యోర్హే లూయీ బోర్హేస్‌కవితలు:మేఘాలు

ప్రశాంతమైన పర్వతాలు
సంచరిస్తున్నాయి గాలిలో
శోకభరితమైన ఆ పర్వతశ్రేణులు
విచారగ్రస్తమైన కంబళి వంటి
నీడతో పగటిని కప్పేస్తున్నాయి.
అవే మేఘాలు
అరుదయిన వింతవింత రూపాలు
మహాకవి షేక్స్‌పియర్‌
గమనించాడొక ఆకారాన్ని
భయంకర భూతం లాంటి దాన్ని.
ఆ మధ్యాహ్నపు మేఘం ఒకటి
ఇంకా ప్రజ్వరిల్లుతోందతని మాటల్లో
నేడు కూడా మనం చూసుకోటానికి.

అసలు మేఘాలేమిటి?
కల్లోల సమన్విత శిల్పాలా?
తన సృష్టికి అవసరమైన
ఆకారాలూహించుకోడానికి
దేవుడికి కావాలేమో.
అనంత విశ్వంలోని అంతర్భాగాలని
కలిపి కుట్టే అల్లికలో దారాలేమో?
తిరిగొస్తున్న ఉత్తి “శూన్యం” ఏమో,
వాటిని చూస్తూ కూర్చునే మానవుడిలా!
మామూలు సరుకులు

చేతిబెత్తం, తాళం చెవుల గుత్తి, కొన్ని కోయిన్స్‌,
ఈజీగా వచ్చేసే తాళం,
పుస్తకాల వెనక పేజీల్లో
వ్రాసిన చిరువ్రాతలు
ఉపయోగం లేనివీ
నాకు మిగిలిన ఈ నాలుగు నాళ్ళలో
చదవబడనివీ
కార్డులు, చదరంగం బల్ల
పేజీల మధ్య నలిగి ఎండిన పువ్వులతో
ఉన్న ఆల్బములు,
మరచిపోదగని సాయంత్రానికి
ప్రస్తుతం మరచిపోయినా
స్మారకచిహ్నం.
పశ్చిమాన భ్రమగా మండుతున్న
సంధ్యారుణ కాంతి అద్దం.
బోలెడు సరుకులు
ఒక ఫైలు, ఒక అట్లాసు, ద్వారాలు
మేకులు, త్రాగటానికి గ్లాసులు
మనకివన్నీ బానిసలు.
ఏదో రహస్యం దాచుకున్న మూర్ఖులవి!
మనం వెళ్ళిపోయినా
అవి బతికే ఉంటాయి,
తెలుసున్నట్లు, గుడ్డితనం
మనం పోయామని తెలీదు

Jorge Luis Borges (1899 – 1986) is an Argentine poet, essayist, and short-story writer, whose centenary is being celebrated this year all over by the literary world. He was born in Buenous Aires and educated in Europe. He settled in Buenous Aires to become one of the most influential literary figures of this century.. His tales of fantasy and dream worlds have become classics of the twentieth century. With eye problems, he became totally blind in the last decades of his life. His greatest contribution is his rediscovery of the Spanish language. He took the Spanish language towards regions that had not before been visited using words with the greatest of clarity and precision than any Spanish writer of this century.