ఎంతో మురిపెంగా నాలుగు రోజులు మునిపత్నులతో గడిపి వద్దామని బయలుదేరిన సీతకు ఈ ఆజ్ఞ వినడం పిడుగుపాటే అయింది. తాను ఏ నేలమీద నిలబడి ఉన్నదో ఆ నేల గభాలున పగిలి తానందులో కూరుకొని పోతున్నట్లుగా అనిపించింది.

సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. […]

మనలో చాలామంది వాడుక భాషలో రాస్తారు. అయినా, మాట్లాడినట్టుగానే రాయరు. రాసేటప్పుడు వాక్యనిర్మాణం మాట్లాడేటప్పటి వాక్యనిర్మాణంలా ఉండదు.

పుదుకుట్టయి ఆస్థానంలో బొబ్బిలి కేశవయ్యతో సంగీత భేటీ త్యాగరాజుతో జరిగినట్లుగా కొంతమంది రాసారు. నిజానికది జరిగింది శ్యామ శాస్త్రితో!

మైడియర్ సంపాదకులూ: నా బాధ్యతగా, కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. – ముఖ్య సంపాదకుడు

“ఈ వాక్యం అబద్ధం” అన్నది నిజమైతే, తన గురించి తను చెప్పుకున్నది నిజమన్న మాట; మరి తన గురించి తను ఏం చెప్తున్నది? తను అబద్ధమని!

ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఈమాట పాఠకులైన మిమ్మల్ని చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి, వీలైనంత వివరంగా.

అపుడపుడు మా ఇంటి వసారా గూట్లోంచి గుమ్మం ముందు పడిపోయే రెక్కలు రాని పిచుకపిల్ల కళ్ళముందు కదలాడి, కడుపులో దేవినట్టు అయ్యింది.

తెలుగు సాహిత్యంపై మక్కువతో సరదాగా మొదలెట్టిన సాహితీ సదస్సు ప్రతీయేటా తప్పకుండా చేద్దామన్న స్థాయికొచ్చింది. మార్చి నెల 14వ తేదీ,2009, శనివారం కాలిఫోర్నియాలో మిల్పిటస్ […]

గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం.

ప్రధాన పాత్రలయిన రాజకుమారుని గురించో, రాజకుమార్తె గురించో కొంచెం పొగుడుతారు. రాగాలతో, సరాగాలతో ఆ పాత్ర ఎవరో సభికులకు పరిచయం చేస్తారు. కొద్దిపాటి బూతునూ, సమయానుకూలంగా సంభాషణల్లో చొప్పిస్తారు.

గులక రాళ్ళని తట్టి ఏనాటి ఊసులో తలబోసి
దిగులుపడి వెనుదిరిగిపోతోంది నది
నీటిగాలికి పులకించిపోతోంది నియమగిరి
రెప రెపల రేయింక అలసి నిల్చుంది.