స్వర్గీయ పీచర సునీతారావు పేరుతో ఈ సంవత్సరం యథాక్రమంగా ఐదవ వార్షిక పురస్కారాలకోసం పీచర సునీతారావు ఫౌండేషన్ కవిత్వం, కథలు, విమర్శ అనే మూడు సాహితీ విభాగాలకు సంపుటులను ఆహ్వానిస్తున్నది.
శీర్షికలు సంచికలు
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ!
కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికిగాను, తెలుగులో బాలసాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత గంగిశెట్టి శివకుమార్ గారి ‘కబుర్ల దేవత’ అనే కథా సంపుటికి […]
ప్రపంచ నలుమూలలకూ వెలుగునిచ్చిందీ, అనేక పరిశ్రమలకు ఆయువుపట్టు అయినదీ, ఆవిరి యంత్రాలతోనో మహాజలపాతాలతోనో ఘనమైన చక్రాలను తిప్పి పుట్టించే విద్యుత్తే. ఆ పుట్టుకకి ఆధారం ఫారడే కనుగొన్న డైనమో.
నన్ను వ్యక్తిగతంగా ‘నువ్వు ఏ ట్రెక్‌ను ఎక్కువగా ఇష్టపడ్డావు’ అని అడిగితే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేను. దేని ప్రత్యేకత దానిది. కానీ నాకు అన్నపూర్ణ ట్రెక్‌ను సమన్వయం చెయ్యడం ఎవరెస్ట్‌కన్నా పెద్ద సవాలుగా నిలిచిందని చెప్పుకోవాలి.
ఆ యిద్దరిలో ఒకరికి అదృష్టవశాత్తు మతిపోయింది, మరొకరు శాయశక్తులా ఆ పిచ్చిని కాపాడుతున్నారు. ఎవరికి పిచ్చి, ఆ పిచ్చిని పోషిస్తున్నది ఎవరు అని మాత్రం చెప్పడం దుస్సాధ్యం.
ఎప్పటికీ
వెలుగు చూడకుండా
రాత్రి రథం మీద
సూర్యుడుండని చోటుకి
వెళ్ళిపోవాలని ఉంది
రాత్రికంటే
రహస్యమైనది ఏది?
ఆ ఐస్‌క్రీమ్-బాయ్
ఇద్దరికోసం ఒక్కటే ఐస్‌క్రీమ్ కొన్నప్పుడు
నాపైకి విసిరిన చూపుల్ని
పోల్చుకోగలవా ఎప్పుడైనా?
తెలుగులో ప్రథమాంధ్రకవి నన్నయ నుంచి ఆధునిక భావకవి కృష్ణశాస్త్రి వరకు, ఒక పాత్ర ఔన్నత్యాన్ని వర్ణించటంలో ఒకే కవిసమయాన్ని తమదైన శైలిలో ఎంత వైవిధ్యంగా ప్రయోగించారో చూపించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.
“లేదు, ఇంకా సీరియస్‌గా ఎలా చెప్పాలో నాకు తెలియదు! నేను కామెడీ, నువు రొమాంటిక్. మనకు బాగా కుదురుతుంది.”
“నీమీద నాకే ఫీలింగ్సూ లేవు. నీ హ్యూమర్ ఏ కొంచెమో నచ్చబట్టే నీతో స్నేహం చేస్తున్నా. అయినా ఆ మిస్టరీ కథ వెనకపడుతున్నానని చెప్పావు కదా!”
ఆ మాటలకు ఒక నిమిషం మనసు కెలికినట్టయినా, “ ఊకో మావాఁ, పేకాట గురించి నా పెళ్ళాంకీ నీకూ ఏటి తెలుసు! ఒక్క పాలి పైసలు వొచ్చినాయంటే కట్టాలన్నీ తీరిపోవూ,” అని అటు అతనికీ ఇటు తన మనసుకూ సర్ది చెప్పుకొన్నాడు.
కుందేలంటే సరే అంత కవ్వింపు బేరం అనుకోవచ్చు, తాబేలు కూడా ఇష్టం మా వాడికి. విజయనగరంలో అమ్మమ్మ ఇంటికి వెళ్తే, పక్కనే కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయముంటుంది. అక్కడి సిమెంటు నీటి తొట్టెలో కొన్ని పదుల తాబేళ్ళు – చిన్నవీ పెద్దవీ, కుదురుగా ఒదిగి కనపడతాయి.
“అంత సౌమ్యంగా పిలిచినపుడే అనిపించింది, ఏదో కొంప మీదకి తెస్తున్నారని. దూడని పెంచుతారా? ఆవుని చేస్తారా? పాలు పితుకుతారా? మీకేం వచ్చని ఈ పనులన్నీ?” అని గట్టిగా అడిగేసింది.
యుద్ధంలో ఎప్పుడో ఒడిస్సియస్ చచ్చిపోయి ఉంటాడనుకొని, పెనలొపీని పెళ్ళాడి… ఇథకా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆశతో పెక్కురు రాకుమారులు నిత్యం ఆమెను అనేక విధాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి బారినుండి తప్పించుకోడానికి పెనలొపీ రకరకాల పన్నాగాలు పన్నుతూనే ఉంటుంది.
భారత కథలో దైవాంశ సంభూతులైన వీరులు, అక్కడక్కడ అవతార పురుషులు, దేవతలు కనబడినట్లే ఇలియాడ్, ఓడిస్సీలలో కూడా మానవులు, దేవతలు కలగాపులగంగా కనబడతారు. భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే ఇలియాడ్‌లో ట్రోయ్ యుద్ధం పది సంవత్సరాలపాటు జరుగుతుంది. ట్రోయ్ యుద్ధం ముగిసిన తరువాత ఆ యుద్ధంలో పోరాడి, బ్రతికి బయటపడిన ఒక వీరుడు ఇంటికి తిరుగుముఖం పట్టినప్పుడు, మరొక పదేళ్లపాటు కష్టాలు పడుతూ చేసిన సాహసయాత్రలోని భయంకరమైన అనుభవాలే ఓడిస్సీలోని కథ.
తెలుగు భావకవిత్వరచనకు కృష్ణశాస్త్రిగారు ఆద్యులు కాకపోయినా అగ్రగణ్యులుగా సాహితీ లోకం గుర్తించింది. ఆయన భావనైశిత్యం, ఆయన కవితోహల లాలిత్యం, మృదుమధురమైన శబ్దసౌందర్యం ఆయన కవితారచన లోని విలక్షణతలుగా భావించవచ్చు.
మంచి పద్యం రాయగలవాడు మంచి గద్యం కూడా రాయగలడని, టి.ఎస్.ఎలియట్ అన్నాడు. మంచి కవి రాసిన పద్యానికీ గద్యానికీ మధ్య భేదం లేదంటాను నేను. వామనుడనే ప్రాచీన ఆలంకారికుడు కూడ ‘గద్య రచన కవికి గీటురాయి అనదగు’ అనే అర్థం వచ్చేట్లు సంస్కృతంలో చెప్పాడు.
అసలు నాకు నెమరువేత డోకు. అంటే, వెనక్కి తిరిగి చిన్ననాడో, ఎన్నడో జరిగినవి జ్ఞాపకం చేసుకోడం. అది అసహ్యం.
అప్పటికి జనవ్యవహారంలోనే తెలుగు భాష ఉంది. అక్కడక్కడ శాసనాలలో మాత్రమే సాహిత్య(ఛందస్సు) స్పర్శ ఉంది. ఆ దశలో మహాభారతం వంటి గ్రంథాన్ని ఆంధ్రీకరించడానికి అవసరమైన ఛందస్సాహిత్యాలను సమకూర్చుకొనవలసి వచ్చింది నన్నయకు నారాయణభట్టు సహకారమూ లభించింది. సఫలుడయ్యాడు నన్నయ్య, ఇప్పటికీ ఆ బాట ఆంధ్ర సాహిత్యంలో అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది.