జవ్వనాన్ని జువ్వ చెయ్యండి
పువ్వుల్లా బ్రతికే పూలరంగళ్ళూ
ఈనెగా మీ ఆననివ్వండి
శూన్య శంకువుల్లాంటి
మీ గుండెల్లో
చైతన్యాన్ని పోసి
దట్టింపులన్నీ
పూర్తి చెయ్యండి
కార్యదీక్షా సూత్రంతో
సంధించండి.
నిరంతర శ్రమాగ్నితో
రగిలించండి.
అపుడు..
ఆకసాన రంగులు విరుస్తాయి.
ఆశయాలు తారాపథాన నిలుస్తాయి.