రావునేదో అర్థంకాని అసహ్యభావం ముంచేసింది. శరీరం యావత్తూ ఏవగింపుతో జలదరించింది. తననీ, తన సంతానాన్నీ చూసుకుంటూ కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు! అమ్మకి నలభై ఐదేళ్ళు దాటాయి. నాన్నకి యాభై ఏడో ఎనిమిదో ఉంటాయి. ఇద్దరూ వృద్ధాప్యంలో అడుగుపెట్టారు. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, రెండు వేపులా మనవలూ! అమ్మమ్మకీ తాతకీ ఇప్పుడు పిల్లలా? ఇప్పుడు పసిబిడ్డ! ఒక్కసారిగా ఆ ఇద్దరి మీదా రావుకి చీదర ముంచుకొచ్చింది. అసలు ఈ వయస్సులో బిడ్డల్ని కనవచ్చునా?
శీర్షికలు సంచికలు
ఆ మధ్య టైటిల్సు ఆఖర్లో కొత్త కార్డ్ ఒకటి ప్రత్యక్షం అవడం మొదలు పెట్టింది – దర్శకత్వపు పర్యవేక్షణ అని. ఒక లఘు డైరెక్టరుగారి చేతిలో ప్రతిష్టాత్మక చిత్రం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక గురు డైరెక్టరుగారు అధ్యక్ష పీఠం అధిష్టించి ఈ సత్తరకాయ గారిని సరిదిద్దుతూ ఉంటారు. దర్శకత్వమే అంటేనే పర్యవేక్షించి తప్పొప్పులు ఎత్తి చూపే పని ఐతే, మళ్ళీ ఈ తోక ఎందుకో, ‘ఆడ లేడీస్’ అన్నట్టు.
రివరీ లోంచి బయటపడి వాచ్ వైపు చూస్తే ఇప్పుడందులో ముళ్ళే లేవు. ఇంతలోకే ఎక్కడికి పోయాయి అని ఆశ్చర్యపడ్డాడు. దీన్ని రిపేర్ షాపువాడికి చూపించి ముళ్ళు మాయమయ్యాయంటే వాడు నమ్ముతాడా అసలు? అనుకుంటూ ముందు విడియో మానిటర్ని చూశాడు. ఇంకా సేఫ్టీ విడియో వస్తూనే వుంది. రివైండ్ అండ్ ప్లే లాగా అందులోని వ్యక్తి సీట్ బెల్ట్ పెడుతూ, తీస్తూ, పెడుతూ, తీస్తూనే వున్నాడు. డ్రింక్ కార్ట్ కోసమని వెనక్కు చూస్తే కొన్ని పసుపు పచ్చని ఆక్సిజన్ మాస్కులు వేళ్ళాడుతూ కనిపించాయి.
సబ్దంగళ్ కడందు వా – వైరముత్తు. సంపుటి: కొంజం తేనీర్ నిఱైయ వానం (కాస్త తేనీరు బోలెడంత ఆకాశం), 2003. சப்தங்கள் கடந்து வா […]
బండ నెత్తిమీద పడినంత వేగంతో నడుస్తుంది ‘బండపాటు’లో కథనం. చావు తరువాతి సంఘటనలన్నీ జోరుగా జరిగిపోతాయి. ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతూ లాభం పొందటానికి చేసే ప్రయత్నాలను చాసో తీవ్రంగా ఉద్విగ్నంగా అన్నిటినీమించి వ్యంగ్యంగా ధ్వనింపజేస్తారు. మనిషితనం నశించినవాళ్ళ ప్రవర్తన ఎంత హీనంగా ఉండగలదో మనం ఊహించలేనంత పదునైన వ్యంగ్యంతో వర్ణిస్తూ బాధాకరంగా నెమ్మదిగా ‘కఫన్’ను నడిపిస్తారు ప్రేమ్‌చంద్.
నీ వునికి నాలో
నిరంతరం ప్రవహించినా
కనుచూపుమేరా అదృశ్యంగా
నన్ను స్పృశిస్తూనే వున్నా
నేను నీ అగుపించని రూపుకై
తపిస్తూనే వుంటాను
విశ్వనాథవారి వేయిపడగలు నవలను, మార్గరెట్ మిచల్ నవల గాన్ విత్ ద విండ్ రెండూ ఇంచుమించు ఏక కాలంలో వెలువడినవే కాని, రెండింటి భౌగోళిక తాత్విక నేపథ్యాలు వేరు. ఒకదానిది భారతీయ నేపథ్యం, ఇంకోదానిది అమెరికన్ నేపథ్యం. అలాంటిది, వాటి మధ్య పోలికలు ఒక ఆశ్చర్యమైతే, ఆ పోలికలలో కొన్ని తేడాలూ అంతే ఆశ్చర్యం.
పెళ్ళయిన కొత్తల్లో ఆమె కాళ్ళ పట్టీలు రెండూ ఒకదానికొకటి చిక్కుకోవడం తరచూ జరుగుతూ ఉండేది. నడిజాములో ఆమె కాళ్ళు చిక్కుకుని అవస్త పడుతుంటే ఆ పరిస్థితి చూసి నవ్వుతూ ఉడికించేవాడు. ఆమె బేలగా అయ్యో పట్టీలు చిక్కుకున్నాయి విడిపించండి అని బతిమలాడేది. ఆమె ఆరాటాన్నలా కొనసాగించి చూసి ఆనందపడేవాడు. ఆమె పాదాలను సుతిమెత్తగా తడుముతూ పట్టీల చిక్కు విడిపించేవాడు. ఎంత ఆలస్యం చేస్తే అంతసేపు ఆమె పాదాలతో ఆడుకోవచ్చు అన్నట్టు నెమ్మదిగా చిక్కు విడిపించేవాడు.
గడచిన నెల వ్రాసిన వ్యాసములో ఉదాహరణముల ఉత్పత్తిని, వాటి నియమములను, విభక్తులను గుఱించిన విశేషములను, రగడల లక్షణములను చర్చించినాను. ప్రతి విభక్తికి నిదర్శనముగా కొన్ని ప్రసిద్ధమైన ఉదాహరణ కావ్యములనుండి వృత్తములను, కళికోత్కళికలను నిదర్శనములుగా చూపినాను. ఇప్పుడు నేను వ్రాసిన శారదోదాహరణతారావళి అనబడు ఒక ఉదాహరణకావ్యమును మీకు సమర్పిస్తున్నాను.
తను అమెరికా వెళ్ళకముందు ఎప్పుడో కాలేజ్ డేస్‌లో ఉండగా లోకల్ ట్రెయిన్ ఎక్కిన అనుభవం గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది కల్పనకి. మామూలు కంపార్ట్‌మెంట్‌లో అయితే మనిషిని నలిపేయడం గారంటీ. ఫస్ట్ క్లాస్‌లో అయితే కాస్త డీసెంట్‌గా ఒకళ్ళనొకళ్ళు ఆనుకుంటూనో, లేకపోతే వేళ్ళాడుతూనో నిలబడొచ్చు. అక్కడికీ తన చేతిలో పర్స్ పోకుండా దాచుకోగలిగితే అదృష్టమే. అయినా బాంబేకి ఇలాంటి వర్షం మామూలే కదా అనుకుంటూండగానే మళ్ళీ తండ్రి కంఠం వినిపించింది ఫోనులో, “విన్నావా? కారు బయటకి తీయవద్దు!”
“పక్షుల కలరవాలను విన్నాను
రాలినపడిన పండుటాకులపై మృగాల
సయ్యాటలు విన్నాను
మూగవైన గట్లతో నది ఆపక సలిపే
మధుర సంభాషణలు విన్నాను
పూల తపస్సును భంగపరుస్తున్న
తుమ్మెదల ఝంకారాన్ని విన్నాను
గజరాజును వెదుకుతున్న
కరిణి ఘీంకారాన్ని విన్నాను”
అడ్డం అడ్డం ముందుభాగాన చెదిరిన వరసా? (3) ఇంటి ముందుభాగం వసారా. దాన్ని వాడుకలో వసార అంటాం. ఆధారంలో ఇచ్చిన వరసా చెదిరి వసార […]
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
శ్రీమతి వాలి ఉమాదేవి, వాలి హిరణ్మయీదేవి అనే పేరుతో 80వ దశకంలో విరివిగా కథలు వ్రాశారు. మంచి కథల రచయిత్రిగా పత్రికా పాఠకులకు చిరపరిచితులు. హిరణ్మయీదేవి గారు ఎప్పటినుంచో రాస్తున్నా, ఇటీవలి కాలంలో రాసిన 22 కథలతో స్వప్నసాకారం అనే వారి మొదటి సంపుటం లోని కథలకు ఒక సంక్షిప్త పరిచయం.
గడి నుడి-4కి చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చాయి. ఐతే తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. దాదాపు ఇరవైమంది పరిష్కారాలు పంపినా అన్ని సమాధానాలూ సరిగా పంపింది ఇద్దరే: 1. శ్రీవల్లీరాధిక, 2. కె. వి. గిరిధరరావు. ఇద్దరికీ అభినందనలు!
- మనకు కనిపించే వెండితెర వెలుగుల వెనుక మనకు తెలియని ఒక ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ శ్రీనివాస్ కంచిభొట్ల వ్రాస్తున్న తెరచాటు-వులు ఈ సంచిక నుంచి ప్రారంభం.
- ఈమాట కొత్త రూపం గురించి తమ అభిప్రాయాలు చెప్పిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈమాటలో ఇంకొన్ని సౌకర్యాలు చేర్చాం. ఇప్పుడు నచ్చిన రచనను అక్కడినుంచే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి వీలుగా ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ బటన్లు; సంపాదకులను సంప్రదించడానికి, మీ రచనలు పంపడానికి క్విక్ లింక్స్, పాఠకుల అభిప్రాయాలు, పాత సంచికలు, శీర్షికలు మొదలైనవి మరింత అందుబాటులోకి తెచ్చాం.
- ముఖ్యగమనిక: ఈమాట గ్రంథాలయం పాఠకులకు మరిన్ని సదుపాయాలు ఏర్పరచడం కోసం మెరుగు పరుస్తున్నాం. ప్రస్తుతానికి గ్రంథాలయంలోని పుస్తకాలకు దారి పాత సంచికలు పేజిలోనుంచి ఏర్పాటు చేయబడింది.
A Cento verse created from the first lines of A Poem at the Right Moment for Velcheru Narayana Rao on the occasion of his 85th birthday that falls on February 1, 2017.
స్క్రిప్టు ఇంకా పూర్తిగా రాయబడలేదు. క్లయిమాక్సుని ఎలా ముగించాలో తెలియక సినేరిస్టులు (అంటే స్క్రీన్‌రైటర్లే. సినేరియోలు రాస్తారని అలా అనేవారు లెండి ఒకప్పుడు) తలలు పట్టుకున్నారు. అప్పటికే ముగ్గురి తలలు ఎగిరి పడ్డాయి కూడా. ఈ లోపల హీరోగారికి అసహనం పెరిగిపోతోంది.
రాత్రి నిద్ర పట్టేదాకా నా కళ్ళు బల్ల మీదున్నరజనీగంధ పూలనే చూస్తూ ఉండిపోతాయి. నాకేంటో అవి పువ్వులు కావని, అవన్నీ సంజయ్ ఎన్నోరకాల కళ్ళని, అవి నన్నే చూస్తున్నాయని, నా ఒంటిని నిమురుతున్నాయని, ప్రేమ కురిపిస్తున్నాయనీ భ్రమ కలుగుతుంది. అంతగా అన్ని కళ్ళు నన్ను చూస్తున్నాయనే కల్పన నన్ను సిగ్గులో ముంచుతుంది.