Comment navigation


15815

« 1 ... 1516 1517 1518 1519 1520 ... 1582 »

  1. చాదస్తం గురించి NaChaKi గారి అభిప్రాయం:

    03/27/2007 12:47 am

    కథ …ఊహించినట్టుగానే సాగింది నాకు మటుకు. 😉 కథ మీద ఇతర పాఠకులు, ముఖ్యంగా కొంచెం లోతుగా చర్చించిన కామేశ్వరరావు గారు, ఇచ్చిన విశ్లేషణ బాగుంది. కథని ఒకే perspective నుంచి వ్రాస్తే… అది రచయిత(త్రి) ideology కాకపోతే defend “చెయ్యటం” కష్టం స్వధర్మం కాదు కనుక, అదే వారి ideology ఐతే defend “చేసుకోవటం” కష్టం. అసలు defensive modeలోకి రాకుండా ఉండాలంటే కథని ఒకే పాత్ర దృక్కోణం నుంచి వ్రాయటం కూడదేమో మరి ఈ లెక్కన. (ఆ ఒక్క పాత్రనీ “లోపాలు లేని మహాత్మ” పాత్రగా దిద్దితే ఒకే పాత్రతో అంతటి విశ్లేషణా నడిపించవచ్చేమో. ఈ పాత్ర అందుకు తూగినట్టు కనపడదు.)

    కథనం పరంగా లోపాలుగా కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. కామేశ్వరరావు గారు చెప్పినట్టు “భర్త” అంటే “పతి దేవుడు” అనే గౌరవం అక్కర్లేదు లేశమైనా, కానీ “మనిషి” అని, “నా జీవితంలో అంతర్వాహిని లాంటి ఒక entity” అని కించిత్ గౌరవమైనా ఉన్నట్టుగా ఉంటే పాత్ర elevate అయ్యేది. కథ రాఘవ్‌కీ ఆ పాత్రకీ మధ్య మాత్రమే జరిగినట్టు అనిపించినా అసలు కథలో తన కుటుంబం గురించిన ఊసు కనీసం రాఘవ్ కుటుంబం గురించి ఉన్నంతైనా లేకపోవటం ఆశ్చర్యకరం (?). అన్నట్టు, కథలో పాత్ర తన పెళ్ళి ఎలా జరిగింది అన్నది చెప్పి ఉంటే కథకి, కనీసం ఏదో ఒక పాత్రకి, ఊతం దొరికేది.

    కాకపోతే ఒక విషయం స్పష్టం: కథలోని స్త్రీ పాత్ర తన ఉద్దేశాలు అవతలి వారి ఇష్టాలను బట్టి అణచుకోవాలి అన్న గ్రహింపు ఉన్న పాత్రే. “ఏమండీ అని పిలుస్తాడు, దానికే ఆలవాటు పడిపోయాను.”, “ఐనా మా మధ్య స్నేహం స్థాయి అంతేనని సరిపెట్టుకున్నాను.” వంటి వాక్యాలు అందుకు నిదర్శనాలు. ఇవి తప్పిస్తే, “నాస్తికత్వం” అంటే “(దేవుడు) లే”డన్న నమ్మకం/వాదం. అందులో “నాకు మీ నాన్నకన్నా పట్టింపులెక్కౌవలే!” అనటమూ, “…అన్నాను logicalగా” అని తన (possessive) భావన గురించి తనే అనటమూ పాత్రోచితంగా లేవు ఈస్థాయి పాత్రకి.

    ఏదేమైనా మొత్తానికి నా మెదడుకు మాత్రం ఈ కథ బాగానే పనికి వచ్చింది 🙂

    – నచకి

  2. ఇద్దరు దుర్మార్గులు గురించి NaChaKi గారి అభిప్రాయం:

    03/26/2007 1:01 pm

    ఫణి డొక్కా గారి కలం నుంచి నిజంగానే expect చెయ్యని కథ నాకు కూడా! జె.యు.బి.వి. గారి అభిప్రాయంతో సహా అన్ని అభిప్రాయాలు చదివాక నాకు ఇప్పటికీ కథ కథగా నచ్చింది. నేనేదో విమర్శకుడిని కాను కానీ నాకు తోచింది చెబుతాను: కథావిశ్లేషణ చేస్తున్నప్పుడు ఆ పాత్రలు విశ్లేషణాపరిధిలోకో, విశ్లేషకుల దృక్పథంలోకో వచ్చేట్టు చూడటం సరియైన పద్ధతి కాదేమోనని నా అభిప్రాయం. మరి చెయ్యవలసిందేమిటి అంటే కథావిశ్లేషణాపరిధిని ఆయా పాత్రల చుట్టూ గీసుకోవటం! పాత్రలు ముందు పుట్టాయి విశ్లేషణ కన్నా. అలాంటప్పుడు గాల్లో ఎక్కడో నిలబడి భూమి మీద విషయాన్ని గురించి పుంఖానుపుంఖాలుగా వ్రాసే లోపుగా అసలు విశ్లేషిస్తున్న కథావస్తువునైనా పరిధిలోకి తీసుకోవాలా వద్దా? కథలోని ఒక్కో పాత్రలో నిలబడి చూస్తే ఎవరికి వారు తమ పరిధులను దాటకుండా “ఉదాత్తంగా” అయినా కాకున్నా హుందాగానే ప్రవర్తించారు.

    కథలోని మూడు పాత్రలకూ బలహీనతలున్నాయి. భర్తని నిలదీయలేని, దూరం చేసుకోలేని బలహీనత దీప పాత్రది. దీపతో వివాహబంధానికి ద్రోహం చేస్తున్నా, గోపికను వదులుకోలేక తన గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతూ, అయినా జన్మతః వచ్చిన సంస్కారం వల్లనో మరొక కారణం వల్లనో ఇద్దరినీ గౌరవిస్తూనే సాగే పాత్ర మోహన్. మరొకరిని నమ్మి కుటుంబాన్ని వదిలి కోల్పోయిన దాని కోసం వెనక్కి వెళ్ళే ధైర్యం లేక, ప్రపంచాన్ని ఎదిరించి ఒక్కర్తీ గౌరవంగా బ్రతికే ధైర్యమూ లేక తోచిన పద్ధతిలో బ్రతుకుతూ మింగలేక కక్కలేక బతికే పాత్ర గోపిక. అందరివీ “సామాన్యమైన” పాత్రలే, బలహీనమైన బ్రతుకులే.

    చిన్న సామ్యం తోచింది ఇది వ్రాస్తోంటే: చీకటిలో దీపతో కలసి నడుస్తూ ఒక దిగుడు బావిలో పడ్డాడు మోహన్. పై నుంచి చూస్తున్నా, భర్త బావిలో ఉన్నాడని గ్రహించినా ఏమీ చెయ్యలేని పాత్ర దీపది. పైకొచ్చే ప్రయత్నం చెయ్యకుండా ఎందుకు, ఎలా పడ్డాడో ఆలోచిస్తూ ఉన్న పాత్ర మోహన్‌ది. అప్పటికే అదే దిగుడు బావిలో పడి పైకి ఎలా వెళ్ళాలో తెలిసినా బావిలోనే “బ్రతుకు” ఏర్పరచుకుని రాజీ పడిన పాత్ర గోపికది. ఇలా చూస్తే ఆయా పాత్రల limitations అర్థమవుతాయి, ఆ limitations వల్ల తమని తాము నిందించుకున్నా నిందించకున్నా పక్క వాళ్ళని నిందించకుండా తమ సమస్యలకి తామే కారణం అనే realization కనిపిస్తుంది ఈ పాత్రల్లో. ఏమంటారు?

    డొక్కా ఫణి గారికి అభినందనపూర్వక ధన్యవాదముతో,
    నచకి

  3. సీతా-రామా గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/25/2007 8:39 am

    కొత్తపాళీ గారికి,

    నా కథ గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకు, కథ వ్రాయటంలో మీ అనుభవంనుంచి మీరిచ్చిన సలహాలకు మీకు మరీ,మరీ నా కృతజ్ఞతలు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  4. ఇద్దరు దుర్మార్గులు గురించి Anil Ivaturi గారి అభిప్రాయం:

    03/22/2007 12:46 pm

    kiran గారి అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను.
    *********
    కధ కన్నా ప్రసాద్ గారి విశ్లేషన నాకు బాగా నచ్చింది. కథ లోని ప్రతి పాత్రయొక్క నిజస్వరూపాన్ని కల్లకు కట్టినట్లు వివరించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

    కిరణ్.
    *******

  5. అర్హత గురించి Shailaja గారి అభిప్రాయం:

    03/22/2007 1:11 am

    చాల రోజుల తరవాత మంచి romantic story చదివేను… it is very nice….

  6. కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి గురించి కాజ సుధాకర బాబు గారి అభిప్రాయం:

    03/21/2007 10:51 am

    నమస్కారము.

    తెలుగు వికిపిడియాలో వివిధ రచనలను గురించిన వ్యాసాలు పెంచాల్సిన అవుసరం ఉంది. ప్రసిద్ధ తెలుగు గ్రంధాలగురించి వ్యాసాలు మొదలుపెట్టబోతున్నాము.

    ఈ రచనను (యధాతధంగా) తెలుగు వికిపిడియాలో వాడుకొనవచ్చునా?

    సుధాకర బాబు

  7. పునశ్చరణం గురించి P. Siva గారి అభిప్రాయం:

    03/19/2007 2:25 pm

    సరిగ్గా అతకని రెండో సిమిలీని వదిలేసి ఉండవలసింది.

  8. సీతా-రామా గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    03/19/2007 8:01 am

    రవికిరణ్ గారూ,

    ఇంత క్లిష్టమైన కథా వస్తువుని మొదటికథకి ఎంచుకోవటం మీ సాహసం. దాన్ని చాలా సున్నితంగా చెప్పబూనటం మీ ఆత్మవిశ్వాసం. మీ రచనలో మంచి కథలు సృష్టించగల అత్యవసర లక్షణాలన్నీ ఉన్నాయి.
    పాఠకుడిగా కొన్ని సూచనలు:
    1. కథకి ముందు చదివించే గుణం ఉండాలి. వస్తువు, కథనంలోని క్లిష్టత దీనికి అడ్డం కారాదు. ఇది ఎక్కడ ఎందుకు కుంటుపడించో ఆలోచించండి.
    2. పేర్ల లింగ మార్పిడి 🙂 మీరాశించిన ఫలితాన్ని ఇవ్వలేదు; ఏదో జిమ్మిక్ అనిపిస్తుంది. కథలో అసలు లోతునించి దారి మళ్ళిస్తుంది.
    3. ఇద్దరు వ్యక్తుల దృష్ట్యా కథ చెప్పటం సామాన్యం కాదు.
    కొన్ని కథలు రాసి నేను నేర్చుకున్న పాఠాలు
    1. చాలా చెప్పెయ్యాలన్న కుతూహలాన్ని, తొందరని నిర్దాక్షిణ్యంగా తొక్కి పట్టండి.
    2. కథని బలవంతంగా ముగించే ప్రయత్నం చెయ్యకండి. కొన్ని కథలకి ఏ ముగింపూ లేకపోవడమే సరైన ముగింపు.
    3. ఏ వాక్యం, ఏ మాట ఎవరు చెబుతున్నారు, వాళ్ళ దృక్కోణం ఎటువంటిది అని గమనించండి. రెండు పాత్రలు కథ చెపుతున్నప్పుడు వాళ్ళ కిద్దరికీ తమదైన స్వరం (unique voice) ఉండాలి.

    మీనించి ఇంకా మంచి కథలు వస్తాయని ఆశిస్తూ ..

  9. పునశ్చరణం గురించి స్వాతి గారి అభిప్రాయం:

    03/19/2007 5:03 am

    అద్భుతం!!
    బిడ్డను కన్న ప్రతి తల్లికీ
    కవిత రాసిన ప్రతి వారికి అనుభవమే ఇది.

  10. అంతరం గురించి balarama గారి అభిప్రాయం:

    03/18/2007 6:20 pm

    హాస్యాన్ని ధ్వనిస్తూనే ఒక సున్నితమైన సమస్యని పాఠకుల ముందుకు తీసుకు వచ్చారు రచయిత.

« 1 ... 1516 1517 1518 1519 1520 ... 1582 »