ప్రస్తుత సంకలనం ఇక్కడ నివాసిగా స్థిరపడ్డాక రూపొందినది. ఇందులో స్నేహరాహిత్యం పట్ల కొంత దిగులు ఉన్నా ఇక్కడ, ఇండియాలోనూ జరిగిన సమకాలీన సంఘటనలకి రాజకీయమైన స్పందన ఎక్కువ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇండియాలో తన ప్రాసంగికతను నిరూపించుకోవాలనే తాపత్రయం కవిలో ఉన్నట్టు నాకనిపించింది.
Category Archive: సమీక్షలు
పల్లెటూళ్ళ జీవన చిత్రణలో ఒక సౌందర్యం ఉంటుంది. వర్గంగానో, సంఘంగానో కూడి బ్రతకడంలో దొరికే భరోసాని బలంగా చూపెడుతుందది. పట్టణజీవితపు ఒంటరితనంలో బిగ్గరగా చెప్పుకోలేని, ఒప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని, తప్పించుకోలేని వేదన ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఈ వైరుధ్యాన్ని ఒకేసారి ఒకే కవితలో, లేదా ఒకే సంపుటిలో స్ఫుటంగా చెప్పడం మామూలు కవులకు దాదాపు అసాధ్యం. కరుణాకర్ మామూలు కవి కాదు.
సూచన ప్రాయంగా వెల్లడించిన భావాన్ని పట్టుకునే వాడు కవిత్వానికి సరయిన పాఠకుడు. సూచన ప్రాయంగా వెల్లడించడానికి తగిన భాషను విచక్షణతో సమకూర్చుకునే వాడు నిజమైన కవి. సౌభాగ్య కుమార మిశ్ర ఆ కోవకు చెందినవారు కాబట్టే అనువాదకుడి పని అంత సులువు కాదు. ఈ అరవై కవితల అనువాదానికి ఒక్క ఏడాది పట్టిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
అమితాశ్చర్యం కొలిపే విషయం పిఠాపురం రాజావారు వారి పరివారంతో కాలిఫోర్నియాలో దిగ్గానే ఒక స్వామీజీ, వారి భక్తులు వీరికి స్వాగతం పల్కడం! ప్యాలస్ లని తలదన్నే ఒక ఇంట్లో (బెవర్లీ హిల్స్ లోని ఒక భక్తురాలి ఇల్లట) ఊదువత్తుల మధ్యలో సిల్కు దిండుల మీద ఆశీనులై ఉన్న ఈ స్వాముల వారిని అక్కడి వాళ్ళంతా ఒక దేవుడిని చూసినట్లు చూడటం!
సరమాగో ప్రారంభంలో రాస్తాడు: “భూతకాలం రాళ్ళు రప్పలతో కప్పబడ్డ విశాలమైన భూమి. చాలామంది జోరుగా కారుల్లో ఏమీ పట్టించుకోకండా పోతారు, ఆ రాళ్ళమీద! కొద్దిమంది మాత్రం ఓపిగ్గా ఒక్కొక్క రాయీ ఎత్తి ఆ రాయి క్రింద ఏమున్నదో అని జాగ్రత్తగా చూస్తారు. ఒక్కోసారి తేళ్ళు, మరొక్క సారి జెర్రులు, గొంగళీ పురుగులూ, గమ్మనకండా కూచున్న గూటిపురుగులూ కనిపిస్తాయి. అసాధ్యం కాదు గాని, ఒకే ఒక్కసారైనా సరే, ఒక ఏనుగు కనిపించవచ్చు…”
తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి — భారతీయ భాషలలోనే కాక ప్రపంచ భాషల్లోనే కవిరాజమార్గం ఒక విశిష్ట శాస్త్ర గ్రంథమని చెప్పడానికి ఆస్కారం ఉంది. భారతీయ అలంకారశాస్త్ర సంప్రదాయాన్ని స్థానిక భాషలో జనుల రీతి నీతుల్ని చేర్చి తీర్చిదిద్దిన ఘనత శ్రీవిజయునిది.
నిజానికి ప్రకృతి వర్ణనలకు సంబంధించి చాలా మంది పాఠకులకు ఉండే ఇబ్బంది కవి దృష్టితో లోకాన్ని చూడలేకపోవడం; కవి వర్ణనలను అతిశయోక్తులని నమ్మడం. ఈ వైయక్తికమైన అనుభవాలని సార్వజనీనం చేసి ఒప్పింప జేసుకోవడానికి కవిలో నిజాయితీతో పాటు, పాఠకులను చనువుగా తన వెంట రమ్మని పిలవగల నేర్పు కూడా ఉండాలి.
హోమర్ పనిచేసే న్యూక్లియర్ పవర్ ప్లాంటుకి హెన్రీ కిసింజర్ వస్తాడు. ఈ కథనం ప్రారంభంలో కిసింజర్ ట్రేడ్మార్క్ కళ్ళజోడు టాయిలెట్లో పడిపోతుంది. ఎవరికన్నా చెపితేనవ్వుతారని కిమ్మనకుండా ఆయన బయటికి వస్తాడు. తరువాత హోమర్ ఆ టాయిలెట్ గుంటలో కళ్ళజోడు తీసి తను పెట్టుకుంటాడు. అంతే! అక్కడే ఒక గణితసూత్రం నెమరువెయ్యడం మొదలుపెడతాడు, హోమర్. ఒక సమద్విభుజత్రికోణము లో ఏ రెండు భుజముల వర్గమూలము కూడినా… అని.
వ్యవసాయ భూమి రియల్ ఎస్టేట్‌గా మారే ముందు దశను రచయిత మధురాంతకం నరేంద్ర జాగ్రత్తగా పట్టుకొని వస్తారు. భూముల స్థలీకరణకు మానవ ప్రతిఘటన బలహీనమైన ఈ అవస్థలో రోసిరెడ్డి ఒక ప్రశ్న వేస్తాడు. “మడుసులంతా ఈ మాదిరి కొంపలు గట్టుకొనేదానికి కయ్యలు, కాలువలు గావాలంటే కుదిరితిందా? నేలుండేది దున్నిపంట చేసేదానికా? కడగాలేసి గోడల్లేపే దానికా?”
వచన కవిత్వం వ్రాస్తున్న వారిలో చాలా మందికి, పాదాల విరుపే అన్ని బాధ్యతలనూ నిర్వహిస్తుందన్న గుడ్డి నమ్మకమొకటి బలంగా ఉంటుంది. అది నిజం కాదు. ఒక్కోసారి బలమైన ప్రతీక లేదా పదబంధం చేసేపనిని కామా, లేదా ఫుల్‌స్టాప్ చేస్తుందనడం అతిశయోక్తి కాదు. స్పష్టత విషయంలోనూ విరామచిహ్నాల సాయం తీసుకోవడం నేరమనిపించుకోదు. కవిత్వంలో అవేమీ నిషిద్ధాలు కావు.
ఇదొక 20 ఏళ్ళ యువకుడి అంతరంగ ఘోష. తెరలు తెరలుగా పొరలు వీడి నగ్నంగా పరిగెత్తే అతని ఆలోచనలు, అతని ఊహలు, అతని పశ్చాత్తాపం, అతని ధర్మాగ్రహం, అతని నిస్సహాయత, అతని ఓటమి, అవమానం, అతని గెలుపు, అతని హృదయోల్లాసం, అతని మోహం, అతని లైంగిక అశాంతి, అతని ఆకలి, అతని ప్రేమ, ఇంకా అతనివే స్నేహం, అభిరుచులు, దుఃఖం — అన్నీ అతడివే!
పుప్పొడి అనే కవితలో పంక్తుల సంఖ్య ఆఱు మాత్రమే. కాని అది చదివినప్పుడు కలిగిన అనుభూతి అపారమైనది. 25 సంవత్సరాలకు ముందు కార్ల్ సేగన్ మనమంతా, అంటే ఆ ఆకాశము, అందులోని ఎన్నో పాలవెల్లులు, మన సౌర కుటుంబము, దానిలోని మన భూమి, అందులో అన్ని జీవజాలాలు అంతా ఆ ఖగోళ బీజము నుండి పుట్టిన అణువులు అని చెప్పిన మాట స్మృతిలో నిద్దుర లేచింది.
వెల్చేరు నారాయణ రావు పరిశోధనా గ్రంథాల గురించిన చిరు పరిచయాలు, ముఖ్యంగా పుస్తకం.నెట్‌లో ప్రచురించబడినవి, వాటన్నిటినీ ఒకచోట చేర్చే ప్రయత్నమే ఇది. వాటితో పాటుగా మరికొన్ని పుస్తకాల వివరాలు కూడా జతచేయబడినై.
తెలుగు వారు ఆస్వాదించ గలిగిన అన్నమయ్య భాష వాడుకలో ప్రత్యేకతలూ, అందమూ ఇతర భాషల వారికి సహజంగా అర్థం కావు. ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం అన్నమయ్య కీర్తనల్లో ఉన్న కవితా మాధుర్యాన్నీ, భావనా పటిమనీ ఇంగ్లీషులోకి పరిచయం చెయ్యడమే కాదు, అన్నమయ్య ఎంత ఆధునికమైన కవో చూపించడం కూడా.
ఇంకొక విశేషమేమిటంటే – ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా’లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి’ సాదరంగా ఆహ్వానించారు.
అన్నమయ్య శృంగార పదాలని కేవలం శృంగారంగా చూడకుండా కవితాత్మకంగా పరిశీలించి అందులో ఉండే పద మాధుర్యాన్నీ, భావ సౌందర్యాన్నీ వివరిస్తూ ఒక పుస్తకరూపంలో “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” పేరున అన్నమయ్య పదపరిచయం చేసింది కవయిత్రి జయప్రభ.
శ్యామ్ కథనా శైలి మరెక్కడా చూడం. అదొక ఏకైక రచనా శైలి. ఏ శైలి అయితే ఆయన కథలకి శక్తిగా, ప్రయోజనకారిగా మారాయో అవే ఆయన కథలకి బలహీనతా, లోపాలయి కూర్చున్నాయి. ఆ శైలికీ, ప్రాసలకీ, వాక్యాలకీ అబ్బురపడి అసలు కథ ఏవిటో మర్చిపోతాం.
పుస్తకం కొనుగోలు, పఠనానుభవం – బాగున్నాయి. పైగా, లీగల్ గా కొంటున్నాం కనుక, ఆత్మసంతృప్తి కూడానూ! బయటి రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండేవారికి ఇది ఉపయోగకరమే. అయితే, ఈ పుస్తకం కొనుగోలు చేయడం లో ఉన్న తతంగం అంతా సామాన్య ప్రజలకి అంత తేలిగ్గా అర్థం కాదేమో అని నా అనుమానం.
ఇంతకు ముందు వచ్చిన సంకలనాలకీ దీనికీ మధ్య నాకు గోచరించే ఒక పెనుమార్పు, కవి తన ఉనికిని హృదయస్థం చేసుకోవటం. అది ‘ఇక్కడే’ అని గ్రహించటం.
పగలంతా పాలవాసన వెంట / పరుగులెత్తిన ఈమె/ సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది. – ఈ మధ్య కాలంలో ఇంతకన్నా మంచి ప్రేమ కవిత చదివిన గుర్తు లేదు.