రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వంద సంవత్సరాల క్రితం

రచన: పెమ్మరాజు వేణుగోపాల రావు
జులై 2005

వేదాలు వల్లించలేదట
ఉపనిషత్తుల సారం గ్రహించలేదట
పురాణాలు పఠనం చెయ్యలేదుట
కానీ ప్రకృతి లక్షణాలని పరికించి పరిశీలించి
తను వేసిన ప్రశ్నల్ని
తను ఇచ్చిన సమాధానాల్ని
వేద వాక్కులంటున్నారు.

చిన్నప్పుడు లెక్కలు కట్టటమే
సరిగా తెలియని
మామూలు బడి పిల్లవాడట!
విశ్వవిద్యాలయాల్లో
ఉద్యోగం దొరకని
గుమాస్తా పనిగాడట!
కానీ అరుదైన దృష్టితో
అద్భుత సృజనతో
సృష్టి ప్రాథమిక సూత్రాలు కొన్నిటిని
సరిదిద్ది తిరగ వ్రాసిన
మహానుభావుడీతడట!

అందరి గడియారాలు ఒకే టైం చూపిస్తాయని
యావద్విశ్వ ప్రపంచానికి కాలప్రమాణం ఒకటేనని
భ్రమతో తృప్తి పడుతున్న మానవ లోకానికి నిజం చెప్పి కళ్ళు విప్పాడు
ఎవరి గడియారం వాడిదేనట, ఒకరి గడియారం మరొకరికి సరిపడదట
కాంతి వేగంతో పరిగెడితే
ముందుకు సాగం సరిగదా
మనలోని ప్రతి జీవకణపు కాలచక్ర పరిభ్రమణ వేగం తగ్గి తరిగి
ముసలితనానికి ఆనకట్టలు పడి యౌవనం పొడుగవుతుందట.
మనకనువుగా దూరాలు సంకోచించుకుని
దూర నక్షత్ర మండలానికి
దారి సుగమం అవుతుందట

గట్టి రాళ్ళలోనూ
స్రవించే ద్రవాలలోనూ
ప్రవహించే వాయువులలోనూ
నిత్యం కదులుతూ నాట్యం చేస్తూ
అణువులు గుంపులు గుంపులు గా విహరిస్తూ ఉంటాయని
ప్రతి వస్తువూ అణు-కణాల సముదాయమని,
కణాదుడు, డెమోక్రిటియస్,
అనాదిగా ఎందరో విజ్ఞానులు
ప్రవచిస్తూ వచ్చారు
ఈ కణాల సైజు, అణువుల సంఖ్య
కచ్చితంగా లెక్కలు కట్టే పద్ధతి మాత్రం
శతాబ్ది కిందట
మానవ జాతికి
ఈ మహామేధావి పెట్టిన బిక్ష

భూదేవిని తడిపి ముంచే
భూపాలుని కిరణరశ్మి
విశ్వమంతా వ్యాపించి
నిశ్చలమైన వేగం తో ప్రసరించే
కాంతి కణ సముదాయమని
నిర్వచించిన మహావిజ్ఞాని

ప్రకృతి నాట్య ప్రదర్శనకి తెరతీసి
సృష్టి రహస్యాలపై వెలుగు ప్రసరింపచేసి
మన కోసం, మన నాగరికత కోసం
సాంకేతిక సామగ్రుల సముపార్జన కోసం
జరిగే శాస్త్ర విజ్ఞాన పరిశోధనను
అధిశాసించినవీయన మాటలు-
మేసర్లు, లేసర్లు, క్లిస్ట్రానులు, సింకోట్రానులు
ఆటంబాంబులు, హైడ్రొజన్ బాంబులు ఒకటి కాదు బోలెడు

అందుకనే అన్నారు
క్రోధి నామ సంవత్సరం పంతొమ్మిది వందల అయిదు
“యానస్ మిరాబిలిస్” అని
అద్భుతమైన ఏడాదని!
ఆనాడు ఐన్‌స్టయిన్ వ్రాసిన
అయిదు పరిశోధనా పత్రాలే
వంద సంవత్సరాల క్రితం
జరిగిన అద్భుతాలు!
విశ్వ రహఃపేటిక నుండి
జారి పడిన మహాద్భుతాలు!!

Source: Einstein’s Miraculous Year: Five papers that changed the face of Physics. Edited by John Stachel. Princeton University Press 1998

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • యోర్హే లూయీ బోర్హేస్‌కవితలు:ఇంకేఁవక్కర్లేదు
  • యోర్హే లూయీ బోర్హేస్‌కవితలు
  • వినాయకుని మనస్థితి
  • వంద సంవత్సరాల క్రితం
  • యోర్హే లూయీ బోర్హేస్‌కవితలు:మేఘాలు

ఇటువంటివే…

  1. మంటో కథలు: వంద వాట్‌ల బల్బు
  2. జమ్మిబంగారం చెట్టు
  3. విందు
  4. సెలయేటి ఒడ్డున
  5. నెమ్మదిగా నాట్యం

జులై 2005 సంచికలో ...

  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • జన్మదిన రాహిత్యం
  • బహు ‘మతులు’
  • విందు
  • సంప్రదాయ సాహిత్యానికి కొత్త వ్యాఖ్యానాన్నిచ్చిన కాత్యాయని విద్మహే
  • సెలయేటి ఒడ్డున
  • 2005 తానా కథ-నవలల పోటీ బహుమతి పొందిన రచనల పై సమీక్ష
  • Doors Closing – ఆఖరి భాగం
  • అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు –
  • కుట్ర
  • జులై 2005
  • వంద సంవత్సరాల క్రితం
  • సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జులై 2005
విందు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.