మీ అన్న నా శత్రువును చంపితే చట్టం అతన్ని శిక్షిస్తుందని భయపడుతున్నావని అర్ధమైంది. కానీ అలాంటి అనుమానాలు పెట్టుకోకు. హీరోలపై చట్టానికి ఎలాంటి అధికారం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినంతమందిని చంపొచ్చు. ఎన్ని ప్రాణాలను వాళ్ళు తీసేస్తే వాళ్ళ శీలం, కీర్తి అంతగ ప్రసిద్ధి చెందుతాయి.

ఉండబట్టలేకే ప్రవాహం.
తడిసిన మనుషులెవరూ
దుఃఖంలో ఎవరు మునిగారో తెలీరు.
నవ్వుతున్న ముఖాల్లో నీళ్ళూ కదలవు.

“సెక్సా అలా రాస్తున్నదంతా” అంటావు.
చదుతున్నారా అని కూడా అడుగుతావు నువ్వే.

ఈ నాలుగురోజులూ బుద్ధిగా పద్ధతిగా ఒక ప్రణాళిక ప్రకారం నడిచాయన్నమాట ఇంకా నిజం. అసలు ఇది నా పద్ధతి కాదు. ప్రణాళిక అంటూ ఏమీలేకుండా, అలా నగరంలో తిరుగాడుతూ ఎక్కడ నచ్చితే అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆయా ప్రదేశాల్లో ఉంటూ నగర ప్రవాహంలో ఒక పిల్లకాలువను కాగలనా?

ఇలాంటి మధ్యాహ్నాల్లో ఆ తాతామనవళ్ళను చూస్తే చిన్న మోతాదు పరిశోధన చేస్తున్నట్టే ఉంటారు. మనవడి చేతిలో ఐపాడ్, తాత చేతిలో ఫోన్‌బుక్. అక్కడక్కడా పేర్లు, వాటి పక్కన పెద్దాయన చేతిరాత కుదరకున్నా ఒత్తిపట్టి రాసిన రాతలు–మాట్లాడిన బంధువులు, స్నేహితుల వివరాలు. కొన్ని పేజీల వెనక వాళ్ళు ఉన్న వీధుల ఫోటో ప్రింట్లు, ఇదే ఆ తాత-మనవడు చేసే వ్యవహారం.

హాల్లోకి వచ్చా. కొందరు నిద్రపోతున్నారు. కొందరు నిద్ర నటిస్తూ మెలుకువ దాచుకుంటున్నారు. వాళ్ళకి నా ఉనికి చిరాగ్గా ఉన్నట్లుంది. జత బట్టలు, టవల్ తీసుకున్నా. బ్రష్, పేస్ట్, దువ్వెన గుర్తొచ్చాయి. అవీ తీసుకున్నా. ఇంకా ఏవో గుర్తొచ్చాయి. అన్నీ వదిలేసి పోవడానికి అన్నీ తీసుకెళ్ళాలనుకోవడం, ఏది లేకపోయినా ఇబ్బందనో, చిన్న వస్తువే కదా అనో ప్రతిదీ సంచిలో పెట్టుకోవడం. చివరికి ఏది అవసరమో ఆలోచించి కొన్ని తీసుకొని బయటపడ్డా.

ఏమో ఈ కోటను చూస్తున్నప్పుడల్లా బహుశా దేవగిరి మధ్యలో ఆగిపోయిన అతి పెద్ద స్తూపం అనిపిస్తుంది. కాలక్రమేణా చోటుచేసుకున్న ఎన్నో మార్పులతో ఇది పటిష్టమైన కోటగా మార్చడానికి కారణమై ఉండచ్చు. ఏ రాజు కూడా ఒక కొండను ఇంత లోతుగా తొలచి కోటను నిర్మించాలని అనుకున్నాడని అనుకోను. దీనికి ఉన్న రక్షణ ఏర్పాట్లు అన్నీ కృత్రిమమైనవి, ఎక్కువభాగం శిల్పులతో చెక్కబడినవే.

చిమ్మ చీకట్లో
పద్యం ఆకాశం మీద పొడుస్తుంది.
చెట్లు నీడ తప్పించి చోటిస్తాయి

నువ్వు అస్తమానూ
అడుగుతుంటావ్
నా పద్యాల చుట్టూ
అంత చీకటి ఎక్కడిదని

ఇంకా ఇంకేదో ఇంకాలని
ఇంకో వంకలోకి వంపు తిరగాలని వొలికి చూడాలని
మరో ముక్తాయింపులో ముక్తిని వెతకాలని

కొత్త పుస్తకాన్ని తెరిచి పుటలని వాసన చూసినంత
చేయి అలా నిమిరి కొన్ని చుక్కలని చప్పరించినంత
మెత్తగా లేతగా

ఎవరి కన్నీళ్ళు వారివే అయినా
కన్నీళ్ళలో తేడాలేనట్టే
అందరినీ తాకుతున్న ఒకే బాధ

ప్రవాహంలో కొట్టుకుపోతున్నా
ఆకాశం అనంతాన్ని
సముద్రం వైశాల్యాన్ని
పాటల్లో ఇమడ్చాలని చూస్తున్నారు

పైన ఉదహరించిన కార్య-కారణ చయనిక మానవ ప్రపంచంలో సహజం అని మనం సంతృప్తి పడవచ్చు. ఒక సంక్లిష్టమైన అంతర్నాటకంలో మానవుల కోరికలు, వాటి ప్రేరేపణలు, తద్వారా జరిగే చర్యలు, ప్రతిచర్యలు కారణంగానే ట్రోయ్ యుద్ధం లాంటి సమరాలు, హెక్టర్ మరణం లాంటి సందర్భాలు ఎదురవుతాయి. కానీ హోమర్ చెప్పిన కథ ఇంత సజావుగా సాగదు.

అన్ని వాదనలకీ ముగింపుగా, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదన్నట్టు చివరకి ఇలా చెప్పేవాడు: ‘ఈ సరఫరా-గిరాకీ అన్న నియమం భగవంతుడు ఏర్పాటు చేసినది. మనం ఊహించగలిగిన అన్ని సందర్భాల్లోనూ ఈ నియమం పని చేస్తుంది. ఈ నియమమే శ్రమకి తగిన ధరని కూడా నిర్ణయిస్తుంది. దీనికి తిరుగు లేదు. ఈ ఆచరణావిధానం నచ్చని వాళ్ళు తమ స్వంత ప్రపంచాలను నిర్మించుకోవచ్చు.’

ఆమె వీధి అరుగుపై కూర్చుని
దారిన పోయే అందరినీ పలకరిస్తుంది
ఎలా ఉన్నారనో
ఏం చేస్తున్నారనో అడుగుతుంది
తోచిన మాటలేవో
వడపోత లేకుండా మాట్లాడుతుంది

మహమ్మదీయ మతమునందేగాక అన్ని మతములందును సత్యమున్నదని నమ్మిన అక్బరుచక్రవర్తి యంతటి వేదాంతికి కూడా పైన చెప్పినవానియందు కొంత విశ్వాసముండెను. ఆయన కుమారుడైన జహంగీరునకీ విషయమున వెర్రినమ్మకముండెను.

హిందూ పురాణాలలో, ఇతిహాసాలలో దేవుళ్ళతో సమానంగా దేవతలున్నారు. చరిత్రలో వీరపురుషులతో పాటు వీరనారీమణులున్నారు. ప్రార్థనాది విషయాలు మినహాయిస్తే మన పాఠ్యపుస్తకాలలో ఏ స్థాయిలోనూ వారి వీరోచిత గాథలు గాని, ప్రేరణాత్మకమైన వారి జీవిత విశేషాలు గాని లేవు, ఉండవు.

జల
ఎప్పుడైనా కనిపిస్తుందా?
చేదితేనే
గలగలమని పొంగుతుంది.

పరిమళం
దూరానికి తెలుస్తుందా?
దరి చేరితేనే
గుప్పుమని కప్పేస్తుంది.

వలస ప్రధాన అంశంగా రాయబడిన ఈ నవలలో మానవ సంబంధాల చిత్రీకరణకూడా ఎంతో వాస్తవికంగా, సునిశితంగా, హృద్యంగా సాగింది. చిత్తూరుజిల్లావాసి, భద్రావతాయనగా పిలవబడుతూ, ఇప్పటికీ జీవించి ఉన్న మంగరి నాగయ్య జీవితాన్నాధారంగా చేసుకుని బలభద్రి పాత్రను మలచారు రచయిత.

ఈ సంచిక గడినుడి ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి స్మృతికి నివాళి.

క్రితం సంచికలోని గడినుడి-48కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-48 సమాధానాలు.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

రాబోయే సంక్రాంతి 2021 పండుగ సందర్భంగా శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ నిర్వహిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా కోరుతున్నాం.