ఇప్పుడు అసలు నాజర్ ఎవరంటే ఎంతమందికి తెలుస్తుందో! నాజర్ జీవిత చరిత్ర గురించి తెలుగు వికీపీడియాలో చాలా వివరాలతో వ్యాసముంది – చివరివరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చాలా నియమబద్ధమైన జీవితం గడిపిన మనిషి ఆయన.

ACP శాస్త్రి గారిగా చిరపరిచితులైన అందుకూరి చిన్నపొన్నయ్య శాస్త్రిగారు​ రేడియో నాటక రచయిత. వసుచరిత్ర లోని సంగీతశాస్త్రీయత గురించి న వారి రేడియో ప్రసంగమును ఈమాట పాఠకులకై వారి అనుమతితో బుసిరాజు లక్ష్మీదేవి దేశాయ్ సమర్పిస్తున్నారు

గాయని జిక్కి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదు. ఈ సంచికలో జిక్కి పాడిన, అంత తేలికగా దొరకని, మూడు పాటలు: మువ్వలు పలికెనురా, మబ్బుల్లో జాబిల్లి, కుందరదనా వినవే రామకథ – విందాం.

పిచ్చయ్య శాస్త్రిగారు, గుర్రం జాషువాగారు ఇద్దరూ వినుకొండలో స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఇద్దరూ కలసి జంట కవులుగా రచనలు చేయాలనుకున్నారని అయితే వీళ్ళిద్దరి పేర్లు కలవక విరమించుకొన్నారనే కథ ఒకటి ఉంది.

ఈ అరుదైన యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం కట్టి 1999 వేసవిలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా ప్రసారం చేసినది.

20వ శతాబ్దపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రతో యేమాత్రం పరిచయం వున్నా అబ్బూరి రామకృష్ణరావుగారి పేరు తెలియకుండా వుండదు. శ్రీశ్రీ ఆయన్ని ‘అబ్బూరి చలివేంద్రం’ అని ప్రశంసించేవాడు.

శేషయ్య శాస్త్రిగారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.

ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయ శర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగాన్ని, దానికి అనుబంధంగా ఈ నాటకాన్ని ఇక్కడ జత చేస్తున్నాను.

పట్రాయని సంగీతరావు గారు ఈమాట పాఠకులకు సుపరిచితమే. 1930-40 ప్రాంతంలో, సాంస్కృతిక కేంద్రంగా విజయనగరం గురించిన ఆయన జ్ఞాపకాలను ఈ సంచికలో మీరు వింటారు.

అద్దేపల్లి రామమోహనరావు గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ వీనులవిందుగా చదివి వినిపిస్తున్నారు. దీన్ని “ఈమాట” కు అందించిన శొంఠి రమణ గారికి, […]

ఇది నేను కొన్ని నెలలక్రింద ఈమాటలో ప్రచురించిన ‘వాణి నారాణి’ అను నాటికలో సందర్భానుసారముగా ఐదుపాటలను వివిధరాగములలో వ్రాసితిని. శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు ఆ ఐదుపాటలను పాడిరి. ఆపాటలతో గూడిన పినవీరనవృత్తాంతము నిక్కడ ప్రదర్శించుచున్నాను.

అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదని అంటారు. అలాగే ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు, ప్రసంగాలు చేసినట్లు కనపడటంలేదు. ఆయన కవితలని రెండింటిని ఆయన గొంతులోనే వినిపిస్తాను.

వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం.