రచయిత వివరాలు

పూర్తిపేరు: వాయుగుండ్ల శశికళ
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

అంత ఎత్తైన జలపాతం ఒక్క ఉదుటున మనని కొండకొమ్ముకు లాక్కెళ్ళి పోతుంటే, చెవుల్లో జలపాత శబ్దం మనని తనతో ప్రవహింపచేస్తూ. ఆ సీతాకోక చిలుకలు చూడు! ఆ కొండకొమ్ములో తాను జారిపడితే మన గుండె ఆగి కొట్టుకుంటూ ఉంది. అదిగో, ఒక్క నవ్వు పిలిస్తే ఎలా దూకేస్తున్నాడు! ఆ చిరుచీకటిలోనే ఇటు చూసి నవ్వుతాం. నువ్వలా చేయగలవా అనే సవాలు ఇటు నుండి అటు కళ్ళతోనే.

“హెచ్-508, ఎందుకు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావ్? యూ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్, యెస్? హ్యూమన్స్ చాలా తక్కువగా ఉన్నాం. మనందరం మరింత ఎఫిషియెంట్‌గా ఉండకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. అందువల్లనే కదా చాలా అన్‌నెసెసరీ ఎమోషన్స్ రెగ్యులేట్ చేస్తున్నాం గ్రోత్ ఛాంబర్స్‌లో పెరిగేప్పుడే. ఐ నో, అందరు హ్యూమన్స్ ఒకేలా రెస్పాండ్ కారు వాటికి. ఇఫ్ యూ నీడ్, ఐ కెన్ సెండ్ యూ టు..”