గ్రీసు దేశపు పురాణ గాథలు చదువుతూ ఉంటే వాటికీ హిందూ పురాణ గాథలకి మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోలికలు పేర్లలో కావచ్చు, సంఘటనలలో కావచ్చు, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, దేవతల ఆయుధాలలో కావచ్చు, దేవతల వాహనాలలో కావచ్చు, దేవతలకి మానవులకి మధ్య సంబంధబాంధవ్యాల రూపేణా కావచ్చు. ఈ పోలికలకి కారణాలు రకరకాల కోణాలలో వెతకవచ్చు.
Category Archive: వ్యాసాలు
మరో రెండు మూడు వారాలు గడిపితే బావుండునన్న ఊహ. నచ్చిన దేశాన్ని వదిలివెళ్తున్నందుకు చిన్నపాటి బెంగ. అమెరికాలూ, ఆస్ట్రేలియాలూ, జర్మనీలూ తిరిగినపుడు తెలియకుండానే పరాయి దేశమన్న స్పృహ నావెంట ఉంటూవచ్చింది. సింగపూరు, ఇండోనేషియాలు వెళ్ళినపుడూ అవి విదేశాలనే అనుకొన్నాను. మరి ఈ థాయ్‌లాండ్‌లో ఎప్పుడూ లేనిది ఈ స్వదేశ భావన ఏమిటీ?
ఆటల మైదానాల్లో స్కోరర్‌ని నేను. ఆటతో పాటు జీవితాన్ని రికార్ద్ చేయడం నా పని. ఇప్పుడు ఈ పుస్తకానికి ఒక ‘ముందు మాట’ అంటూ చెప్పాలి కాబట్టి–ఎందుకు ఈ రాతలు ఇప్పుడు? ఇలాగని? పెదాలు బిగించుకుని మోకాళ్ళ మీద కూచుని జుట్టు కళ్ళమీదికి జారుతుంటే చేత్తో తోసుకుంటూ, చాలా చిన్నవాడిగా, ఇంటా బయటా గోడల మీద బొగ్గుతో నల్లబొమ్మలు గీసే నేనే నాకు కనబడతా.
నవోదయలో అడుగిడిన సాహితీవేత్తలంతా వెలుగుమూర్తులే! ఆ వెలుగే ఇదంతా! మంచి పుస్తకానికి చిరునామా నవోదయ! మహోదయుల సాయంకాలపు సంగమమై 50యేళ్ళు వెలిగింది. పుస్తకాల గుళ్ళో ధ్వజస్తంభంలా నవోదయను నిలపాలన్నది నా కల. నేనింకా ఆ కల కంటూనే ఉన్నాను. నవోదయ పుస్తకాలు తెలుగు భాష ఉన్నంతవరకూ సజీవం. తెలుగు భాష ఉన్నంతవరకూ నవోదయ సజీవం.
వీళ్ళకు మనలాంటి శ్రుతిమించిన పోటీతత్వం లేదు. నింపాదిగా తమ పని తాము చేసుకొంటూ పోతారు. రేయింబవళ్ళు పనిచేసి అందరికన్నా ముందు ఉండాలి అన్న తాపత్రయం లేదు. ఒక పట్టాన సహనం కోల్పోరు, ఆవేశపడరు. మనం కోల్పోయి ఆవేశపడినా స్పందించనే స్పందించరు. తరిమో, ఆశపెట్టో, భయపెట్టో వీళ్ళతో పనిచేయించలేం.
రంగు, భాష, సంస్కృతి, మతం, జాతి అన్న పొరలు దాటివెళితే మనిషికీ మనిషికీ మధ్య మరీ అంతంత దూరం లేదన్న వాస్తవం కనిపిస్తుంది. జర్మనీ అయినా అమెరికా అయినా; భారతదేశంలోని అనేకానేక రాష్ట్రాలు అయినా; కారణాలు వేరువేరు అయినా; భిన్న జాతులవాళ్ళూ భాషలవాళ్ళూ కలసిపోయి బతకడం అన్నది ఈ కాలపు అవసరం. నిజానికి అదో గొప్ప అవకాశం.
సోమరాజు సుశీల పాఠకులకు తమ బాల్యాన్ని పునర్దర్శించుకునే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని ‘ఇల్లేరమ్మ కతలు’లో అందించారు. ఆ క్రమంలో అందులోని పాత్రలు ఉడుక్కున్నా, ‘అది నిజమే కదా. ఉడుక్కోవడం దేనికీ, నిన్ను కథలోకి ఎక్కించి అమరత్వం కల్పిస్తేనూ’ అని డబాయించారు. ముందే చెప్పినట్టు, ఆమెకు నిజం చెప్పడం ఓ సరదా.
అంతా బానే ఉంది గానీ, ఇన్నాళ్ళూ చేతులు కట్టుకు కూచుని, ఒక్కసారి ఈ రచయిత్రి ఇలా తిరుగుబాటు చేయడం, ఓవర్టేక్ చేసి పెద్దపీట ఆక్రమించడం సీనియారిటీని ఓవర్‌లుక్ చెయ్యడం అవుతుందని సంకోచంగా ఉన్నా ఆమెకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. కనీసం కొన్నాళ్ళపాటు వీరు పీఠికల జోలికి రాకుండా ఉంటే చాలు. అదే నాలాంటి వాళ్ళకి పదివేలు.
రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతోన్న రోజులవి. పర్ల్ హార్బర్ మీద దాడి ద్వారా జపాన్ విజయవంతంగా ఆ యుద్ధంలో అడుగుపెట్టిన సందర్భమది. ఆగ్నేయాసియా దేశాలన్నీ జపానువారి అధీనంలో ఉన్న సమయమది. అండమాన్ నికోబార్ ద్వీపాలు కూడా ఆక్రమించబడిన సమయమది. భారతదేశం మొత్తాన్ని జయించాలన్న సంకల్పంతో జపాను ఉరకలు వేస్తోన్న వేళ అది.
కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్ళు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కాని, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్ళని గుర్తించే సమాజమూ లేదు.
కేవలం శారీరిక సామర్థ్యం, సాధారణమైన తెలివితేటలూ మాత్రమే కాదు, విజయాన్ని సాధించాలనే తృష్ణ, తిరుగులేని పట్టుదల ఉంటే వాటితో మన భవిష్యత్తును పడుగూ పేకలుగా మనమే అల్లుకోవచ్చు. విధి అంటే మనచేతిలో ఉన్న ఈ అల్లికే. ఈ అల్లిక ఎంత కష్టంగా ఉంటే, ఆ విజయం అంత తీయగా ఉంటుంది.
నూటయాభై అడుగుల పొడవూ పాతికడుగుల ఎత్తూ ఉన్న బృహత్తర విగ్రహమది. ఒకప్పుడు ఈ విగ్రహం గుడి లోపల ఉండేదట. మామూలే… దండయాత్రలు, విధ్వంసాలు, పునర్నిర్మాణాలు. ఈ రోజుకు ఇలా ఏ నీడా లేకుండా మిగిలిందా విగ్రహం. మహాపరినిర్యాణం భంగిమ అది. ఈ విగ్రహమూ, అది ఉండిన గుడీ పద్నాలుగో శతాబ్దం నాటివనీ, 1767లో అవి బర్మీయుల దాడికి గురయ్యాయనీ చరిత్ర చెపుతోంది.
బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. వస్తువూ, వాదమూ ఏదైనా, మనోధర్మమే ఏ కళకైనా శోభనిస్తుందనీ, అది ఎంత గొప్పదైతే కళ అంతలా రాణిస్తుందనీ నమ్మిన కవి ఇంద్రగంటి. ఆయన ఈ భావాలను ఎంతలా నమ్మారో, అంతలా పునరుద్ఘాటిస్తూ వచ్చారు.
విరసం కార్యవర్గ సమావేశం జరుగుతుండగా గెడ్డం ఉన్న ఒక ముసలాయన వస్తాడు. లోపలి వాళ్ళతో వెంటనే మాట్లాడాలని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ కార్యకర్త సాయంకాలం రమ్మని పంపించేస్తాడు. నిరాశతో వెనుదిరిగిన ఆయన్ని, ‘ఇంతకీ మీ పేరేంటి సార్?’ అని అడుగుతాడు. దానికాయన ‘నన్ను కార్ల్ మార్క్స్ అంటారు బాబూ!’ అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ జలతీరపు రెస్టారెంటూ, అక్కడి వాతావరణమూ, స్పీకర్లలో వినిపిస్తోన్న థాయ్ సంగీతమూ నన్ను ఆకట్టుకొన్నాయి. అప్పటికే గంటా రెండుగంటలుగా ఎండంతా నాదే! కాస్సేపు నీడపట్టున ఆగుదామనీ, ఇలాంటి సమయాల్లో నాకు బాగా ఇష్టమైన పెప్సీ తాగుదామనీ అనిపించింది. లోపలికి నడిచాను. వేళగాని వేళ దేశంగాని దేశం నుంచి అలా ఓ మనిషి నడచి రావడం వాళ్ళను ఆశ్చర్యపరిచింది…
సమాజాన్ని, చరిత్రను, చరిత్రగతిని సీరియస్‌గా తీసుకుని రాసిన చంద్రశేఖరరావు కథల గురించి తెలుగు సాహిత్యలోకం చర్చించాల్సినంతగా చర్చించకపోవడం, దాదాపు మౌనంగా ఉండడం, అర్థంకాని కథలనే వ్యాఖ్యల మాటున దాక్కోవడం చంద్రశేఖరరావు కంటే తెలుగు కథకు జరిగిన నష్టంగానే భావించాలి. ఆయన రచనలపై చెప్పుకోదగ్గ వ్యాసాలేవీ ఈనాటికీ రాలేదు.
అప్పుడే బ్యాంకాక్ నగరం మేలుకొంటోంది. ఆకాశంలో వెలుగు రేకలు. దారిలో ఏదో జలప్రవాహపు ఉనికి. చక్కని రోడ్లు… ఫ్లై ఓవర్లు… మెల్లగా పుంజుకొంటోన్న వాహనాల జోరు. నగరం గురించి సరళమైన ఇంగ్లీషులో నా చిన్న చిన్న ప్రశ్నలు. తడబడుటాంగ్లంలో అతని సమాధానాలు. కుదిరిన సామరస్యం.
ఛాయాదేవి అంటే క్రమశిక్షణ. ఛాయాదేవి అంటే సమయ పాలన. ఛాయాదేవి అంటే ప్రతిపనీ కళాత్మకంగా చెయ్యడం. ఛాయాదేవి అంటే హాస్య చతురత. ఎంత కష్టాన్నైనా అది సహజమేనన్నట్లు స్వీకరించడానికి సిద్ధంగా వుండడం. మృత్యువు అనివార్యం. కాని అందరూ సంసిద్ధంగా ఉండలేరు. ఛాయాదేవి మాత్రం ఎవరికీ ఎలాంటి తడబాటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని సగౌరవంగా వెళ్ళిపోయారు.
పఠాభి ఒక ప్రపంచయుద్ధం సృష్టించిన విధ్వంసం అనంతరం, ఆ విధ్వంసం నుంచి కోలుకోకుండానే ప్రపంచం మరొక ప్రపంచయుద్ధం కోసం సమాయత్తమౌతున్న కాలంలో, వినాశనం వైపుగా, ఆత్మ విధ్వంసకత్వం వైపుగా ప్రపంచం అడుగులు వేస్తున్న కాలంలో ఆ యుగ మనఃస్థితిని, ఆ కాలంలో తన ఆత్మ విచికిత్సని పఠాభి కావ్యరూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మనమర్థం చేసుకోవాలి.
అమ్మా సత్యవతిగారూ! కథలో కథంతా చెప్పే ప్రధాన పాత్రకు పేరు లేదు. ఒక వ్యక్తిత్వమూ, ఒక అభిరుచి, ఒక రుచి, అతగాడి ఒక వృత్తి కనపడదు. అసలు కళ్ళముందుకు రాని సుశీల మాత్రం మనకు అంతా తానై మనతో ఉండిపోతుంది. ఈ కథ ఇంకో గొప్ప టెక్నిక్. అమ్మా మీకు నా పరి పరి దండాలు.