ఇంతకూ ఎలియట్ ఈ దృశ్యంలో వర్ణించిన స్త్రీ ఎవరు? ఆయన మొదటి భార్య వివియన్ అని కొందరి ఊహ. ఆయన వర్ణించింది ఒక స్త్రీని కాదు, స్త్రీని. స్త్రీకి ఎన్ని ముఖాలుంటాయో అన్నీ కరిగించి పోసిన పోత. మసి అయిపోయేది స్త్రీయే, మసి చేసేది స్త్రీయే. ఈ దృశ్యంలో వస్తువు స్త్రీ మాత్రమే కాదు. కృత్రిమత్వంలో బుద్ధి నశించిన మనిషి.

కొండల వెనకాల నుంచి మా ముందున్న సరోవరాన్ని వర్ణభరితం చేస్తూ సూర్యుడు మెలమెల్లగా రంగప్రవేశం చెయ్యడం కానవచ్చింది. ‘అసలు నువ్వా శునకాలకు థాంక్స్ చెప్పుకోవాలి. వాటి పుణ్యమా అని ఇంత చక్కని ప్రదేశం చేరి సూర్యోదయం చూడగలుగుతున్నావ్’ అని చెణికింది జెమ్మా. ఆమె ఈ ప్రదేశానికి తరచూ వస్తూ ఉంటుందట.

బామ్మ దగ్గర కథలు విని రాయడం నేర్చుకోవాలి. నన్నడిగితే ప్రపంచం లోని పెద్ద పెద్ద పేరున్న కథకులందరూ బామ్మ దగ్గర కథ చెప్పడంలో బలాదూరే! ఒక్కసారి గాని వాళ్ళు వింటే ఎంత నేర్చుకోవాలో తెలిసివస్తుంది! బామ్మ దగ్గర కథలు విని కథలు రాయడం మొదలుపెడితే ఇంక వాటికి తిరుగు ఉండదు!

పదిహేను అడుగుల వెడల్పున్న ఆ తార్రోడ్డు మీద, అడ్డంగా పరుచుకుని ఉందో నల్లటి త్రాచు. కొద్దిసేపటి క్రితమే ఏదో భారీ వాహనం దాన్ని తొక్కేసినట్లు, తోక భాగం కొద్దిగా తప్ప మిగిలిన శరీరమంతా అప్పడంలా రోడ్డుకి అతుక్కుపోయింది. తోకలో కొద్దిగా చలనం కనిపిస్తోంది ఇంకా. “మెచ్యూర్డ్ కోబ్రా” అన్నాడు మేజర్ దేవల్ దాన్ని ఒకింత జాలిగానూ, ఎక్కువ నిర్లిప్తంగానూ పరికిస్తూ. “ఏదో పెద్దదాన్నే మింగినట్లుంది. అందుకే ట్రక్కు వస్తున్నా తొందరగా రోడ్డు దాటలేకపోయింది.”

ఒక్కోసారి వియోగమనే భావపు ఘాటు ముందర ప్రేమ వెలవెలబోతుందేమో అనిపిస్తుంది. విప్రలంభపు మహిమ ఎవరికీ ఎన్నతరం కాదు. కవిత్వంలో మనకు తెలిసిన ఎన్నో పొరలు దాని దయాభిక్షే. ఒక బలీయమైన అనుభూతిలో శుద్ధతతో కూడినవైన ఎత్తులలో విహారం చేస్తున్నపుడు ఒకవేళ మనస్సు మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఒక్కో పదమూ ఎంతో చిన్నదైనప్పటికీ బరువైన భావాలను మోసేదిగా ఉంటుంది.

ఇవన్నీ ఎప్పుడో ఉన్న కవులకి కాని ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి వర్తించే చట్రాలు కావని అనిపించొచ్చు కాని, నిజం కాదు. పందొమ్మిదో శతాబ్దంలో కొత్త రకం పాఠకులు వచ్చారు, మరికొన్ని కొత్త మూసలు తయారుచేశారు. ఈ కొత్త పాఠకులకి దారి చూపించి, తెలుగు సాహిత్య చరిత్రలో పెనుమార్పులకు కారకుడైన విశిష్టవ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఈయన ప్రభావం బహుశః అద్వితీయం.

తర్వాతి పొద్దునే లేచావు అలికిడికి. అసలు నిద్రే పట్టదనుకున్నావు కానీ నీ శరీరం నిన్ను మోసం చేసింది. ఒళ్ళంతా లాగేస్తోంది. పొట్ట కాలిపోతోంది. ఎవరో కాఫీ తెచ్చిచ్చారు. మొదటిసారి తీసుకోలేదు కానీ ఇంకోసారి బలవంతపెడితే వద్దనలేదు నువ్వు. మెల్లగా కిందకొచ్చి సైలెంట్‌గా కుర్చున్నావు. కొంతమంది వంటింట్లో ఉన్నారు. మగవాళ్ళు బైటికీ లోపలికీ తిరుగుతున్నారు. ఎవరూ నీతో కళ్ళు కలపడంలేదు. వచ్చినవాళ్ళకి టిఫిన్‌లూ, టీలూ అందిస్తోంది ఒకామె.

రామ, కృష్ణ, శివ, వెంకట – పదాలలో ఒకటో రెండో పదాలు ఎన్నుకుని ముందో వెనకో ఇంకో విశేషణ పదం కలిపితే తెలుగు మగశిశువుకి నికార్సయిన పేరు తయారవుతుంది. ముప్ఫై ఏళ్ళు దాటిన సగం ముప్పావు తెలుగువారికి అటువంటి పేరే ఉంటుంది. బుద్ధిరామయ్య పేరు అలాగే వాళ్ళ నాన్న రూపకృతి చేశాడు. పూర్వ పదాన్ని ఆయన బుద్ధ అనబోయి బుద్ధి అని బియ్యంలో రాశాడేమో మనకి తెలియదు.

You come uninvited and knock at the door
for me! I won’t be there then!
Did you really knock at the door for me?
No; you come knocking at my door uninvited
since you really don’t need me!

(బాలాంత్రపు రజనీకాంతరావు కవిత ‘అనుకోని ఆఖరి అతిథి’కి ఆంగ్లానువాదం.)

ఒక ఆకాశమే
వేల సంవత్సరాల వర్షమై చీలినట్లు
ఒక చంద్రుడే
వేల రాత్రుల వెన్నెలై విరిసినట్లు
ఒక మనసే
వేల దిగుళ్ళ ఆనందాల చెలమైనట్లు

వర్షం గట్టిగా కురుస్తోంది. చేతులు లేని గోనెపట్టా తొడుక్కున్న ఒక వ్యక్తి ఖాళీ రోడ్డు దాటి కఫే వైపు వస్తున్నాడు. ఆ చుట్టుప్రక్కలే ఎక్కడో కుడివైపున పిల్లికూన ఉండాలి. ముంజూరు క్రిందనుండి వెళ్ళి చూద్దునా అని ఇంకా మనసులో అనుకుంటోంది. ఆమె అలా తలుపు దగ్గర బయట నిలబడి ఆలోచిస్తూంటే, ఆమె వెనక ఎవరో గొడుగు తెరిచి పట్టుకున్నారు. మరెవరో కాదు, ఆ హోటల్‌లో పనిచేసే మెయిడ్.

ఒడిదుడుకుల జీవితంలో
ఎవడైనా దూరంగా జారినప్పుడు
వాడితో నువ్వెలా ఉన్నావో
లోలోపల ఒకసారి తొంగి చూడు.
ఎవడి చీదరింపు కూడా నీలో సంతోషాన్ని నింపుతుందో
వాడి అరుపు జీర కోసం ఎదురు చూడు.

ఉప్పు, తీపి కలసిన
గరగరలా ఉంటుంది
పెదాలు చప్పరిస్తుంటే

చేపలన్నీ నీళ్ళలో ఉంటే
నువ్వూ నేనూ ఈ పక్కమీద
ఈదుతున్నామెందుకు?

లేడికూనతో ఆడుకోవాలనుకోవటం
నేరమని తెలియనేలేదు
అన్నార్తుడిని ఆదుకోవాలనుకోవటం
గీత దాటడమనుకోలేదు
కాముకుని చెరలో ఉన్నా
జీవించాను నీ తలపుల బందీగానే

ఒళ్ళువిరుచుకుని లేచే కుక్కకి
వాసనలు చూడని
బతుకే లేదని అనిపిస్తుందా?

అస్తమానం హోరెత్తించే
సముద్రపు గాలుల్ని చూసి
వీధి బిచ్చగాడు విసుక్కుంటాడా?

నిన్నా మొన్నటి గాయాలను
రేపటి గురించిన భయాలనీడలను మోస్తూ
జీవితాన్ని వడగట్టి
ఆనందాల ఆనవాళ్ళను ఆవిరిచేసి
దుఃఖాలను మాత్రమే మిగుల్చుకుని
మనసంతా పొగిలి
బ్రతుకును కుంటినడక నడిపిస్తూ

నేను చెట్టుని
ప్రతి తుఫాను తర్వాతా
నా మరణం
వాయిదా పడుతుంటుంది

నిజానికి నన్ను
శిథిలంకాని వాక్యాన్ని చేసేది నువ్వే

ఎండ నదిలో మునుగుతున్న
బాటసారుల్ని
నీడవల వేసి పట్టుకునే జాలరి

చెట్టు ఎపుడూ విలపిత కాదు
పూలపిట్టల, పిట్టపూల నవ్వులతో
విచ్చుకునే వికసిత.

సాహిత్యం సమాజంలో మార్పులకు దోహదం చెయ్యాలి అని ఆశించడం, ఆ సాహిత్యంలోనూ భాష, వాస్తవికతల పరంగా మౌలికమైన మార్పులు ఆశించడం, తీసుకురావడం – ఆ ప్రక్రియలో ఆధునిక సాహిత్యానికి గురజాడ మూల పురుషుడవడం వివినమూర్తిని బాగా ఆకట్టుకున్న విషయం, వాటికన్నా ఎక్కువగా మూర్తిని ఆకర్షించింది గురజాడలోని వివేచన.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: