Self Realization

“మనసున మల్లెల మాలలూగెనే… ” టేపురికార్డర్‌లో పాట
అబ్బ! కృష్ణ శాస్త్రిలా నేనూ కవిత్వం రాయగలిగితే!
రమేష్‌కృష్ణన్‌ జూనియర్‌వింబుల్డన్‌ గెలిచాడుట.
ఆహా! నేనూ ప్రఖ్యాత టెన్నిస్‌ప్లేయర్‌ అవగలిగితే!

ఐయిన్‌స్టెయిన్‌కు ఐదేళ్ళ వరకూ మాటలే రాలేదుట.
నాకూ గుడింతాలు చాలా రోజుల వరకూ రాలేదుట.
ఎంచగ్గా నాకూ నోబెల్‌ప్రైజ్‌ వస్తుందేమో!
ప్రఖ్యాత సైంటిస్ట్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోతానేమో!

బిల్‌గేట్స్‌కాలేజి డిగ్రీ కూడా లేకుండా రిచ్చెస్ట్‌మేన్‌ అయ్యాడుట.
మైకెల్‌డెల్‌కాలేజి డ్రాపౌట్‌ఐయి కూడా బిలియనియర్‌ అయ్యాడుట.
ముప్ఫై ఏళ్ళయినా నిండని యాహూ చైర్మన్‌కి మూడు బిలియన్లున్నాయిట.
వాళ్ళ లాంటి ఐడియాలే నాకూ వస్తున్నాయి. నేనూ బిలియనియర్‌ అవుతానేమో!

అమ్జదాలీఖాన్‌ సరోద్‌ మీద నలభై సంవత్సరాలు కృషి చేశాడుట.
నేను రెండేళ్ళ క్రితం చేసిన పనికీ ఈ రోజు చేస్తున్న పనికీ సంబంధం లేదే?

ఎన్నుకున్న పనిలో తాదాత్మ్యం చెందే తపస్సు వారిది,
తడవకొక రీతిగా కలలు మాత్రం కనే మనస్సు నాది!