Comment navigation


15815

« 1 ... 1519 1520 1521 1522 1523 ... 1582 »

  1. ఇద్దరు దుర్మార్గులు గురించి Kamesh Challa గారి అభిప్రాయం:

    03/09/2007 3:55 pm

    Phani garu,
    This story is quite different from what we’re used to from your “pen”. This show how diverse you would think and can write. The way you joined the two parallel lives is worth the thought. Keep up the good work!!. Really nice job!!. And keep writing … 😉
    Good luck.

    Cheers,
    –Kamesh

  2. అంతరం గురించి seetha గారి అభిప్రాయం:

    03/09/2007 2:14 pm

    simply superb. just general story, but we canot stop until finish.
    the level of thinking of the ladies about sailu is exactly correct. though iam a waoman i simply laughed.
    keep it up
    thank u.

  3. చాదస్తం గురించి JUBV PRASAD గారి అభిప్రాయం:

    03/09/2007 10:55 am

    రవికిరణ్ గారూ,
    నేను కధలో పిల్లలు తమ ప్రేమ గురించి తల్లితండ్రులతో చెప్పుకోకపోవడం గురించే రాశాను గానీ, తమ స్నేహితుల కన్నా ముందరే చెప్పాలని రాయలేదు. స్నేహితులకీ, తల్లితండ్రులకీ పోలిక తీసుకురాలేదు. బయటివాళ్ళ ద్వారా వినడం కాకుండా, సొంత పిల్ల ద్వారానే ఆ విషయాలు తెలుసుకోవడం తల్లితండ్రులకు గౌరవనీయం అని నా అభిప్రాయం. వూళ్ళో వాళ్ళందరికీ తెలిశాక, ఎవరి ద్వారానో పిల్లల ప్రేమ విషయం తెలిస్తే, ఆ తల్లితండ్రులు తమని తాము పరిశీలించుకోవాలి. మామూలు ప్రేమలు అందరికీ వుంటాయి పిల్లల పట్ల. దాన్నెవరూ శంకించరు. చక్కని స్నేహమే వుండదు చాలా మంది తల్లితండ్రులకి తమ పిల్లలతో.
    ప్రసాద్

  4. భయం! గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/09/2007 10:25 am

    మంచి కథ. కానీ వేమూరి గారు ఇదొక అద్భుతవైన కథ అయ్యుండేది. మంచి పట్టులో జరుగుతున్న కథలో ఆ యూనివర్సిటీ విషయాలూ, వేదకాలపు ఆర్యుల విశ్లేషణ అనవసరవైన విశ్రాంతి నిచ్చేశాయ్. కథలో వున్న బిగిని పలుచన చేసేశాయ్. అలాగే ఆడియో హాలూసినేషన్స్ గురించి మీరిచ్చిన విశ్లేషణ కథలో పట్టుని తగ్గించింది. వాటి విశ్లేషణ పాఠకులకే వదిలేసుంటే కథ చాలా బాగుండేది. కొన్ని, కొన్ని ప్రశ్నలకి ఎవరికి వాళ్ళే జవాబులెతుక్కుంటేనే మజా. శబ్దాన్ని మాత్రవే ఇచ్చి, ఎలుగొడ్డుని ఇయ్యని ముగింపు చాలా బాగుంది. అది ఎలుగ్గొడ్డేనా మరింకేదన్నానా అన్న ప్రశ్నకి జవాబునియ్యని ముగింపు బాగుంది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  5. చాదస్తం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/09/2007 9:50 am

    వైదేహీ శశిధర్, ప్రసాద్,

    పెళ్ళి ఏ రకంగా చేసుకోవాలో వ్యక్తిగతవైనప్పుడు, పెళ్ళికి వెళ్ళాలో, వెళ్ళకూడదో కూడా వ్యక్తిగతవే కాదా? పెళ్ళికి రాననే చెప్పిందికానీ, స్నేహం చెయ్యనని చెప్పలేదుగా తను.
    JUBV PRASAD ,

    కథ చాలా బాగుంది. కథలో ఆవిడ పాత్ర చాలా బాగా ఎష్టాబ్లిష్ అయింది. మామూలుగా, వయస్సులో వున్నప్పుడు వుండే ఆదర్శాలు, అభిప్రాయాలు, కొంత వయసు గడిచిన తర్వాత, పిల్లలు, జల్లలు పుట్టి, బతుకులో నాలుగు ఢక్కా మొక్కీలు తిన్న తర్వాత, వయసులో వున్న విశాలత్వం పారిపోయి, ఏ తిరుపతి కొండమీద మొక్కులోనో దాక్కుంటుంది. ఈ కథలో అలా కానందుకు చాలా నచ్చింది.

    ఒక్క విషయంలో మాత్రం విభేదించాల్సి వస్తుంది. అమ్మా, నాన్నలు ఎంత స్నేహంగా వున్న, పిల్లల ప్రేమ కథ ముందర తెలిసేది చెప్పుకునేది స్నేహితులకే. తల్లి, తండ్రులకీ, పిల్లలకీ మద్య ఎంత స్నేహం వున్నా, వయసుల అంతరం కూడా అంత వుంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే ఆ తల్లి తన పిల్లల ప్రేమ కథ తనకి ముందు తెలీలేదని అంత బాధ పడనక్కరలేదు.
    కథ చాలా బాగుంది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  6. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Sowmya గారి అభిప్రాయం:

    03/08/2007 6:10 pm

    బాగుందండీ మీ సమీక్ష. “అనువాదకవులగురించి ఏ విధమైన వివరణా ఇవ్వకపోవడం…. ” – మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను. ఇదే అభిప్రాయం వేరే పుస్తకం గురించి మరో సైటు లో నేను చెప్పినప్పుడు అక్కడ ఒకరేమో – అవన్నీ మీరే తెలుసుకోవాలి అని చెప్పారు నాకు!
    “పాత స్మృతుల్ని రాల్చి
    కొత్తవి తొడిగితే బాగుణ్ణు:
    చెట్టు లా.”
    – బాగుంది ఈ హైకు.

  7. ఇద్దరు దుర్మార్గులు గురించి PhaNi DokkA గారి అభిప్రాయం:

    03/08/2007 11:28 am

    రవికిరణ్ గారూ,

    నమస్కారం. నా కథపై మీ అభిప్రాయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు.

    లక్షణమైన నా తెలుగు పాత్ర “గోపిక” ఉండగా, ఏ బెంగాలీ పాత్రనో అరువు తెచ్చుకోవడానికి నాకు మనస్కరించదు. పైగా, మీరు చెప్పిన శరత్ గారి రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలియదు కూడాను.

    సంఘదృష్టితో చూస్తే మోహన్ దుర్మార్గుడిలా అనిపిస్తాడు. కానీ అతనిలోనూ ఆత్మ పరిశీలన వున్నది, మంచీ చెడులని వేరుగా చూడగల విచక్షణ ఉన్నది, అంతర్మధనం వున్నది. కథ దానితోనే మొదలయ్యిందిగా.

    సాధారణంగా, మనకేదైనా విషయం అర్థం కాకపోయినా, దాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నించకపోయినా, ఆ విషయంపై మనకు ద్వేషమూ, వ్యతిరేకతా కలుగుతాయంటారు. మోహన్ కి దీప అర్థం కాలేదు. అతను తెలుసుకోవాలనీ ప్రయత్నించలేదు. అయినా అతనికి ఆమె అంటే గౌరవం, కాస్త భయం ఉన్నాయి, ద్వేషం లేదు.

    ఇన్ని బాగుపడే లక్షణాలున్నా, “ఆడదాని చూడ అర్థంబు చూడ..” అన్న చందాన, అతని బలహీనత అతనికుంది.

    చెప్పే విధంగా చెబితే, బుర్రకెక్కడానికి నాలుగు మాటలు చాలు. గోపిక ఆ పనే చేసింది, రవ్వంత సమయం, సందర్భం చూసుకుని.

    ఏదో నాకు తోచింది చెప్పాను, మిమ్మల్ని ఎల్లాగోల్లా ఒప్పించేసే ఉద్దేశ్యంతో మాత్రం కాదు…ఏదో నా తుత్తి కోసం.

    మీ అభిప్రాయాలని గౌరవిస్తూ,
    ఫణి డొక్కా.

  8. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/08/2007 10:59 am

    వ్యాస కర్త గారి వివరణ కాస్త దురుసుగా ఉన్నట్లుగా అనిపించిందని నా అభిప్రాయం. ఏ వ్యాసమైనా, కథ అయినా, కవిత అయినా విమర్శ ఉన్నప్పుడే దాని బాగోగులు తేలేది! రచయితలకి తమ తమ రచనలనీ, అభిప్రాయాలనీ, విశ్లేషణనీ, ప్రజల్లోకి తీసుకెళ్ళే స్వేచ్ఛ ఎలా ఉంటుందో, పాఠకులకీ విమర్శంచే స్వాతంత్ర్యం ఉంటుది కూడా! ఈ వ్యాసం బాగోలేదని ఎవరూ ఉటంకించ లేదు. అక్కడక్కడ కాస్త తప్పులు దొర్లాయంతే ! దానికే సవాళ్ళు చేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.

  9. భయం! గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    03/08/2007 9:15 am

    అద్భుతం!
    తెలుగులో ఇట్లాంటి ఇతివృత్తంతో కథ నేను చదవలేదు. ఏవో కొన్ని వేట, అడవి కథలు ఉన్నాయి గానీ ఈ కథలోని “వాతావరణమే” వేరు.
    మాస్టారూ, ఆ కాస్త ఓపికా చేసుకుని నవలే రాయండి.
    కొన్ని చోట్ల ఫుట్ నోట్సు కావాలి. ఉదా: చత్వారీ వాక్పధాలు
    చాలా వర్ణనలు బావున్నాయి, కళ్ళకి కట్టినట్టు. కానీ అక్కడక్కడా కొన్ని వాక్యాలు ముందు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో తర్జుమా చేసినట్టు వంకరగా అనిపిస్తున్నాయి.
    ఎప్పుడో చాన్నాళ్ళక్రితం ఒక నవల చదివాను. HG Wells రాసింది, పేరు Marriage అనుకుంటా.
    అందులో ఒక యువ దంపతులు తమ వివాహాన్ని పటిష్ఠం చేసుకోవటానికి ఇలాగే గ్రీన్లాండ్ టండ్రాలో మూణ్ణేల్లో ఆర్నెల్లో ఉంటారు. విచిత్రమైన కథ.
    మీ అభయారణ్యం లింకు పనిచెయ్యడం లేదు. ఈ కథ ఎక్కడ దొరుకుతుంది?

  10. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/08/2007 9:03 am

    సర్వజ్ఞత ఎవరికుంటుంది? ఎవరికీ వుండదు. అందువలన తప్పులుండతం ఎంత సహజవో, తప్పులెన్నటం అంత సహజవే. మన ఆలోచనలు మనలో వున్నంతవరకూ మనవే, ఎవరికీ విమర్శంచే హక్కు లేదు, కానీ అవే బయటకొస్తే, విన్న వాళ్ళకీ చదివిన వాళ్ళకీ అందరికీ తప్పులెతికే హక్కుంది. అందువలన దాంట్లో బలాబలాలు తేల్చుకోవటం ఎందుకండీ? మీరు వ్రాశారు, నచ్చిన మాలాటి నలుగురం చదివి, ఆహా, వోహొ అనుకున్నాం. నచ్చని నలుగురు, ఏవి నచ్చలేదో చెప్పేరు, అంతే కదా, దానికే బాలా బలాలు తేల్చుకునే సవాళ్ళేందుకు సార్.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

« 1 ... 1519 1520 1521 1522 1523 ... 1582 »