“కర్ణుడి చావుకి కారణాలనేకవనీ..పాపం అన్నీ కలిసొచ్చుంటాయి అతనికి. గయ్యాళి పెళ్ళాం, కొరగాని కొడుకు, చెప్పు చేతల్లో లేని కూతురు.”
Category Archive: సంచికలు
శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది ఈ పద్యం.
ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అది కలా నిజమా – అని తెలుసుకుందుకు గిల్లుకొనేవాడే, అంతలో కయ్యి మని హారన్ కొట్టుకొంటూ ఎదురుగా వెళ్ళిపోయిన లారీ తన శబ్దభేరిని భేదించినంత పని చేస్తే, తను చూస్తున్నది కలకాదని నిశ్చయించుకున్నాడు. ఆమె… ఆమేనా?! ఇది సాధ్యమేనా?! లేక తను భ్రమపడుతున్నాడా?!
నేను మాఘమాసాన్ని
నీవు శ్రావణమాసానివి
రెండు దేశాల మధ్య వారధులం మేవు
కొండల్ని, కోనల్ని, సముద్రాల్ని,
భాషల్ని, భావాల్ని, భేదాల్ని,
దాటి ఎగిరిన రెండు స్వేఛ్చా విహంగాలం మేవు
మనసులో ఏమూల్లో ఎక్కడ పుట్టిందో
ఈ బైపోలార్ భూతం, వాడి
మెదడుని చెర పట్టింది
వచ్చెనదె వాసంతిక
సుధాపూర్ణ విపంచిక
చారు సుందర సీమలందున
చైత్ర భామిని ప్రభవించగ
అక్టోబర్ 1952, ఆంధ్రజ్యోతి మాసపత్రిక నుండి పునః ప్రచురణ
అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ రంకెలు వేసి
అమ్మో మమ్మీ వెనక ఉలుబులుకు దాంకో పారిపో పారిపో.
ఇప్పటికి 4500 సంవత్సరాలకి పూర్వమే, మహా వైభవంగా సాగిన పురాతన ఈజిప్ట్ చక్రవర్తుల (ఫెరోల) పాలనలో ప్రముఖ పాత్ర వహించిన హైరోగ్లిఫ్ లిపి కాల గర్భంలో కలిసిపోయి, దాదాపు 1500 సంవత్సరాల కాలం తరవాత, ఒకదాని తరవాత మరొక అద్భుత పరిశోధనల సముదాయం వల్ల, మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆ కథా వివరాలే ఇక్కడ ప్రస్తావన.
హిందుస్తానీ గాత్రంలో ప్రాచుర్యంలో ఉన్న వివిధ పద్ధతులను వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
సరికొత్త కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల! ఈ సంచిక “కన్యాశుల్కం” ప్రత్యేక సంచిక.
రాయ్ కథలు చదువుతూ ఉంటే కూడా ఆయన స్క్ర్రీన్ ప్లే చూస్తున్న భావన కలుగుతుంది.
ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.
కంటికి కనిపించే ప్రపంచమంతా నిజం కాదు; నిజమైన ప్రపంచం అంతా కంటికి కనిపించదు.
వానలో తడిసినప్పుడు
పాత గాయాలేవో సలపరించినట్టు
నీ పాటలో తడిసినప్పుడు
మానిన జ్ఞాపకాలు
మళ్ళీ బాధ పెడతాయి.
అడవిలో మరొక సారి
తప్పిపోవాలనుంది
ఇవి రాయటానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, ఈమాట వంటి అంతర్జాతీయ వెబ్ పత్రిక నడపటంలో ఒక ముఖ్య ఉద్దేశ్యం – ప్రవాసాంధ్రుల అనుభవాలు అందరితోటీ పంచుకోటం కాబట్టి, ఈమాటను ఒక వేదికగా తీసుకొని మా అనుభవాలు పంచుకోవాలని. రెండవది, మేము ఫ్రాన్స్ నుంచి అమెరికా తిరిగి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. మా జ్ఞాపకాలు, అనుభవాలు మరిచి పోకముందే వాటిని రాతపూర్వకంగా పొందుపరచాలని!
నారాయణరావు గారి అనువాదం కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ చదివించింది. అనువాదమే కాదు; ఆయన రాసిన వెనుక మాట (The Play in Context) నూతన ప్రేరణనిచ్చి, తిరిగి ఆలోచించవలసిన అవసరం కల్పించింది. వెనుక మాటలో నారాయణరావుగారు ఒక సరికొత్త ప్రతిపాదన చేసారు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. తన ప్రతిపాదనని సోపపత్తికంగా సమర్థించారు.
నూరేళ్ళ సమగ్ర పరిశోధనల తర్వాత కూడా కన్యాశుల్కం గురించి మనకింకా తెలియని విషయాలున్నాయా?
శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా శోణం బయ్యెఁ బతంగ […]