వంగూరి ఫౌండేషన్‌ సాహిత్య వ్యాసంగాల ప్రకటన

“వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా” వారు ఈ క్రింది రెండు ప్రకటనలను “ఈమాట” పాఠకులకు అందించమని కోరేరు. ఈ సమాచారం మా పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ ఇస్తున్నాం . సంపాదకులు)

1. ఐదవ ఉత్తమ రచనల పోటీ

“విక్రమ” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్‌ 5, 2000) సందర్భంగా, అమెరికాలో నివసిస్తున్న తెలుగు రచయితలను ఉత్తేజ పరిచే ఉద్దేశంతోనూ, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించే అభిలాషతోనూ, ఈ ఉత్తమ రచనల పోటీని నిర్వహిస్తున్నాం, అచ్చంగా ఐదవ సారి. బహుమతి గ్రహీతలకి ప్రశంసా పత్రం, పారితోషికం ఇవ్వబడతాయి. ఈ పోటీలో పాల్గొని, మా ఆశయాలని మరొక్కసారి దిగ్విజయం చేయమని తెలుగు రచయితలని అర్థిస్తున్నాం.
ఉత్తమ కథానిక
ప్రథమ బహుమతి : $116, ద్వితీయ బహుమతి : $58
ఉత్తమ కవిత
ప్రథమ బహుమతి : $116, ద్వితీయ బహుమతి : $58
ఉత్తమ నవల : $200

కథలు, గేయాలు, నవలలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ : ఏప్రిల్‌ 5, 2000 (ఉగాది)

ముఖ్య అంశాలు :

1. తెలుగులో కథానికలు పది పేజీలు, గేయాలు నాలుగు, నవల రెండు వందల పేజీలు వ్రాత ప్రతిలో మించకూడదు.
2. ఉత్తర అమెరికా నివాసులైన రచయితల అముద్రిత, స్వీయ రచనలు మాత్రమే పోటీకి అంగీకరించబడతాయి. కలం పేరుతో వ్రాసినా, అసలు పేరు, చిరునామా, ఫోన్‌ నెంబరు, ఇమెయిల్‌ అడ్రసు మాకు తెలియపరచాలి.
3. ఇండియాలో నివసించేవారు తప్ప, ఇతర దేశాల ప్రవాసాంధ్ర రచయితలు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చును.
4. ఉత్తమ రచనల నిర్ణయం డా. పెమ్మరాజు వేణుగోపాల రావు (అట్లాంటా) గారి ఆధ్వర్యంలో అజ్ఞాత న్యాయనిర్ణేతలు విడివిడిగానూ, కలిసి, నిర్ణయిస్తారు.
5. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు వీలుని బట్టి పుస్తక రూపేణా ప్రచురించబడతాయి.
6. రచనలు దేశికాచారి గారి “పోతన” ఫాంట్స్‌లో టైప్‌ సెట్‌ చేసి పంపించి, మాకు సహాయపడితే చాలా కృతజ్ఞతలు.

రచనలు పంపించవలసిన చిరునామా

Vanguri Foundation of America, Inc.
P.O. Box 1948
Stafford, TX 77497

For more information :
Dr. P. Venugopala Rao Dr. Vanguri Chitten Raju
Work Phone:(404)727-4297 Work phone:(281) 403-3196
Fax:(404) 727-0873 Fax:(281) 403-1346
E-mail: phspvr@physics.emory.edu E-mail: rvanguri@wt.net

2. ద్వితీయ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

Chicago, Illinois
September 2-3, 2000

ఆహ్వానం

అమెరికాలో రెండవ సారిగా, దేశవ్యాప్తంగా, తెలుగు సాహితీ సదస్సు రాబోయే సెప్టెంబరు 2, 3 తారీకులలో (లేబర్‌డే వీకెండ్‌) షికాగో మహానగరంలో జరగబోతోంది. చిరకాలంగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రోజెక్ట్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ( SAPNA ) వారు ఈ మహాసభలు నిర్వహిస్తారు.
శ్రీ అన్నమాచార్య ప్రోజెక్ట్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా అధ్యక్షులు శొంఠి శ్రీరామ్‌, వేలూరి వెంకటేశ్వరరావు, శొంఠి శారదా పూర్ణ, తదితర షికాగో సాహితీప్రియులు ఈ సభలు అద్వితీయంగా జరిగే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రెండేళ్ళ క్రితం అట్లాంటాలో విజయవంతంగా జరిగిన ప్రప్రధమ అమెరికా తెలుగు సాహితీ సదస్సు వివరాలు మీకు తెలిసే ఉంటాయని భావిస్తున్నాం.
ఈ ద్వితీయ అమెరికా సాహితీ సదస్సులో మీరు ఉత్సాహంగా పాల్గొని, ఈ మహాసభలని దిగ్విజయం చేయ వలసినదిగా కోరుతున్నాం.
వివరాలకు శొంఠి శారదా పూర్ణ (708 957 4302), వేలూరి వెంకటేశ్వర రావు (630 271 1065) లని పిలవండి.