అమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా! ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు – వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా చర్చిస్తుంది.

రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్‌, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత.

“ప్రతి శిశు జననం మానవ జాతి మీద భగవంతునికి మిగిలి ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది” అన్నట్టే ప్రతి కవిజననం మన భాష మీద మనకున్న ఆశను రెట్టింపు చేస్తుంది.

(ఈ వ్యాసం కొద్దిరోజుల క్రితం “నీహార్‌ఆన్‌లైన్‌”లో అభిప్రాయవేదికలో ప్రచురితమైంది. ఐతే, ఈ వ్యాసంలో పరిశీలించిన కథలు ఇక్కడ “ఈమాట” లో ప్రచురించినందువల్లనూ, “నీహార్‌ఆన్‌లైన్‌”లో జరిగిన […]

ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.

“రాలిపోయే కండకు మల్టీనేషనల్‌ అత్తరు సోకులు జేసే ఓ గ్లోబల్‌ రాబందూ,
ఎముకను ప్రేమించే నేను, నేనే నేనైన నేను, నేనిక స్నానం చేయను”

“టూ వీలర్‌ కాలుష్యంతో బిరుసెక్కిన నా కళ్ళతో
నీ రక్తమాన్‌దిరాక్స్‌ తాగడానికే నేను రక్తనేత్రుడనైనాను”

అని కవి ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలు సమాజాన్ని పీడిస్తున్న సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దుష్టశక్తులపైకి దూసుకొస్తున్న కవితా సునామీలు!

కవిత్వం గురించి చెబుతూ ఎజ్రా పౌండ్ “భావ ప్రకటనకి పనికిరాని ఒక్క పదాన్నైనా సహించకూడదన్నారు.”. ఆ లక్షణాన్ని పవన్ బహు చక్కగా పుణికిపుచ్చుకున్నారు.

తెలుగు సాహిత్యం నిలిచివుండాలంటే దాన్ని ఆంగ్లంలోకి అనువదించటమే ఇప్పుడున్న ఏకైక సాధనం. ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఈ కృషిని కొనసాగిస్తున్న నారాయణరావు, షుల్మన్ గార్లను మనం ప్రత్యేకించి అభినందించాలి.

కథా సమీక్ష విముక్తుడు (రచయిత్రి: జొన్నలగడ్డ రామలక్ష్మి) ఓ చేయితిరిగిన రచయిత చదివించే గుణంతో ఓ చిన్న విషయం గురించి రాసిన కథ. కేన్సరుతో […]

అభివృద్ధి పేరుతో ప్రకృతి మీద మానవుడు చేస్తున్న అఘాయిత్యాలనీ, వాటి వల్ల సహజ వనరుల మీద ఆధారపడిన ప్రజల జీవితాలు చితికిపోవటాన్నీ, భూగోళంపై ఉండే సహజ సంపద, జంతుజాలాల మీద శాశ్వతంగా మిగిలిపోయే సమస్యలనీ నేపథ్యంగా తీసుకొని వ్రాసిన నవల చంద్రలతగారి “దృశ్యాదృశ్యం”. ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయాలు చాలానే ఉన్నా, కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే ఇక్కడ చర్చిస్తాను.

యీ “సముద్రం”లో అన్వేషణ వుంది. గుర్తు పట్టే చూపుంది. చుట్టూ పరిగెత్తమనే పరిస్థితులున్నా తమలోకి తాము చూసుకొనే మనుష్యులు మనకి స్నేహితులవుతారీ “సముద్రం”లో.

భూషణ్‌ కథల్లో ముఖ్యమైన వస్తువు స్త్రీపురుష సంబంధం. ఒక యువకుడు ఉంటాడు. మిత భాషి. తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమెకు ఇష్టం; నిన్నుప్రేమిస్తున్నాను అని చెప్పనవసరం లేకుండానే ఆమె తనను అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటాడు. కాని అలా జరగదు. ఆమె దూరం అవుతుంది. అతని ప్రయత్నం లేకుండానే మరోస్త్రీకి దగ్గిరవుతాడు; లేక మొదటి స్త్రీ తిరిగి అతనికి దగ్గిరవుతుంది. ఇంతకంటే లోతుగా ఈ సంబంధాన్ని పరిశీలించటం ఈ కథల్లో కనిపించదు.

(తమ్మినేని యదుకుల భూషణ్‌ కవితాసంకలనం “చెల్లెలి గీతాలు” పై సమీక్ష) ఈ కవితలు చదివే ముందు ఒకసారి, వర్తమానాన్ని వదిలి బాల్యంలోకి తిరిగి పయనించేందుకు […]

ముందుగా కల్పనా రెంటాల పుస్తకం “కనిపించే పదం”. ముప్పై ఒక్క కవితలు; అందులో ఎంపిక చేయదగిన చక్కటి కవితలు ఒక నాలుగు (నది సప్తపది, […]

“ఆకులోఆకునై” కాలమ్‌ గా “ఆంధ్రప్రభ దినపత్రిక” లో వచ్చిన వ్యాసాలను సంకలించి అందమైన పుస్తకంగా తీసుకువచ్చారు వీరలక్ష్మీదేవిగారు. ఇందులోని వ్యాసాలు మల్లెపూవుల మీద నిలిచిన […]

అనువాదం ప్రాముఖ్యం  తెలియని జాతికి విమోచన లేదు. దీవి సుబ్బారావు శ్రమకోర్చి, బసవ, అక్క మహాదేవి, అల్లమప్రభు, తదితర కన్నడ వచన కవులను(12 వ […]