విశేషము. ఎనిమిది విభక్తులలో వీరు ఎన్నియో పాటలను వ్రాసియున్నారు. పాటలలో ఉదాహరణ లనవచ్చును వీటిని.

    మాత్రుష్కా బొమ్మలాగు పదములలో పదములుంచి వ్రాయుట వీరి కృతులలోని మరొక విశేషము. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, వసుప్రదే, శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే పదే, ఇత్యాదులు. దీనికి గోపుచ్ఛయతి అని పేరు.

    ఇవన్నీ రచయితకు తెలిసియుండవచ్చు. స్థలాభావమువల్ల వ్రాసియుండక పోవచ్చు. కాని అందరికీ ఇవి తెలిసిన మంచిదని నేను తెలియజేయుచున్నాను.

    విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు

  10. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    03/05/2007 2:23 pm

    సుభాన్ అల్లా! బ్రావో!
    ఈ వ్యాసం ఎంత చదివినా తనివి తీరలేదు. వ్యాసకర్త ముందుకు వెడదాం రమ్మన్నా మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆనందాన్నిపెంచుకున్నాను.ముగింపు అని ముందే చెప్పటం ఈ చదువరికి తీరని ద్రోహం. గుండె జారి పోయింది. ఆ దుఃఖంనుండి బయటపడటానికి వెంటనే వ్యాసం మొత్తం రెండోసారి చదువుకున్నాను.
    వియన్నాలో ప్రజలంతా ఒక ఉద్వేగపు, ఉద్రేకపు, ఉజ్జ్వల స్థాయిలో జీవించేట్లు చేసిన కళాకారులున్న సమయంలో, నేను అప్పుడు జీవించి ఉండి ఉంటానా అని ఊహించుకునే నాకు -ఎన్నోసమయాల్లోని సంగీతకారుల గొప్ప సంగీతం ఒకేసారిగా విన్న ఈ భ్రాంతి , కలిగిన ఈ పట్టరాని సంతోషము – ఏమని చెప్పేది. ఎన్నిసార్లు నిట్టూర్పులు విడిచానో! ఎన్నిసార్లు తల ఊపానో!
    ఓహో! గొప్ప వ్యాసం! ధన్యవాదాలు.

    లైలా

« 1 ... 1522 1523 1524 1525 1526 ... 1582 »