ఎవరైనా
నీపై దాడి చేసి గెలిచామనుకుంటే కాదనకు
నీ గుండెని ఖాయంగా తొలిచామనుకుంటే లేదనకు
నీకళ్ళల్లో నీరుందని వారంటే ఖండించకు
నిలువెత్తు దిగులే నీవంటే కోపించకు
వారు చూసేదాన్ని వద్దనకు
నమ్మేదాన్ని మిథ్య అనకు
ఆకాశమా! నువు నీలంగా వున్నావని
పదే పదే నినదిస్తే
కాదు కాదంటూ ఉరమకు
ప్రశాంతతని మరచి
మెరుపులూ రువ్వకు
రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. "రేవు చూడని నావ" అనే కవితాసంపుటి, "మహార్ణవం", "ఆలోచన అమృతం" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి "mitva" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. "నా స్నేహితుడు" అనే కథకు 1994 లో "కథ" అవార్డు అందుకున్నారు ... పూర్తిగా »