రవిశంకర్ గారి కవిత్వం అంటే ఇష్టపడే వాళ్ళల్లో నేనొకణ్ణి. ఈ వ్యాసం మొదటి భాగం కవితా సమీక్ష ఉన్నట్లుగా నవలా సమీక్ష లేదు.
నవీన్ గారు ఆయన అనుభవాలు రాసారు. అమెరికాలో జరిగే కొన్ని విషయాల గురించి పైపైనే స్పృశించి చెప్పారు. అందువల్ల ఇది ఇండియానుండి వచ్చేవాళ్ళకి గైడులా ఎలా ఉపయోగపడుతుంది? ఈ నవల్లో చాలా చోట్ల పొందుపర్చిన వివరాలు సరిగ్గా లేవు. తెలీని వాళ్ళకి పరవాలేదు కానీ, అమెరికాలో ఉంటున్న వాళ్ళకి ఈ నవల ఓ పట్టాన మింగుడుపడదు.
ఎయిర్ పోర్ట్లో అమెరికన్ సంభాషణ గురించి ఈ వ్యాసంలో రాయలేదు. ఇరాక్ యుద్ధం గురించి నవీన్ గారేమనుకుంటున్నారో అది అమెరికన్తో మాట్లాడినట్లుగా రాసారు. పరిచయం లేని వ్యక్తుల దగ్గర అమెరికన్లు అంత లా మనసు విప్పి చెప్పరు. సిడ్నీ షెల్డన్ నవల్లో సెక్స్ లేకపోతే ఇక్కడ పుస్తకాలెవరూ కొనరన్నట్లుగా రాసారు. అది మాత్రం నిజం కాదు. ఇలాంటి చోటే నవీన్ సొంత అభిప్రాయాల్ని చొప్పించారన్నట్లుగా ఉంది. ఇవేమీ ఈ వ్యాస సమీక్షలో రాయలేదు. ఇది ఖచ్చితంగా రివ్యూ రాసేటి నవలల జాబితాలో చేరదు. వ్యాస రచయిత చెప్పినట్లుగా ఒక్క బిగిని చదివేసే నవల మాత్రం కాదు.
ప్రశంసల దగ్గర పెల్లుబికిన విశేషణాలు విమర్శ దగ్గర మౌనం వహించడం ఈ వ్యాసంలో కొట్టచ్చినట్లుగా కనిపించింది. నవల చదివితే ఈ అభిప్రాయం మరింత నిర్ధారింప బడుతుంది. ఇదే ఏ పేరులేని మామూలు రచయితో రాస్తే ఇలా రివ్యూలకి నోచుకుంటుందా? అందుకే అతితక్కువగా మెల్లని స్వరంలో విమర్శ సాగింది.
యాత్రా నవల అన్నారు. అంటే యాత్ర చేస్తూ రాసిన నవలనా లేక యాత్ర గురించి నవలనా? ట్రావెలాగ్ అని అనుంటే పోయేది. మరలా నవల అంటూ ఈ బిల్డప్పు ఏమిటి? నవలకి కావల్సిన మౌలిక లక్షణాలు ఈ పుస్తకంలో ఏ కోశానా కనిపించవు. అది వ్యాస రచయిత ఎక్కడా చెప్పినట్లు లేదు. విమర్శ మాత్రం ఘాటుగా లేదు. మరీ చెయ్య లేదనకుండా “కవర్ డిజైన్” సరిగ్గా లేదు. ఇంకాస్త శ్రద్ధ చూపిస్తే బాగుండేది అని రాసారు. ఇందులో నవలా వస్తు విమర్శ లేదు. స్నేహ పూర్వక సమీక్షలా వుంది.అందుబాటులో వుంటే చదవండి. చదివాక మీరూ నాతో ఏకభవిస్తారన్న నమ్మకం నాకుంది.
మాధవ్ గారూ,
అభిప్రాయాలు రాసేవాళ్ళు, వాళ్ళ తరపునో, వీళ్ళ తరపునో రాయరు.
కథావస్తువు, నాకు విపరీతంగా నచ్చింది. పంటికింద ఇన్ని “వన్నండాఫ్ ఇంచీ” సైజు రాళ్ళు పడ్డంతో, చెడ్డ చిరాకు వేసింది. అలా కాకుండా వుంటే, కారా మేస్టారి కథ మీద జరిగిన అద్భుతవైన “యుధ్ధం” లాటిది జరిగుండేది. అది తప్పిపోయింది. అదీ నా బాధ.
మీరు రాసిన, “తప్పులెందుకున్నై?” రెండు సార్లూ ఒకేలా రాసినా, ఒకసారి దబాయింపుగానూ, రెండోసారి సామరస్యం గానూ ఎలా వినిపించాయి మీకు?
అలాగే అద్రుష్టానికీ, అదృష్టానికీ తేడా ఏవిటో? (మీరు రాసిన వాక్యంలో మీ వొళ్ళుమంటే కనిపించింది. సరైన వుదాహరణ కాదు. “మోహన” గారు రాసినది ఒకసారి చదవండి. క్షమించాలి. సంపాదకులు అన్నీ తెలిసినవాళ్ళు. వాళ్ళు ప్రాచీన గ్రంథాలు అన్ని భాషలలోవీ, పరాయి భాషల్లో వస్తున్న సమకాలీన సాహిత్యం మాత్రమే చదువుతారు. “బై ది బై” వ్యావహారిక భాషకి కూడా “వృధ్ధ వ్యాకరణం” ఎవరైనా రాసేరా? జయంతి వారు అంత “పులేసం” కట్టేరో, “వ్యావహారిక భాష” మీద, మీ వల్ల తెలియడం నా అద్రుష్టం. మీ 2011 వుదాహరణ, “వుయ్ హావ్ టు టీచ్ దిస్ బగ్గ ఎ లెసన్” లాగే వినబడుతోంది. మాది రాణీగారింగ్లీషు లేదా రెన్ & మార్టిన్ ఇంకా కాదంటే ఎన్ డీ వీ ప్రసాద రావు ఇంగ్లీషు. సెమించాలి.)
ఇక, మాకు మీ అభిప్రాయాలే ముఖ్యం అన్న ముక్క నాకసలు అర్థం కాలేదు.
పాఠకులు రాసే అభిప్రాయాల వల్ల ఈ మాటకి ఏం ఒరుగుతుందో నాకు తెలీదు.
ఒక రచయిత రాసిన దాని మీద మిగిలిన వాళ్ళు ఏవైనా రాస్తే బ్లాకులు కట్టి మరీ వేసే సంపాదకులు, వాళ్ళని ఎవరైనా ఏవైనా అంటే, ఇలా వొంటికాలి మీద లేవడం, సహజవే కాబోలు.
ఇయన్నీ వొగ్గెద్దురూ. మీకు తెల్దని కాదు. వొకటే మందు, ఇలాటి తిక్కోళ్ళకి. అళ్ళెప్పుడైనా ఏటైనా రాసి పమ్మిస్తే, ఆర్ అని రెడ్డీంకు తో సున్నా సుట్టీసి, పక్కనొడేయాల. “అచ్చా! మావఁలాటోళ్ళవి కావంటారా” అవును కాబోలు.
రమాదేవిగారు,
పనిగట్టుకుని ఇంగ్లీషులో ఉన్న సైన్స్ పదాలని తర్జుమా చేసి పాఠ్యపుస్తకాల్లో వెయ్యడం గురించిన మీ అభిప్రాయం చాలా సబబైనది. తెలుగు మీడియంలో చదువుకునేవారి కష్టాలు గురించి నాకు పెద్దగా అవగాహన లేదు కానీ మా తెలుగు మీడియం స్నేహితులు Hill Reaction కి కొండ చర్య లాంటి తర్జుమాలు సరదాగా చేయడం గుర్తొచ్చి ఇది ఎంత వృథాప్రయాసో ఇప్పుడు అర్థమవుతోంది.
ఇకపోతే తెలుగు పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకి కలగజేయడం గురించి. ఈమధ్యనే నేను మన దేశం వచ్చినప్పుడు, అక్కడ పిల్లలు (ప్రాథమికి పాఠశాలలో ఒకటి, మూడు తరగతులలో చదువుతున్న వాళ్ళు) పరీక్షలకోసం బట్టీ పడుతున్న విధానం చూసి కొన్ని విషయాలు స్ఫురించాయి. నేను చదువుకున్నప్పటికీ, ఇప్పటికీ అక్కడ విద్యావ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదు. మూడవ తరగతిలో ఉన్న పిల్లలు కాకతీయ సామ్రాజ్యం గురించిన వివరాలు బట్టీ కొట్టడమే కాకుండా సమాధానాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా రాయకపోతే మార్కులు తగ్గి రాంకు పడిపోతుంది. దీనిని 2nd grade చదువుతున్న మా అమ్మాయికి ఇక్కడ చదువు చెప్పే విధానంతో పోల్చి చూసాను. ప్రపంచపటంలో ఇష్టమైన దేశం ఏదో ఒక దానిని ఎంచుకుని లైబ్రరీలోనో మరొక చోటో దొరికిన పుస్తకాలు చదివి, ఇంటర్నెట్లో సోధించి (పెద్దవాళ్ళ సహాయంతో), presentation తయారుచేసి క్లాస్ లో present చేయాలి. ఇలాటివి కాక రోజూ ఇంట్లో కొంత సమయం పుస్తక పఠనానికి వెచ్చించాలి, (ఒకటవ తరగతి నుంచి ఈ సమయాన్ని పెంచుకుంటూ వెడతారు). నాలుగు, ఐదు తరగతులలోకి వచ్చేటప్పడికి, chapter books చదివి వాటి మీద చిన్న సమీక్షలు రాయడం అలవాటు చేస్తారు. Inner city schools, impoverished school districts లో చదువుకునే పిల్లల విషయంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నప్పటికీ (primarily due to socio-economic condiions), చిన్నప్పటినుంచీ చదవడం అనే అలవాటు వలన చాలామంది పిల్లలు ఎంతో లాభం పొందుతున్నారు. ఈ విధంగా పిల్లలచేత పుష్కలంగా చిన్నప్పటినుంచే పుస్తకాలు చదివే అలవాటు మన educational system లో నాకు ఇప్పటికీ అంత పెద్దగా కనపడదు.
మీరు ఈ విషయమై ఎవో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నా e-mail మీకు తప్పక పంపుతాను. మీ ప్రయత్నాల వివరాలు తెలిపినట్లైతే ఉడతా భక్తిగా నాకు చేతనైనది తప్పక చేస్తాను. మన మాతృభాష మీద పిల్లలకి గౌరవము, అభిమానము కలగజేయడం మన వలన మాత్రమే అయ్యే పని, విద్యాసంస్థలూ, విద్యాధికారులూ, మంత్రాంగాలూ ఏదో చేస్తారనుకోవడం మన భ్రమ.
అవును రమాదేవి గారూ, మీ observation చాలా రైట్ సుమా. భాష బోధనలో తల్లితండ్రులూ, టీచర్లూ, educational institutions policies — ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. ఇప్పుడైతే ఈమూడు ఒక నిర్లక్ష్య ధోరణి, లేదా నిరాసక్తత, అయోమయం అదీకాకపోతే స్పష్టంగా చెప్పాలంటే “బాధ్యతారాహిత్యం”తో వున్నాయో. పిల్లలకి “మంచి తెలుగు” ఎక్కడ్నించి వస్తుందీ? ఎవరు నేర్పుతారూ?? ఇది ఎందరో ఆలొచించవలసిన విషయం ఇవాళ. టీచర్లకే రాని తెలుగుని అమ్మ, నాన్నా మట్లాడటం మానేస్తున్న తెలుగుని, రాజకీయనాయకుల వింత పలుకుబడిని చూస్తూ అసలు ఇవాళ్టి చిన్నపిల్లలకి తెలుగుని గురించి ఎమన్నా తెలుస్తుందా? మనకి మాతృభాషాభిమానం లేదు. మనం చాలా సునాయాసంగా ఇతరులని అనుకరిస్తూ బతికేయగలం. మనకి “ఐడెంటిటీ క్రైసిస్” అస్సలు లేదు. అందువల్ల చాలా విలువైనవాటిని చేజార్చేసుకుంటున్నాం. రెండు తరాలు భాషని వాడటం మానేస్తే ఆ భాష తప్పకుండా వాడుకకి పనికిరాకుండా పోతుంది. తాతలు దిగిరావాలి మళ్లీ భాషని వుద్ధరించాలంటే. నిర్బంధంగానైనా, ప్రేమగానైనా, భాషని నిలబెట్టుకొవడానికి ఏ పద్ధతులు అనుసరణీయమో ఆయా విధానలని మనం నిర్మొహమాటంగా పాటించాలి. భాషకి పరమ శత్రువులు యునివెర్సిటీ వాళ్ళే. వాళ్ళు రూపొందిచే పాఠాలని నాలాంటి వాళ్ళే చదవలేరు. ఇహ పిల్లలేమిటి చదివేది? భాషని భోదించటం కూడా క్రియేటివిటీనే. ఆ లక్షణాలున్న టీచర్లు ఇవ్వాళ విశ్వవిద్యాలయాలనించీ చిన్న స్కూళ్ళ దాకా మనకి కనబడరు. లోపలనించి institutions వాళ్ళు తేవాల్సిన మార్పులని బయటనించీ మనం తీసుకురాలేంకదా? ముఖ్యంగా ఆఫీసులకు వెడుతూనో లేదా గృహిణిగా గడుపుతూనో మనం ఎలాంటి మార్పులు తేగలమని మీరు అనుకుంటున్నారో చెప్పండి. మనలాగా ఆలోచించే ఇతరులు ఇంకా ఏమని అంటారో కూడా విందాం.
మీ ఆందోళన చాలామంది ఆందోళన అనే నేనూ అనుకుంటున్నాను. నాలాగా, బాబ్జీలు గారి లాగా ఎందరో వుండేవుంటారు. ఒక network కావలసి వుంటుంది. అప్పుడు ఏమైనా share చేసుకోగలం. ఏ ఆలోచననైనా ఒక కార్యరూపానికి మార్చగలం. ఒక ముఖ్య విషయాన్ని మీరు మరోసారి నలుగురిముందుకి తెచ్చినందుకు మీకు నా అభినందనలు.
ఇప్పటికే ఇక్కడ చాలా మంది చాలా విషయాలు ప్రస్తావించేసారు కానీ తెలుగు మీడియం లో చదివి (1979 ముందు) ఇప్పటి తెలుగు మీడియమ్ పుస్తకాలు చదివి, మా ఇద్దరి పిల్లలు, ఇంగ్లీషు మీడియమ్ లో తెలుగు మీడియమ్ లో చదివిన మిగిలిన పిల్లలని చూసి, నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలని వెలిబుచాలని ఈ మాటలు.
తెలుగు మాధ్యమానికి తెలుగు భాష సజీవ స్రవంతి లా వుండడానికి తేడా వుంది. నేను నేర్చుకొన్నప్పుడు ఇన్ని కష్టమైన తెలుగు పదాలని సృష్టించే ఈ పద్ధతి లేదు. హాయిగా అటమ్ అంటె ఆటమ్ అనే చదువు కొన్నాం కానీ ఇప్పుడు పరమాణువు అని ఒక కొత్త పదాన్ని నేర్చుకోవాలి, ద్రావణి, ద్రావణేయత అని నేర్చుకొని, మళ్ళీ ఇంగ్లీషులో తర్జుమా చేసుకొవాలి . ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళినా కష్టమే. కాబట్టి తెలుగు లో చదివిన వాడు తనకి అవకాశాలు వుండాలి పెరగాలి అనే వుద్దెశం ఎక్కువ కనిపిస్తోంది. బాబ్జీలు గారన్నట్లు రేపు చైనేస్ నెర్చుకొంటే అవకాశాలు ఎక్కువ అనిపిస్తే అదే నేర్చుకుంటాము. ఇది పరమ సత్యం – తెలుగు కీ దీనికీ సంబంధంలేదు.
భాష కి సాహిత్యమంతో పరిచయం ఎక్కువ బలాన్నిస్తుంది. విస్తృతమైన పఠనతోనే ఇది సాధ్యమవుతుంది. కాని ఇప్పుడు తెలుగు సాహిత్యంతో పరిచయం తక్కువ అయిపోయింది. తెలుగు పఠనం చాలా తగ్గిపొయింది. ఈ రెండు అంశాలు ప్రోత్సహిస్తే చాల బాగుంటుంది
( Sorry it is taking too long to type in Telugu. So please excuse me for this switch )
Nowadays everything is glamorized and popularized. Including PETA sort of activism. So there should be a popularization spiced with some glamor. Like Indina idol , KBC sort.
Sankaraabharanam undoubtedly made more people start learn classical music. It compeled people to taste the classical music. I feel sad for my not able to share the the beauty in the telugu literature with my sons. But they feel that I am silly and crazy to expect them so. They don”t mind taking extra efforts to learn about space shutles and moon rovers since it gives them identity. and recognition. we had a small quiz comepetition in Ramayanam charecters on our corporation day. Even small questions were not known to many or most were indifferent to show their knowledge. But the same gathering was asked on something more popular subject everybody was curious or showed interest. The question here is not about Ramayanam It is about the subject being a popular one or “in-thing”. So
Please note that even people who studied in telugu medium are not very comfortable when it comes to enjoying a small story in telugu or small kavitha. There are so many telugu medium students who have not read anything other than their text books. If you ask them if they have read anything other than their text books the answer one gets is no. So what exactly is our aim and objective?
I went to telugu university to ask for some help in popularizing telugu among school going children. But the people who are ready to spend lacs on popularizing to foreign nationals had no interest in this particular thing. The teachers are helpless but to teach children who feel that it is just for 10th percentage which can be dumped once exam is over. Many times the teachers themselves will not have any enthusiasm to enthuse any interest.
If any body who is really interested to promote the language other than writing or taking in elite platforms I will be most happy to work along with them. I am desperately looking for someone to help me.
Bujjilugaaru or Rama gaaru or someone who are able to understand my point if you can give your email ids I will be most happy.
ఎంత రంధ్రాన్వేషణ ఐనా ఇలా ప్రతీ అచ్చుతప్పూ ఏకరువు పెట్టక్కర్లేదనుకుంటాను. ఎక్కడా లేని ఇన్ని తప్పులీ కథకే ఎందుకున్నై? అనడిగితే సరిపోయేది.
తప్పులెందుకున్నై? అని దబాయించే బదులు తప్పులెందుకున్నై? అని సామరస్యంగా అడిగితే, 2005లో ఈమాట సంపాదకుల సాదకబాధకాలు ఏమైనా తెలిసేవేమో. ఇప్పుడిక తెలీవు, వారు చెప్పరు కాబట్టి.
కానీ, ఒకటి మాత్రం నిజం. సంపాదకులదే బాధ్యత, తప్పైనా ఒప్పైనా, అప్పుడైనా, ఇప్పుడైనా ఇంకెప్పుడైనా. అందుకని ఇప్పుడూ తప్పు మాదే.. అలాగే 2011లో ఒక పాఠకుడు…
“అద్రుష్టానికీ, అదృష్టానికీ – క్రుతజ్ఞతకీ, కృతజ్ఞతకీ తేడా తెలియని సంపాదకు లుండడం మన టెల్గూ* భాష దరిద్రం.
– ఒక పాఠకుడు.
(* టెల్గూ అనేది జాన్ స్మిత్ ప్రభావం వల్ల రాసినది)
– అని తిడితే, అప్పుడూ తప్పు మాదే. తప్పదు కదా మరి? ఐనా పర్లేదు లేండి. మాకు మీ అభిప్రాయాలు ముఖ్యం.
మాధవ్ మాచవరం
(ఈమాట సంపాదకుల తరపున అని రాయదల్చుకోలేదు, వారి అనుమతి అడగలేదు కాబట్టి)
ఈ మాట సంపాదకులకు,
“ప్రూఫ్ రీడింగ్” బాధ్యత ఎవరిది?
రాసిన వారిదా? ప్రచురించేవారిదా?
ఈ కథ లోనే ఇన్ని తప్పులెలా దొర్లేయి? ఇన్ని అచ్చుతప్పులు ఇంకెక్కడా లేవు. అభిప్రాయాలులో తప్ప. (నేను రాసిన వాటిలోనే కొన్ని మా నాలుగోక్లాసు నాన్నమ్మ చదివి, “నాకు చూపించేకే పంపించు” అంది. తప్పైపోయింది క్షమించు అనగలిగేను)
మచ్చుకి…
“ఇదిగో లింగమ్మా నువ్వు ఈ కోర్టుంఉందు…” ( అందుకే లింగమ్మకి అన్నం నీళ్ళు బంద్ అన్న ఒక్క మాట అర్థమైంది, కోర్టంఉందు ఎవరికీ అర్థంకాదు)
“విశయం” (తెలంగాణా యాసా?)
“ఒక రకంగా వాళ్ళు కూడా ఆవిడ పక్షాన చేరరేమో” (పత్రికల వాళ్ళు, ఆవిడ పక్షాన చేరేరేమో కదా?)
“నష్ఠపోవడం” (బహుశా నష్టం తాలూకా బాధని ధ్వనింపచేయడం కోసం అయుండొచ్చు)
“ఒక సాధారణ పౌరిడికి..” ( సాధారణ పౌరుడు, కోన్ కిస్కా గాడు. వాడి గురించి ఎలా రాసినా తప్పు కాదు. వోటర్ల లిస్టులో వాడి “ఫోటో” బదులు మరొహడిది వేసినా, “ఫొటొ” సరిగ్గానే వుంటుంది, పేరు మార్చేసినా ఎవడిక్కావాలి?)
“నా కొడుకుని ఉత్త పుక్యానికి నోముకున్నారు..”
“దృష్ఠీ” (దృష్టి తీవ్రత కోసవేమో?)
ఇక వాక్యాల “విశయం.”
రచయిత కి తెలంగాణా యాస మీద పట్టులేదు. పట్టు లేని విషయాన్ని పట్టించుకోకూడదు, రచయిత. లేకపోతే అప్పటిదాకా “మరియాదస్తుల” భాషలో సాగే వాక్యం ఆవుపెయ్యా కాదు, గేదే పెయ్యా కాదు అన్నట్టు తయారవుతుంది.
వుదాహరణకి:
“మొఖాలు ఎర్రగా చేసుకోవడం తప్ప మరేం చేయలేక పోయినరు”
“అందుకే గుర్రుగా … చూస్తున్నరు ఇద్దరూ”
“.. టీవీ వాళ్ళొచ్చినరు, … మట్లాడినరు..” ఎస్సై ఇంటి దారి పట్టినడు.
లింగమ్మ జడ్జీ గారితో శిష్ట వ్యావహారికంలోనే మొదలెట్టి, తెలంగాణా యాసలోకి వెళిపోతుంది.
“నీ కాల్మొక్కుత..” తప్పు. “నీ కాల్మొక్త..” ఆయనెవరండీ, ముప్ఫై, నలభైయేళ్ళ కిందటే అంత చక్కగా రాసేరు. ఇప్పుడేవొచ్చిందీ?
రాసిన ప్రతిసారీ “భాషా” అనే రాసేరు. అందరూ “బాషా” అనే అంటారు. “అలీఫ్, బే… ల్లో కూడా “భ” లేదనే అనుకుంటున్నాను. “మోహన” గారేవయినా చెప్పగల్రా? లేదంటె మా సాజిద్ నడిగితే తెలిసిపోతుంది. అడుగుతాను.
ఈ కింది వాక్యం “ఇండిపెండెంటు” గా చదివి “కర్తా, కర్మా మరియు క్రియ” చెప్పగలిగిన వాళ్ళకి సాహిత్య అకాడెమీ “ప్రైజు గేరంటు” (అమంగళము ప్రతిహతమౌగాక)
“హైదరాబాదులో మిత్రుడు, హైకోర్టు జడ్జీ ఒకాయన పిల్లవాడి పెళ్ళికి వెళితే ఆయన నోటి మీదుగా విన్న విషయం….”
(రసాత్మకవైన వాక్యం అందరికీ అదే రసాన్ని అందించాలి. లేకపోతే అది రాసినవాడిదే తప్పు. చదివిన వారిది కాదు.)
“విప్లవ్ గారితో గొడవ/అభిప్రాయభేదం వల్ల ఇలా “రంధ్రాన్వేషణ” చేస్తున్నాడెహె” అని అనొచ్చు. (నాకే అనిపించింది. నచ్చకపోతె వదిలెయ్యొచ్చుగా? ఎందుకింత రాధ్ధంతం? పిల్లలు ఎలాగా తిడుతున్నారు ఈ మాట చదవటం మొదలెట్టేక వాళ్ళతో ఆడ్డం, వగైరాలు మానేసేనని)
నిజాయితీ గురించి బాధపడేవాళ్ళు నిజవైన వాళ్ళు. విప్లవ్ గారికి నిజాయితీ గురించి
నిర్దుష్టవైన అభిప్రాయం వుంది. ఇలాటి వారి రచనల గురించే వివరంగా రాయాలి.
ఈ రచనలో నిజాయితీ వుంది. ఇంకేం లేదు.
ఇక వరవర రావూ, గద్దర్ గురించి: వాళ్ళిద్దర్నీ “లింగమ్మ” తప్పు పట్టింది. వీళ్ళిద్దరూ ఏవనకుండావుంటే ఆవిడ కొడుకు బతికుండేవాడన్న బలవైన అభిప్రాయంతో. తప్పో రైటో లింగమ్మది, రచయితది కాదు.
మై డియర్ విప్లవ్,
మరో భారత యుధ్ధాన్ని రచించగలిగిన వారని స్వయంగా చెప్పుకునారు. ఇదేం లెక్క?
అభిప్రాయాల్ని పట్టించుకోకండి. చదివేసి వూరుకోండి.
ఈ విషయం మీద రాయండి.
“ఇద్దరు నడివయసు ఆడవాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. “చెస్. ఎదవ లోకం” అన్న మూడ్ లో వున్నారిద్దరూ. ఇద్దరికీ మాటలు కలిసాక తెలిసింది ఇద్దరూ కొడుకుల్ని పోగుట్టుకున్నవాళ్ళేనని. అదికూడా “వొరం రోజుల కిందటే” ఇద్దరు కొడుకులూ పోయేరు. ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది “ఇదేటిదని”. ఒహావిడ కొడుకు పోలీసు, మరొహావిడ కొడుకు (అవిడకి తెలుసు ఎటు పోయేడో, ఎక్కడున్నాడో) చదువూ సంధ్యా, తల్లీ తండ్రీ అందర్నీ వదిలేసి చిన్నప్పుడే అటెటో పోయేడు.”
మీరు రాసినదాన్ని “కథ” అని ఇవాళ ఎవరూ అనరు. కథ చెప్పటం ఒక టెక్నిక్, ఒక క్రియేటివ్ స్కిల్. మంచి కథ ఎలా వుంటుందో Márquez ని చదివి గానీ, ఝుంపాలాహిరిని చదివి గానీ ముందు తెలుసుకొండి. కథలకేం ఎప్పుడన్న రాయొచ్చు. ఆ విద్య పట్టుబడితే. లేకపోతే మీ పరిచయం లోని బిరుదులన్నీ వ్యర్థమే సుమా..!!
అమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు – II గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
09/01/2008 12:45 pm

[ఈ కామెంటు ఎడిట్ చేయబడినది – సం.]
కేసు గురించి baabjeelu గారి అభిప్రాయం:
09/01/2008 9:50 am
మాధవ్ గారూ,
అభిప్రాయాలు రాసేవాళ్ళు, వాళ్ళ తరపునో, వీళ్ళ తరపునో రాయరు.
కథావస్తువు, నాకు విపరీతంగా నచ్చింది. పంటికింద ఇన్ని “వన్నండాఫ్ ఇంచీ” సైజు రాళ్ళు పడ్డంతో, చెడ్డ చిరాకు వేసింది. అలా కాకుండా వుంటే, కారా మేస్టారి కథ మీద జరిగిన అద్భుతవైన “యుధ్ధం” లాటిది జరిగుండేది. అది తప్పిపోయింది. అదీ నా బాధ.
మీరు రాసిన, “తప్పులెందుకున్నై?” రెండు సార్లూ ఒకేలా రాసినా, ఒకసారి దబాయింపుగానూ, రెండోసారి సామరస్యం గానూ ఎలా వినిపించాయి మీకు?
అలాగే అద్రుష్టానికీ, అదృష్టానికీ తేడా ఏవిటో? (మీరు రాసిన వాక్యంలో మీ వొళ్ళుమంటే కనిపించింది. సరైన వుదాహరణ కాదు. “మోహన” గారు రాసినది ఒకసారి చదవండి. క్షమించాలి. సంపాదకులు అన్నీ తెలిసినవాళ్ళు. వాళ్ళు ప్రాచీన గ్రంథాలు అన్ని భాషలలోవీ, పరాయి భాషల్లో వస్తున్న సమకాలీన సాహిత్యం మాత్రమే చదువుతారు. “బై ది బై” వ్యావహారిక భాషకి కూడా “వృధ్ధ వ్యాకరణం” ఎవరైనా రాసేరా? జయంతి వారు అంత “పులేసం” కట్టేరో, “వ్యావహారిక భాష” మీద, మీ వల్ల తెలియడం నా అద్రుష్టం. మీ 2011 వుదాహరణ, “వుయ్ హావ్ టు టీచ్ దిస్ బగ్గ ఎ లెసన్” లాగే వినబడుతోంది. మాది రాణీగారింగ్లీషు లేదా రెన్ & మార్టిన్ ఇంకా కాదంటే ఎన్ డీ వీ ప్రసాద రావు ఇంగ్లీషు. సెమించాలి.)
ఇక, మాకు మీ అభిప్రాయాలే ముఖ్యం అన్న ముక్క నాకసలు అర్థం కాలేదు.
పాఠకులు రాసే అభిప్రాయాల వల్ల ఈ మాటకి ఏం ఒరుగుతుందో నాకు తెలీదు.
ఒక రచయిత రాసిన దాని మీద మిగిలిన వాళ్ళు ఏవైనా రాస్తే బ్లాకులు కట్టి మరీ వేసే సంపాదకులు, వాళ్ళని ఎవరైనా ఏవైనా అంటే, ఇలా వొంటికాలి మీద లేవడం, సహజవే కాబోలు.
ఇయన్నీ వొగ్గెద్దురూ. మీకు తెల్దని కాదు. వొకటే మందు, ఇలాటి తిక్కోళ్ళకి. అళ్ళెప్పుడైనా ఏటైనా రాసి పమ్మిస్తే, ఆర్ అని రెడ్డీంకు తో సున్నా సుట్టీసి, పక్కనొడేయాల. “అచ్చా! మావఁలాటోళ్ళవి కావంటారా” అవును కాబోలు.
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
09/01/2008 9:14 am
రమాదేవిగారు,
పనిగట్టుకుని ఇంగ్లీషులో ఉన్న సైన్స్ పదాలని తర్జుమా చేసి పాఠ్యపుస్తకాల్లో వెయ్యడం గురించిన మీ అభిప్రాయం చాలా సబబైనది. తెలుగు మీడియంలో చదువుకునేవారి కష్టాలు గురించి నాకు పెద్దగా అవగాహన లేదు కానీ మా తెలుగు మీడియం స్నేహితులు Hill Reaction కి కొండ చర్య లాంటి తర్జుమాలు సరదాగా చేయడం గుర్తొచ్చి ఇది ఎంత వృథాప్రయాసో ఇప్పుడు అర్థమవుతోంది.
ఇకపోతే తెలుగు పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకి కలగజేయడం గురించి. ఈమధ్యనే నేను మన దేశం వచ్చినప్పుడు, అక్కడ పిల్లలు (ప్రాథమికి పాఠశాలలో ఒకటి, మూడు తరగతులలో చదువుతున్న వాళ్ళు) పరీక్షలకోసం బట్టీ పడుతున్న విధానం చూసి కొన్ని విషయాలు స్ఫురించాయి. నేను చదువుకున్నప్పటికీ, ఇప్పటికీ అక్కడ విద్యావ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదు. మూడవ తరగతిలో ఉన్న పిల్లలు కాకతీయ సామ్రాజ్యం గురించిన వివరాలు బట్టీ కొట్టడమే కాకుండా సమాధానాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా రాయకపోతే మార్కులు తగ్గి రాంకు పడిపోతుంది. దీనిని 2nd grade చదువుతున్న మా అమ్మాయికి ఇక్కడ చదువు చెప్పే విధానంతో పోల్చి చూసాను. ప్రపంచపటంలో ఇష్టమైన దేశం ఏదో ఒక దానిని ఎంచుకుని లైబ్రరీలోనో మరొక చోటో దొరికిన పుస్తకాలు చదివి, ఇంటర్నెట్లో సోధించి (పెద్దవాళ్ళ సహాయంతో), presentation తయారుచేసి క్లాస్ లో present చేయాలి. ఇలాటివి కాక రోజూ ఇంట్లో కొంత సమయం పుస్తక పఠనానికి వెచ్చించాలి, (ఒకటవ తరగతి నుంచి ఈ సమయాన్ని పెంచుకుంటూ వెడతారు). నాలుగు, ఐదు తరగతులలోకి వచ్చేటప్పడికి, chapter books చదివి వాటి మీద చిన్న సమీక్షలు రాయడం అలవాటు చేస్తారు. Inner city schools, impoverished school districts లో చదువుకునే పిల్లల విషయంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నప్పటికీ (primarily due to socio-economic condiions), చిన్నప్పటినుంచీ చదవడం అనే అలవాటు వలన చాలామంది పిల్లలు ఎంతో లాభం పొందుతున్నారు. ఈ విధంగా పిల్లలచేత పుష్కలంగా చిన్నప్పటినుంచే పుస్తకాలు చదివే అలవాటు మన educational system లో నాకు ఇప్పటికీ అంత పెద్దగా కనపడదు.
మీరు ఈ విషయమై ఎవో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నా e-mail మీకు తప్పక పంపుతాను. మీ ప్రయత్నాల వివరాలు తెలిపినట్లైతే ఉడతా భక్తిగా నాకు చేతనైనది తప్పక చేస్తాను. మన మాతృభాష మీద పిల్లలకి గౌరవము, అభిమానము కలగజేయడం మన వలన మాత్రమే అయ్యే పని, విద్యాసంస్థలూ, విద్యాధికారులూ, మంత్రాంగాలూ ఏదో చేస్తారనుకోవడం మన భ్రమ.
With best wishes
రాజాశంకర్ కాశీనాథుని
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి paravastu naga sai suri గారి అభిప్రాయం:
09/01/2008 3:07 am
మీరు తెలియ జెసిన సమాచారం అద్భుతం. అంతరించి పొతున్న భారత
సంస్కృతికి మూలమయిన ఈ శాస్త్రాలు కాపాడుతున్నందుకు మీకు వందనాలు.
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి rama గారి అభిప్రాయం:
09/01/2008 3:06 am
అవును రమాదేవి గారూ, మీ observation చాలా రైట్ సుమా. భాష బోధనలో తల్లితండ్రులూ, టీచర్లూ, educational institutions policies — ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. ఇప్పుడైతే ఈమూడు ఒక నిర్లక్ష్య ధోరణి, లేదా నిరాసక్తత, అయోమయం అదీకాకపోతే స్పష్టంగా చెప్పాలంటే “బాధ్యతారాహిత్యం”తో వున్నాయో. పిల్లలకి “మంచి తెలుగు” ఎక్కడ్నించి వస్తుందీ? ఎవరు నేర్పుతారూ?? ఇది ఎందరో ఆలొచించవలసిన విషయం ఇవాళ. టీచర్లకే రాని తెలుగుని అమ్మ, నాన్నా మట్లాడటం మానేస్తున్న తెలుగుని, రాజకీయనాయకుల వింత పలుకుబడిని చూస్తూ అసలు ఇవాళ్టి చిన్నపిల్లలకి తెలుగుని గురించి ఎమన్నా తెలుస్తుందా? మనకి మాతృభాషాభిమానం లేదు. మనం చాలా సునాయాసంగా ఇతరులని అనుకరిస్తూ బతికేయగలం. మనకి “ఐడెంటిటీ క్రైసిస్” అస్సలు లేదు. అందువల్ల చాలా విలువైనవాటిని చేజార్చేసుకుంటున్నాం. రెండు తరాలు భాషని వాడటం మానేస్తే ఆ భాష తప్పకుండా వాడుకకి పనికిరాకుండా పోతుంది. తాతలు దిగిరావాలి మళ్లీ భాషని వుద్ధరించాలంటే. నిర్బంధంగానైనా, ప్రేమగానైనా, భాషని నిలబెట్టుకొవడానికి ఏ పద్ధతులు అనుసరణీయమో ఆయా విధానలని మనం నిర్మొహమాటంగా పాటించాలి. భాషకి పరమ శత్రువులు యునివెర్సిటీ వాళ్ళే. వాళ్ళు రూపొందిచే పాఠాలని నాలాంటి వాళ్ళే చదవలేరు. ఇహ పిల్లలేమిటి చదివేది? భాషని భోదించటం కూడా క్రియేటివిటీనే. ఆ లక్షణాలున్న టీచర్లు ఇవ్వాళ విశ్వవిద్యాలయాలనించీ చిన్న స్కూళ్ళ దాకా మనకి కనబడరు. లోపలనించి institutions వాళ్ళు తేవాల్సిన మార్పులని బయటనించీ మనం తీసుకురాలేంకదా? ముఖ్యంగా ఆఫీసులకు వెడుతూనో లేదా గృహిణిగా గడుపుతూనో మనం ఎలాంటి మార్పులు తేగలమని మీరు అనుకుంటున్నారో చెప్పండి. మనలాగా ఆలోచించే ఇతరులు ఇంకా ఏమని అంటారో కూడా విందాం.
మీ ఆందోళన చాలామంది ఆందోళన అనే నేనూ అనుకుంటున్నాను. నాలాగా, బాబ్జీలు గారి లాగా ఎందరో వుండేవుంటారు. ఒక network కావలసి వుంటుంది. అప్పుడు ఏమైనా share చేసుకోగలం. ఏ ఆలోచననైనా ఒక కార్యరూపానికి మార్చగలం. ఒక ముఖ్య విషయాన్ని మీరు మరోసారి నలుగురిముందుకి తెచ్చినందుకు మీకు నా అభినందనలు.
RAMA
bharadwaj_rama@rediffmail.com
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి Ramadevi గారి అభిప్రాయం:
09/01/2008 12:32 am
ఇప్పటికే ఇక్కడ చాలా మంది చాలా విషయాలు ప్రస్తావించేసారు కానీ తెలుగు మీడియం లో చదివి (1979 ముందు) ఇప్పటి తెలుగు మీడియమ్ పుస్తకాలు చదివి, మా ఇద్దరి పిల్లలు, ఇంగ్లీషు మీడియమ్ లో తెలుగు మీడియమ్ లో చదివిన మిగిలిన పిల్లలని చూసి, నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలని వెలిబుచాలని ఈ మాటలు.
తెలుగు మాధ్యమానికి తెలుగు భాష సజీవ స్రవంతి లా వుండడానికి తేడా వుంది. నేను నేర్చుకొన్నప్పుడు ఇన్ని కష్టమైన తెలుగు పదాలని సృష్టించే ఈ పద్ధతి లేదు. హాయిగా అటమ్ అంటె ఆటమ్ అనే చదువు కొన్నాం కానీ ఇప్పుడు పరమాణువు అని ఒక కొత్త పదాన్ని నేర్చుకోవాలి, ద్రావణి, ద్రావణేయత అని నేర్చుకొని, మళ్ళీ ఇంగ్లీషులో తర్జుమా చేసుకొవాలి . ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళినా కష్టమే. కాబట్టి తెలుగు లో చదివిన వాడు తనకి అవకాశాలు వుండాలి పెరగాలి అనే వుద్దెశం ఎక్కువ కనిపిస్తోంది. బాబ్జీలు గారన్నట్లు రేపు చైనేస్ నెర్చుకొంటే అవకాశాలు ఎక్కువ అనిపిస్తే అదే నేర్చుకుంటాము. ఇది పరమ సత్యం – తెలుగు కీ దీనికీ సంబంధంలేదు.
భాష కి సాహిత్యమంతో పరిచయం ఎక్కువ బలాన్నిస్తుంది. విస్తృతమైన పఠనతోనే ఇది సాధ్యమవుతుంది. కాని ఇప్పుడు తెలుగు సాహిత్యంతో పరిచయం తక్కువ అయిపోయింది. తెలుగు పఠనం చాలా తగ్గిపొయింది. ఈ రెండు అంశాలు ప్రోత్సహిస్తే చాల బాగుంటుంది
( Sorry it is taking too long to type in Telugu. So please excuse me for this switch )
Nowadays everything is glamorized and popularized. Including PETA sort of activism. So there should be a popularization spiced with some glamor. Like Indina idol , KBC sort.
Sankaraabharanam undoubtedly made more people start learn classical music. It compeled people to taste the classical music. I feel sad for my not able to share the the beauty in the telugu literature with my sons. But they feel that I am silly and crazy to expect them so. They don”t mind taking extra efforts to learn about space shutles and moon rovers since it gives them identity. and recognition. we had a small quiz comepetition in Ramayanam charecters on our corporation day. Even small questions were not known to many or most were indifferent to show their knowledge. But the same gathering was asked on something more popular subject everybody was curious or showed interest. The question here is not about Ramayanam It is about the subject being a popular one or “in-thing”. So
Please note that even people who studied in telugu medium are not very comfortable when it comes to enjoying a small story in telugu or small kavitha. There are so many telugu medium students who have not read anything other than their text books. If you ask them if they have read anything other than their text books the answer one gets is no. So what exactly is our aim and objective?
I went to telugu university to ask for some help in popularizing telugu among school going children. But the people who are ready to spend lacs on popularizing to foreign nationals had no interest in this particular thing. The teachers are helpless but to teach children who feel that it is just for 10th percentage which can be dumped once exam is over. Many times the teachers themselves will not have any enthusiasm to enthuse any interest.
If any body who is really interested to promote the language other than writing or taking in elite platforms I will be most happy to work along with them. I am desperately looking for someone to help me.
Bujjilugaaru or Rama gaaru or someone who are able to understand my point if you can give your email ids I will be most happy.
Ramaadevi
rd6219@yahoo.com
కేసు గురించి Madhav గారి అభిప్రాయం:
08/31/2008 7:45 pm
బాబ్జీలు గారూ,
ఎంత రంధ్రాన్వేషణ ఐనా ఇలా ప్రతీ అచ్చుతప్పూ ఏకరువు పెట్టక్కర్లేదనుకుంటాను. ఎక్కడా లేని ఇన్ని తప్పులీ కథకే ఎందుకున్నై? అనడిగితే సరిపోయేది.
తప్పులెందుకున్నై? అని దబాయించే బదులు తప్పులెందుకున్నై? అని సామరస్యంగా అడిగితే, 2005లో ఈమాట సంపాదకుల సాదకబాధకాలు ఏమైనా తెలిసేవేమో. ఇప్పుడిక తెలీవు, వారు చెప్పరు కాబట్టి.
కానీ, ఒకటి మాత్రం నిజం. సంపాదకులదే బాధ్యత, తప్పైనా ఒప్పైనా, అప్పుడైనా, ఇప్పుడైనా ఇంకెప్పుడైనా. అందుకని ఇప్పుడూ తప్పు మాదే.. అలాగే 2011లో ఒక పాఠకుడు…
“అద్రుష్టానికీ, అదృష్టానికీ – క్రుతజ్ఞతకీ, కృతజ్ఞతకీ తేడా తెలియని సంపాదకు లుండడం మన టెల్గూ* భాష దరిద్రం.
– ఒక పాఠకుడు.
(* టెల్గూ అనేది జాన్ స్మిత్ ప్రభావం వల్ల రాసినది)
– అని తిడితే, అప్పుడూ తప్పు మాదే. తప్పదు కదా మరి? ఐనా పర్లేదు లేండి. మాకు మీ అభిప్రాయాలు ముఖ్యం.
మాధవ్ మాచవరం
(ఈమాట సంపాదకుల తరపున అని రాయదల్చుకోలేదు, వారి అనుమతి అడగలేదు కాబట్టి)
క్రీడాభిరామము:1 వ భాగం గురించి paravastu naga sai suri గారి అభిప్రాయం:
08/31/2008 7:17 pm
తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు. తాత్పర్యమ్ కూడా ఇస్తే చాలా మందికి తెలుస్తుంది.
కేసు గురించి baabjeelu గారి అభిప్రాయం:
08/31/2008 11:15 am
ఈ మాట సంపాదకులకు,
“ప్రూఫ్ రీడింగ్” బాధ్యత ఎవరిది?
రాసిన వారిదా? ప్రచురించేవారిదా?
ఈ కథ లోనే ఇన్ని తప్పులెలా దొర్లేయి? ఇన్ని అచ్చుతప్పులు ఇంకెక్కడా లేవు. అభిప్రాయాలులో తప్ప. (నేను రాసిన వాటిలోనే కొన్ని మా నాలుగోక్లాసు నాన్నమ్మ చదివి, “నాకు చూపించేకే పంపించు” అంది. తప్పైపోయింది క్షమించు అనగలిగేను)
మచ్చుకి…
“ఇదిగో లింగమ్మా నువ్వు ఈ కోర్టుంఉందు…” ( అందుకే లింగమ్మకి అన్నం నీళ్ళు బంద్ అన్న ఒక్క మాట అర్థమైంది, కోర్టంఉందు ఎవరికీ అర్థంకాదు)
“విశయం” (తెలంగాణా యాసా?)
“ఒక రకంగా వాళ్ళు కూడా ఆవిడ పక్షాన చేరరేమో” (పత్రికల వాళ్ళు, ఆవిడ పక్షాన చేరేరేమో కదా?)
“నష్ఠపోవడం” (బహుశా నష్టం తాలూకా బాధని ధ్వనింపచేయడం కోసం అయుండొచ్చు)
“ఒక సాధారణ పౌరిడికి..” ( సాధారణ పౌరుడు, కోన్ కిస్కా గాడు. వాడి గురించి ఎలా రాసినా తప్పు కాదు. వోటర్ల లిస్టులో వాడి “ఫోటో” బదులు మరొహడిది వేసినా, “ఫొటొ” సరిగ్గానే వుంటుంది, పేరు మార్చేసినా ఎవడిక్కావాలి?)
“నా కొడుకుని ఉత్త పుక్యానికి నోముకున్నారు..”
“దృష్ఠీ” (దృష్టి తీవ్రత కోసవేమో?)
ఇక వాక్యాల “విశయం.”
రచయిత కి తెలంగాణా యాస మీద పట్టులేదు. పట్టు లేని విషయాన్ని పట్టించుకోకూడదు, రచయిత. లేకపోతే అప్పటిదాకా “మరియాదస్తుల” భాషలో సాగే వాక్యం ఆవుపెయ్యా కాదు, గేదే పెయ్యా కాదు అన్నట్టు తయారవుతుంది.
వుదాహరణకి:
“మొఖాలు ఎర్రగా చేసుకోవడం తప్ప మరేం చేయలేక పోయినరు”
“అందుకే గుర్రుగా … చూస్తున్నరు ఇద్దరూ”
“.. టీవీ వాళ్ళొచ్చినరు, … మట్లాడినరు..” ఎస్సై ఇంటి దారి పట్టినడు.
లింగమ్మ జడ్జీ గారితో శిష్ట వ్యావహారికంలోనే మొదలెట్టి, తెలంగాణా యాసలోకి వెళిపోతుంది.
“నీ కాల్మొక్కుత..” తప్పు. “నీ కాల్మొక్త..” ఆయనెవరండీ, ముప్ఫై, నలభైయేళ్ళ కిందటే అంత చక్కగా రాసేరు. ఇప్పుడేవొచ్చిందీ?
రాసిన ప్రతిసారీ “భాషా” అనే రాసేరు. అందరూ “బాషా” అనే అంటారు. “అలీఫ్, బే… ల్లో కూడా “భ” లేదనే అనుకుంటున్నాను. “మోహన” గారేవయినా చెప్పగల్రా? లేదంటె మా సాజిద్ నడిగితే తెలిసిపోతుంది. అడుగుతాను.
ఈ కింది వాక్యం “ఇండిపెండెంటు” గా చదివి “కర్తా, కర్మా మరియు క్రియ” చెప్పగలిగిన వాళ్ళకి సాహిత్య అకాడెమీ “ప్రైజు గేరంటు” (అమంగళము ప్రతిహతమౌగాక)
“హైదరాబాదులో మిత్రుడు, హైకోర్టు జడ్జీ ఒకాయన పిల్లవాడి పెళ్ళికి వెళితే ఆయన నోటి మీదుగా విన్న విషయం….”
(రసాత్మకవైన వాక్యం అందరికీ అదే రసాన్ని అందించాలి. లేకపోతే అది రాసినవాడిదే తప్పు. చదివిన వారిది కాదు.)
“విప్లవ్ గారితో గొడవ/అభిప్రాయభేదం వల్ల ఇలా “రంధ్రాన్వేషణ” చేస్తున్నాడెహె” అని అనొచ్చు. (నాకే అనిపించింది. నచ్చకపోతె వదిలెయ్యొచ్చుగా? ఎందుకింత రాధ్ధంతం? పిల్లలు ఎలాగా తిడుతున్నారు ఈ మాట చదవటం మొదలెట్టేక వాళ్ళతో ఆడ్డం, వగైరాలు మానేసేనని)
నిజాయితీ గురించి బాధపడేవాళ్ళు నిజవైన వాళ్ళు. విప్లవ్ గారికి నిజాయితీ గురించి
నిర్దుష్టవైన అభిప్రాయం వుంది. ఇలాటి వారి రచనల గురించే వివరంగా రాయాలి.
ఈ రచనలో నిజాయితీ వుంది. ఇంకేం లేదు.
ఇక వరవర రావూ, గద్దర్ గురించి: వాళ్ళిద్దర్నీ “లింగమ్మ” తప్పు పట్టింది. వీళ్ళిద్దరూ ఏవనకుండావుంటే ఆవిడ కొడుకు బతికుండేవాడన్న బలవైన అభిప్రాయంతో. తప్పో రైటో లింగమ్మది, రచయితది కాదు.
మై డియర్ విప్లవ్,
మరో భారత యుధ్ధాన్ని రచించగలిగిన వారని స్వయంగా చెప్పుకునారు. ఇదేం లెక్క?
అభిప్రాయాల్ని పట్టించుకోకండి. చదివేసి వూరుకోండి.
ఈ విషయం మీద రాయండి.
“ఇద్దరు నడివయసు ఆడవాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. “చెస్. ఎదవ లోకం” అన్న మూడ్ లో వున్నారిద్దరూ. ఇద్దరికీ మాటలు కలిసాక తెలిసింది ఇద్దరూ కొడుకుల్ని పోగుట్టుకున్నవాళ్ళేనని. అదికూడా “వొరం రోజుల కిందటే” ఇద్దరు కొడుకులూ పోయేరు. ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది “ఇదేటిదని”. ఒహావిడ కొడుకు పోలీసు, మరొహావిడ కొడుకు (అవిడకి తెలుసు ఎటు పోయేడో, ఎక్కడున్నాడో) చదువూ సంధ్యా, తల్లీ తండ్రీ అందర్నీ వదిలేసి చిన్నప్పుడే అటెటో పోయేడు.”
మీలాటి వారే రాయగలరు. రాయండి.
సాయము శాయరా డింభకా! గురించి rama గారి అభిప్రాయం:
08/31/2008 7:10 am
DEAR NARAYANA SWAMEE,

రామ.