గడి నుడి – 8 సమాధానాలు

గడినుడి-8కి అన్నీ కరక్టు సమాధానాలు పంపిన వారు:
ఎవరూ లేరు.

అడ్డం:

  1. విశ్వనాథ…శాస్త్రి

    విశ్వనాథతో మొదలై, శాస్త్రితో ముగిసే పేరుతో ప్రసిద్ధమైనవారు విశ్వనాథ పావని శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ కుమారుడు.

  2. అటుఇటుగా సుత మమ అనుకోవడంలో అనురాగం

    అనురాగం = మమత. ఆనగ్రామ్.

  3. అరే! దిగ్గున దృష్టినాకర్షించగలిగెనే!

    Outstanding అనే అర్థంలో “అదిరింది” అనడం వాడుక. క్లూ మొదట్లో ఆనగ్రామ్ ఉంది.

  4. తృప్తిచెందిన మనసు

    సంతుష్టమది అంటే దుష్టసమాసం అవుతుంది.

  5. దీనితో మెత్తగా ఒకటంటే చాలు, గట్టిగా రెండు తిరిగొస్తాయి

    తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా-నని సామెత.

  6. మిక్కిలిగా ఈడేరుటతో వచ్చు కీర్తి

    ప్ర = మిక్కిలి, ఈడేరుట = సిద్ధి. ప్రసిద్ధి = కీర్తి

  7. విజయనగరపు వింతపక్షి

    రెండు తలల కాల్పనిక పక్షి గండభేరుండం. అధికారచిహ్నంగా కొన్ని ఇతర రాజవంశాలు కూడా రెండుతలల పక్షి బొమ్మను వాడినప్పటికీ దాన్ని నాణేల మీద మొట్టమొదట ముద్రించింది విజయనగర రాజులు. విజయనగర శైలికి చెందిన దేవాలయాల కుడ్యశిల్పాల్లో కూడా ఒక్కో ముక్కున, ఒక్కో కాలితో ఒక్కొక్క ఏనుగును పట్టుకుని ఉన్న పక్షి బొమ్మలు కనిపిస్తాయి.

  8. హిందూమహాసముద్రంలో తెల్లవాడి సైనిక స్థావరం

    డీగోగార్సియా – మారిషస్ నుంచి బ్రిటన్ కొనుక్కుని సైనిక అవసరాల కోసం అమెరికాకు అప్పగించిన ద్వీపం.

  9. వాలి కడుపులో వికటించిన శేఫాలిక

    శేఫాలిక అంటే వావిలాకు. వాలి కడుపులో వి దూరితే వచ్చేది వావిలి.

  10. మరులుగొలపడానికి కవనమల్లినవారి మొదటి ఎంపిక

    మన్మథబాణాల్లో మొదటిది. ఆనగ్రామ్.

  11. అడడా ధం, గారాబం నుండి పెనవేసుకున్న అనురాగం. ఆనగ్రామ్.
  12. అడ్డం 34 నుంచి పొందేది.

    చవి అంటే రుచి. వాయి అంటే నోరు. నోటికి తగిలే రుచి వాచవి.

  13. బజ్జీల బండి కాడ వడివేలు కరకరలాడించేవి ఆనగ్రామ్.
  14. ఎండాకాలం కదా? బస్తీ అని భాష మార్చి చెప్పినా వేడి తగుల్తూనే ఉంది

    నగరం అంటే వేడి, నగరం అంటే బస్తీ.

  15. బిడ్డ. విడగొడితే చెడ్డ మృత్యువు

    కు = చెడ్డ, మారి = మృత్యువు

  16. అష్టసిద్ధుల్లోనొకటి తడబడినట్లనిపించినా స్వరాల వరుసలో సరిగా అమరింది

    అష్టసిద్ధుల్లోనొకటి గరిమ. సప్తస్వరాల వరుసలో రిగమ.

నిలువు:

  1. కరతలామలకంలో ఫలమూ పుష్పం ఒకే రూపంలో

    కమలాఫలం, కమలం

  2. అది హనుమానుడి గానంలో సందేహాస్పదంగా దాగుంది ఆనగ్రామ్.
  3. ఫలం పుష్పం

    ప్రసూన అంటే ఫలం, పుష్పం అని రెండర్థాలున్నాయి.

  4. యజ్ఞాలు?

    యజ్ఞాలు, యాగాలు ఒకలాంటివే అయినా కొన్ని యాగాలు యజ్ఞాల్లా కాకుండా హింసతో కూడుకున్నవి. ఉదా: అశ్వమేధయాగం.

  5. పిలుస్తున్నది అర్జునుడినా కొలుస్తున్నది వరుణుడినా?

    కురువంశశ్రేష్ఠుడిగా అర్జునుడిని కురువరా అని పిలవొచ్చు. అచ్చతెలుగులో వానలు కురువాలని ‘కురువరా’ అని వానదేవుడిని కొలవొచ్చు.

  6. త్రివిక్రమ

    విక్రమం అంటే అడుగెయ్యడం. భూమి, ఆకాశం, బలిచక్రవర్తి నెత్తిమీద ఒక్కొక్క అడుగేసిన వామనుడిని త్రివిక్రముడంటారు.

  7. స్వభావాల వర్ణాలు రంగు = వర్ణం, స్వభావం.
  8. గంధం వస్త్రసంబంధ స్వభావం

    వసనం = వస్త్రం, వాసన = వస్త్రసంబంధమైన.

  9. అంచు కరిగిన మంచు, భూమితో కలిసి చేసిన మాయ

    మహి = భూమి, హిమ = అంచు కరిగిన మంచు.