ఒంటరి ప్రయాణాలను నేను బాగా ఇష్టపడతాను. కెంట్‌ కౌంటీలోని కాంటర్‌బరీ, ససెక్స్‌లోని ఈస్ట్‌బర్న్‌ పట్టణాలను కేంద్రంగా చేసుకొని అక్కడి పల్లెలూ పట్నాల్లో సాగేలా ఐదారు రోజులపాటు ఇంగ్లండ్‌ దేశపు గ్రామ సీమల్లో సోలో ప్రయాణం చెయ్యాలన్నది నా అభిలాష.

పుట్టుకొచ్చే మనవసంతానాన్ని సాకడం, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఆ పిమ్మట సుధామయి తాలూకు అల్లుళ్ళు, కోడళ్ళతో ఇహిహీ అంటూ పూసుకోవడం… ఈ లంపటానికి ముగింపు ఉందా? ఇప్పటికే నా జీవితం ఒక నాటకమయిపోయింది. పాస్ మార్కుల నటనకూడా నావల్ల కావటం లేదు. ఇహ నటించటం నావల్ల కాదు. లేటుగా వచ్చినా నా బుఱ్ఱకి వెలుగు నీటుగా వచ్చింది. మీ బతుకులు మీకు కావలసినట్లు మీరు బతుక్కోండి. నాకిక బాధ్యతలు వద్దు, హక్కులూ వద్దు.

ఇంతింత లావుగా ఉబ్బిపోయిన పుస్తకాలు అవి, వాటి పేజీల్లో పత్రికలలో వచ్చే రకారకాల అదీ ఇదని కాదు బొమ్మల ప్రపంచానికి, డిజైన్ కళకు సంబంధించి ప్రతీది అందులో అతికించబడి ఉండేది. ఆ పుస్తకం ఎవరికి వారికి పవిత్ర గ్రంథం. ఏ గ్రంథానికి ఆ గ్రంథం విభిన్నం, వైవిధ్యం.

జ్యోతిష్మంతమైన యజ్ఞరథమునెక్కి
తమమునెల్లనీవు తరిమివేసి
భీమరూపమందు శత్రుదంభముజేసి
వేదనిందకులను వెడలగొట్టి
గోత్ర భిదము సల్పి స్వర్గ విభము నిల్పి
రాక్షసులను చంపు రక్షకుడవు!

నాకు చిన్నతనం నుండి పరిచయం, అలవాటు, చనువూ ఉన్న ఏరు ఇది. నా చిన్ననాటి స్నేహితురాలు. వర్షాకాలంలో ఆమె తెంపరితనం. రాత్రివేళల్లో ఆమె మౌనం. మంచుకాలపు వేకువ జాముల్లో ఆమె సిగ్గు. ఎంత దగ్గరది ఈ ఏరు నాకు! వంపు తిరిగి ఆదీ అంతమూ లేకుండా అనంతమైన ఒక డొంకదారిలా ప్రవహిస్తూ సాగే ఆమెలో నాకు తెలియని వేలాది రహస్యాలు ఉన్నట్టు అనిపిస్తోంది.

ఆవరణలో పెద్ద మామిడిచెట్టు, దానిపక్కనే మొదలుకంటూ అడ్డంగా కొట్టేసి, ప్రస్తుతం మొద్దులా మిగిలిన మరో చెట్టు ఆనవాలు. ముందుకు నడిచాను. రెండు పిల్లులు గబాల్న నా ముందునుండి పరిగెత్తాయి. హాల్ మధ్యలో నాలుగు కేన్ చైర్స్, ఒక చిన్న కాఫీ టేబుల్. పక్కగా కొద్దిపాటి ఎత్తులో పియానో. దానికి కొంచెం దూరంలో కిటికీ. దానికి అటు ఇటు పుస్తకాల షెల్ఫులు.

గదిలోంచి బయటకి నడుస్తున్నపుడు, నేలకు కాళ్ళు ఆనుతున్నట్టు అనిపించలేదు ఆమెకి. అసలు ఏమీ అనిపించలేదు. కొద్దిగా తల తిరుగుతున్నట్టు, వాంతి వస్తుందేమోనన్న భయం తప్పితే. చేస్తున్న పనులన్నీ అచేతనంగా జరిగిపోతున్నాయి: సెల్లార్ లోకి వెళ్ళడం, లైటు వెయ్యడం, ఫ్రీజర్ తలుపు తెరవడం, చెయ్యి పెట్టి ఏది ముందు తగిలితే దాన్ని అందుకోవడం. అందినది బయటికి తీసి అదేమిటా అనుకుంది.

అంకెల లెక్క కాదు
అస్తి నాస్తి విచికిత్స

ప్రమాణాలు తెలుసుకున్నాక
ప్రణామం చెయ్యి
ప్రాణాయామం ఎప్పుడైనా
చెయ్యచ్చు

బొల్లి కలిగించే మనస్తాపం వర్ణనాతీతం. ఎవరికైనా ప్రాణాంతకమైన జబ్బు వస్తే జాలిపడతారు. ప్రాణం పోతే ఒకసారి ఘొల్లుమంటారు. కానీ బొల్లి వ్యాధి వచ్చిన అమ్మాయిల జీవితం సజీవ సమాధే! ఒక పక్క వ్యాధి వచ్చిందని బెంగ. మరొక పక్క ఎవరైనా చూస్తారేమోనని దిగులు.

మిణుగురు పాదాలు చిట్లి,
నెత్తుటి దారి ఏర్పడిన చోటు నుంచి
ప్రారంభమైంది నడక!

మొలకంత ప్రాణి
సమస్త భూమండలాన్ని
కాంతిమయం చేస్తుందని
నమ్మిక!

ఇదంతా పాత కథ. 1949లో మాట. తెలుగుస్వతంత్ర అనే పత్రికలో నా దైనిక సమస్యలు అనే శీర్షిక కింద అచ్చయిన కొన్ని కన్నీటి చుక్కలు, గుండె మంటలు, ఆకలి నొప్పులు. అయ్యా బాబూ, అమ్మా తల్లీ, మీ మంట, మీ ఏడుపు, మీ దరిద్రం, మీ దౌర్భాగ్యం ఏదైనా పర్లేదు, చదవచక్కగా ఉంటే చాలు.

గుడ్లగూబకో బొటనవేలు ఉంటుందనీ
ఐతే అదలా తిరిగి ఉండదని
శరీర శాస్త్రం చెప్తుంది.
పక్షిశాస్త్రం బోధిస్తుంది!
ఎన్నో ఏళ్ళు తెల్ల గుడ్లగూబని అధ్యయనం చేశాను
ఈ డొల్ల పనితనాన్ని చూసి బాధ పడుతున్నాను.

తెలుగుభాష క్రియాత్మకం అన్న విషయాన్ని గమనించకపోవటం దురదృష్టకర పరిణామాలకు దారి తీసింది. ఒక ప్రబల ఉదాహరణ వార్తాపత్రికలు: వీరు ఆంగ్లభాషాపత్రికల్ని అనుసరిస్తూ కృత్రిమమైన తెలుగుని తయారుచేసి భాషకు విపరీతమైన అపకారం చేశారు.

పాఠకుల ఊహ విషయానికొస్తే, దాంట్లో కనీసం రెండు రకాలు ఉంటాయి. ఆ రెండింట్లో ఏది సరైనదో చూద్దాం. మొదటిది తులనాత్మకంగా తక్కువదైన, వ్యక్తిగతమైన ఊహ. ఇది భావావేశాలను ఆశ్రయిస్తుంది. ఈ రకమైన ఊహ స్వభావం ఇలా ఉంటుంది: మనకో, మనకు తెలిసిన వాళ్ళకో జరిగిన వాటిని పుస్తకంలోని ఫలానా సన్నివేశం గుర్తు చేస్తుంది కాబట్టి అది మనల్ని బలంగా తాకుతుంది.

ఈ సంచికలో కొన్ని జానపద పాటలు విందాం. ఇవి నిజంగా జానపదుల పాటలా లేక ఆధునిక రచనలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ జానపద వాఙ్మయం మనకు జాతీయవాదం బలంగా వున్న రోజుల్లో సినిమాల్లోను, గ్రామఫోను రికార్డులపైన, ముఖ్యంగా రేడియోలోను చాలా ప్రముఖంగా వినబడేది.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: