గడినుడి – 48 సమాధానాలు

సూచన: ఈసారి సమాధానాల్లో 8 నిలువు కోసం వులివెంజర అని గడినుడి కూర్చాము. కానీ, ఆంధ్ర భారతి నిఘంటువులో అది అక్షర దోషమని, అసలు పదం పులివెంజర/పులిపెంజర అని ఉండాలని గ్రహించాము. పొరపాటుకు మన్నించగలరు.


అడ్డం

  1. అయ్యలరాజు నారాయణామాత్యుని శృంగార నీతికావ్యం (5)
    సమాధానం: హంసవింశతి
  2. ప్రతి నివాసీ కలిగివున్న గొంగళి. (3)
    సమాధానం: తివాసీ
  3. తాపము కల శిశిరఋతువు. (5)
    సమాధానం: సీతుకందువు
  4. ఫిల్మ్ చుట్ట (2)
    సమాధానం: రీలు
  5. ఉపచర్యలోని పాకము (2)
    సమాధానం: పచ
  6. నాశమొందెడిది తిరగేస్తే కాపుగడ (2)
    సమాధానం: రక్ష
  7. నడిమింటిలో నాట్యకత్తె (2)
    సమాధానం: నటి
  8. వెనుకకుచూస్తే అసలు కనపడదు. (3)
    సమాధానం: నకలు
  9. దేవతల ప్రీతి కోసం చేసే కర్మకాండ (2)
    సమాధానం: యజ్ఞం
  10. గుమ్మడి వెంకటేశ్వరరావులో తిరగబడిన లోహము (2)
    సమాధానం: డివెం
  11. మాయను చిన్ని తుండుగుడ్డ అనుకోవచ్చా? (4)
    సమాధానం: టవలిక
  12. గంగోదకం గరళం కలిపితే పోయే గకం. ఏమిటో ఈ కన్ఫ్యూజన్.(5)
    సమాధానం: గందరగోళం
  13. గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి ఇది కోరాడట (4)
    సమాధానం: పులిహోర
  14. దీనికేల ఊరిలో పెత్తనం? (3)
    సమాధానం: ఉడుత
  15. అరగంట (3,4)
    సమాధానం: ముప్పయినిమిషాలు
  16. యండమూరి నవలలలో ఒకటి (3,4)
    సమాధానం: వెన్నెల్లోఆడపిల్ల
  17. పెంచగల మేకపోతు (3)
    సమాధానం: చగల
  18. మునసబు కుట్రలో నగతోటి జంటపదాన్ని తొలగించి సరిచేస్తే వచ్చే అహినిర్మోకం (4)
    సమాధానం: కుబుసము
  19. ఆంధ్ర దశకుమార చరిత కావ్యకర్తవున్న యిల్లు (5)
    సమాధానం: నికేతనము
  20. నఖము వంపుతో మైనా (4)
    సమాధానం: గోరువంక
  21. పగడములో తెరచాపకొయ్య (2)
    సమాధానం: గడ
  22. మౌఖిక పరీక్ష (2)
    సమాధానం: వైవా
  23. పొడవు X వెడల్పు = ____ (3)
    సమాధానం: వైశాల్యం
  24. పర హితములోనే ఆనందమున్నది. (2)
    సమాధానం: రహి
  25. మురళీమోహనుడు చేసే గారడి (2)
    సమాధానం: మోళీ
  26. మేషరాశిలో తాజాకలం. (2)
    సమాధానం: షరా
  27. రవర్ణము (2)
    సమాధానం: రేఫ
  28. యాచకులు చేసేది. (5)
    సమాధానం: భిక్షాటనము
  29. కుముద రాణి యిచ్చే రాయితీ (3)
    సమాధానం: ముదరా
  30. ముళ్ళపూడి వెంకటరమణ కథల సంపుటి (5)
    సమాధానం: రాధాగోపాలం

నిలువు

  1. ఒకానొక నపుంసక రాగవిశేషము (5)
    సమాధానం: హంవీరనాట
  2. పాత ఒక రోత అయితే కొత్త ఒక __? (2)
    సమాధానం: వింత
  3. రేగుచెట్టు వెనుక నుండి వెనుకటి రీతి (4)
    సమాధానం: తిరీటిక
  4. వాచి కలిగివున్న రాయబారి. (7)
    సమాధానం: వాచికహారకుడు
  5. సంచయములో కొంతను సముద్రంతో భర్తీచేస్తే జీర్ణవస్త్రం లభిస్తుంది. (4)
    సమాధానం: సీచయము
  6. వెన్ను (2)
    సమాధానం: కంకి
  7. కాటుకరేకులపొడ. (5)
    సమాధానం: పులివెంజర = పులిపెంజర. పొరపాటు వల్ల ఇది వులివెంజర అని గడినుడి కూర్పులో వచ్చేసింది.
  8. ఒరిగి సుగ్రీవాగ్రజుని కనుక్కోండి. (2)
    సమాధానం: వాలి
  9. పొత్తు, చేత, ఊసు (2)
    సమాధానం: జోలి
  10. ఈ సస్యవిశేషాన్ని తలతో కలిపితే గూర్ఖా, బీజంతో కలిపితే రోగం. (2)
    సమాధానం: వరి
  11. అహోరాత్రములో రెండున్నర ఘడియలు. (2)
    సమాధానం: హోరా
  12. చెలికత్తె నడిమి (5)
    సమాధానం: చెలిమికత్తె
  13. అల్లకల్లోలం చెల్లాచెదురు (5)
    సమాధానం: కల్లల్లోఅలం
  14. టయిముకు డప్పు కొట్టండి. (3)
    సమాధానం: టముకు
  15. గడువు, కిస్తు (3)
    సమాధానం: వాయిదా
  16. మిక్కిలి చాపల్యము కల మత్స్యము. (3)
    సమాధానం: ఉలుచ
  17. కొంత వెలలో తపేలా (3)
    సమాధానం: తవెల
  18. తోడ్‌నా నహీ అని స్ఫురించే అశ్వగతి విశేషము (3)
    సమాధానం: జోడన
  19. తురకపిల్ల కప్పుకునే కంబళి (3)
    సమాధానం: రల్లక
  20. ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చిన అవసరాల రామకృష్ణారావుగారి ఒక బాలల నవల (3,4)
    సమాధానం: గణితవిశారద
  21. ఆఖరు మొఘల్ చక్రవర్తి చొక్కాకు ఉన్నది. (2)
    సమాధానం: జేబు
  22. భాగ్యవంతునిలోని తాత్పర్యం (2)
    సమాధానం: భావం
  23. రంగనాథుని కడుపులో పెట్టుకున్న కస్తూరి (5)
    సమాధానం: కురంగనాభి
  24. ఈటీవిలో స్త్రీల కార్యక్రమం (2)
    సమాధానం: సఖి
  25. సంపదను తిరగేస్తే శబ్దం (2)
    సమాధానం: రుతి
  26. దీని తొక్క ఒలచడం చాలా సులభం. (3,2)
    సమాధానం: కదళీఫలం
  27. వాయసమును సరిచేసి ‘స’రళాన్ని పరు’ష’ముతో మార్చితే తీపిపదార్థం. (4)
    సమాధానం: యవాషము
  28. గిరాకీని బట్టి ఇది ఉంటుంది. (4)
    సమాధానం: సరఫరా
  29. బంతాటలో తొక్క (2)
    సమాధానం: తాట
  30. జానకీ గోపాలుర మేలుకొలుపు (2)
    సమాధానం: జాగో