ఈమాట సంపాదక వర్గానికి మాధవ్ మాచవరం పేరు గత కొన్నేళ్ళుగా సమానార్థకంగా స్థిరపడింది. 1998లో స్థాపించబడిన ఈమాట పత్రికకు తొలినాళ్ళ నుండి ఎందరో ప్రత్యక్షంగానూ, […]

మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్‌ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది. ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి..

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్ 19 నెలల పసిగుడ్డుగా ఉన్న బాల్యంలోనే జబ్బుపడి వినికిడి శక్తిని, చూపుని పోగొట్టుకుంది. తనకి ప్రాప్తించిన గుడ్డితనం కంటే వినికిడిని పోగొట్టుకోవడం వల్ల కలిగిన బలహీనత, ఒంటరితనం, బాధ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకుని ఆమె బాధ పడింది.

ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డ్ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వినోద్‌కుమార్ శుక్లాకు లభించింది. ఈ సందర్భంగా ఆయన రాసిన ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవల గురించి భారతీయ నవలా దర్శనం అన్న పుస్తకంలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన వ్యాసాన్ని ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం.

పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ఎక్కడికెళ్ళాడు దేవుడు?”, అని అరిచాడు; నే చెబుతా. మనం చంపేశాం, నీవూ, నేనూ. మనమంతా ఆయన హంతకులం. కాని, ఎలా చంపాం? సముద్రాన్ని ఎలా తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం? సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా?

మహాయాన బౌద్ధానికి చెందినదీ టిబెటియన్ బుద్ధిజం. జాతకకథల్లో చెప్పినట్టు బుద్ధుడు అనేక అవతారాలు ఎత్తిన మహనీయుడు అని వీరు నమ్ముతారు. అందులో కొన్ని జంతురూపపు అవతారాలు కూడానట. వాటి వాటి గుణధర్మాలు సామాన్యులు గ్రహించి అనుసరించాలన్నది ఆ అవతారాల ఉద్దేశ్యమట.

స్వచ్ఛమైన గాలీ, నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు ఆనందంగా కూడా వుంటారనుకుంటాను. అందుకేనేమో భూటాన్‌ను ఆనందమయదేశం అంటారు.

రాత్రికి రాత్రే సముద్రం రణరంగంగా మారిపోయింది. గాలి భీకరంగా వీచింది. నీరు నిలువెల్లా ఉప్పొంగిపోయింది. ఆకాశం చిమ్మచీకటిగా మారింది. వేటయన్ ఊహించిన విధంగా సముద్రం తన నిజరూపాన్ని చూపిస్తున్నదని గ్రహించాడు. అలలు పడగెత్తి, ఒడ్డుకు ఉరికి పడుతూ, ప్రతీదానికంటే మరొకటి మరింత గర్జనతో ముందుకొచ్చాయి. వేటకు వెళ్లిన బోట్లలో ఒక్కటీ తిరిగి రాలేదు

ఈ ఆధునిక సిద్ధాంతాలను చూసినప్పుడు, కుమారిల భట్టు కంటే శంకరాచార్యులు, బౌద్ధులు సత్యానికి ఎక్కువగా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. బౌద్ధులు, శంకరాచార్యులు కూడా స్థల-కాలాలు మనోనిర్మితాలని, మనం చూసే దృశ్యాలు దేహ పరిమితుల నుంచి పుట్టాయని చెప్పారు. ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా దాదాపు ఇటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదించడం ఆబ్బురపరిచే విషయం.

లాల్గుడి జయరామన్ చిన్నగా నవ్వి “నేను వాయించటానికి నువ్వు ఏమి అట్టేపెట్టావు నాకు? నువ్వు కాఫీ రాగం సంపూర్ణంగా పాడేసావు. అంచేత నాకేమీ మిగల్లేదు. అప్పుడు నేను ఇంక వాయిస్తే బాగుండదు. అందుకనే పాడేయమన్నాను” అన్నారు.

“ఎవర్నువ్వు?”

“దేవుడిని. నీతో చిన్న పనుంది.”

“ఓహో… నేను అమితాబ్ బచ్చన్‌ని! నాకు నీతో పనేం లేదు. పోయి ఇంకెక్కడైనా పని చూసుకో.”

ఎటు పొంచియున్నాడొ యెక్కుపెట్టిన యమ్ము
కటునిషాదుం, డెంత కఠినమా హృదయమ్ము
త్రుటిలోన నేసె నాతురముగా గురి చూసి
చటుకునన్ మగపక్షిఁ జంపె గుండెను దూసి

ఆ లేఖలన్నీ చేరినప్పుడే కదా,
మన చుట్టూ అడవులు విస్తరించేది
అందరికీ నాలుగు వేళ్లూ నోట్లోకి పోయేది!

మనది పరిశుభ్రత అంటే చాలా పట్టింపు గల వంశం అన్నమాట. అన్నిటినీ శుద్ధి చేసే ఆ అగ్నిదేవుడే కానీ, మనింటోకి రావాలంటే చన్నీళ్ళు స్నానం చేస్తేగానీ రావడానికి వీల్లేదని అర్థం.