నేలబారు గద్ద
నిడుపు సూపు నేను
నేలమీద లేను
ధూళి రేగుతాను.
శీర్షికలు సంచికలు
నేను ఉద్యోగంలో చేరిన రోజు తను ఆస్పత్రి, ఆఫీసుల మధ్య తిరుగుతోంది. వాళ్ళ నాన్నకిది నాలుగో గుండె పోటు. ఆయనకు ఆరోగ్యం నెమ్మదించినప్పుడు మాత్రం వాళ్ళందరి జీవితాలను నియంత్రించేది నాయనే.
కఱ్ఱచట్రంబు పైఁ గట్టి గట్టిగాను
చిత్రలేఖన కనువైన శ్వేతపటము
వ్రాయఁ గాఁ గడంగితిఁ దద్వి హాయసానఁ
గ్రాలు ఘనమాలికాచిత్రమాలికలను.
నాకు మళ్ళీ గుర్తొస్తోంది-
నువ్వొచ్చిన ఆ కాలమే ఇదనీ
చప్పున గుండె చప్పుడు ఆగి వెళ్ళిందనీ.
బుడి బుడి
నీటి తెప్పల కింద
తక్కుతూ తారుతూ
కంకిపాటి కామాయికి ఇన్ఫెంట్రీలో ఇచ్చిన పేరు ప్రయివేటు సిపాయి నంబరు 58310 అని. ఆ చుట్టుగోడలో వున్న కంతలోంచి దూరి ఇవతల పడ్డాడు. బోర్ల […]
ఏ దేశంలోనన్నా యుద్ధం వస్తే, యుద్ధపరంగా సాహిత్యం రావడం సహజం. ఆ విషయంలో మన తెలుగు సాహిత్యం కుంటుపడే ఉన్నది. బహుశా తెలుగునాడు నుంచి మిలిటరీలోకి వెళ్ళినవారు తక్కువై ఉండవచ్చు.
ముళ్ళపూడి వెంకట రమణ (28 జూన్ 1931 – 24 ఫిబ్రవరి 2011): సాక్షి, ముత్యాలముగ్గు, రాజాధిరాజు, అందాలరాముడు, బుద్ధిమంతుడు, గోరంత దీపం, స్నేహం, వంశవృక్షం, రాధాకళ్యాణం – ఇలా ఎన్నో బాపూ చిత్రాలకు మాటలద్దిన మాంత్రికుడు. బుడుగు, సీగాన పెసూనాంబ, అప్పుల అప్పారావు, కాంట్రాక్టరు, రాధా గోపాళం, రెండుజెళ్ళ సీత – ఇలా ఎన్నో పాత్రలకు జన్మ నిచ్చి మాటలు పోసి పెంచి సజీవులను, చిరంజీవులను చేసిన వాక్య బ్రహ్మ, ఋణానందలహరి భాష్యకారుడు, అర్ధబాపూ అయిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ పెన్ను మూశారు. వారికి మా శ్రద్ధాంజలి.
- ఈమాట ప్రచురణ నియమాలలో ఒక చిన్న మార్పు ప్రవేశపెడుతున్నాం.
- పలుకుబడి – తెలుగు పదాలపై సురేశ్ కొలిచాల కొత్త శీర్షిక ప్రారంభం.
- ఒక కథ చెప్పిన కథ; కనకప్రసాద్ కవిత, వ్యాసం, శబ్ద సాహిత్యం; సత్య పెట్లూరి మొదటి కథ కాలనీ భోగి; ఇంద్రాణి, దమయంతి, ఉదయకళ, రవిశంకర్, కృష్ణదేశికాచార్యుల కవితలు, వేలూరి వేంకటేశ్వరరావు, గొర్తి బ్రహ్మానందంల కథలూ, ఇతర శీర్షికలు, వ్యాసాలు – ఈ సంచికలో మీకోసం.
ఈ మధ్య ఒకరిద్దరు రచయితలు, తమ వ్యాసాలను మరింత తరుచుగా ప్రచురించే వీలుంటే బాగుండునని మాతో తమ కోరిక వెలిబుచ్చారు. మాకూ సబబే అనిపించింది.
ఏ కవితనో చదువుతున్నప్పుడు మనందరికీ ఎప్పుడో ఒక్కప్పుడు వచ్చే సందేహం – ఇదసలు కవితేనా, లేకపోతే వాక్యాన్ని పొట్టీ పొడుగూ ముక్కలుగా విరక్కొట్టి ఇది కవితే అని రాసినవారు బుకాయిస్తున్నారా అని. అది కవిత్వమే అయితే, కవి ఏ ఆధారంతో ఆ కవితలో పాదాలని విరక్కొడుతున్నాడు? అని.
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
కోవెల సంపత్కుమారాచార్య (26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010): శ్రీ కోవెల జననం వరంగల్లులో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, హిందీ భాషలలో ఎం. ఏ., ఆపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1978లో ‘తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ: సంప్రదాయము’ అనే సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ డిగ్రీలు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ – లక్షణ దీపిక, తెలుగు ఛందోవికాసము, మధుర గాథలు, తదితర గ్రంథాలు; ఆముక్త, చేతనావర్తం కవితా కావ్యాలు; విశ్వనాథ కవిత్వ విమర్శ, కన్యాశుల్క నాటక విమర్శ, వచన పద్య లక్షణంపై చేరాతో చర్చ, అనేక తదితర సాహిత్య వ్యాసాలు – తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో పరిపుష్టం చేసిన పండితుడు, కవి, విమర్శకుడు, నిగర్వి, స్నేహశీలి, ఒక మామంచి మనిషీయన. సంపత్కుమారాచార్య సాహితీప్రస్థానంపై సమగ్ర పరిచయాత్మక ప్రత్యేక వ్యాసం ‘విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార‘ సహితంగా ఈ స్మారక సంచికలో మీకోసం…
[వేలూరి వేంకటేశ్వర రావు పరిచయంతో…]
వారణమాయిరం ప్రత్యేక గ్రంథం కాదని, అది నాచ్చియార్ తిరుమొళిలో ఒక ఖండమనీ, ఆ ఖండంలో గోదాదేవి రంగనాథునితో తనకు కలలో జరిగిన పెండ్లి చెలికత్తెకి వివరించిందనీ తెలిసింది. సంపత్కుమారకి ఆ ‘పెండ్లి కల’ తెలుగులోకి తేవాలనీ కోరిక కలిగింది.
పదిల పరచంగ పుస్తకప్రతతు లెల్ల
రత్నసాగరమన, రత్నరంజకమన,
మఱియు రత్నోదధి యనంగఁ బరగు
మూఁడు గగనమంటెడి భవనాలు గట్టిరచట.
పద్యం అనగానే పాదబద్ధత ఉండాలి, అన్నది మొదటి నియమం. పద్యం యొక్క పాద నిర్మాణానికి ‘ఛందోబద్ధమైన పద్ధతి’ కూడా ఒకటి ఉండి తీరాలన్నది రెండో […]
సంపత్కుమార కన్యాశుల్కం నాటకాన్ని రకరకాల కోణాలనుంచి పరిశీలించి తన అభిప్రాయాలని సూటిగా చెప్పారు. ఆ వ్యాసాలపై వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానంగా రాసిన ఈ వ్యాసానికి, నిజంగా తగిన గుర్తింపు రాలేదు.
వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి 1.ఆంజనేయులు, కుందుర్తి – ‘హృదయం విప్పి’ (గోపాల చక్రవర్తి ‘కలం కలలు’ […]
ప్రాంగణాన పెద్ద ముగ్గు. ప్రహరీ గోడ బయట వీధిలో మరో ముగ్గు. గేట్ తీసుకుని బయటకు తొంగి చూస్తే ఇంటింటికీ ముగ్గులు. తెల్లగా నక్షత్రధూళి దారంతా పరుచుకున్నట్టు తోచేది.